బ్లాగుల్లోకి ఉ...(బీప్) పోయించడానికి వచ్చాను!

మొన్న ముప్పైఆరు డాలర్లు తగలేసి (మా అమ్మలు తిండి అదనం - మేమూ షేర్ తీసుకున్నాం - అది వేరే విషయం) బాంబేలో బ్యుజీమ్యాన్ ఏం చేసేడో చూసి వచ్చేం. చూసి వచ్చాక అనిపించింది - ఆ సినిమా డివిడికి ఎక్కువా, సినిమా హాలుకి తక్కువా అని. తీక్షణమయిన మహేశ్ బాబు కళ్ళు చూసి చూసి, గంభీరమయిన ఉపన్యాసాలు వినీ వినీ తలనొప్పి పుట్టింది. సార్ వస్తారూ అన్నారో, వత్తాడు అన్నారో కానీ నాకు ఆ పాట అసలు అర్ధం కాలేదు కానీ  ఆ పాట అయితే వినడానికీ, చూడ్డానికీ బావుంది. కాజల్ మిల్క్ బేబీని, మహేశ్ మిల్క్ బాయ్ నీ కలిపి చూడ్డానికి బావుంది. ఇహ మిల్క్ బాయ్ మరో మిల్క్ బేబీ తమన్నాతొ జత కడితే చూడాలని వుంది.  మరి అదెప్పుడో. 

సినిమా విడుదల అయ్యాక పూరి వెళ్ళి నర్సీపట్నం (అనుకుంటా) లో తన స్నేహితులతో కలిసి సినిమా చూస్తే ఆ సినిమా సూపర్ హిట్టవ్వుద్దని మహేశ బాబు కూడా పూరిని నర్సీపట్నంలోనే ఈ సినిమా కూడా చూడమని చెప్పేడుట. అందుకే ఈ సినిమా హిట్టయ్యింది కానీ మన మహేశ్ ప్రతిభ వల్ల మాత్రం కాదుట. ఓ హిట్టు హిట్టని నాలాంటి బకరాలు కూడా ఓ కుటుంబాన్ని వెంటేసుకొని వెళితే మరింత హిట్టవక ఛస్తుందా? మరో సినిమా ముప్పయి రోజుల్లో రీళ్ళు చుట్టేసి మళ్లీ పూరీ గారు ఆ ఊర్లో సినిమా చూస్తే చాలు - ఈ సారి పూరితో మహేశుకి హ్యాట్రిక్కు గ్యారెంటీ.  ఇప్పటికే పూరి గారి పైత్యం పెరిగిపోయిందని, తానో రాం వర్మ లాగా ఫీల్ అవుతూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. మహేశుడితో మూడో సినిమా వరకు ఇంకా ఆ పైత్యం ముదిరిపోయి తన సినిమాలో ఇంకెన్ని లెక్చర్లు దంచుతాడో. ఈ సారి ఏ రేపిస్టు కోణంలోనో సినిమా తీసి జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంకో ఒక్కరినయినా బలాత్కారం చెయ్యకపోతే ఆ బ్రతుకు వృధా అని మళ్ళీ నీతోపదేశాలు ఇప్పించెయ్యగల్డు.

సరే సినిమాని మాఫియా ఏంగిల్లో తీసాడు - విభిన్నంగా వుందని అడ్జస్ట్ అయిపోదాం కానీ చివర్లో ఆ మెసేజులేంటీ? నాకయితే చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు ఇండియాలో బూతు పుస్తకాల్లో  కథలు ఎలా వుంటున్నాయో తెలియదు కానీ మేము అవి చదివిన రోజుల్లో కథలన్నీ పసందుగా వుండి కథ చివర్లో అంత్యతృప్తి కలుగుతున్నదనంగా ఓ నీతి ప్రబోధం వుండేది. ఫెడేల్మని ఎవరో మనల్ని ఓ చెంపదెబ్బ కొట్టినట్టు ఆ కథ చదువుతున్న ఆనందం ఆవిరి అయ్యేది (అలా నీతి బోధ లేకపోతే ఆ పుస్తకాలు ప్రభుత్వం బ్యాన్ చేస్తుందని ఆ పబ్లిషర్ల భయం లెండి).  అలాగే ఈ సినిమాలో మహేశు ఏదో మాఫియా దందా చేసుకొని బ్రతికేస్తున్నాడులే అని వదిలేస్తే చివరికి మనకే నీతిపాఠాలు చెప్పేసరికి నన్నెవరో నెత్తి మీద గాఠ్ఠిగా ఓ పీకుడు పీకినట్లనిపించింది. మా ఆవిడ ఏమయినా నన్ను ఓ పీకుడు పీకిందేమోనని తిరిగి చూసా. అబ్బే, ఆనందంగా ఆ మహేశుడి మెసేజు వింటోంది. నా బాటం లైన్: ఫర్వాలేదు కానీ సినిమా హాలు కెళ్ళి ఈ సినిమా చూసేంత దృశ్యం లేదు.

ఆ చిత్రం చివర్లో మాఫియా మహేశ్ గీతోపదేశం లాగా నీతోపదేశం ఇచ్చాక నాలో అంతర్మధనం మొదలయ్యింది. ప్రతి వ్యక్తికీ ఓ లక్ష్యం వుండలానో ఏమో చెప్పినట్లున్నాడు. అప్పటికే నాకొచ్చేసిన తలనొప్పికి నాకదేం పెద్దగా జీర్ణం కాలేదు కానీ కొద్దిగా అయ్యింది. అందరూ మిగతావాళ్లనందరినీ ఉ..(మళ్లీ బీప్) పోయించాలని మాత్రం తెలిసివచ్చింది. మరి నాకంత దృశ్యం వుందా? అది పోయించడానికి నేనేమీ కనీసం ఒ రౌడీనో, దాదానో అయినా కాకపోతిని. నేను మహేశ్ బాబుని కాకపోతిని - ఉట్టి శరత్ బాబుని అయిపోతిని.

మనం అనగా నేను బ్లాగులు తప్ప వేరే సాధిస్తున్నది ఏమీ లేదు. నేనూ మహేశ్ బాబులా గర్వపడేదెలా అని ఆలోచించి చించాను. అప్పుడు నాకు బుర్రలో తళుక్కున మెరిసింది. నేనూ బ్లాగుల్లో మరీ అందరితో కాకపోయినా చాలా మందితో ఉ...( పదే పదే బీప్ లు చెప్పలేను, అడ్జస్ట్ అయిపోండేం) పోయిస్తున్నానని అర్ధమయ్యింది. బాబు గారయితే కేవలం ఉ... పోయించాడేమో కానీ నేనయితే ఉ (పదే పదే చుక్కలు కూడా పెట్టలేనని మనవి) కూడా విమర్శకులతో వేయించుకుంటున్నా మరి. 


అయితే మహేశ్ బాబు గారి ఉ వేరు శరత్ బాబు గారి ఉ వేరూ.  నాది ఉమ్ము. ఓ సారి మళ్ళీ వేసి వెళ్ళి రండి.

11 comments:

  1. అయితే మీరు దూకుడు చూడలేదన్న మాట.. అందులో మనతమన్నా నటించింది.. .

    ReplyDelete
  2. @ సింహం
    దూకుడు మళ్ళీ మొన్నే చూసా. అందులో వుంది సమంతా కదా!

    ReplyDelete
  3. నాకేదొ అయ్యింది.. పని ఎక్కువ చేస్తున్నానేమో.. తమన్న అంటే నాకు సమంతా ఎలా గుర్తొచ్చిందో.. ఛీ నా..

    ReplyDelete
  4. @ సింహం
    మరీ ఇంత చిన్న చిన్న విషయాలకే మిమ్మల్ని మీరు తిట్టేసుకోకండి (అంటే నన్ను తిట్టమని అర్ధం కాదు!). మహేశుడు చెప్పినట్లుగా మీ లక్ష్యం మీద ఆ కసిని చూపండి. ఆ లక్ష్యం ఎలాంటిదన్నది ముఖ్యం కాదు - మంచిదా చెడ్డదా అన్నది ముఖ్యం కాదు - దాన్ని సాధించడమే ముఖ్యం. ఇది చెప్పింది నేను కాదు. పూరి ది గ్రేట్!

    ReplyDelete
  5. ఏది ఏమయినా, మీ టపాలకి మీరు పెట్టే టైటిల్స్, ఫోటోలు మాత్రం సూపరండీ బాబూ. మొన్నెవరో అన్నట్టు, మీ కథనం అదుర్స్ !!!

    ReplyDelete
  6. పూరి కి ఒక హిట్ ఉంటే.. పది ఫ్లాప్స్ ఉంటయ్. ఎందుకో ఇట్ల సలహాలిస్తడు.. మనం మంచిగ ఓషో చెప్పినట్లు.. సాఫీగా నడిచేట్లు ధ్యానం చేద్దాం..

    ReplyDelete
  7. Anny Inthaki Intervel lo ayina Yu**** posara leda. adi poyadaniki $36 Karchu chesara Papam...

    ReplyDelete
  8. Annay...Mahesh "ATHADU" cinema chusara...leka pothe oka sari chudandi meru eppudu Bore kottina chudali anipisthundi....cinema ante ala vundali.

    ReplyDelete
  9. @ సిద్ధార్ధ్
    :)

    @ సింహం
    :)

    @ అజ్ఞాత
    ఏం చేస్తామండీ, ఏం చేస్తాం. పెళ్ళామూ, పిల్లలూ ఒకటే నస - సినిమాకి తీసుకెళ్ళమని.

    మహేశ్ నా అభిమాన హీరోల్లో ఒకడు. అతని చాలా సినిమాలు చాలా బావుంటాయి. 'అతడు' కూడా తరచుగా చూస్తుంటాం.

    ReplyDelete
  10. stupid movie.I didn't like it at all.Bodyguard is really good but couldn't be as successful.Sometimes hype spreads like contagious virus and kills the conscience of viewers.If the director is walking in clouds for making the movie a supposedly hit,his downfall can also be a disastrous.

    ReplyDelete
  11. @ ప్రశాంత్
    మేము బాడీగార్డ్ ఇంకా చూడలేదు - సినిమా హాలుకి వెళ్ళి చూసే ఉద్దేశ్యం లేదు. హిందీలో చూసేసాం కనుక తెలుగుది డివిడిలో చూస్తే సరిపోతుంది లెండి.

    మీరన్నట్లే పూరి పైత్యం ఇంకా ముదిరిపోతే ముందు ముందు అపజయాలు ఖాయం.

    ReplyDelete