నన్ను వాళ్ళు తెగ తిట్టేసేరండీ బాబూ!

సాధారణంగా మనం ఒక్కరు కాస్త తిడితేనే భరించలేము. అలాంటిది విపరీతమయిన ఆగ్రహంతో వాళ్ళు అంతా ఒకరి తరువాత ఒకరు, మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను తిట్టేసారు. అది కూడా మామూలుగానా భీకరంగా ముఖాలు పెట్టి మరీ నన్ను దులిపేసారు. నాకయితే వాళ్ళు అలా అరుస్తుంటే కాష్మొరాలు నామీద పడి దహిస్తున్నట్లే అనిపించింది. ఒక కాష్మోరాని భరించడం అంటే కష్టమే అనుకుంటే పది కాష్మోరాలు  మన వెంట బడితే ఎలా వుంటుంది?

అలా అని నేను ఊరుకున్నానుటండీ. ఆలా ఎలా ఊరుకుంటానూ. నేనూ వారిని కసిదీరా తిట్టేసాను. ఆగ్రహంతో అరిచేసాను. అయినా వాళ్ళు బెదరలేదు. ఇంకా దూకుడుగా నామీదికి వచ్చి తిట్ల దండకం ప్రారంభించారు. అలా ఒకరినొకరం ఓ పదిహేను నిమిషాలు తిట్టుకొని తిట్టుకొని చల్లారిపోయాము.  ఇదండీ మొన్న శనివారం మేము చేసిన AUM ధ్యానంలోని మొదటి స్టేజ్. మనలో ఎన్నేఏళ్ళుగానో పాతరేసుకున్న నెగటివ్ ఎమోషన్స్ ని రిలీవ్ చేసుకొని రిలీఫ్ పొందడమే ఈ మెట్టు యొక్క ప్రత్యేకత. ఎందుకంటే చిన్నప్పటినుండీ ఆగ్రహాన్ని అదిమిపెట్టుకోవడమే సమాజం మనకు నేర్పించింది. ఆగ్రహం ప్రదర్శించడం సభ్యత కాదు కాబట్టి అలా నొక్కిపడుతూ పడుతూ వస్తాము కదా. అందుకే ఈ స్టేజ్ లో మనలో నిబిడీకృతమయి వున్న ఆగ్రహావేశాలని, క్రోధాలని ఎలా బయటకి తియ్యాలో చెప్పారు, చేయించారు.

అబ్బో ఒక్కొక్కరు నాదగ్గరికి వచ్చి ఎంత బాగా తిట్టేసారో! చాలా ఘోరంగా, భీకరంగా అరిచారు. కొంతమంది బూతులూ తిట్టారు :) అలా వారు ఆ రోజంతా తిడుతూవుంటే బావుండుననిపించింది. నేనూ బాగానే తిట్టా కానీ కొందరి అంత భీకరంగా తిట్టలేకపోయాననిపించింది. అసలయితే ఒక్కో స్టేజ్ ఒక్కో రోజు వుంటుందంట. మేము ఒక్కో స్టేజ్ పావు గంట మాత్రమే గడిపాము కాబట్టి మేము చేసింది సాంపుల్ గా మాత్రమే అనిపించింది. అయినా సరే ఆ పదమూడూ స్టేజిలు అయ్యాక మాలో ఎంత రిలీఫ్ వచ్చిందనీ. అలా మన మనసిక అవస్థలను అలా స్వేఛ్ఛగా వెళ్ళగక్కుకొనే అవకాశం మనకు ఎక్కడ లభిస్తుంది చెప్పండి? ఇది నాకు దొరికిన చక్కటి అవకాశం. నేను ఎన్నో సార్లు వ్యాయామం చేసాను, ఎన్నో సార్లు ధ్యానం చేసాను. కానీ వ్యాయామం + ధ్యానం కలిపి ఇలా సామూహికంగా చెయ్యడం ఇదే ప్రధమం.

కూర్చునే ధ్యానాల కన్నా చురుకయిన ధ్యానాలు బావుంటాయి. ఎందుకంటే వాటిలో సిట్టింగ్ మెడిటేషన్ వుండటమే కాకుండా ఏక్టివ్ గా వుంటాయి కాబట్టి శరీరానికి వ్యాయామం కూడా లభిస్తుంది. వాటికన్నా కూడా సాంఘిక ధ్యానాలు ఇంకా బావుంటాయి. వీటిలో సిట్టింగ్, ఏక్టివ్ మెడిటేషన్లు మిళితమయి వుండటమే కాకుండా మన ఎమోషన్స్ కి కూడా స్వాంతన లభిస్తుంది. సాంఘిక ధ్యానాలలో ఇతరులు బాగా సన్నిహితం అవడానికి అవకాశం వుంది. అందువల్ల అవి తియ్యగా అనిపిస్తాయి.

Aum is a social meditation. It can create friendship, intimacy and emotional awareness. It is a guided journey through 13 different aspects of being human, where you and others will function as mirrors for one another. And in that way, you become more aware of your feelings and your attitudes towards life. The process will take you from one polarity to the other: from hate to love, from sadness to laughter, from sound to silence, and will finally bring you back to your center. Once there, you will be able to connect from an open heart.

Experience that you are an endless source of energy and discover that true friendship comes from accepting yourself totally as a human being.

First Stage – Anger: 
Expression of negativity, frustrations and anger, using any words that come (free association). Participants face each other, and discharge at the same time, moving to as many people as possible. This stage allows participants to express their ‘No’ to create space for a ‘Yes’, and to experience standing in their power.
 
ఈ AUM ధ్యానం గురించీ, ఇతర సాంఘిక ధ్యానాల గురించీ తెలుసుకోవాలంటే ఈ క్రింది సైటుకి వెళ్ళండి.  

2 comments:

  1. నేనేం ఇలా తిట్ల ధ్యానం నేర్చుకోలేదు కానీ, తిట్టడం నాకు బాగా సరదా.. అందుకే, ఎప్పుడు మీ బ్లాగులో ఏది వ్రాసిన, కొట్టినంత పని చేస్తాను.. ఒకప్పటి కాయ లా, ఇప్పటి సింహం లా నైనా...

    ReplyDelete
  2. శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంలో, సుత్తి వీరభద్ర రావు గారు.. ఎవరి మీద కోపం వచ్చినా, వారిని ఉద్దేశించి పక్కన వారిని తిట్టడమో, లేక గోడ తలకెసి(?) కొట్టుకోవడమో చేస్తుంటాడు.. అది చూసి ముచ్చటేసి తిట్టడము నేనూ మొదలు పెట్టాను.. కార్ లొ వచ్చేటపుడు ఎవడైనా చిన్న తప్పుతో దొరికితే.. నా తిట్లు భరించలేక .. నా కారు బాధ వర్ణనాతీతం..

    ReplyDelete