పోలీసు కారులో నా విహారం

అరెస్టయి పోలీసు కారులో వెనక కూర్చున్నాను అనుకోకండి. అదేమీ కాదు. పౌర పోలీసు శిక్షణలో భాగంగా మేము ఓ నాలుగు గంటలు ఒక పోలీసు అధికారికి తోడుగా వెళ్లవచ్చు. నేను సాయంత్రం 7 నుండి 11 గంటల వరకు సమయం ఎన్నుకున్నాను. కావాలంటే రాత్రి అంతా కూడా అలా తోడుగా తిరగవచ్చని పోలీసు అధికారులు అన్నారు కానీ మరుసటి రోజు పనికి వెళ్ళాలి కాబట్టి వారి సూచన తిరస్కరించాను. 

నాకు తోడుగా వున్న అధికారి మంచి స్నేహశీలి. ఇద్దరం తొందరగానే మంచి మిత్రులం అయ్యాము. స్క్వాడ్ కారులో తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. యుఎస్ లో పోలీస్ కల్చర్ గురించీ, ఇండియాలో పోలీస్ కల్చర్ గురించీ అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాం. పోలీస్ పెట్రోలింగ్ అంటే ఎలా వుంటుందో, ట్రాఫిక్ వయలేషన్స్ ఎలా పట్టుకుంటారో నాకు తెలియజెప్పాడు. ఆ నాలుగు గంటలలో ముగ్గురు కారు డ్రయివర్లని ఆపి టికెట్లు ఇచ్చాడు. ఏమాత్రం అనుమానం వున్నా అనుమానాస్పదమయిన కారు యొక్క నంబర్ ప్లేట్ నంబరుతో ఆ కారు యొక్క, ఆ కారు యొక్క యజమాని యొక్క సమాచారం అంతా ఎలా లాగవచ్చో వారియొక్క డేటాబేసులు వెతుకుతూ నాకు చూపించాడు. షికాగో పరిసర ప్రాంతాల్లో ఆ రాత్రి ఏమేం నేరాలు జరిగాయో, ఎవరెవరు అరెస్ట్ అయ్యారో వారి డేటా బేసులల్లో చూపించాడు. 

పోలీసు స్క్వాడ్ కార్ల గురించి నాకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి నా వెనక పోలీసు కారు కనపడితే నాకు టెన్స్ గా వుంటోంది. ఎందుకంటే నా వెనకే వస్తూ వాళ్ళు ఏం గమనిస్తారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నన్ను ఎప్పుడు ఆపడానికి అవకాశం వుందో అర్ధమవుతోంది. పార్కింగ్ ప్లేస్ వున్న ప్రాంతానికి దగ్గర్లో వాళ్ళు మనల్ని ఆగమన్నట్లుగా పోలీసు లైట్లు వేస్తారు. అప్పుడు ఆ పక్కనే వున్న పార్కింగ్ ప్లేసులో మన కారు ఆపాలి. ఇదివరలో అయితే ఏదో మామూలుగా వచ్చేస్తున్నార్లే అనుకునేవాడిని. ఇప్పుడు ఏదయినా పోలీసు కారు నా వెనకాలే వస్తుంటే జాగ్రత్త పడుతున్నాను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే సామెత వుంది కానీ నాకయితే నాలెడ్జ్ ఈజ్ ఏంగ్జయిటీ అనిపిస్తుంటుంది.   అయితే నా 12 ఏళ్ళ డ్రైవింగ్ అనుభవంలో  ఇంతవరకూ నన్నెప్పుడూ ఏ పోలీసూ ఆపలేదనుకోండి.

అలా పోలీసు కారులో తిరుగుతూ వుంటే ఈ రోజు మాంఛి మసాలా పిలుపు వస్తే నాకు డెమో ఇవ్వడానికి బావుంటుంది అన్నాడు కానీ మరీ అంత మసాలా పరిస్థితి ఏమీ రాలేదు. కాకపోతే ఒక చోట ఒక వ్యక్తిని ఇద్దరు పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తే  ఆ వ్యక్తిని మా కారు వెనకాల కూర్చోపెట్టి తీసుకొని వచ్చి పోలీసు స్టేషనులో హండోవర్ చేసాం. తాము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఏఏ ఆంశాలు పరిశీలిస్తామో, అత్యవసర 911 కాల్స్ ఎలా వస్తాయో, ఎలా స్పందిస్తారో ఆ అధికారి నాకు వివరిస్తూ వెళ్ళాడు.  మధ్యలో మా పెట్రోలింగ్ రోటీన్ అయిపోయి కాస్త బోరు కొట్టినా కూడా మొత్తమ్మీద మా రైడ్ ఎలాంగ్ సరదాగా, ఉత్సాహంగా, సమాచారయుతంగా, ఎగ్జయిటింగుగా జరిగింది. నేను ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో సందేహాలు, ఫందేహాలు తీర్చుకున్నాను. నా ప్రశ్నలన్నింటికీ ఓపికగా వివరణ ఇచ్చాడు. 

మా రైడులో ఒక సరదా విషయం జరిగింది. అప్పటికి చీకటి పడింది. ఒక కారుకి లైట్లు వేస్తే ఆ డ్రయివర్ పక్కనే వున్న పార్కింగ్ ప్లేసులో ఆపాడు. అది మేము తరచుగా వెళ్ళే తెలుగు గ్రోసరీ షాప్ ముందే. ఆ గ్రోసరీ షాప్ యజమని నాకు మిత్రుడే.  చాలా హడావిడి మనిషి. అధికారి వెళ్ళి కారులో వున్న ఆతనికి టికెట్ ఇస్తుంటే మా మిత్రుడు షాప్ బయటకి వచ్చి చూసి హర్రే, మన షాప్ ముందుకి పోలీసు కార్ వచ్చిందే అని తన పక్కనున్న వారితో పెద్దగా అన్నాడు. పోలీసు కారులో వున్న నేను అతనికి చెయ్యి ఊపాను. నా ఫ్రెండ్ విస్మయం చెందాడు. ఈ లోగా తిరిగివచ్చిన అధికారి నేను అతనికి విష్ చెయ్యడం చూసి "అతను నీకు తెలుసా" అన్నాడు. "అవును, ఆ షాప్ యజమని అతనే" అన్నాను. "కలుస్తావా" అన్నాడు. "సరే" అన్నాను. పోలీసు కారుని రయ్యిమని మా ఫ్రెండ్ ముందు ఆపడంతో నా మిత్రుడు కంగారు పడ్డాడు. నేను పక్కనుండి హలో అంటూ తెలుగులో పలకరించేసరికి ఉలిక్కిపడి "శరతూ, నువ్వు పోలీసు కార్లో..." అని కంగారు పడుతూ నా పక్కకి వచ్చాడు. పౌర పోలీసు శిక్షణ గురించి నేను క్లుప్తంగా వివరించడంతో అతని కంగారు తగ్గింది. నా పక్కనే వున్న అధికారిని పరిచయం చేసాను. వారిద్దరూ క్లుప్తంగా మాట్లాడుకున్నారు. అలా పోలీసు రైడులో వుండగా నా మిత్రుడిని కలవడం నాకు సరదాగా అనిపించింది. 
  
ఈ పూట అయినా  జాగ్రత్తగా కారు నడపమనీ -  లేకపోతే నేనే నీకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందని మా ఆవిడతో జోక్ చేసానని ఆ అధికారికి చెబితే అతనూ సరదాగా నవ్వాడు. ఆ అధికారికి పెట్రోలింగ్ డ్యూటీ మా ఇంటి వైపే పడింది కాబట్టి మా ఇంటి చుట్టూ ఎన్నో రవుండ్లు వేసాము. ఆ నాలుగు గంటలు పూర్తి అయ్యాక అతను నాకు చక్కగా వీడ్కోలు ఇచ్చాడు. మంచి సమాచారం  నాకు అందించినందుకు ఆ అధికారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పౌర పోలీసు శిక్షణలో చేరి కమ్యూనిటీకి, పోలీసు వారికి సహకరిస్తున్నందుకు తాను నాకు థేంక్స్ చెప్పాడు. ఏ అవసరం వున్నా తమని కాంటాక్ట్ చేస్తుండమని చెప్పాడు. మా పౌర పోలీసు శిక్షణ పూర్తయినందువల్ల  ఆ పోలీసు స్టేషను వారు మమ్మల్ని తమలో భాగంగా గౌరవిస్తున్నారు. పోలీసు ఆలెమ్నీ అసోషియేషనులో కూడా మేము సభ్యులుగా చేరవచ్చు కానీ అంతెందుకులే అని నేను చేరలేదు. పౌరపోలీసు ఆకాడెమీలో కూడా చేరి పోలీసు వారికి అనుబంధంగా కొన్ని విధులు నిర్వహించవచ్చు కానీ అది కూడా నేను తీసుకోలేదు. మిగతావారు దాదాపుగా అందరూ అలా చేరినట్లున్నారు. నేను ఇప్పటివరకూ చేసింది చాల్లే అని లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా ఆసక్తి కలిగితే ఆ ఆకాడెమీలో చేరి పాల్గొంటాను.

6 comments:

  1. you not only shared your experience

    along with that

    you also given the feel of it.

    (from the beginning to the end of the post).

    really very nice.


    good write up skill you have

    ?!

    ReplyDelete
  2. పోలీసు దొంగ ని ఎలా పట్టుకుంటాడో దొంగకి తెలియడం దొంగ కి చాలా మంచిది
    దొంగ ఎలా దొంగతనం చేస్తాడో పోలీసు కి తెలియడం పోలీసు కి మంచిది

    మీరు సం"దేహాలు" తీర్చుకున్నారు సరే
    మరి మా పరిస్తితి ఏమిటి ?

    @ కాయ
    మీరేమి అంటారు ?

    ReplyDelete
  3. @?!
    :)

    @ అప్పి
    మగ దేహం బదులు ఆడ దేహం తోడుగా వుండి వుంటే సన్ దేహాల మాటేమోగానీ ఎన్నో ఫన్ దేహాలు తీర్చుకునివుండేవాడినేమో కదా.

    ReplyDelete
  4. నా చిన్నపుడ్డు ఎవరైనా పెద్దవాళ్ళు నాకు పరిచయం అయితే.. నా దోస్త్ లకి వాళ్ళని పరిచయం చేసి నాతో పెట్టుకోకండిరా అని ఒక మెసేజ్ ఇచ్చేవాన్ని.. గురువు గారు షాప్ అతన్ని బానే భయపెట్టాడు ..

    అప్రావ్ భాయ్:
    పోలీసులు దొంగల గురించి పట్టించుకోగలరు, ఎప్పుడంటే దొంగ కి ఏం ముఖ్యమో తెలిసినప్పుడు.. కానీ గురువు గారికి కావల్సిందేంటో తెలిస్తే... ఇంకేమైనా ఉందా..
    (##)($$)(%%)(..)(@@)(OO)(**)(--)(^^)...

    ReplyDelete
  5. @ సింహం
    అంత సీను లేదు లేబ్బా.

    ReplyDelete
  6. రొటీన్ లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే లైఫ్ లో ఇలాంటి చేంజెస్ ఉండాలి... గుడ్..., శరత్ జీ...

    ReplyDelete