కోదాడులో డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్న రోజులవి. ఇంకో ఇద్దరు రూమ్మేట్లతో నివాసం వుంటుండేవాడిని. నేను బైసెక్సువల్ అని వారికి తెలియదు. రోజూ పడుకున్నట్లే ఆ రోజు రాత్రి కూడా ఒక రూమ్మేట్ పక్కన పడుకున్నా కానీ గాఢనిద్రలో వేడెక్కిపోయి నాకు తెలియకుండానే పక్కన వున్న అతడిని కౌగిలించుకొని కెలకడం మొదలెట్టాను. ఎందుకో మెలకువ వచ్చి చూస్తే అతగాడిని ఆడదానిగా భావిస్తూ తడిమేస్తున్నాను. నా నాలుక కొరుక్కొని చప్పున చెయ్యి వెనక్కి లాక్కుని దూరం జరిగి పడుకున్నాను.
అతను నాకు మంచి స్నేహితుడే అయినప్పటికీ అతని మీద అలాంటి ఆకాంక్ష లేదు. అతను ఆ రకంగా నాకు నచ్చేవాడు కాదు. అందుకే పొరపాటుగా అతని మీద చెయ్యివేసినా స్పృహలోకి రాగానే తగ్గాను. మరి నేను ఇలా కెలికిన విషయం అతనికి అర్ధమయ్యిందో లేదో నాకు తెలియదు కానీ ఆ క్షణాల్లో మాత్రం కదలకుండా వుండిపోయాడు. మరునాడు లేచాక మామూలుగానే వున్నాడు. మా మధ్య ఎప్పుడూ ఈ ప్రస్థావన రాలేదు.

0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి