మాంసాహారంతో మనస్థత్వంలో మహా తేడా :)

అసలే మనకు ఆత్మాభిమానం ఎక్కువ. అన్నిచోట్లా కాదులెండి - అనువైన చోట. హి హీ. ఆ మధ్య వళ్ళు దగ్గరుంచుకొని బ్రతకడం బెటరు కదా బ్రదర్ అనుకొని ఆరోగ్యం చక్కా వుండాలని చాలావరకు ఆకులూ, అలములూ, దుంపలూ, పళ్ళూ, కూరగాయలు తింటూ బ్రతికాను. ఆకులెలా తింటావన్నా అని అప్పుడప్పుడు ఆప్పారావు లాంటివారు ఆశ్చర్యపోతూనే వుండేవారు.

ఈమధ్య జిమ్ములో బరువు లెత్తుతున్నా కదా - కేలరీలు సరిపోవడం లేదని  సాత్వికాహారానికి నమస్తే చెప్పి జనజీవన స్రవంతిలో కలిసేసా. అన్నీ ఫుల్లుగా లాగించేస్తున్నా. బరువు పెరగాలని తిండి ఇంకా దట్టంగా దూర్చేస్తున్నా కానీ అంతగా బరువు పెరగట్లేదనుకోండి. అయితే జిమ్ము చేస్తున్నందువల్లనో లేక సాత్వికాహారం మానివేసినందువల్లనో  కానీ నాలో సాత్విక లక్షణాలు తగ్గి పౌరుషం పొంగుకువస్తోంది. ఇందుకు కైరోప్రాక్టిక్ కూడా కొంత కారణమేమో. చూసి చూసి ఇహ లాభం లేదని  కొంత కాలం FLR ప్రయత్నించిన వాడినల్లా దాన్ని గిరవాటు వేసాను. అలా అలా నా ఆలోచనా రీతుల్లో కొన్ని మార్పులు గమనిస్తున్నాను. ఈ ఉత్సాహం ఎక్కడికి దారితీస్తుందో ఏమో చూడాలి :)

5 comments:

  1. i have observed the differences in mentalities in vegetarians and non-vegetariens and what you said is correct.

    ReplyDelete
  2. annay welcome back.....Meat tho patu koncham Onions and garlic kuda penchu....appudu chudu Malli rasagnya lo post lu vasthay.....

    ReplyDelete
  3. జాగ్రత్తండోయ్!

    అన్నట్టు మీ బ్లాగు పోస్టులు బజ్జులో పెట్టడంలేదేంటి మీరు?

    ReplyDelete
  4. ee madhya timdi charchalu bajju lo leka nakanaka laadutunnaaru :)

    ReplyDelete
  5. @ బులుసు,
    :)
    @ అజ్ఞాత
    హ హ. అలాగే
    @ సుజాత
    :)
    బజ్జులోకి ఆటోమేటిగ్గా నా పోస్టులు వేద్దామంటే అలా ఈ బ్లాగు కనెక్ట్ కావడం లేదు. గూగుల్ చేసి చూసాను కానీ పరిష్కారం దొరకలేదు. మరీ స్వయంగా నా టపా గురించి ఏం డప్పు కొట్టుకుంటానులే అని వెయ్యట్లేదు.
    @ అజ్ఞాత
    ఈమధ్యనే మిర్చీబజ్జీల గురించి బజ్జులు ఘుమఘుమలాడినట్లున్నయ్యే.

    ReplyDelete