US లో 20% మంది స్త్రీలు బలత్కార(యత్నా)నికి బలయ్యారుట

ఏం లెక్కలో, ఏమేం సమీకరణాలో కానీ 9 వేలకు మందికి పైగా స్త్రీలని సర్వే చేసి మరీ తేల్చారు ఆ విషయాన్ని. లైంగిక నేరాల గురించి కఠిన మయిన చట్టాలూ, అమలూ వున్న ఈ దేశంలోనే ఇంతటి పరిస్థితి వుందంటే ఇండియా లాంటి దేశాల్లో ఇంకెంత వుంటుందో.  వీరి సమీకరణాలతోనే అక్కడా సర్వే చేస్తే వచ్చే శాతం ఎక్కువగా వుంటుందని నా అభిప్రాయం.  గత ఏడాదిలో పది లక్షలకు మంది పైగా US స్త్రీలు బలాత్కారానికి గురి అయ్యారుట.

స్త్రీల సంగతి అటుంచి మగ మహారాజుల అవస్థేంటో చూద్దాం.  ప్రతి 71 మంది పురుషులలో ఒకరు తమ జీవిత కాలంలో బలాత్కారానికి బలయ్యారుట. అలాంటి వారిలో 25% మంది పురుషులు తమకు పదేళ్ళు కానీ అంతకులోగా వుండగా కానీ రేప్ కు గురయ్యారుట. 7,420 మంది మగాళ్లను సర్వే చేసి ఈ సంగతులు కనుగొన్నారు. మరి అలా ఆ మగాళ్ళని రేప్ చేసింది మగాళ్ళా లేక ఆడవారా అన్న వివరాలు నేను చదివిన వ్యాసంలో లేవు. అయినా పురుషులను స్త్రీలు బలవంతంగా చేస్తే అది బలాత్కారం అవుతుందంటారా?!

శృంగారం అనేది పరస్పర ఆమోదంతో, సహకారంతో వుండాలి కానీ  ఇలా బలవంతంగా, బలత్కారయుతంగా వుండకూడదు. కొన్నిసార్లు ఆ హడావిడిలో బలాత్కారానికీ, సహకారానికీ వున్న సన్నని గీత చెరిగిపోతూవుంటుంది. కొంతమంది ఆడవారు టిఫిన్ల వరకూ ఓకే అనవచ్చు కానీ భోజనం చేస్తామంటే నో అనవచ్చు. అర్ధాకలితో ఆగమంటే మనం ఆగలేకపోవచ్చు. అప్పుడు వస్తుంది తంటా.

మిగతా వివరాల కొసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి. 

5 comments:

  1. oh so sad...

    but anyway

    east or west India is all time best

    ?!

    endukoemo@india.com

    ReplyDelete
  2. ఆడవారి జరిగుతున్న అన్యాయలను వారు పరిష్కరించు కోగలరు. వీలైతే మొగ వారికి జరుగుతున్న అన్యాయల గురించి రాయండి. రేప్ గురైన మగ వారికి ఎమైనా ఆర్ధిక సహాయం ప్రభుత్వం చేసిందా? వారికి ప్రభుత్వం, సహాయక సంస్థలు/యన్.జి.ఓ. లు ఎటువంటి సహాయం చేశాయి? వాటి గురించి రాయండి.

    SriRam

    ReplyDelete
  3. @శృంగారం అనేది పరస్పర ఆమోదంతో, సహకారంతో వుండాలి... పరస్పర ఆమోదంతో, సహకారంతో ..అంత టైమ్ ఎక్కడ స్పెండ్ చేయగలం అని చెప్పండీ....: )

    ReplyDelete
  4. @ kvsv
    అందుకే ఆత్రగాడికి బుద్ధి మట్టు అన్నారు. అంత ఆత్రమయితే అవతలవారికి ఇబ్బందేనండీ బాబూ :)

    ReplyDelete
  5. @?!
    నా అభిప్రాయం ఏంటంటే ఇండియాలో ఇవి అంతకంటే ఎక్కువ జరుగుతాయి. అక్కడి చట్టాలు బలహీనం కాబట్టి చలేగా అనుకుంటారు. ఇక్కడ లైంగిక నేరాలపై చట్టాలు మరియు వాటియొక్క అమలూ కఠినంగా వుంటాయి కాబట్టి చాలామంది అలాంటి దుస్సహసాలు చెయ్యడానికి భయపడతారు.

    @ అజ్ఞాత
    ఆడది అంటె సబల అనీ మగాడే దుర్బలుడని మీ అభిప్రాయంలా వుందే. నిజమే. ఆడవారికి సహాయపడటానికి, రక్షించడానికి ఎన్నో ఎర్పాట్లు వున్నాయి. మగవాడి హక్కులే మైనారిటీ అయిపోతున్నాయి. రేప్ కి గిరి అయిన పురుషులకు ఏమయినా సహాయం అందిందా అన్న విషయం నాకు తెలియదు. స్త్రీలకు అయితే కొన్ని ఎర్పాట్లు వుంటాయి. అయితే అవి మగవారు కూడా ఉపయొగించుకోవచ్చా అన్నది నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన విషయమే మరి.

    అయితే మగాళ్ళని బలాత్కరించేది దాదాపుగా మొగవారే అయివుంటారు. ఓ స్త్రీ చేత పురుషుడు బలాత్కారానికి గురి అయితే దానికి ఆ పురుషుడు గర్వించాలా లేక బాధపడాలా అన్న ప్రశ్న నాకయితే ఉదయిస్తుంది. ఏదిఏమయినా ఎవరు ఎవర్ని బలాత్కరించినా ఇష్టం లేని సెక్స్ చెయ్యడం పద్ధతి కాదు లెండి.

    ReplyDelete