శుక్రవారం 30 డిసెంబర్ 2011

ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీలందరికీ బురఖాలు వెయ్యాలి!

గౌరవనీయులయిన డిజిపీ దినేష్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తుంటే స్త్రీలందరికీ బురఖాలెస్తే గానీ పోలీసులకు శ్రమ తప్పేట్టుగా లేదు. నిజమే. స్త్రీలను ఇండ్లల్లోనుండి బయటకి రాకుండా చేసి, ఒహవేళ తప్పని పరిస్థితులో రావాల్సి వచ్చినా సరే వారికి ఘోషాలు తగిలిస్తే  వారి మీద బలాత్కారాలు వుండవు. బలాత్కారాలు తగ్గించాలంటే ఏపిలో తాలిబాన్ పాలన ప్రవేశ పెట్టాలి. ఆడపిల్లలకు చదువు చెప్పకూడదు. అమ్మయిలు చదువుకుంటే స్టయిల్ ఎక్కువవుతుంది, ఫ్యషన్లు ఎక్కువవుతాయి. అందువల్ల ఆడవారి మానసిక ఎదుగుదలను మొగ్గలోనే తుంచివెయ్యాలి.

అసలు ఆడది బలాత్కారానికి గురి అయ్యిందంటే నేరం ఆ స్త్రీదే అని చట్టం చెయ్యాలి. ఎందుకంటే శుబ్బరంగా ఇంట్లో పడి మగ్గక బయటకి వచ్చినందువల్లే కదా ఆ తిప్పలు. అలా ఆడది బరితెగించి బయటకి వస్తే అది ఆ ఆడదాని తప్పే అవుతుంది కానీ బలాత్కరించిన మగవాడి తప్పెలా అవుతుంది? కదా. అందువల్ల మగవాడు ఎన్ని రేపులు చేసినా హాయిగా వదిలెయ్యాలి. కదా డిజిపీ గారూ!

అఫ్ఘనిస్తానులో ఈమధ్య ఒక యువతిని అరెస్టు చేసారు. ఎందుకంటే అక్కడ అక్రమ సంబంధాలు నిషిద్ధం. అయితే ఆమె విషయంలో ఒక ట్విస్ట్ వుంది. ఆమెను ఒక పురుషుడు రేప్ చేసాడు. అయినా సరే అది భర్తతో సంబంధం కాకుండా తనకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా అయినా సరే పరపురుషుడితో గడిపింది కాబట్టి ఆమెను అక్రమ సంబంధాల చట్టం క్రింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదీ వాళ్ళ న్యాయం. అలా ఆమె ఓ పురుషుడి బలాత్కారానికి గురి అవడమే కాకుండా ఆ దేశపు చట్టం యొక్క బలాత్కారానికీ గురయ్యింది. ఆ నేరం నుండి తప్పించుకొవాలంటే ఆ రేపిస్టును ఆమె పెళ్ళి చేసుకోవాల్సిందేనంట. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా మనలాంటి వారు నిరసనలు వ్యక్తం చెయ్యబట్టి ఆమెను జైలు నుండి వదిలేసారు. 

ఈ  AP DGPకీ ఆ అఫ్గాన్ పోలీసులకూ నాకైతే ఏం తేడా కనపడటం లేదు. మీకు ఏమయినా తేడా తెలుస్తోందా?!

15 comments:

శరత్ 'కాలమ్' చెప్పారు...

మరీ అంతగా ఆడవారి వేషధారణ వల్ల మగ మహారాజులు ఇబ్బందిపడిపోతున్నారంటే పరిష్కారం - స్త్రీలకు ఘోషాలు కాదు - పురుషుల కళ్ళకు గంతలు. అయినా సరే బలాత్కారాలు జరిగితే ఇంకా మంచి పరిష్కారం కూడా వుంది - పల్లెటూర్లల్లో ఎద్దులను కట్టేసి పడుకోబెట్టి ఏవో చితగ్గొడతారే - అదీ!

అజ్ఞాత చెప్పారు...

That is not only one reason .. but dressing also one of the reason ....
Media and you people are pointing DGP words.. please think and write reality why more incidents happening now comparing old day..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
సంఘటణలు ఎక్కువ అనిపించడానికి ఒక కారణం - ప్రజలలో, మహిళల్లొ చైతన్యం ఎక్కువయ్యి ఆ కేసుల రిపోర్టింగ్ ఎక్కువ అవడం కావచ్చు.

సింహం చెప్పారు...

మన డీజీపీ మాడ్రన్ డ్రస్ లో ఉన్న అమ్మాయిని రేప్ చేశాడేమో.. అందుకే ఆ స్థాయిలో ఉండి కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు.. బయటికి ఇలా చెప్పిన డీజీపీ లోపల ఇంకేమేం ఊహించుకుంటున్నాడో .. అందరూ ఒక చెయ్ వేయండి.. ఈ డీజీపీ లాంటి వాళ్ళు కళ్ళకు కట్టిన పొర ఊడిపోవాలి..
మీరు విస్తృత ప్రచారం కలిపించాలి గురువు గారూ..

డౌన్ డౌన్ డీజీపీ ..

డౌన్ డౌన్ డీజీపీ ..

డౌన్ డౌన్ డీజీపీ ..

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

The source from which you have quoted the comments of DGP also says this:

"Though it was a reasonably correct comment, it became controversial as it had come from the highest police officer in the state"

We should always avoid extremes. If somebody says that the way women dress themselves may be the reason for assaults against them, we need not necessarily pander to the extreme views of wearing Burkha or castrating all Male or force Male members to wear blind folds.

We can always review why the Highest Authority in Police Department made such a statement and if there is truth in what he is saying, it requires to be heard patiently but not to be greeted with knee jerk reactions and jingoistic protests.

I for one feel that the dress pattern need not be the only reason but can be one of the many reasons.

Manjusha kotamraju చెప్పారు...

paapam DGP ni bali chestunnaru andaru,,ayana annadi dressing kuda oka kaaranam kavochhu ani,,,in some extent adi kuda oka 80% nijame

Srikanth M చెప్పారు...

మీ సెటైర్ పోస్టు చాలా బావుంది. మీ సెటైర్ కామెంటు చాలా ఎబ్బెట్టుగా ఉంది. చర్చను దారి మల్లిస్తున్నానని కాదు Just curious... Do you support so-called sterilization as punishment for rape?

వామనగీత చెప్పారు...

శరత్‌'కాలమ్‌'గారు
చాలా బాగా చెప్పారు..
అసభ్యకరమైన దుస్తులు వేసుకోవద్దు అంటే దాని అర్థం "బురఖా" వేసుకొమ్మనా..? భలేవారండి మీరు..!
//అసలు ఆడది బలాత్కారానికి గురి అయ్యిందంటే నేరం ఆ స్త్రీదే అని చట్టం చెయ్యాలి//
ఇదెప్పట్నుంచి..?
//స్త్రీలకు ఘోషాలు కాదు - పురుషుల కళ్ళకు గంతలు.//
ఆణిముత్యాల్లాంటి మాటలు..!
AP DGP చెప్పింది అక్షరాలా నిజం..,(కనీసం ఎక్కువ చోట్ల).., తప్పు ఆడవారివైపు కూడా ఉన్నపుడు వారు మాత్రం ఎంతని చేస్తారు..?

"అసభ్యకరమైన దుస్తులు" వేసుకున్నందుకు అబ్బాయిలని కాలేజినుండి సస్పెండ్‌ చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి, ఇలాంటివి పేపర్లకెందుకు ఎక్కుతాయి..?
(విశాఖపట్నం "గాయత్రి" కాలేజి గురించి ఓ సారి వాకబు చెయ్యండి..! "అసభ్యం"కాదు Shaded Jeans వేసుకున్నా లోపలికి రానివ్వడు..! Only Formals..! )

प्रवीण् शर्मा చెప్పారు...

ఫాషన్ పెరేడ్‌లలో చూపించే అశ్లీల దుస్తులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. ఇతర రాష్ట్రాల పర్యాటకులు వచ్చే విశాఖపట్నం కైలాసగిరి మీదగానీ, తెన్నేటి పార్క్ బీచ్‌లో గానీ, భీమిలీ బీచ్ రోడ్‌లో గానీ ఆడవాళ్ళు అశ్లీల దుస్తులు వేసుకోవడం ఎక్కడా కనిపించదు. ఢిల్లీలోనో, ముంబైలోనో కొంత మంది స్త్రీలు అలాంటి దుస్తులు వేసుకుంటే ఇక్కడ కూడా అలాంటి దుస్తులు వేసుకుంటున్నారని అనుకుంటున్నాడంటే DGP టివిలో ఏవో చూసి అవే నిజాలని అనుకుని ఉంటాడు. అతనికి టివి తప్ప బయటి ప్రపంచం తెలిసినట్టు లేదు. సినిమాలు, టివి కార్యక్రమాలలో మసాలా కోసం స్త్రీలు అశ్లీల దుస్తులు వేసుకుంటున్నట్టు చూపిస్తారు. ఆ మసాలా నిజ జీవితంలో కూడా ఉంటుందనుకుంటే అది జోకే.

Jai Gottimukkala చెప్పారు...

Dinesh Reddy appears to be full of baggage so typical of Indian middle class "morality". He also chose to blame the Telangana agitation for rise in crime!

प्रवीण् शर्मा చెప్పారు...

It's not middle class morality. In Jagdalpur, even rich class Marwadi Jain women cover their faces with saree. No need to introduce Burqas in Hindu society. Already there are Hindu women who cover their faces with saree or chunri.

Mauli చెప్పారు...

స్వప్నిక అనే అమ్మాయి పై ఎవరో ఆసిడ్ పోసినప్పటి నుండి, ఈ అభిప్రాయం ప్రజల్లోనే ఎక్కువయ్యింది. ఇప్పుడు డి జి పి. చెప్పేది ఒక జాగ్రత్త మాత్రమె అయ్యుండొచ్చు. బురఖాలు కి అలవాటు పడి వెంట పడే ప్రబుద్దులు కూడా తయారవుతారు, మీ సలహా పాటిస్తే :)

అయినా డి.జి.పి కి పనికిమాలిన సినిమాలు కనిపించడం లేదా. అవి కూడా ప్రస్తావిన్చాల్సింది :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ శివరాం ప్రసాద్
మీ అభిప్రాయం ఇక్కడ వెల్లడించినందుకు ధన్యవాదాలు.
@ మంజూష
నా బ్లాగులో మీరు కామెంటడం మొదటిసారి అనుకుంటా. మీ పేరు బావుంది. మీ అభిప్రాయం ఇక్కడ వెల్లడించినందుకు ధన్యవాదాలు.
@ శ్రీకాంత్
పదేపదే రేపులు చేసే మగవారిని యు ఎస్ లాంటి పాశ్చాత్యదేశాలు జైల్లో వుంచి శృంగార వాంఛను తగ్గించే మందులు ఇస్తారని చదివాను. పొరపాటునో, గ్రహపాటునో ఒకటి రెండు రేపులు చేస్తే అర్ధం చేసుకోవచ్చేమో, కాస్తో కూస్తో క్షమించొచ్చేమో కానీ పదేపదే బలాత్కారాలు చేసే మగవాళ్ళ వృషణాలు మరీ అనాగరికంగా చితగ్గొట్టకపోయినా కూడా మందులతో వారి దూకుడును తగ్గించాలి మరి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ వామన గీత
ఏది సభ్య వస్త్రధారణో, ఏది కాదో ఎలా నిర్ణయించడం? (ఛాందస) ముస్లిములలో బయటివారికి ఏమాత్రం శరీరం కనపడ్డా అసభ్యతే మరి. అందుకే మహిళలకు ఘోషాలేసి పడేస్తే ఓ పని అయిపోతుంది. ఇహ పొడుగు ఇంతబట్టలేసుకోవాలా, అంత పొడుగు బట్టలేసుకోవాలా అనే చర్చకు తావుండదు. స్త్రీలందరూ అ రకంగా మతానంతర సమానత్వం సాధించినట్లు అవుతుంది కూడానూ.

@ ప్రవీణ్, జై
మీ కామెంట్లకి ధన్యవాదాలు.

@ మౌళి
పనికిమాలిన సినిమాలు అంటున్నారు - మమ్మల్ని కనీసం సినిమాల్లో కూడా చూడనివ్వరా :) అన్యాయం అండీ.

Mauli చెప్పారు...

కదా, మరి సినిమాలోక్కటి చూసి ఊరుకోక, స్త్రీ జనాల హక్కులకోసం ఈ పోరాటాలేంటి మీ బాచ్ అంతా (బ్లాగుల్లో) :)