మాకు కూడా బందులుంటే ఎంత బాగుండును

తెలంగాణాలో అందరూ బంద్ పండగ చేసుకుంటున్నారు. ఉద్యమం పుణ్యమా అని ప్రతి కొన్ని వారాలకూ బందులూ, హర్తాళ్ళూ వచ్చి చాలా బాగా కాలక్షేపం చేస్తున్నారు. మా అమ్రికా వాళ్లకి కూడా మనవాళ్ళు బందుల్లో పాఠాలు నేర్పిస్తే బావుండును. ప్రతీ పని రోజూ అఫీసుకి వెళ్ళక్కర్లేకుండా ఎంచక్కా ఇంట్లోనే మునగదీసుకొని కొన్ని రోజులయినా పడకేసేవాడిని.  

సమ్మె వల్ల కరెంటు కొన్ని గంటలయినా కట్టంటున్నారు కదా. ఇంకేం, టివిలు గట్రా చూడకుండా ఎంచక్కా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు.

ఏంటో ఇక్కడంతా బోరుగా వుంది - బందులు లేక ఒక్క రోజన్నా పనికి బంద్ అయ్యే అవకాశమూ లేదు, అనారోగ్యం అంతగా రాదు కాబట్టి ఎక్కువగా సిక్కవనూలేము. అనగా సిక్ లీవ్ పెట్టుకోలేము. నిజ్జంగా అనారోగ్యం పాలిట బడ్డా  అనుమానంగానే చూస్తారు. ఇండియాలోనయితే ఎంచక్కా రోజుల తరబడి జ్వరాలు వస్తాయి. హాయిగా అందరి సేవలు పొందుతూ, పని ఎగ్గొట్టి విశ్రాంతి పొందవచ్చు. అందుకే ఇండియాను చూస్తే ఈర్ష్య నాకు. 

2 comments:

  1. నిజమేనండి. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక సందడిగానే ఉంటుంది. పనిచేసే యంత్రాల్లాంటి జీవితం ఉండదు ఇక్కడ. అందుకే భారతదేశం అంటే చాలామందికి ఈర్ష్య.

    డబ్బు ఎంతున్నా సందడి లేకపోతే జీవితం బోరే మరి. ఇక్కడ మాలో మేము కాసేపు తిట్టుకున్నా అది కాసేపే .

    హిచ్ కాక్ సినిమా లెవెల్లో దేశంలో సంఘటనలు జరిగిపోతున్నాయి,. ఏరోజుకారోజు తరువాత ఏం జరుగుతుందోనని గొప్ప టెన్షన్ గా ఉంది.

    వీటితోనే సమయం చాలటం లేదు. అందుకే సినిమాలను చూడటానికి కూడా జనం అంతగా వెళ్ళటం లేదు.

    ReplyDelete
  2. Paina Thadhaasthu Devatalu Untaaratandi. Mee korika seeghrame teerutundi. Amrikaa e dikkulo velutondo gamanistoonte mee korika saakshaatkaaraaniki samayam ati twaralone vundanipistondi!

    cheers
    zilebi
    http://www.varudhini.tk

    ReplyDelete