సక్సెస్ సూత్రాలలో Win - Win టెక్నిక్ నాకు బాగా నచ్చుతుంది. ఏ విషయంలోనయినా నా కృషిలో ఆ సూత్రాన్ని వీలయినంతంగా ప్రవేశపెట్టాలనుకుంటాను కానీ అన్ని సార్లూ కుదిరి చావదు. అలా వీలయిన ఆంశాల్లో మాత్రం చక్కగా ఫలితాలు వుంటాయి. రొమాంటిక్ విషయాల్లో కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తుంటాను. అలా గొప్ప గొప్ప ఆనందాలు పొందేస్తుంటాను. సక్సెస్ సాధించడమంటే ఏదో నీళ్ళ మీది నడకలాంటి మహత్మ్యాలు ఏమీ సాధించనఖ్ఖరలేదు గానీ మన ఎంచుకున్న పరిధిలో ఎంతో కొంత పురోగతి సాధించినా చాలు అనిపిస్తుంది. నేను చదువుల్లో గోల్డ్ మెడల్స్ ఏమీ సాధించలేదు కానీ దాదాపుగా ప్రతి పరీక్షలోనూ ఆ తరగతిలో మొదటి మూడు స్థానాల్లో అయితే వుండేవాడిని. అయితే ఇంటరులో మాత్రం బోల్తా కొట్టాలెండి. దాని గురించి మరో సారి వ్రాస్తాను.
నా డిగ్రీ అయిపోయాక ఖమ్మంలో కంప్యూటర్ కోర్సులో చేరాను. అప్పుడు ఈ టెక్నిక్కును బాగా ప్రయోగించాను. కంప్యూటర్లు అంటే ప్రజలకు అంతగా తెలియని రోజులవి. అందువల్ల ఉత్సాహంగా అందులో చేరాను. నా తోటి వారికి సందేహాలను తీరుస్తుండేవాడిని. అందువల్ల నాకు కంప్యూటర్ కాన్సెప్టులలో బాగా క్లారిటీ వచ్చేది. అందువల్ల నాలో ఇంకా ప్రతిభ పెరిగింది. నా తెలివిని గుర్తించిన మా ప్రిన్సిపాల్, లెక్చరర్లు డిప్లొమా విద్యార్ధులకి పాఠాలు చెప్పమని ఉరమాయించారు. ఒక వైపు పోస్ట్ గ్రాజుయేషన్ విద్యార్ధిగా వుంటూ మరో వైపు డిప్లొమా విధార్ధులకు అధ్యాపకుడిగా వుండేవాడిని.

కంప్యూటర్ ల్యాబులో కూడా అందరికీ సహకారం ఇస్తుండేవాడిని. అలా అలా ఆ ల్యాబ్ తాళాలూ నా చేతికి వచ్చాయి. ఎవరికయినా ప్రాక్టికల్స్ ఎక్కువగా కావాలంటే శరత్తుతో సమన్వయం చేసుకోమని ఆ శిక్షణా కేంద్రం చెప్పేది. అలా ఏ రాత్రి రెండు మూడింటి వరకో లేకపోతే ఉదయం నాలుగు గంటలకో లేచి అడిగిన వారికి ప్రాక్టికల్స్ చేయిస్తుండేవాడిని. శిక్షణా కేంద్రానికి దగ్గర్లోనే నా గది వుంటుండటంతో నన్ను లేపి అక్కడికి తీసుకువెళ్ళడానికని కొంతమంది విద్యార్ధులు ఉదయం నాలుగు గంటలకే నా గదికి వచ్చి లేపేవారు. అలా అలా అటు యాజమాన్యానికీ, ఉపాధ్యాయులకూ, విధ్యార్ధులకూ, స్టాఫుకూ అందరికీ తలలో నాలుక అయిపోయాను. అలా నాకు చక్కని విజ్ఞానమూ అబ్బింది, అందరితో చనువూ పెరిగింది. అలా నేను ఆ శిక్షణా సంస్థకు ఉపయొగపడ్డాను - నాకు ఆ సంస్థ ఉపయోగపడింది. ఇద్దరమూ లాభం పొందాము.
అది మెగాబైట్స్ కంప్యూటర్స్ వారి శాఖ. జాతీయ స్థాయిలో కూడా పరీక్షలు వుండేవి. జాతీయ స్థాయిలో ప్రధముడిగా రావాలని కృషి చేసాను కానీ ఆ శాఖలో ప్రధముడిగా వచ్చాను. కేవలం ఆ శాఖలోనే ప్రధముడిగా రావాలని ప్రయత్నించివుంటే అంత ఫలితం కూడా వచ్చివుండేది కాదు. అందుకే మన లక్ష్యాన్ని కాస్త ఎక్కువగా పెట్టుకుంటే గానీ కనీస లక్ష్యాన్ని సాధించలేము. అయితే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ఆ Win-Win టెక్నిక్ ప్రయోగించడానికి అవకాశం లేకుండా వుంది. కొన్ని కారణాల వల్ల అలా చిక్కుబడిపోయాను. ఇంతకు ముందు ఉద్యోగాల్లో ఇది ప్రయోగించి మంచి ఫలితాలు సాధించాను.
మీకు ఈ విజయ సూత్రం తెలుసా? దీనిని మీ కృషిలో అప్లయ్ చేసారా? ఎటువంటి ఫలితాలు సాధించేరేంటీ?

0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి