ఈ అమ్మాయి ఫోటో చూడండి. ఆ తరువాతా...

Stare at the colored dots on this girl’s nose for 30 seconds, then quickly look at a white wall or ceiling (or anything pure white) and start blinking rapidly. Congratulations, you just processed a negative with your brain! A question for you GSF, how is this possible?


...అప్పుడు మీకు ఎవరు కనిపించారు? నాకయితే ఐశ్వర్య రాయ్ బచన్ లా అనిపించింది కానీ నిర్ధారణగా చెప్పలేం.

ఇంటర్నెట్టుని కనీస హక్కుల్లో ఒకటిగా రాజ్యాంగంలో చేర్చాలి!

ఈమధ్య హైకోర్టో, CBI కొర్టో ఒకరికి జైల్లోకి లాప్టాప్ తెచ్చుకోకూడదని తీర్మానించింది కదా. హెంత దారుణం, హెంత దారుణం. లాప్టాప్ లేకపోతే ఇక నెట్టెలా? ఈ కాలంలో మానవజీవి ఊపిరి లేకపోయినా బ్రతగ్గలడు కానీ  ఇంటర్నెట్టు లేకపోతే బ్రతగ్గలడా?  అంచేత ఆ కోర్టు నిర్ణయాన్ని ఖండిచ్చేద్దాం.  ఏమంటారు?  ఇంటర్నట్టనేది కనీస మానవహక్కు. కనీసం అది కూడా జైలుపక్షులకి  అందివ్వకపోతే ఎలా? నెట్టు గాలి వీయకపోతే ప్రాణం విలవిలలాడి అల్లాడిపోదూ?  

పదేళ్ళ క్రితమే ఓ ఇంగ్లీష్ కార్టూన్ చూసాను. అందులో  ఓ తాతా మనుమడూ ఆదిమమానవుల వస్త్రధారణతో  రాళ్ళు చెక్కుతూ కనిపిస్తారు. తాత మనుమడితో ఇలా చెబుతుంటాడు "ఒక రోజు అకస్మాత్తుగా ప్రపంచం అంతటా ఇంటర్నెట్టు ఆగిపోయింది..."   అందులోని భావం అర్ధం అయ్యిందనుకుంటాను :))  మనం ఓ చిన్ని పోల్ పెట్టుకుందాం. మీరు ఈ లిస్టులో దేనికి అధిక ప్రాధాన్యం ఇస్తారేం. 1. భార్య/భర్త/ప్రేయసి/ప్రియుడు 2. దిన పత్రిక 3. ఇంటర్నెట్టు 4. టివి 5. శరత్ కాలం బ్లాగు (హిహీ).  పైవాటిల్లో వేటిని విడిచి బ్రతగ్గలరు? చుట్టూచూసుకోకుండా భార్య అని కామెంటు వెయ్యకండి - మీ నెత్తిన మొట్టికాయో, జెల్లకాయో పడగలదు. సరే ఇంకో పోల్. 1. గాలి, 2. వెలుతురు, 3. నీరు 4, నిప్పు 5. ఉప్పు 6. ఇంటర్నెట్టు. వీటిల్లో దేన్ని విడిచి బ్రతకలేరు? మీరేం చెబుతారో ఏమో గానీ తాజా జెనెరేషన్ని అడిగి చూడండి. మా పెద్దమ్మాయిని అడిగితే సందేహం లేకుండా నెట్టు విడిచి బ్రతకలేనంటుంది!   

ఆ మధ్య ఎక్కడో చదివాను. ముందు ముందు ప్రజలు ఎక్కడ నివసిస్తారు అని అనుకుంటున్నారు? చంద్రమండలం మీదనా? గురు గ్రహం మీదనా? కాదు కాదు. ఇంటర్నెట్టు మీద జీవిస్తారు! అవును అడవుల నుండి పల్లెలకూ, పట్టణాలకూ, అమెరికాలకూ జనాభా ప్రాకింది. ఇహ చంద్రమండలం మీద ముందు ముందు ప్రజలు నివసించబోతారు అని అనుకుంటాం కానీ అది తప్పు. ఇప్పటికే ఇప్పటి యువతరం నెట్టులో  జీవించడం మొదలెట్టారు! సందేహమా? ఓ సారి మీ టీనేజీ పిల్లలని చూడండి. ఇండియాలో యువతరం పరిస్థితి ఎలా వుందో తెలియదు కానీ యు ఎస్ యువతకి ఫేసుబుక్కు లేకుండా ఫేస్ వుంటుందా? ఫేసుబుక్కులో ఎక్కవుంట్ లేని నాలాంటి వారిని నెట్టు వృద్ధులుగానూ, ఆదిమమానవులుగానూ ఈ యువత పరిగణించే ఆస్కారం వుంది.  అదయినా సంతోషమే - అసలే మనిషిగా గుర్తించకపోతే మరీ కష్టం.  

అంచేతా... యావన్మందీ బ్లాగు ప్రజలకు నేను చెప్పొచ్చేదేమిటంటే జైల్లోకి లాప్టాప్ కావాలన్న ఆ పెద్ద మనిషికి మనం పెద్ద మనస్సు చేసుకొని నైతిక మద్దతు ప్రకటిద్దాం. అలా అది ఇవ్వకపోతే కనీస హక్కులను కాలరాయడమే అని గుర్తిద్దాం. రాజ్యాంగ సవరణ చెయ్యాలని గొంతెత్తి అరుద్దాం. ఏరీ మానవహక్కుల బ్లాగర్లూ? ఇంత ప్రధానమయిన ఆశం గురించి వారు పట్టించుకోరేం? కాకపోతే గాలి, వెలుతురూ, నీరూ, నిప్పు వగైరాలు తగ్గించి అయినా వైర్లెస్ నెట్టు గాలి ధారాళంగా జైల్లో వీచే అవకాశం ఏర్పరచాలని డిమాండ్ చేద్దాం. అంచేతా ఈ ప్రధానమయిన విషయం మీద మిగతా బ్లాగర్లు అందరూ కనీసం ఒక పోస్టు అయినా వేసి ఆ జైలు పక్షి కనీస కోర్కెకు మద్దతు పలకాలని నేను డిసైడు చేసిన.

డాక్టర్ గూగుల్ దగ్గరికి వెళ్ళండి

ఇదివరలో వైద్యుడు చెప్పిందే వేదం. ఇప్పుడు అంత సీను లేదు. గూగులమ్మ చెప్పిందే వేదం అని చాలామంది జనాలు భావిస్తున్నారు. ఏ వైద్యుడికయినా సాధారణంగా తన సంపాదన ముఖ్యం - పేషెంట్ల బాగోగులు తరువాత. అందువల్ల మనం ఏదయినా సమస్య వచ్చి డాక్టరు దగ్గరికి లగెత్తుకి వెళ్లగానే ఆయన గారు తన విజ్ఞానాన్ని, కాలాన్నీ పూర్తిగా వెచ్చించి మనలని బాగుచెస్తాడనుకోవడం మన భ్రమ. మన అదృష్టం కొద్దీ అనుభవజ్ఞుడూ, మంచివాడూ అయిన వైద్యుడు దొరికితే కొంత నయమే. ఎంత మంచివాడే అయినా, ఎంత నాలెజ్ వున్నవాడే అయినా మన మీద అతను కెటాయించగలిగే సమయం కొద్దిగా మాత్రమే వుంటుంది. మనమే అతనికి సర్వస్వం కాదు కదా. తన దగ్గరికి వచ్చే శతికోటి లింగాల్లో బోడిలింగాలం మనం. మనలాంటి పేషెంట్లని ఎంతోమందిని చూడాలి కదా.

అతను మనకోసం వెచ్చించే సమయంలో మన రోగ లక్షణాలు మనం సరిగ్గా చెప్పగలగాలీ, అయనకి సరిగ్గా అర్ధం చేసుకునేంత ఓపిక, సహనం, అనుభవం, విజ్ఞానం వగైరాలు వుండాలి.  అలాకాకుండా US లాంటి దేశాల్లో పదేపదే వైద్యుడి దగ్గరికి వెళ్ళేంత దృశ్యం వుండదు. అలా వెళ్ళాలంటే డబ్బుల కొసం జేబులు తడుముకోవాల్సివుంటుంది. వేలకొద్దీ భీమాలు చెల్లించడమే కాకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కో-పేమెంట్ అనే నైవేద్యం సమర్పించుకోవాల్సివుంటుంది. మాకయితే అది $25. మా ఇంట్లో నాతో పాటు నలుగురికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వెళ్ళినప్పుడల్లా ఆ దండగ తప్పదు. దానికి భయపడి నెట్టులోనో, పెద్దవారినో అడిగి ఏ వంటింటి చిట్కాలో ముందుగా వాడిచూస్తున్నాం. 

ఇహ మన సమస్యలు వైద్యుడి దగ్గరికి ఒక్కసారి వెళ్లగానే తగ్గిపోవుకదా. కొన్నింటికి పలుమార్లు వెళ్ళాల్సివుంటుంది. వెళ్ళినప్పుడల్లా ఆ దక్షిణ తప్పదు కదా. అలా ఎన్ని డబ్బులని గుల్ల చేసుకుంటాం? అందువల్ల అమెరికాలాంటి దేశాల్లో చాలామంది వైద్య పరిజ్ఞానం కోసం నెట్టు మీద ఆధారపడుతున్నారు. ఇదివరలో వైద్యులకి ఇక్కడి రోగులు ఆరోగ్య సమస్యలు చెప్పుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు మందుల చిట్టీ కోసం వైద్యుడి దగ్గరికి వెళుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తమకు ఏం మందులు కావాలో వెల్లడించి అందుగ్గానూ ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నారంట. నేను కూడా అంతే. ఏదయిన ఆరోగ్య సమస్య వస్తే ముందు గూగుల్లో దాని గురించి వీలయినంత పరిశోధన చేస్తున్నా. ఉదాహరణకి మా ఆవిడ ఒకటి రెండు రోజులుగా సైనసైటిసుతో బాధపడుతోంది. ఆమె సమస్య గురించి గూగుల్ చెయ్యమని చెప్పాను కానీ వినిపించుకోలేదు. తనకు తీరిక వుండాలి కదా. అవీ ఇవీ సీరియళ్ళు అలా అవస్థపడుతూనే చూస్తోంది. ఇహ లాభం లేదని ఇవాళ నేను నెట్టులో దాని గురించి వెతికి అందుగ్గానూ ఇంటి చిట్కాలు చూసి ఈమెయిల్ చేసాను. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలాంటి సమాచారాల్లో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరమో, ఎప్పుడు హోం కేర్ పద్ధతులు పాటించవచ్చో వివరంగా వుంటుంది.

ఇంటర్నెట్టులో అయితే మనకు ఓపికా, తీరికా వున్నత మేరకు సమాచార సేకరణ చెయ్యొచ్చు. అందువల్ల పలు విధాలయిన సమస్యా పరిష్కారాలు, పలు పద్ధతులు, పలు చికిత్సా ధోరణులు, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలూ మనకు అవగతం అవుతాయి. ఇవన్నీ మనతో ఇంత వివరంగా చర్చించేంత తీరిక, అవసరం వైద్యుడికి ఎందుకు వుంటుంది?  అక్కడికి వెళ్ళి మన తలకాయ ఆయన చేతిలో పెట్టాక ఆయన గారు చెప్పినట్లే విని  బుర్ర ఆడించి రావడం తప్ప వేరే మార్గం అంతగా వుండదు. మన అదృష్టం బావుండి మన సమస్య త్వరగా నయమయితే సంతోషమే. లేకపోతే అన్ని రకాలుగా నష్టపోయేది మనం గానీ ఆ డాక్టర్ కాదు కదా. అందువల్ల ఏ సమస్య గురించి అయినా సరిగ్గా రిసెర్చ్ చెసుకోవాల్సిన బాధ్యత మన మీద వుంది. ఇదివరకులా వైద్యులని పూర్తిగ నమ్మి మన ప్రాణాలను వారిచేతిలో గుడ్డిగా పెట్టేటటువంటి రోజులు కావివి. అందుకే మన బాధ్యత మేరకు తగినంత జాగ్రత్త మనమూ పడాలి మరి. ఇదివరకంటే ఈ సమాచారం అందరికీ అందుబాటులో వుండేది కాదు కాబట్టి మన డాక్టర్ చెప్పిందే మనకు దిక్కయ్యేది. అప్పుడు అలా కాదు. ఇప్పుడు రోగులు తగినంత సమాచారం సేకరించుకొని మరీ వస్తున్నారు కాబట్టి వైద్యులు కూడా వళ్ళు దగ్గరబెట్టుకొని వుంటున్నారు. 

అలా అని అన్నీ ఇంట్లో పరిష్కరించుకోలేము కానీ మన సమస్యల పట్ల మనకు అవగాహన వుంటే వైద్యుడు సరి అయిన దారిలోనే చికిత్స చేస్తున్నాడా లేకపోతే ఇంకో వైద్యుడి సలహా తీసుకోవాలా అనేది ఆలోచించవచ్చును.  ఇహ చిన్నా, పెద్దా సర్జెరీలు గట్రా ఇంట్లో చెసుకోలేము కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేలెండి. అయితే ఇలాంటి వైద్య విజ్ఞానం ఎక్కువయితే ఇంకో సమస్య వుంది. ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి వణికిపోవడం జరుగవచ్చు. అలా మనం హైపోకాండ్రియాక్స్ కాకుండా జాగ్రత్త వహించాలి. ఇంకో విషయం ఏంటంటే నెట్టులో వున్నదంతా, వ్రాసినదంతా మనం గుడ్డిగా నమ్మెయ్యకూడదు. ప్రిస్టీజియస్ సంస్థలూ, సైట్లూ వుంచిన విజ్ఞానాన్నే నమ్ముకోవాలి.

మరుసటి టపాలో ఇలా డాక్టర్ గూగుల్ సహాయంతో నేను ఎలాంటి సమస్యలని పరిష్కరించుకున్నానో చెబుతాను.

పిల్ల జమీందార్ చూస్తున్నాం - అందరం ఏడుస్తున్నాం


ఓ సినిమా ఓ రెండు మూడు సార్లు మనస్సుని కదిలిస్తేనే అది విజయవంతం అయినట్లు. (ఆడవాళ్ల ఏడుపు సినిమాల గురించి కాదు నేను చెబుతూంట.) ఇదేంటండీ ఈ సినిమా ఇన్నిసార్లు మనస్ఫూర్తిగా ఏడిపిస్తోంది? ఈ సినిమా దర్శకుడు ఎవరండీ. చాలా చక్కగా తీసేడండీ బాబో.

పాపం ఆ కుక్క...

సూర్యాపేటలో నాకు ఓ అన్నతమ్ముళ్ళు చాలా సన్నిహిత స్నేహితులుగా వుంటుండేవారు. ఒక రోజు వాళ్ల కుటుంబం అంతా కలిసి కొంత దూరంలో వున్న ప్రాంతానికి చుట్టాలింటికో మరి ప్రదేశాలు చూడ్డానికో గుర్తుకులేదు కానీ వెళ్లనయితేవెళ్ళారు. కొద్దిరోజుల తరువాత తిరిగివచ్చారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ పెంపుడు కుక్క...పాపం...ఎముకలు మాత్రం వున్నాయి. వుండవూ మరి? దాన్ని కట్టేసి మరచిపోయి ఊరికివెళ్ళి కొన్ని రోజులయ్యాక వస్తే అలాగే అవుతుంది. పాపం ఆ జీవి ఎంత అవస్థ పడిందో కదా. ఆలనా పాలనా అటుంచి కనీసం దాని యొక్క కట్టు విప్పే నాధుడు లేకపోయే.

వారికి ఊరికి వెళ్ళాక తీరిగ్గా కుక్కని కట్టేసి మరచివచ్చిన విషయం గుర్తుకు వచ్చిందట కానీ లైట్ తీసుకున్నారు. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. కొద్దిమందికి లాండ్ లైన్లు వుండివుండవచ్చు. అప్పట్లో మాకు అదీ లేదు. పోనీ ఎవరికయినా వున్నవారికి ఫోన్ చేసి చెప్పినా వారు ఆ ప్రాణిని రక్షించేవారు. ఏ బ్యుజీలో వున్నారో ఏమో కానీ ఆ విషయం తేలిగ్గా తీసుకున్నారు. ఆ విషయం తెలిసి మా అమ్మ బాగా క్షోభ పడింది. తగిన శాస్తి ఆ కుటుంబానికి జరుగుతుందని శపించింది. 

అది జరిగిన కొన్ని నెలలకు ఆ కుటుంబ పెద్దకి కారు గుద్దడం వల్ల మరణించాడు. ఆ తరువాత ఒకటి రెండేళ్ళకి ఆ సోదరుల్లో పెద్దవాడు మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించాడు. ఇహ తమ్ముడుకి  కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన ప్రమాదంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా బయటపడి ప్రస్థుతం బాగానే వున్నాడు. మా అమ్మ శాపం వర్తించింది అని అనుకునే మూఢనమ్మకాలు నాకు లేవు కానీ మా అమ్మ అలా అనడమూ, అలా ఆ ఇంట్లో ఆ చావులు వరుసగా జరగడమూ మాత్రం సంభవించాయి. 

ఈ విషయం ఈ క్రింది టపా చదివితే గుర్తుకువచ్చింది.  అది శోభ గారు వ్రాసారు.

పులీ... మీకో ధన్యవాద్!

కొద్ది రోజుల క్రితం వ్యాయామంలో వెయిట్ ట్రైనింగు పై అస్త్రసన్యాసం చేస్తూ ఓ టపా ఇచ్చాను. అది ఇక్కడ చదవచ్చు. దానికి పులి అనే పేరిట ఒకరు స్పందించారు.
 
"శరత్,
మీ ప్రొటీన్ ఇన్ టేక్ ఎలావుంది? మనం రోజూ యింట్లో తినే తిండితో సరిపడేంత ప్రొటీన్ రాకపోవచ్చు. మీరు చెప్పిన బరువులతో చెసే వ్యాయామాలు మీ వయసుకు కూడా ఎక్కువేమీ కాదు. ఇంకేదో సమస్య వున్నట్లుంది. Dr.Google ని పూర్తిగా నమ్మి self diagnose చెయ్యడం మరీ మంచిది కాదేమో? "

ఆ సలహా నాలో మళ్ళీ ఆలోచనకు పురికొల్పింది. కొత్త ఉత్సాహాన్ని నింపింది. నాలోని లోపాలని నాకు తెలిసినవే అయినా ఎత్తి చూపింది. మనం ఎదుటివారిని మెచ్చుకోవడానికి వారేమీ నీళ్ల మీద నడవఖ్ఖర్లేదు. చిన్నచిన్న విషయాలకి కూడా మనం ఇతరులని ధారాళంగా, హృదయపూర్వకంగా ప్రశంసించగలగాలి. అందుకే ఈ టపా. ఆ పులి గారెవ్వరో, ఎక్కడ వుంటారో, ఏం చేస్తుంటారో నాకు తెలియదు. నేను ఈ విషయంలో డవున్ అయినప్పుడు నన్ను తట్టి మార్గదర్శకత్వం చేసారు, ఉత్సాహపరిచారు.  ఇలా నా టపాలు పాజిటివ్ ఇంటెరాక్షంతో వుంటే సంతొషంగా అనిపిస్తుంది. నా టపాల్ నాకు గానీ, ఇతరులకు గానీ ఉపయొగకరంగా వుంటే బావుంటుంది.

వ్యక్తిత్వవికాసపు పుస్తకాల్లో డేల్ కార్నెగీ వ్రాస్తూ మనం ప్రశంసల్లో ధారాళంగానూ, విమర్శల్లో మితంగానూ వుండాలంటాడు. మనం నిత్యజీవితంలో దానికి వ్యతిరేకంగా చేస్తుంటాము. మనం ఎవరినయినా తిట్టాలనుకున్నప్పుడు బాగా మాటలు వచ్చేస్తాయి. ఎవరినయినా మెచ్చాలనుకున్నప్పుడు నోరు పెగలదు. కొంతమంది ఇతరులని భలే మెచ్చుకుంటారు. వారి యొక్క ప్రజ్ఞను చూస్తే ముచ్చటేస్తుంది. నాకలా సులభంగా మెచ్చుకొవడం అస్సలు రాదు. ఇంట్లో కూడా అంతే, పిల్లల్ని భలేగా మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తుంటాను కానీ మా ఆవిడని మెచ్చడానికి పెద్దగా ఏమీ గుర్తుకురావు!

నిజవే. నేను ప్రొటీన్ తీసుకోవడం తక్కువే అని తెలిసినా సరిగా శ్రద్ధ తీసుకోలేకపోయాను. ఇప్పుడు ప్రొటీన్ పాలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాను. ఇంట్లో కూడా ప్రొటీన్ పదార్ధాలు ఎక్కువ చేస్తున్నా. మళ్లీ నాకు ఎదురవుతున్న సమస్యపై నెట్టులో గాలించాను. దానికి పరిష్కారంగా ఉదయమే అలాంటి వ్యాయామాలు చేస్తే రాత్రి చక్కగా బజ్జోవచ్చని కొంతమంది సలహా ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నమే చేసినప్పటికీ ఈ వ్యాయామం ఉదయానికి మార్చేలా ప్రయత్నిస్తున్నాను. 

నాకు డాక్టర్ గూగుల్ చాలా ఉపయొగపడుతోంది. అందువల్ల ఓ సమస్య ఎదురుకావచ్చు. మనం హైపోకాండ్రియాక్స్ అయిపోవచ్చు. అలా అని నెట్టులో వ్రాసినదంతా నిజమని  నమ్మితే బోర్లాబొక్కల పడతాము అని కూడా తెలుసు. డాక్టర్ గూగుల్ తో నా అనుభవాలను గురించి మరోసారి వ్రాస్తాను.

పులీ, థేంక్స్ ఎగైన్! మీ పులి పేరు చూస్తే నాకు అప్పట్లో వున్న 'పులి రాంబాబు' నిక్ నేం గుర్తుకు వచ్చింది :) ఆ కథా కమీషూ నా బ్లాగులో వెతికితే దొరుకుతుండొచ్చు.

No Higher Honour

తాను జాతీయ భద్రతా సళాదారుగానూ, విదేశాంగ మంత్రిగానూ పని చేసిన రోజుల గురించి కండొలిజా రైస్ వ్రాసిన నో హయ్యార్ ఆనర్  పుస్తకం నాకయితే బాగా నచ్చింది. ఆ విషయాలన్నీ సెప్టెంబర్ 11, 2001 వ సంఘటణకి ముందూ, వెనుక మరియు ఆ రోజుకి సంబంధించినవి కావడంతో ఉత్కంఠభరితంగా వుంది. కొద్దిరోజుల క్రితం శాంస్ క్లబ్బుకి వెళితే  $35 పుస్తకం $20 కే అని వుంది. కొద్దిసేపు మనస్సులో తర్జనభర్జన పడి మొత్తమ్మీద ఆ పుస్తకం కొనేసాను.

ఆ మధ్య కొన్ని పుస్తకాలు కొన్నా కూడా చదవలేకపోవడంతో ఇహ పుస్తకాల మీద నాకు ఆసక్తి సన్నగిల్లిందేమో అనుకున్నా. వాటిని చదివేంత తీరిక కూడా దొరక్కపోవడంతో ఇహ పుస్తకాలు చదివే కార్యక్రమం ఇంతేలే అని సరిపెట్టుకున్నా. అయితే ఈ పుస్తకం చదువుతుంటే నాకు అర్ధం అయ్యిందేమిటంటే ఆసక్తికరమయిన పుస్తకమే అయితే గనుక తీరిక దానంతట అదే దొరుకుతుందని :)

భద్రతా విషయాలలో యు ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, వారిలో పొరపొచ్చాలు, పొరపాట్లూ ఎలా జరుగుతుంటాయి  మొదలయిన విషయాల మీద ఆసక్తి వుంటే ఈ పుస్తకం మీరు ఎంచక్క చదివెయ్యొచ్చు. అంతేకాకుండా 9/11 సంఘటణ జరిగినప్పుడు తెరవెనుక ఏం జరిగింది, ప్రభుత్వ పెద్దలు ఎలా పనిచేసారు అనే విషయం మీద ఆసక్తి వున్నా ఈ పుస్తకం చదివెయ్యొచ్చు. ఈ పుస్తకంలో చాలాసార్లు ఇండియా గురించి వుండటం సంతోషంగా అనిపించింది. అయితే అదే సమయంలో నా దేశం అయిన కెనడా గురించి ఎక్కువగా లేకపోవడం నిరాశ పరిచింది.  అయితే నేను ఇప్పటిదాకా చదివింది కొంతేలెండి. ఓ వంద పేజీలు చదివా. రోజూ చదివేస్తూనే వున్నా. 

9/11 తదనంతర మార్పులని రైస్ ఎంతగా సమర్ధించుకున్నా అవన్నీ అతిభయంతో విచక్షణ కోల్పోయి చేసినవిగా ఆ పుస్తకం చదువుతుంటే మనకు అర్ధమవుతూనే వుంటుంది. అంతస్థాయి వాళ్ళు కూడా, అంత మంది కూడా గ్రవుండ్ రియాలిటీని కోల్పోయి అంత తేలిగ్గా భయభ్రాంతులవడం మనకు గోచరిస్తూనేవుంటుంది. ఒకరోజు ఆల్కైదా వాళ్ళు న్యూక్లియర్ బాంబులు వేస్తారేమో అని  వైట్ హవుజ్ అంతా కంగారు పడుతుంది. ప్రెసిడెంటుని బంకరులోకి వెళ్లమని రైస్ సూచిస్తే లం.. కొడుకు ఎవడయినా సరే వాడిని ఈ ఓవల్ ఆఫీసులోనే కలుస్తా అని బుష్ ఘీంకరించేసరికి తన టైం బావోలేదని, ప్రెసిడెంట్ మూడ్ బావోలెదని రైస్ అక్కడినుండి మెల్లగా జారుకుంటుంది.   

9/11 జరిగిన రోజు రాత్రి పూట కూడా విమానదాడి జరగబోతున్నట్లుగా అలారం వస్తే నైట్ డ్రెస్సులోనే బుష్ బంకరులోకి వెళ్ళాల్సి వస్తుంది. అది పొరపాటు హెచ్చరిక అని అర్ధం అయ్యాక సీక్రెట్ సర్వీసు వాళ్ళు ఆయన్ని అక్కడే పడుకొమ్మంటారు. 1960 ల్లోని పాత సోఫా ఒకటి గుంజి ఆయనకు పడకవేస్తారు. దాన్నో సారి బుష్ చూసి తనవల్ల కాదని బంకరు లోంచి జారుకోవడం, అతనివెంటే పోలోమ్మంటూ ఇతరులూ జారుకోవడం నవ్వు తెప్పిస్తుంది.

నా విగ్రహం సంగతేంటీ?

ఈ మధ్య విగ్రహాల హత్యలూ, వాటి తాలూకు గొడవలూ ఎక్కువయ్యాయి కదా. అందరి విగ్రహాలూ సరే, మరి నా విగ్రహం సంగతేం ఆలోచిస్తున్నారూ అని మిమ్మల్నదరినీ  నిగ్గదీసి, నిలదీసి ప్రశ్నిస్తున్నాను. తెలుగు వారి కీర్తిని ప్రపంచమంతా చాటుతున్నాను. కాదు కాదు తెలంగాణా కీర్తినే చాటుతున్నా అని కొందరు ఆకతాయిలు అంటుంటారులెండి. నేను బేసిగ్గా తెలుగోడిని. అంచేతా నేను వ్యాపింపజేసేది తెలుగు ప్రతిష్ఠే. అంచేతా ఇహ మీరు ప్రతిష్ఠించాల్సింది నా విగ్రహమే. నా విగ్రహం కోసం ఇంతవరకు నిగ్రహంగా వేచి వున్నా కానీ ఎవరి దగ్గరినుండీ ఉలుకూపలుకూ లేదు కాబట్టి నేనే కోడై కూయాల్సొస్తోంది. ఖర్మరా బాబూ. నా విగ్రహం కొసం నేనే డిమాండ్ చెయ్యాల్సొస్తోంది. నేనే ఆందోళనలు చెయ్యాల్సొస్తోంది.

ఆ మధ్య ట్యాకంబండ్ మీద మహనీయుల విగ్రహాల మూకుమ్మడి హత్య జరిగినప్పుడే సెలవించ్చాను - నా విగ్రహం ఎవరన్నా ట్యాంక్బండ్ మీద ప్రతిష్టించండయా బాబూ అని. ఎవరూ వినిపించుకున్నారు కాదు. అందుకే మళ్ళీ పాత డిమాండును కొత్తగా తెర మీదికి అనగా బ్లాగు మీదికి తీసుకురావాల్సొస్తోంది. పోనీ ట్యాంక్ బండ్ మీద కాకపోయినా పుర కూడళ్లలోనయినా పెట్టండయ్యా బాబులూ. మీక్కాస్త పుణ్యం వుంటుంది.  ఏం పతోనికీ విగ్రహాలు నెలకొల్పగా లేనిది పుట్టినప్పటినుండీ కాదు లెండి లే.. వద్దులెండి వయస్సు వచ్చినప్పటి నుండి లైంగిక హక్కుల కోసం ఆడా, మగా అనే తేడా లేకుండా పోరాడుతూనే వున్నా కదా.  అంచేత నా డిమాండులో న్యాయం కొంతయినా వుందని మీరు అంగీకరించాలి.  అంచేతా నా విగ్రహం నాకు అర్జంటుగా కావాలి. 

నా విగ్రహం వల్ల చాలా లాభాలు వున్నాయి. మనుషులూ, కుక్కలూ కాలెత్తుకొవచ్చు, పక్షులూ, పిట్టలూ రెట్టలు వేయొచ్చు, రాత్రి కాగానే నా నీడన చీకటి పనులూ చేసుకోవచ్చు. అలా అలా ఎన్నో, ఎన్నెన్నో. ఎవరో నేను మహానుభావుడిని కాదని నిన్ననే అన్నారు. అలాంటి రూమర్లు వ్యాపించకముందే నా విగ్రహం పెట్టేసెయ్యండి, పెట్టేసెయ్యండి. అయినా బ్రతికి వున్నవాడికి విగ్రహాలేంటయ్యా అని మీరడగవచ్చు. ఆ ప్రశ్న నన్నడగకండి మాయావతి సోదరిని అడుక్కోండి.  నేను బ్రతికి వున్నప్పుడే నా విగ్రహానికి గతిలేదు కానీ నేను చచ్చాక దాని గురించి పట్టించుకుంటారని నాకు ఇసుమంతయినా నమ్మకం లేదు. అంచేత కానివ్వండి, కానివ్వండి. అలా అని చెప్పి నా విగ్రహం కోసం నా దగ్గరే చందా వసూలు చెయ్యాలనే దుర్మార్గమయిన ఆలోచన తక్షణం మానుకోండి. అది పద్ధతి కాదు. గుర్తించండి.  కొంపదీసి మీకు రాని ఆలోచన గానీ నేను గానీ ఏమయినా ఇచ్చేసేనంటారా?!

అదో, విగ్రహం పెట్టగానే సరిపోదండోయ్, దాని చుట్టూ పూల మొక్కల సర్కిలూ, తగిన రక్షణా, పోలీసులూ వుండాలి. ఇనుప కంచె కూడా పెట్టించండి. బాంబ్ స్క్వాడులూ దగ్గర్లో వుండాలి. అలాగే ఓ డాక్టరూ, మొబయిల్ వైద్యశాలా దగ్గర్లో వుండాలి. అబ్బా డాక్టర్ అంటే డాక్టర్ కాదు లెద్దురూ. తాపీ మేస్త్రీ గురించి నేననేది. నాకు అనగా నా విగ్రహానికి ఎవరయినా రాళ్ళేసి చెయ్యో, కాలో విరిగితే కట్టు కట్టాలి కదా. అందుకూ. అసలే నాకు శత్రువులు ఎక్కువాయే. పతి పతివ్రతా నామీద పుచ్చు టమాటోలో, మురిగిపోయిన కోడిగ్రుడ్లో విసరాలనుకునేదాయే. 

మొత్తానికి మీరు నా విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించుకున్నందుకు అభినందనలు. ఇప్పుడో ధర్మ సందేహం. నాది నగ్నవిగ్రహం ప్రతిష్టిస్తారా లేక సాధారణ విగ్రహమా. మీరే చెప్పండని మాత్రం నన్ను అడొగవద్దు. అది ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ మెజారిటీ నిర్ణయానికీ, ప్రజా బలానికీ నేను తల వంచుతాను కనుక. మీ అభిప్రాయం ఏంటో, నా విగ్రహం ఎలా వుంటే ఎలా బావుంటుందో కామెంట్ల ద్వారా సెలవివ్వండి మరీ. నాది మరో ధర్మ సందేహం. ఒహవేళ నా నగ్న విగ్రహమే ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారే అప్పుడు ఆ విగ్రహంలో... వద్దు లెండి. మరి కొన్ని పుచ్చు టమటాలూ, మురిగిపోయిన కోడిగుడ్లూ కామెంట్లుగా పడతాయి. వద్దులెండి. అన్నీ ప్రజలే నిర్ణయించాలి. నాదేముందీ, నిమిత్తమాత్రుడిని. అన్నట్టు నా విగ్రహం ప్రతిష్టించుకోవడానికి ఎవరూ ఒప్పుకోకపోతే కనీసం వేశ్యావాటికల్లో నయినా ప్రతిష్టించండయ్యా...వాళ్లయితే నన్ను వద్దనరూ.

అవును గానీ నా విగ్రహంలో నా చూపుడు వేలు ఎటువేపు చూపిస్తుందేమీటీ? అది మరో ధర్మ సందేహమూనూ. దాన్నిక మీరే తీర్చాలి మరి.

ఇవాళ... వ్రాయడానికేమీ లేదు!

ఎందుకు లేదూ, వ్రాయాలనుకుంటే ఎన్నయినా,ఎంతయినా  వ్రాయొచ్చు. కానీ ఏం బ్లాగులో ఏంటో, ఏవయినా వ్రాయడానికి ముందు ఎన్నెన్నో ఆలోచించాలి. ఇంకా నయ్యం. నేనలా తక్కువగా ఆలోచిస్తుంటాను లెండి. ఇష్టమయినవన్నీ వ్రాయలేము, కష్టమయినవన్నీ ఇష్టం కావు. ఎలా చెప్మా!

ఏమయినప్పటికీ ఈ మధ్య కాస్తంత ఎమోషనల్ రోలర్ కోస్టరులో  వుంటున్నా కాబట్టి ఏవయినా వ్రాసే మూడ్ వున్నప్పుడు వ్రాసేస్తుంటానేం. నేను టపాలు వ్రాయకపోతే ఏవో కొంపలు మునిగిపోతాయని కాదుగానీ నాకున్న కొద్దిమంది శ్రేయోభిలాషుల కొరకే ఈ సమాచారం.