లోకపాల్ సభ్యులూ అవినీతిపరులు అయిపోతే...ఇదీ పరిష్కారం!


ప్రధానినీ, రాష్ట్రపతినీ, న్యాయాధికారులనూ, CBI నీ, అవినీతి నిరోధకక శాఖ వారినీ, ఇక వాళ్ళూ వీళ్ళూ అనే తేడాలెందుకులెండి, మిగతా వాళ్ళెమో పత్తిత్తులా కాబట్టి అలా అందరినీ లోక్‌పాల్ బిల్లులో చేర్చాలి. అప్పుడు లోక్పాల్కి తిరుగులేని అధికారం, దర్పమూ ఏర్పడి, భయం ఆమెడ దూరానికి పోయి వాళ్ళు ఎంచక్కా సూపర్ అవినీతిపరులు అవడానికి రాజమార్గం ఏర్పడుతుంది. మరి వాళ్ళ మీద కూడా నిఘా కావాలి కదా. వాళ్ళూ మానవోత్తములే కదా, వారిలో కూడా మానవత్వం అనగా మానవతత్వం మిగిలేవుంటుంది కదా, అందువల్ల వారూ అవినీతిపరులు ఖచ్చితంగా అవుతారు కదా. మరి ఎలా? వుంది, దానికో బమ్మాండమయిన పరిష్కారం వుంది. అదేమనగా...


బ్రిటిష్ వారికి భారత్ ను పరిపాలించిన విశేషమయిన అనుభవం వుంది కాబట్టి వారిని సూపర్ లోక్‌పాల్ గా నియమించాలి. మరి వారూ అవినీతి పరులు అయినట్లయితే...? అది భారద్దేశ సమస్య కాదు కదా, అది బ్రిటిష్ దేశ సమస్య. వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు, ఆ దేశ పౌరుల అవినీతి గొడవ మనకెందుకులెండి. మన లోక్పాలూ, సూపర్ లోక్పాలూ సల్లగుంటే సాలు. 

ఇంకానయ్యం మనవాళ్ళు అమెరికా, రష్యా, చైనా అధ్యక్షులను కూడా లోక్‌పాల్ బిల్లులో చేర్చాలని డిమాండ్ చెయ్యలేదు. థేంక్స్. 

3 comments:

  1. "Quis custodiet ipsos custodes?" అన్నారుకదా. కాబట్టి లోక్పాలుకూడా లోక్పాలు పరిధిలోక్కాకపోతే ఇంకోదాని పరిధిలోకైనా రావాల్సిందే. అప్పటిక్కూడా వాడు ఇంకొందరితో మిలాఖతయ్యి వెధవ్వేషాలువెయ్యడని గ్యారెంటీ అయితే వుండదు. ఎటొచ్చీ మనమేమీ చెయ్యము. మనమెప్పుడో శిక్షించే బాధ్యతను లోక్పాలుకప్పగించి చేతులు డెట్టాల్‌తో కడిగేసుకునుంటాంగా!

    ఈవిషయంలో మీ వెటకారం నాకర్ధంకాలేదు.

    ReplyDelete
  2. @ శరత్ గారు,



    2011 అయిపోతుంది. మీ 2011 సేవింగ్స్ లక్ష్యం చేరుకున్నారనే అనుకుంటున్నాను ... ( తెలియని వారి ఇక్కడ చూడుడు: http://sarath-kaalam.blogspot.com/2010/12/blog-post_30.html )

    ReplyDelete
  3. @ మినర్వా
    లోక్‌పాలకులు మాత్రం (అవినీతి పరంగా) లేకిపాలకులు కాకూడదని ఏముంది అనేదే నా వెటకారం.

    @ రాజు
    ఆ లక్ష్యాన్ని ఎప్పుడో పక్కన పెట్టెసేనండి. పలు కారణాల వల్ల దానిమీద కృషీ, ఫోకసూ నాకు కుదర్లేదు.

    ReplyDelete