సోమవారం 23 జనవరి 2012

ఇకనుండి కొంతకాలం నా సెక్స్ కథలకు కామా పెట్టి,


, నా సక్సెస్ స్టోరీస్ వ్రాస్తాను. అంటే నేనేదో జీవితంలో గొప్పగా విజయవంతం అయ్యానని కాదు గానీ నా పెళ్ళయ్యేదాకా ఎందులోనయినా విజయం కోసం కాస్తంత కిందా మీదా పడుతుండేవాడిని. వివాహా విద్యా నాశాయా అన్నట్లుగా పెళ్ళయ్యాక నేను విద్యలోనూ, విజయంలోనూ బొక్కబోర్లాపడ్డాను. అలా అలా నా పెళ్ళికి ముందూ, పెళ్ళికి తరువాతా విజయం కోసం ఆ ఆరాటాలూ, పోరాటలూ, అందులో నేను నేర్చుకున్న పాఠాలూ, గుణపాఠాలూ కొన్ని మీకు వ్రాస్తాను. ఇలా ఎంత కాలం? కొంత కాలం. కొంత అంటే...? ఏమో. 

మీ విజయగాధలూ, అపజయగాధలూ కూడా మా అందరితో కనీసం ఈ బ్లాగులో కామెంట్ల రూపేణా అయినా మీరూ పంచుకుందురూ. 

11 comments:

సింహం చెప్పారు...

అలా దేశ దేశాల్లో లింగ హక్కుల పై అకుంఠితంగా కృషి చేసి 2076లో స్వదేశానికి పయన మయ్యాడు శరతానంద స్వామి..
అని ముందు తరాలు చదుకుంటే బాగుంటుంది కానీ.. మాకెందుకు అయన్నీ....

(><).. సెక్స్ కథలు అయితే దాదాపుగా ఒకేలా ఉంటాయి.. కాబట్టీ ఏదో చదవ బుద్ది వేస్తుంది..

Zilebi చెప్పారు...

శరత్తు గారు,

అదేమీ టో నండీ, మీరు కథలకి 'కామా'
పెట్టినా కామా నే కనిపిస్తోంది
కామ ఇంట్లు కూడా 'కామా' మయం !
beuty lies in the eyes of the beholder అంటే ఇదే 'కామోసు'!!

చీర్స్
జిలేబి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సింహం
లైంగిక హక్కుల గురించిన కృషి ఎలాగూ వుంటుంది కాకపోతే కథలే అనగా నా అనుభవాలే కాస్త వుండవు. అదీ కొంత కాలమే. ఈ మధ్య సెక్సెస్ మీద ఫోకస్ తగ్గి సెక్స్ మీద ఫోకస్ ఎక్కువయినట్లు అనిపిస్తోంది. ఫోకస్ బ్యాలన్స్ చేసుకోవడం కోసం బ్లాగుల్లో కూడా ఇలా ఫోకస్ చేస్తున్నా. నాకు సెక్సూ, సక్సెసూ రెండూ ఇష్టమే. జనాల్లో సెక్స్ కోసం ఆరాటపడేవారు ఎంతమంది వుంటారో అలాగే సక్సెస్ కోసం ఆరాటపడేవారూ అంతమందీ వుంటారు. అలాంటి వారితో కనెక్ట్ అయిపోయి సక్సెస్ సలహాలను ఇచ్చిపుచ్చుకుంటూ వుంటే అవి నా అభివృద్ధికీ కాస్తో కూస్తో దోహదపడవచ్చు. కొంతమంది అదృష్టవంతులకి విజయం తన్నుకుంటూ వస్తుందేమోకానీ మిగతావారందరూ ఏదోరకంగా కృషి చెయ్యాల్సిందే. నేను మరీ ఈమధ్య తడిగుడ్డ మీదేసుకొని పడుకుంటూ తాపీగా వుంటున్నా. నాలో చురుకుదనం కోసమే, నాలో వేడి రగిలించుకోవడం కోసమే ఆ టపాలు. అయితే అవి మీలాంటి వారికి సరిపడకపోవచ్చు కాబట్టి వాటికి దూరంగా వుండండి మరి.

@ జిలేబీ
నా కామాలో కూడా మీకు కామం కనిపిస్తే ఎలాగండీ బాబూ ,) మీ పోలిక బావుంది సుమీ :)

సింహం చెప్పారు...

ఏదో అలా అంటాం కానీ.. సరైన వి అనిపించి ఆలోచింపచేసే ప్రతివీ అహ్వానిస్తా గురువుగారు.. మీ బ్లాగ్ చదివే వాళ్ళలో ఎక్కువమందికి.. అలాంటి కథలే ఆహ్వానం పలికినా.. కథనం బాగుండడమే మీ బ్లాగు విజయానికి మూలం..

ఇంక మీ కథనం ఎలాగూ బాగుంటుంది కాబట్టి చదుతూనే ఉంటాం.. చెప్పే విధానం తెలియాలే కానీ,..విషం కూడా తాగించొచ్చు కదా..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సింహం
సంతోషం :)

నా కాస్తో కూస్తో బ్లాగు విజయానికి కారణం కథనం కూడా కాస్త కారణం అయివుండొచ్చు కానీ అలాంటి మంచి కథకులు ఎంతమందో వున్నారు. అయితే ప్రతి విషయంలోనూ నిజాయితీ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో నా వ్రాతల్లోని నిబద్ధత కొంతమందినయినా సేద తీరుస్తుందనే నా విశ్వాసం.

ఏ వ్యక్తిత్వవికాసం పుస్తకం చదివినా, ఏ విజయం కోసం అపసోపాల పుస్తకం చదివినా కూడా అన్నీ సక్సెస్ స్టోరీసే వుండి నన్ను చిరాకు పెడుతుంటాయి. వారి విధానాలన్నీ ఎల్లప్పుడూ 100% పనిచేస్తాయన్నట్టే చెబుతారు కానీ ఆ విధానాలు మరి ఎన్నిసార్లు బోల్తాపడ్డాయనే విషయం ప్రస్థావించరు. ఆ లోపం నా టపాల్లో లేకుండా చూసుకుంటాను.

సింహం చెప్పారు...

అట్లా కొన్ని సూత్రాలు కట్టకట్టి ఇవి చదువుకో, విజయం నీదే అంటే ఎవరు ఆదరిస్తారు లెండి. మన ఓషో లాగా స్పష్టత తో చెప్పడమూ, అర్థం ఉండేలా చేయడమూ చేస్తే విజయం వచ్చినా రాకపోయినా గెలుస్తాం..

అజ్ఞాత చెప్పారు...

Annay....
Simham cheppinattu
కథనం బాగుండడమే మీ బ్లాగు విజయానికి మూలం..

idi matram nijam

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సింహం
"...విజయం వచ్చినా రాకపోయినా గెలుస్తాం.." ఈ మీ మాట బాగా బావుంది.

ఓషోని బాగానే తిరగేస్తున్నారన్నమాట.

@ అజ్ఞాత
:)

Siddharth చెప్పారు...

రోజుకొక్కసారయినా తొంగి చూడాలనుకునే బ్లాగ్ మీది. ఒక్కో వారం ఒకటే విషయం మీద వరుసగా టపాలు టప టపా రాల్చకుండా, అన్ని రకాలు మీ వీలుని బట్టి రాస్తూంటే విసుగనిపించకపోవచ్చు ... చదివే వారికి, మీకు కూడా .....

Mauli చెప్పారు...

yandamoori aapasopaala gurinchi oka tapaa vraayagalaraa?

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సిద్ధార్ధ్
నేనూ అదే అనుకుంటున్నాను. నాకు ఇష్టమయిన రెండు ఆంశాలనూ బ్యాలన్స్ చేస్తూ వ్రాస్తే బావుంటుందని...సో, అలాగే చేద్దాం.

@ మౌళి
అంత దృశ్యం లేదు లెండి నాకు. ఆ పుస్తకం ఎవరింట్లోనో కొద్దిసేపు చూసాను మరియు సమీక్షల ద్వారా కొద్దిగా మాత్రమే తెలుసు. వారియొక్క ఇతర వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు "తప్పుచేద్దాం రండి" గట్రా కొనుక్కొని చదివాను.