గురువారం 6 అక్టోబర్ 2011

సమ్మసమ్మగా సకల జనుల సమ్మె

అయిదేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఒకసారి సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తున్నాను. మధ్యలో నకిరేకల్లులో అనుకుంటా సిపిఐ వాళ్ళో సిపిఎం వాళ్ళో ఎందుకో ఒకందుకు రాస్తా రోకో చేసి (వాళ్ళకు అవి రోటీన్ పనులు కదా) మూడు గంటల పాటు బైఠాయించారు. కొన్నేళ్ళుగా కెనడా, యు ఎస్ లలో వుంటూ వస్తున్న నాకు  అలా చిక్కు పడిపోవడం చాలా అసహనంగా, చిరాగ్గా అనిపించింది.  ఇక్కడ ట్రాఫిక్ జాములు వుండవని కాదు కానీ రాస్తారోకోలు వుండవు కదా. నాకు ఒక్కసారికే అలా అనిపిస్తే రోజూ హర్తాళ్ళూ, సమ్మెల్లూ, రాస్తారోకోలతో జనాలకి ఎలా వుంటుందో ఏమో. 

అందుకే ఇండియాకు ఎవరికయినా ఫోను చేసినప్పుడల్లా సమ్మె ఎలా నడుస్తోందని అడుగుతూవుంటా. నేను ఎక్కువగా హైదరాబాదు వారికే చేస్తుంటాను. అలా వారియొక్క ఇబ్బందులు తెలుస్తుంటాయి.  ముఖ్యంగా కరెంట్ కష్టాలు చెబుతూవుంటారు. ఈ ఇబ్బందుల వల్ల మరి సమ్మెను వ్యతిరేకిస్తున్నారా, సమర్ధిస్తున్నారా లేక ఇంకా సమ్మె ఇంకా తీవ్రంగా వుండాలనుకుంటున్నారా అని అడుగుదామనుకుంటూనే మరచిపోతూవున్నా. తెలుసుకోవాలి.

ఈ సమ్మెలో అమ్మ గురించే ఆందోళన. ఒక్కతి ఈ ఇబ్బందుల్లో ఎలా నెట్టుకొస్తోందో అని ఆదుర్దాగా వుంటుంది. ఆమెకు చేదోడు వాదోడుగా తోబుట్టువులూ, మా బంధుమిత్రులు వున్నారనుకోండి. అయినా సరే. ఇవాళ ఫోన్ చేసి సమ్మె వల్ల ఏమయినా ఇబ్బందులు పడుతున్నావా అని అడిగాను. ఏమీ లేదని చెప్పింది. పెన్షన్ వచ్చిందా అని అడిగాను. రేపు మాపు అని తిప్పించుకుంటున్నారని చెప్పింది. అమ్మకి డబ్బు కోసం మరీ అర్జెంటేమీ లేదనుకోండి  కానీ ఇతరులు ఎంతోమంది వృద్ధాప్యంలో పెన్షన్ల మీదే ఆధారపడివుంటారు కదా.

అయితే ఈ సమ్మె ఎవరికి సమ్మగా వుంటొందనేది నాకు అర్ధం కావడం లేదు. చిన్నప్పుడు మన పగవాడికి ఎవడికయినా దెబ్బలు తగిలితేనో, క్రిందపడిపోతేనో, తిట్లు పడితేనో సమ్మ సమ్మ అని సంకలు కొట్టుకునేవారం.  ఇప్పుడు ఈ సమ్మ వల్ల ఆంద్రా వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రతాపం చూపిస్తున్నామని తెలంగాణా ఉద్యమకారులు చంకలు కొట్టుకుటున్నారా లేక ఇన్నాళ్ళుగా అవస్థలు పడి సమ్మె చేస్తున్నా ఇంకా వర్కవుట్ అవడం లేదు అని సమైక్యాంధ్రా వారు చంకలు కొట్టుకుంటున్నారా  అనేది తెలియకుండా వుంది.

ఎవరు కొట్టుకున్నా కొట్టుకోకున్నా ఒకతను మాత్రం మననందిరినీ చూసి చంకలు కొట్టుకుంటున్నాడనే అనుకుంటాను. అతనే సిలిపి సిదంబరం. సిచ్చు పెట్టేసాడుగా, సంకలూ కొట్టుకుంటాడు మరి. 

ఇకనైనా సమ్మె ఆగితే బావుండు అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారా లేక సమస్యా పరిష్కారం కోసం ఇంకా తీవ్రం కావాలంటున్నారా అనేది నాకు అర్ధం కాకుండా వుంది. పేపర్లు చూస్తే నాయకుల సవాళ్ళే తప్ప సామాన్య తెలంగాణా జనం యొక్క జపం తెలియదాయే. అందుకే తెలంగాణాలో వుంటూ సమ్మె వల్ల అవస్థపడుతున్న జనం యొక్క గళం అది మీది అయినా లేదా మీకు ఏమయినా తెలిసినా చెప్పెయ్యండేం.

7 comments:

విశ్వామిత్ర చెప్పారు...

శరత్ గారూ..ఆంధ్రావాళ్ళకు కరెంట్ లేక పిర్రలు కాలితే తెలంగాణా వాళ్ళకు కరెంట్‌తోబాటు జీతాల్లేక ఒళ్ళు కూడా మండిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే నిసృహతో దాడులు తధ్యం. అది ఖచ్చితంగా రాష్ట్రపతి పాలనకే దారి తీస్తుంది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

థూ..దీనమ్మ తెలంగాణా, హైదరాబాద్‌తో కలిపి ఇచ్చి పారెయ్యండెహె అని ఆంధ్రావాళ్ళకి అనిపిస్తుంటే, తొక్కలో తెలంగాణా వస్తే ఎంత రాకుంటే ఎంత, ఈ సమ్మె ఆపెయ్యండెహే అని తెలంగాణా వాళ్ళకి అనిపిస్తోంది ఈ సమ్మె, అది తెచ్చిన కష్టాలతో.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ విశ్వామిత్ర
మొత్తమ్మీద అందరికీ కాలుతూనే వుందన్నమాట. రాష్ట్రపతి (పాలనతో) అయినా నీళ్ళు చల్లుతారేమో చూద్దాం.
@ క్రిష్ణ
సమైక్యాంధ్రా అయితేనే బావుంటుంది కానీ విడిపోవడం అనివార్యం అయితే మధ్యేరకంగా హైదరాబాద్ మినహా తెలంగాణా అంటేనే ఈ పీటముడి విడిపోతుంది అనే కొందరి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. హైద్బాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చెయ్యాలి. ఆంధ్రా వారు ఎంచక్కా విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేసుకోవచ్చు. తెలంగాణా వారు వరంగల్లును రాజధానిగా రాజ్యం ఏలవచ్చు. అందరూ ఎంతోకొంత రాజీపడకపోతే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది?

Jai చెప్పారు...

Sarat, why are we having this now? The only reason is the artificial "integrationist" agitation of December 10. Otherwise by now every body would have been living peacefully in their own state.

బలవంతపు సమైక్యం బూటకం. ప్రజల కోరికను దౌర్జన్యంతో ఎదురోకోవడం అవివేకం

kvsv చెప్పారు...

అయితే ఈ సమ్మె ఎవరికి సమ్మగా వుంటొందనేది నాకు అర్ధం కావడం లేదు....ardhaM kaakapOtE elaa saar..kcr batch ki sammagaa vuntadi...janaalu andaraki picchani nemmadigaa inject chEsaaru kadaa...telangaanaa vacchaaka maro swaatantra poraatam chEstaam...edo oka ragada undaali kadaa...poraaataalu cheyadam koodaa oka addiction annadi ippudu kotta gaa ardam chesukovaali...

kvsv చెప్పారు...

@krishnas...ha ha u r 100% correct sir..

kvsv చెప్పారు...

@ ప్రజల కోరికను...???ea prajalu baaboo...prajalu evadi batuku bandi vaadu laakkuntaadu..uk lo unnaa us lo unnaa...chidambaram gaadi tamila teliviki verri pappalam ayipoyaam...enni kotla lakshala pettu badulu tamil vaallaku potunnaayo telusaa??oka taagu botu gaadi piccha aalochanalaku 2012 lo janaalu verri daddammalu avadam baadagaa undi...