మా ఊర్లో గ్యాంగ్ వార్లు

మొన్నటి వారం పౌర పోలీసు శిక్షణలో గ్యాంగుల గురించి చెప్పారు. వాళ్ళు ఎలా వుంటారు వారి మనస్థత్వం ఏంటి, ఎలాంటి ఆయుధాలు వాడుతారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, ఎలాంటి ఆభరణాలు ధరిస్తారు, ఎలాంటి చట్ట వ్యతిరేకమయిన కార్యక్రమాలు చేపడుతారు అనేవి అన్నీ ప్రదర్శన వస్తువుల ద్వారా, పోస్టర్ల ద్వారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఇదివరలో నగర వీధుల్లోని గోడల మీద అడ్దదిడ్డమయిన వ్రాతలు చూసి కుర్రాళ్ళు పెంకిగా వ్రాసే గ్రాఫిటీ అనుకునేవాడిని. గ్యాంగులు కూడా తమ తమ టెరిటరీలను ప్రకటిస్తూ తమ గ్యాంగు యొక్క చిహ్నాలను, ఉద్దేశ్యాలను అలా గోడల మీద ప్రకటిస్తారుట. మోడర్న్ ఆర్టులా ఆ వ్రాతలు, చిత్రాలు మనకు గ్యాంగుల గురించి తెలిస్తే తప్ప బోధపడవు. అయినా అవి వాళ్ళు వ్రాసేవి సామాన్య జనాన్ని ఉద్దేశ్యించి కాదు లెండి - ఇతర గ్యాంగులకు అర్ధమవాలని అలా వ్రాస్తారు. 

పోలీసులు ఆయా గ్యాంగులను ఏరిపారేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతారు అయినా ఆ సమస్య ఇంకా మా పట్టణంలో కూడా ఇంకా ఎందుకు వుంది అనేటటువంటి వివరాలు చెప్పారు.  మా టవునులో వున్న గ్యాంగుల పేర్లు, వాటి పనులు చెప్పారు. గ్యాంగ్‌స్టర్స్  ముఖ్యంగా మత్తుమందుల అమ్మకం చేస్తారు.    వారు మత్తుమందులకు అలవాటు పడి వుంటారు కనుక వాటికి కావాలసిన డబ్బు కోసం కూడా దొంగతనాలూ, దోపిడీలూ చేస్తారు. హైస్కూలులో చదువుతున్నప్పటి నుండే గ్యాంగుల్లో రిక్రూట్మెంట్లు జరుగుతాయని, పాఠశాలల్లొ కూడా కుర్ర గ్యాంగు మెంబర్లు వుంటారని తెలిసి ఆశ్చర్యం అనిపించింది. గ్యాంగు సభ్యుల సంజ్ఞలు, సంకేతాలు ఎలా వుంటాయో తెలిసింది. వాళ్ళు పరస్పరం ఎలా సమాచారం అందించుకుంటారో చెప్పారు.  

గ్యాంగుల మధ్య ఎలా యుద్ధాలు జరుగుతాయి, ఎలా వాళ్లు చంపుకుంటారు, ఎలా ఒకరి ప్రాంతపై ఇంకొక ప్రాంతం వారు ఆధిపత్యం ఎలా చెయాయించాలని చూస్తారు అనే వివరాలు కొన్ని సినిమా బిట్స్, మరికొన్ని వీడియో బిట్స్ చూపిస్తూ వివరించారు. మా ఊర్లో జరిగే గ్యాంగ్ యుద్ధాల గురించి కూడా చెప్పారు. మా పక్క కమ్యూనిటిలో గత ఏడాది అనుకుంటా జరిగిన కాల్పుల్లో ఒక అమాయక ప్రాణి బలయ్యాడు అని చెప్పారు. గ్యాంగ్ వార్ జరుగుతుంటే మధ్యలో అతగాడు బలయ్యాడంట. మా పక్క కమ్యూనిటీలో ఆరుగురు మెక్సికన్ గ్యాంగ్‌స్టర్స్(SGD gang) వున్నారని చెప్పడంతో కాస్త అనీజీగా అనిపించింది. అదే కమ్యూనిటీలో నా క్లోజ్ ఫ్రెండ్ వుంటుంటాడు, వారి ఇంటికి తరచుగా వెళుతుంటాం మరి.  సామాన్య జనం జోలికి వారు అంతగా రారు అని తెలియడంతో కాస్త ఊరట అనిపించింది కానీ దొంగతనాలు, దోపిడీలు మాత్రం అన్ని ఇళ్ళల్లో, కార్లల్లో చేస్తూనేవుంటారు కదా. 32 వేల మంది వుండే మా పట్టణంలో సరాసరిన రోజుకో దొంగతనం జరుగుతూవుంటుందిట. 

తెలుగు బ్లాగుల్లో గ్యాంగుల గురించి నేను వారికి ఎదురు బోధిద్దామనుకొని మిన్నకున్నాను.

ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ శిక్షణ వుంది. ఈ రోజు ట్రాఫిక్ పోలీసింగ్ గురించి చెబుతారట. ఈరోజు మమ్మల్ని పోలీసు కార్లల్లో తిప్పుతారని అనుకుంటున్నాం. స్క్వాడ్ కార్లలో వెళుతూ ఆఫీసర్ల విధులు మేము గమనిస్తుండాలనుకుంటా.

4 comments:

  1. "తెలుగు బ్లాగుల్లో గ్యాంగుల గురించి నేను వారికి ఎదురు బోధిద్దామనుకొని మిన్నకున్నాను."

    LoL... cheppi undalsindhi.

    ReplyDelete
  2. I wish... I wish I could be a gang member.

    Why don't you explain a bit about what you have been learning. Especially the territorial declarations and the sign language?

    ReplyDelete
  3. ee madya koncham blogllulo gola tagginatlundi.
    meeru emantaru sarath garu

    ReplyDelete
  4. @ క్రికెట్ లవర్
    :)
    @ మినర్వా
    అందాకా మీ గ్యాంగ్ దురద ఏ బ్లాగు గ్యాంగులోనో చేరి తీర్చుకుందురూ.

    అంత లోతుగా వ్రాసే ఓపికా, ఆసక్తీ లేవండీ. మిగతావారికీ అంత ఆసక్తి వుండకపొవచ్చు. దృష్టిలో పెట్టుకుంటాను.

    @ వంశి
    నిజమే. సంతోషమే. అందుకు బజ్జులు కూడా ఓ కారణం. కొత్తొక వింత పాత ఒక రోత అన్నట్లుగా కొంతమంది బజ్‌న చేస్తుండటంతో (నేనూ అప్పుడప్పుడు) బ్లాగుల్లో గ్యాంగుల బ్యుజి(నెస్) తగ్గింది.

    ReplyDelete