గురువారం 6 అక్టోబర్ 2011

తెనాలి రామలింగడి పిల్లి పాల లాంటి తెలంగాణా ఆంశం

తెనాలి రామలింగడి పిల్లి కథ మీరు వినే వుంటారు. తెలియని వారికోసం ఓ సారి చెబుతాను. నాకూ కథ అంత బాగా గుర్తుకు లేదు కానీ లాగిద్దాం. ఎందుకో గుర్తుకులేదు కానీ ఓ సందర్భంలో తెనాలి రామలింగ కవిని ఒక పిల్లిని పెంచాల్సిందిగా రాయల వారు ఆదేశిస్తారు. పిల్లిని పెంచమన్నారు సరే, బాగానే వుంది కానీ దాని పోషణ సంగతేంటి మహాప్రభో అని మొరపెట్టుకుంటాడు. పిల్లి పాల ఖర్చుల కోసం నెలకు కొంత మొత్తం కవికి అందే ఏర్పాటు చేస్తారు రాయలవారు. పిల్లికి అంత మొత్తం ఖర్చు చెయ్యకుండా మిగిల్చుకుందామని ఒక కుట్ర పన్నుతాడు ఆ కవి. బాగా మరగపెట్టిన పాలు పెట్టి పిల్లిని పిలుస్తాడు. అది ఆ పాలు తాగి మూతి కాల్చుకొని ఆ భయంతో మళ్ళీ పాల జోలికి జన్మలో రాదు. దాంతో ఆలా పాల డబ్బులు కవి గారికి మిగులుతూవుంటాయి. ఆ పిల్లిమో చల్లటి పాలు పెట్టినా దరిదాపుల్లోకి కూడా రాదు. పిల్లికి పాలు పొయ్యడం లేదని రాయలవారికి  తెలుస్తుంది. నేనేం చెయ్యను మహాప్రభో అదే తాగడం లేదు అని విన్నవించుకుంటాడు. పిల్లి పాలు తాగకపోవడం ఏంటి విచిత్రంగా వుందే అని పరీక్షించాలనుకుంటాడు. సేవకులు పాల గిన్నె తెచ్చి పిల్లి ముందు పెడతారు కానీ పిల్లి బ్రతుకు జీవుడా అనుకుంటూ పారిపోతుంది.

ఈ తెనాలి రామలింగడి పిల్లి కథను నేను నిత్య జీవితంలో చాలాసార్లు అన్వయిస్తూ సరదాగా ఉదహరిస్తుంటాను. కొద్దిరోజుల క్రితం తెలంగాణా ఉద్యమం గురించి గ్రేటాంధ్రా సైటులో ఎంబిఎస్ ప్రసాద్ వ్రాస్తూ ఆ కథను ఉటంకించడంతో నాకు నవ్వు వచ్చింది.  తెలంగాణా ఇచ్చేద్దామని 2009 డిసెంబరులో కాంగ్రెస్ అధిష్టానం అదేనండి సోనియమ్మ తన పుట్టినరోజు కానుకగా నిర్ణయం ప్రకటించింది కదా. ఆ నిర్ణయంతో ఆమెకు మూతి కాలింది. అందువల్ల ఇహ ఆ ఆంశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మళ్ళీ కాలుతుందేమోనని ఆమె గారికి ధైర్యం చాలడం లేదు. అలా తెనాలి రామలింగడి పిల్లి పాల లాగా తెలంగాణా ఆంశం అయి కూర్చుంది. 

3 comments:

కాట్రవెల్లి ఒంటేలు చెప్పారు...

ఆ యేమోయ్‌ షరత్తూ ఉజ్జమం షరైన దిషలోనే షాగుతోందోయ్‌. నువ్వు అనవషరంగా ఏమోమో ఊహించేషుకుంషున్నావు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ కాట్రవల్లి
ఇది వ్రాసింది ముఖ్యంగా ఉద్యమ పరిస్థితి గురించి కాదు - సోనియమ్మ పరిస్థితి గురించి :)

Mirch Bajji చెప్పారు...

:-) Its True... :-)