చాలామంది మేధావుల లేదా మేధావులం అనుకునేవారి చదివిన పుస్తకాల జాబితాలో ఆ పుస్తకం తరచుగా వుంటుంది. నేనింతవరకూ అయాన్ రాండ్ పుస్తకం ఒక్కటీ చదవకపోవడంతో చాలాకాలంగా చిన్నబుచ్చుకొని వుంటున్నాను. పొరపాటున జీవితంలో గొప్పాడినయిపోతే అప్పుడు ఎవరన్నా ఏమేమి పుస్తకాలు చదివారూ అంటే ఇంకేమన్నా వుందా!
వారి యొక్క తత్వశాస్త్ర పుస్తకాలు ఇప్పుడు తలకెక్కవు అనుకొని బైబిల్ తరువాతి పుస్తకం అనబడుతున్న ఆ అట్లాస్ పుస్తకంలో కాస్త ఫిక్షన్ కూడా కలిసివుంటుంది కదా అని అమెజాన్ సైటునుండి తెప్పించుకున్నాను. ఆ నవల యొక్క ప్లాట్ కూడా ఆసక్తికరంగా వుండటం కూడా ఆ పుస్తకం ఆర్డర్ చెయ్యడానికి ఓ కారణం.
తెప్పించుకున్నాక చూస్తే వెయ్యి పేజీలకు పైగానే వుందండీ బాబూ. పైగా చిన్న అచ్చులో. అసలే ఈమధ్య తీరిక సమయాల్లో ఊహించుకోబుద్ధవుతోంది కానీ పుస్తకాలు చదివెయ్యబుద్ధి కావడం లేదు. అలా కొన్ని పుస్తకాలు కాస్తకాస్త చదివి పక్కన పడేసాను. ఈ పుస్తకం కూడా కాస్త చదివా. అర్ధమయ్యీ కానట్టుగా, కాస్త ఆసక్తికరంగా బాగానే వున్నట్టుంది కానీ భుజాలు ఎగరేసి ఇప్పటివరకయితే పక్కన పడేసాను. చదువుతా, చదువుతా, మొత్తమ్మీద ఆ పుస్తకం పూర్తి చేసి నేనూ మేధావుల లిస్టులోకి వచ్చేస్తా.
అయాన్ రాండ్ గురించి నాకు మొదటగా తెలిసింది యండమూరి నవల ద్వారా. ఏ నవలో గుర్తులేదు - చినప్పుడెప్పుడో చదివాను - అందులో రాండ్ ప్రసక్తి వచ్చినప్పుడు ఒక పాత్ర నేనూ ఆతగాడి పుస్తకాలు చదివాను అని గప్పాలు కొట్టుకుంటుంది. అప్పుడు హీరో మనస్సులో నవ్వుకుంటాడు. ఎందుకంటే రాండ్ ఓ స్త్రీ కాబట్టీ. అప్పటినుండి పేరు బాండ్ లాగా వున్నా కూడా రాండ్ మాత్రం మగ కాదు అని బాహ్గా గుర్తుండిపోయింది.

10 comments:
నేను గత ౨-౩ నెలలు గ చదవడానికి ట్రై చేస్తున్న అండి..నా బుర్ర కి ఎక్కడం చాల కష్టం గానే వున్నది. ఆపేసిన తర్వాత నుండి మొదలు పెడదాము అంటే ముందు ఏమి చదివానో గుర్తు వుండటం లేదు :)
ప్రార్థన నవలండి అది. నాకు కూడా షేమ్ టు షేమ్ అప్పుడే తెలిసింది. అప్పటినుంచి నేను కూడా మేధావి నవ్వాలనుకుంటూనే ఉన్నాను కానీ కుదరలా ఇంత వరకు :-).
మీకు Ayn Rand బోరు కొట్టిందా? ఇహ మీరిలా మేధావేమవుతారు? Actually జీవితాన్నీ మూసలో జీవించడం ఇష్టంలేని మీలాంటి జీవులకి Ayn Rand బోరు కొట్టకూడదు. మళ్ళీ ప్రయత్నించండి.
I started reading Rand's books couple of years back . Completed Fountainhead last year and started with Atlas Shrugged recently. Though it gets boring at times due to length, I felt that it is a very interesting book. One point that she stresses so much in her books is that people who are hungry for power encourage mediocrity. I have seen this happening a lot in real life around me, at work. Though it has been 50 years since the book is written, I feel that I can relate characters to the people around me, specially the ones that she calls "looters". Keep going - I am sure you will get absorbed into it very soon. Please share your opinion about the book.
amdaroo chebutoo umtE nenu koodaa ayan raand the fountain head pustakam ee madhyanE koni chadavadaaniki prayatnistunnaanu,kaanee muduku saagadam lEdu.
good book. and more relevant in present day Obama's USA who is hell bent on turning USA into a socialist country with his medicare and other policies. If u are already not aware u might also realise how government is responsible for economic recessions. And at the end of it u'll realise that " There is no government like no government."
@ వినీల
:)
@ సురేశ్
ఓ అది ప్రార్ధన నవలా. తెలిపినందుకు ధన్యవాదాలు. అవుతారు సురేశ్ గారు. మీరూ ఏదో ఒక రోజు మేధావి అవుతారు :)
@ మినర్వా
బోర్ కొట్టలేదండీ. వారి భావాలు నాకూ నచ్చుతాయి. బోర్ కొట్టకున్నా కూడా పక్కన పెట్టెయ్యడానికి బోలెడన్ని కారాణాలుండొచ్చు. ఆ పుస్తకం చూస్తే భయం వెయ్యడం ఓ కారణం. చిన్న అచ్చులో వెయ్యి పేజీలకు పైనే వుంది మరి. తెలుగు చదివినంత వీజీగా ఆంగ్లం చదివిపడెయ్యలేను నేను.
@ అజ్ఞాత
మీరు చెప్పింది చూస్తుంటే మళ్ళీ మొదలెట్టాలనిపిస్తోంది. మీరు చక్కగా వివరించినందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కాస్త తీరిక తక్కువ అయ్యి పక్కన పెట్టేసాను. పుస్తకం అయాక తప్పక నా అభిప్రాయం వ్రాస్తాను.
@ రమణా రెడ్డి
ఈ పుస్తకం అయిపోతే ఫౌంటెయిన్ హెడ్ కూడా చదవాలి. తత్వశాస్త్రం నాకు సులభంగా జీర్ణం కాదు. వీరి నవలల్లో తాత్విక చర్చ ఎక్కువగా వుంటుందేమో అని కాస్త బెదురుగా వుంది. వున్నా కూడా సులభంగా అర్ధమయ్యేలా వుంటే సంతోషమే. మీరు చెప్పింది, వినీల గారు చెప్పింది చూస్తుంటే కొందరికి అంతగా ఆ పుస్తకాలు కొరుకుడు పడవేమో అనిపిస్తోంది. ఇహ నాకెలా వుంటుందో చూడాలి. నేను ఇప్పటివరకు ఓ పది పేజీలు మాత్రమే చదివా మరి.
@ అజ్ఞత
మీరు చెప్పింది చూస్తుంటే ఆ పుస్తకం నాకు బాగా నచ్చేలాగే వుంది. నాకూ అలాంటి ఆంశాలు అంటే ఇష్టం. ప్రపంచ ఆర్ధిక స్థితి గురించి ఈమధ్య బాగా పరిశీలిస్తున్నాను.
"ప్రపంచ ఆర్ధిక స్థితి గురించి ఈమధ్య బాగా పరిశీలిస్తున్నాను. " - గ్రీసు ఎప్పుడు ఐ పి పెడుతుందోనని స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. గ్రీసు దేశ దివాలాకోరుతనానికి కారణాలేమిటి?
@ సిబిరావ్
రాజ్యాలే కావచ్చు పౌరులే కావచ్చు గాక - దివాళా తీస్తున్నారంటే దానికి కారణం చాలావరకు ఆదాయానికి మించిన ఖర్చులే అయివుంటాయి. బజెట్ కి మించిన స్పెండింగ్ వున్నప్పుడు అవస్థలు తప్పవు. అందుకే ప్రభుత్వ ఖర్చుల్లో కోతలు విధించి పరిస్థితి అదుపులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు అక్కడ. అమెరికా పరిస్థితీ అంతే. పన్నులు పెంచి రాబడి పెంచడానికి రిపబ్లికన్లు ఒప్పుకోవడం లేదు. ఖర్చుల్లో కోత విధిద్దామంటేనేమో డెమోక్రాట్లు ఒప్పుకోవడం లేదు. అందుకే బజెట్ లోటు పెరిగిపోతూనేవుంది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి