ఒహవేళ మీ మనస్సు నొప్పిస్తే క్షమించండి...

...అని నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నా భుజాల మీద చేతులు వేసి మంద్రమయిన స్వరంతో ఒకరి తరువాత మరొకరు వచ్చి పదేపదే చెప్పసాగారు. ఇదీ మేము చేసిన AUM మెడిటేషనులో రెండవ స్థితి. నేను కూడా అలా అందరికీ చెప్పివచ్చాను. మొదటి స్టేజ్ లో అందరం అరుచుకున్న తరువాత ఇలా దానికి వ్యతిరేక మనసిక స్థితిలో అందరం ఒకరినొకరం మన్నించమని వేడుకున్నాం. ఇలా అందరినీ ఊరకే మన్నించమని అడగడంలోని లాజిక్ నాకు అంతగా అర్ధం కాలేదు కానీ ఆచరించేసాను. అన్ని వేళల్లా మనస్సుకి పదును పెడితే ప్రశాంతత వుండదు. కొన్ని సార్లు ఆయా విషయాల్లో ప్రవీణులు చెప్పింది గుడ్డిగా నమ్మెయ్యక తప్పదు.

Second Stage – Forgiveness

Facing each other, each say “I’m sorry if I hurt you”, and hug. This stage offers a bridge to turn around the energy from anger to love. 
మరుసటి మెట్టు - ఫ్రీ హగ్స్ :) అందరినీ ఒకరి తరువాత మరొకరిని మనసారా కౌగిలించుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పదేపదే చెప్పాలి. ఆడ, మగా అన్న తేడా లేకుండా అందరికీ అలా హగ్గులిస్తూ మన ప్రేమను ప్రకటిస్తూ వెళ్ళాలి. నిజ్జంగా ప్రేమ లేకున్నా కూడా అలా చెబుతూ వెళ్ళమని ఆ శిక్షకుడు కోరేడు. దాంతో అందరితో అలా ప్రేమ ప్రకటిస్తూ వెళ్ళాను. అయితే ఒక ఇబ్బంది ఎదురయ్యిని నాకు. ఎంతసేపు అలా కౌగిలించుకోవచ్చు? అది నాకు అర్ధం కాలేదు. ఎక్కువసేపు అలాగే పట్టుకొని వుంటే ఎదుటివారు అపార్ధం చేసుకోవచ్చు. అందుకే ఎందుకయినా మంచిదని, అలాంటి గ్రూపు వ్యవహారాలూ, ధ్యానాలూ నాకు కొత్త కాబట్టి త్వరగానే తెమిలాను.  
 
ఇలా అందరం క్షమాపణలూ, ప్రేమలూ పంచుకోవడం వల్ల అందరం ఒకరికి ఒకరం కాస్త చనువు అయిపోయాము. కొత్తాపాతా, వీరూవారూ అన్న తేడా లేకుండా అందరి మనస్సులూ వికసించడానికి ఆస్కారం ఏర్పడింది. కొందరయినా ఆత్మబంధువులు అనిపించడానికి అవకాశం చిక్కింది.
Third Stage – Love

This stage connects participants with the healing power of love. One feels nourished by expressing love and hearing that they are loveable. Facing each other, each say “I love you”, and hug.
ఈ AUM ధ్యానం గురించీ, ఇతర సాంఘిక ధ్యానాల గురించీ తెలుసుకోవాలంటే ఈ క్రింది సైటుకి వెళ్ళండి.  

2 comments:

  1. మా శరత్తు వారు తప్పు దోవ పడు తున్నారేమో అని సందేహం వేస్తోంది !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. @ జిలేబీ
    అంటే నా రొటీన్ దారినుండి పక్కదోవ పడుతున్నానంటారా? అన్నీ బ్యాలన్స్ చేసుకోవాలి కదండీ.

    ReplyDelete