మా విజయవాడ సహజీవనం ముగిసాక సూర్యాపేటలో వున్న నన్ను అప్పుడప్పుడు అర్ధరాత్రుళ్ళు వచ్చి కలుస్తుండేది అని చెప్పాగా. కొన్ని నెలల తరువాత మా ఊరి బస్సుస్టాడులో కలరింగ్ (అనగా జుట్టుకి రంగు అనుకునేరు. కాదు. అలా బస్సుస్టాండుకి వెళ్ళి ప్రయాణీకుల అందాలు ఆరాధించడానికి మేము ఆ పేరు పెట్టాము లెండి) వేసుకుంటున్న నాకు విజయవాడలోని VK కాంప్యూటర్స్ ఫ్రెండ్ కనపడ్డాడు. అతనూ ఆ హాస్టల్లో వుండేవాడు. విజయవాడ విశేషాలు చెబుతూ నా రాజి గురించి కూడా చెప్పాడు. నేను ఇటు వచ్చేసాక ఆమె అక్కడ కనపడితే తనూ, ఇంకో మా కామన్ ఫ్రెండూ కలిసి ఆమెతో పరిచయం ఇంకా బాహ్గా పెంచేసుకున్నారుట. ఆమెతో ఎలా గడిపారో చెప్పుకువచ్చాడు. అందరూ కలిసి బహు బాగా ఆనందిస్తున్నందుకు నేను చాలా సంతోషించాను. అంతలోకే నాకు ఓ అనుమానం వచ్చి నివృత్తి చేసుకున్నాను. మేమిద్దరం కలిసి ఆమెతో గడిపాము అని చెప్పాడు కదా. మీరిద్దరూ కలిసి సమిష్టిగా ఆమెతో గడిపారా లేక విడివిడిగా ఆమెతో గడిపారా అని అడిగాను. అతను తెల్లబోయి లేదండీ బాబూ, విడివిడిగానే గడిపాము అని అన్నాడు. విడివిడిగా మీరు గడిపినా కూడా సమిష్ఠిగా కూడా ఆమెతో గడిపివుంటే ఇంకా ఎంత బావుండేదో చెబుతూ జ్ఞానబోధ చేసాను. ఆమెతో మళ్ళీ అవకాశం వస్తే అలాగే చెస్తాం గురువు గారూ అని హామీ ఇచ్చేడతను. ఆ తరువాత అతను ఎప్పుడూ మళ్ళీ నాకు కనపడలేదు!
నా పెళ్ళయ్యాక ఒకసారి హైదరాబాదులో మా చిన్న అక్క ఇంటి దారిలోనే నీళ్ళ పంపు దగ్గర కనపడింది. ఆ ఇంటిదారిలోనే ఓ చిన్న గది అద్దెకు తీసుకొని వుంటోంది. గదిలోకి పిలిచి కమ్మని తేనీరు ఇచ్చింది. ఏం చేస్తున్నావ్ అంటే సుమన్ తో సినిమాల్లో నటిస్తున్నా అని చెప్పింది. అంటే హెక్కడికో వెళ్ళిపోకండేం. సినిమా పాటలలో వెనకాల తయ్యతక్కలాడుతారే ఆ జూనియర్ ఆర్టిస్ట్ వేషాల్లెండి. సినిమా రంగం మంచిది కాదమ్మా, ఇళ్ళకు వెళ్ళండి ఆ సుమన్ మహానుభావుడు సుభాషితాలు చెబుతూవుండేవాడుట. ఎంజాయ్ చేస్తున్నావా అంటే హబ్బే, హవన్నీ హెప్పుడో మానివేసా అంది. నాకు తీరిక లేక ఇక ఆ విషయాలు గెలక్కుండానే వచ్చేసాను. ఆ తరువాత మా అక్క వాళ్ళో, ఆమెనో ఇళ్ళు మారడంతో అక్కడ మళ్ళీ ఆమె కనపడలేదు.
ఓ ఏడేళ్ళ క్రితం కెనడా నుండి ఇండియా ట్రిప్పుకి వెళ్ళినప్పుడు ఆమె బంధువునుండి ఆమె నంబర్ తీసుకొని మాట్లాడాను. ఓ చిన్న సినిమా, టివి నటుడిని పెళ్ళి చేసుకుందిట. ఒక కూతురు అని చెప్పింది. ఇంకా ఆ వెధవ్వేషాలు వేస్తున్నావా అని అడిగితే అమాయకంగా అవును అని అన్నాను. ఇకనయినా మానెయ్ అని నీతి బోధలు చెప్పనారంభించింది. అలాగే అని ఆమె ఫోను హడావిడిగా పెట్టేసాను. ఓ అయిదేళ్ళ క్రితం మళ్లీ ఇండియా వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తోందో, ఎక్కడుంటోందో కనుక్కున్నాను. ఒక చిన్న షాప్ పెట్టుకుందిట. ఆ అడ్రసు కనుక్కొని ఆమె దగ్గరికి వెళితే ఆశ్చర్యపడిపోయి ఆనందపడింది. కాస్త ఛాయ తగ్గింది, కాస్త వళ్ళు చేసింది కానీ ఆమె అందం మరియు పరువాలు దాదాపుగా అలాగే కవ్వింపుగా వున్నయ్. ఆమె కూతురు కూడా తనతో పాటే వుండటంతో ఆ ముచ్చట్లు ఏమీ మాట్లాడుకోలేదు కానీ స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మాట్లాడింది. నాతో పాటే వచ్చిన మా చిన్నమ్మాయితో చక్కగా ఆడి తినుబండారాలు కొనిచ్చింది. దగ్గర్లో వున్న ఆమె ఇంటికి కూడా తీసుకువెళ్ళింది. భర్త ఏదో ఊరు వెళ్ళాడుట. కాస్సేపు మాట్లాడి వచ్చేసాను.
యు ఎస్ కి వచ్చాక ఫోన్లు చేస్తే కొన్ని సార్లు దొరికి కొద్దిసేపు మాట్లాడింది. మరి కొన్ని సార్లు భర్త వున్నాడనీ, తరువాత చెయ్యమని చెప్పి పెట్టేసింది. ఇదేదే జరిగే వ్యవహారం కాదులే అని చెప్పి నేనూ కాల్ చెయ్యడం మానివెసాను. మళ్లీ ఎప్పుడో నేను ఫోన్ చేస్తే నంబర్ మార్చినట్లు అర్ధమయ్యింది. ఈ మధ్యే ఆమె బంధువుకి ఫోన్ చేస్తే ఆమె యొక్క లేటేస్ట్ విశేషాలు చెప్పాడు కానీ అవి మీతో పంచుకోతగ్గవి కాదులెండి :)
8 comments:
annay....Puttukatho vachiina buddulu povu kada....nuvvu enni yoga classes or osho classes attend ayina em marav kani. proceedddd.........
Annay me canada ammayi "Sunny Leon" gurinchi anni papers chaneels band vayisthunte nuv matram silent ga vunnav....koncham chudu :)...ne list lo emina vundoooooooooo
A quick question. What if your wife too has your kind of mentality and want to sleep with others even now? Would you encourage her for 2 some and 3 or 4 some? OK let us include you in the 4 some for clarity of thought :-) What if she did it before marriage?
@Agnatha: 28 డిసెంబర్ 2011 12:09 సా
If u follow his all post u will get the answer.....he has given alot of information abt that...read his previous posts....dont ask me, which post :)
@ అజ్ఞాత
నేను యోగాలు చేసినా, యాగాలు చేసినా (ప్రస్థుతానికయితే) అందుకోసమే ;) మా గురువు గారు ఓషో కూడా అందరినీ ప్రేమించమనే కదా చెబుతూంట.
సన్నీ లియోన్ గురించి చూస్తూనే వున్నా కానీ ఆమె అంతగా నాకు నచ్చలేదు - అందుకే పట్టించుకోవట్లేదు. చిన్నప్పుడు (అనగా కెనడాకి వచ్చిన తొలిరోజుల్లో) ఆమె నీలి చిత్రాలు ఏమయినా చూసానో లేదో నాకు తెలియదు. అప్పట్లో గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఏవేవో, ఎవరెవరివో చూసేవారం.
@ అజ్ఞాత 28 డిసెంబర్ 2011 12:09 సా
నా వ్రాతలను బట్టి నా వ్యక్తిత్వం మీకు అర్ధమయ్యే వుంటుంది. ఆ ఆంశంలో నా విధానం ఏమయివుండవచ్చు? నేను చెప్పడం ఒకటి చేసేదొకటి చెయ్యను. లైంగిక హక్కులనేవి స్త్రీలకు అయినా పురుషులకు అయినా (దాదాపుగా) ఒకే విధంగా వుండాలి. భార్య కయినా, భర్తకయినా ఒకే విధంగా వుండాలి. నేనెంత స్వేఛ్ఛగా వుంటానో, ఎంత స్వేఛ్ఛ కోరుకుంటానో అదే స్వేఛ్ఛ ఇతరులకూ వుండాలనుకుంటాను, ప్రోత్సహిస్తాను. అయితే ఆ స్వేఛ్ఛ నా భార్య ఉపయోగించుకుంటుందా లేదా అన్నది ఆమె వ్యక్తిగతం కాబట్టి నేను మీముందు అది ప్రస్థావించలేను. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం - మా అభిప్రాయాల్లో 95% వైరుధ్యాలు వున్నాయి.
అయితే రాజ్యలక్ష్మి గురించీ, ఇతరుల గురించీ ఎందుకు ప్రస్థావిస్తున్నానని మీరు అడగవచ్చు. వారియొక్క ఐడెంటిటీలు, వివరాలు కాస్త మార్చి ఇతరులు వారిని గుర్తుపట్టలేని విధంగానే వారి గురించి వ్రాస్తుంటాను.
@ అజ్ఞాత 28 డిసెంబర్ 2011 12:58 సా
నేను ఎప్పుడు ఏం చెప్పానో - మీరేం అనుకున్నారో!
Sarath garu, mee madhya three four months anni adhyatmika vishayalu matladithe, bhogi nundi yogi ki transform ayyaru anukonna. Malli you are back. I am curious to know what happened to you during those 4-5 months?
@ అజ్ఞాత
మీరు నా గురించి ఆసక్తిగా అడిగిన ఈ సందేహం నన్ను సంతోషపరిచింది. ఈమధ్యే ఓ టపాలో వివరణ ఇచ్చాను కానీ మీరు చూసి వుండకపోవచ్చు. ఆ 3,4 నెలలు ఏం జరిగింది అన్నది ఇక్కడ చూడండి. నా ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం కాస్త అతి అయిపోయి ఇబ్బందుల్లో పడ్డాను.
http://sarath-kaalam.blogspot.com/2011/12/blog-post_1116.html
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి