కమ్యూనల్ లివింగ్ కావాలనిపిస్తోంది

ఇండియాలో ఇదివరలో ఎంచక్కా సమిష్టి కుటుంబాలు వుండేది. వాటితో కొన్ని సమస్యలు కూడా వుండేవనుకోండీ. ఇప్పుడేమో కేవలం ఒక భార్యా, ఇద్దరు పిల్లలతోనే  అస్తమానం గడుపుతూ రావడం వల్ల బోరెత్తిపోతోంది. ఈమధ్య కమ్యూనిటీ లివింగ్ మీద కాస్త రెసెర్చ్ చేసా. పూణే ఓషో ఆశ్రమం గురించీ, నేపాలులో వున్న తపోబన్ మరియు గోవాలో నిర్మితమవుతున్న ఓషో కో కమ్యూనిటీ మొదలయినవి నెట్టులో పరిశీలించాను. ఓషోవే కాకుండా మిగతా కొన్నింటి గురించి కూడా చదివాను. కమ్యూనిటీ లేదా కమ్యూన్ నివాసంలో రకరకాల పద్ధతులు వున్నాయని అర్ధమయ్యింది.

అయితే ప్రతి దాంట్లోనూ కొన్ని సమస్యలున్నట్లు ఈ నివాస విధానంలోనూ కొన్ని ఇబ్బందులు లేకపోలేదు లెండి. అందరితో కలిసి వుండాల్సి రావడం, ప్రైవసీ కొరవ అవడం, ఇష్టం వున్నా లేకపోయినా కమ్యూనిటీ పనుల్లో పాల్గొనాల్సి రావడం లాంటి ఇబ్బందులు వున్నాయి. అయితే ఎంతో మందితో సరదాగా, సన్నిహితంగా, ఒకే కుటుంబంలా గడిపే అవకాశం వుంటుంది. మన పరిధి, హృదయం విశాలమయ్యి పరిణతి సాధించవచ్చును. ఎప్పుడూ మనమూ, మన కుటుంబమూ అని కుచించుకుపోకుండా అందరం, అందరికోసం అన్న భావన పెరుగుతుంది. అలా అలా ఎన్నొ లాభాలు వున్నాయి. 

ఇండియా, నేపాల్, యూరప్, బ్రిటన్ లలో ఓషో కమ్యూనిటీలు వున్నాయి. యుఎస్ లో కూడా కాలిఫోర్నియా, వర్జీనియా లాంటి రాష్ట్రాల్లో చిన్న, చిన్న కమ్యూన్స్ వున్నట్టున్నాయి. మా చికాగో దగర్లో మాత్రం ఒషో కమ్యూన్స్ ఏమీ లేవు. ఇప్పట్లో ఏర్పడే దృశ్యమూ లేదు. అందువల్లనూ, పూర్తి స్థాయి కమ్మూనల్ లివింగ్ వల్ల వుండే కొన్ని ఇబ్బందులనూ మరియు ఇప్పుడు మేము వున్న పరిస్థితులల్లో ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని వీకెండ్ కమ్యూనల్ లివింగ్ సూచిస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను. 

పని రోజుల్లో ఎవరింట వారు వుంటారు కాబట్టి అన్ని రోజులు ఎవరి పనులు వారు చూసుకుంటారు, ఎవరి ప్రైవసీ వారికి వుంటుంది కాబట్టి వారాంతాలు అందరితో కలిసి గడపడానికి అందరూ ఇష్టపడవచ్చు. ఒహవేళ రెండు రోజులు కూడా మొదట్లోనే ప్రాక్టికల్ కాదనుకున్నా కూడా ఈ విధానం నచ్చిన వారు కనీసం ఆదివారం అయినా కలిసి గడపొచ్చు. అందరూ ఒకే ఫ్యామిలీ మెంబర్సులా గడపడం అన్నది కాస్త సత్యదూరం అవుతుంది కాబట్టి అందరూ కలిసి ఎక్స్‌టెండెడ్ కుటుంబ సభ్యుల్లాగా అయినా ఎంచక్కా గడపడానికి అవకాశం చిక్కుతుంది.

అలా ఇష్టమయిన కుటుంబాలు కలిసి ఎవరి ఇంట్లో అయినా గడపోచ్చు లేదా ఎక్కడికయినా వెళ్ళి గడపొచ్చు. అప్పుడు ఆ ఇంటికి వచ్చిన వారు అతిధుల్లా కాకుండా ఆ కుటుంబ సభ్యుల్లాగానే పనుల్లో పాలుపంచుకోవాల్సివుంటుంది.  అలా తమ ఇల్లు లాగానే భావిస్తూ గడపడం బావుంటుంది.  నా ఆలోచనలు పాటించడానికి మా కుటుంబం అయినా సిద్ధం అవుతుందో తెలియదు. జస్ట్ నా ఆలోచనలు మీతో పంచుకుంటున్నా అంతే. అందరికీ సూచించి చూస్తాను. వర్కవుట్ అయితే అవుతుంది లేకపోతే లేదు.  చూద్దాం. వేయి పూవులు వికసించనీ, వేయి ఆలోచనలు వికసించనీ. మొదట్లోనే తృంచివేయడం ఎందుకూ?

మీలో ఎవరయినా ఆశ్రమవాసం లేదా కమ్యూన్ నివాసం చేసారా? మీ అనుభవాలు, అనుభూతులు ఏంటి?

4 comments:

 1. రెండు మూడు చిన్నిళ్ళు పెట్టి అంతా ఒకచోట జేర్చండి..., సమిష్టి కుటుంబం ఎఫెక్ట్ వస్తుంది మీకు. లేక..., అంతా అనకాపల్లి సంత... అవుతుందంటారా...

  ReplyDelete
 2. బుల్లబ్బాయ్January 11, 2012 at 1:21 AM

  కమ్యూనల్ లివింగా? అంటే ఒక హిందు, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్... కలిసుండటమా??


  ఇంకా నయ్యం కమ్యూనిస్ట్ లివింగ్ అనలేదు! మన మార్తాండ లగెత్తుకొచ్చి మీ దుప్పట్లో దూరేటోడు!

  ReplyDelete
 3. బుల్లబ్బాయ్January 11, 2012 at 1:43 AM

  అన్నాయ్, మన పార్టీ ఎక్కడ?
  http://sarath-kaalam.blogspot.com/2010/12/blog-post_30.html

  -----

  బుల్లబ్బాయ్ చెప్పారు...
  Dec31 మనం ఫుల్లు బిజీ, అందుకే మీ అందరికి ఇప్పుడె హాపీ న్యూఇయర్స్!

  ఈ కొత్త సంవత్సరంలో మీ ప్లాన్లన్నీ విజయవంతం కావాలని... శరత్ గారు దాచిన డబ్బుల్తో 2012 న్యూఇయర్ కి మనందరికీ డౌన్ టౌన్ చికాగో లో ఒక చవకైన పబ్బులో పార్టీ ఇవ్వాలనీ ఆసిస్తూ..

  సెలవ్! టాటా, బాబాయ్!

  -----

  ReplyDelete
 4. @ మిర్చి
  ఒక్క కుటుంబాన్ని భరించడమే కష్టంగా వుంది. ఇంకా రెండు మూడు చిన్నిళ్ళా! అలా కుదరదు కనుకే ఈ రూటులో ఆలోచిస్తున్నా :)

  @ బుల్లబ్బాయ్
  చాలా రోజుల తరువాత మీరు కనపడ్డారు.

  అలా ఏమీ కాదు గానీ ఎలాంటి పక్షపాతాలూ లేకుండా అందరూ కలిసివుండొచ్చు. భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి ఎవరయినా కలిసిరావచ్చు.

  ఆ డబ్బు లక్ష్యాలు గట్రా సాధించలేదు లెండి. లైట్ తీస్కోండి. అసలు ఆ పోస్టు తీసివేస్తా వుండండి.

  ReplyDelete