ఈ నాస్తికుడి నారాయణ వ్రతం!

మా ఆవిడ సత్య నారాయణ వ్రతం చెయ్యాలనుకుంటోందని కొన్ని నెలల క్రితం ఓ టపాలో సెలవిచ్చాను.  మొత్తమ్మీద కొన్ని వారాల క్రితం అరోరాలోని దేవాలయంలో ఆ వ్రతం జరిగింది. అందులో నేను పాల్గొనిన విధం బెట్టిదన...

వ్రతం అంటే మామూలుగానే నేను రానని మొరాయించాను. నా వీక్ పాయింట్లు మా ఆవిడకి బాహ్గా తెలుసు కదా. అక్కడ ఫుడ్డు పెట్టిస్తానని చెప్పింది. గంగిరెద్దులా తలాడించి పోలోమంటూ బయల్దేరాను. నా దారిన నేను తింటూ వుంటే తన దారిన తాను వ్రతం చేసుకుంటుంది కదా అనేది నా ప్రగాఢ నమ్మకం. ఆలయాల్లో పెట్టే అహారం కమ్మగా వుంటుంది. అందుకే అక్కడ తినడం అంటే నాకు ఇష్టమే. అదే కాకుండా ఈ వ్రతం జరిగాక ఇచ్చే ప్రసాదం బావుంటుంది. ఏదో పిండిలో పాలు, అరటి పళ్ళూ కలిపి ఇస్తారు.  ఆ ప్రసాదం తినడం చిన్నప్పటి నుండీ నాకు ఇష్టం.

మా పొరుగింటి వారు కూడా అదే వ్రతం కోసమై అక్కడికి వెళుతున్నారు. గుడికి వెళ్ళాక ఇంకా చాలా జంటలు అక్కడ వరుసగా కూర్చున్నాయి. మా ఆవిడ కాస్సేపు కూర్చొమ్మంది. సరే ఓ పది నిమిషాలు కూర్చొని వెళ్దాములే అని అక్కడ ఆసీనుడిని అయ్యాను. పూజ మొదలయ్యింది. కాస్సేపయ్యాక లేవబోతుండగా పూజ మధ్యలో అలా లేవకూడదని మా పక్కింటి మిత్రుడు హెచ్చరించాడు. నేను బుక్కయ్యాననుకొని బిక్కచచ్చిపోయి పూజ ఎంతసేపు వుంటుందేంటి అని అడిగాను. మహా అయితే ఓ గంట వుండొచ్చు అని చెప్పాడు. మధ్యలో లేచి వెళితే పూజారి శపిస్తాడేమో అని ఓపిగ్గా కూర్చున్నాను.

మిగతా సమయమంతా సౌందర్యారాధన చేస్తూ గడిపాను. అపార్ధం చేసుకోకండి. తళతళలాడుతున్న డిజైన్ స్టీలు ప్లేటులో వివిధ రకాల పూలు, పళ్ళు, పొడులూ చూస్తుంటే చూడముచ్చటగా అనిపించాయి. అలా అందరి పళ్ళాలూ గమనిస్తూ గడిపాను. గంట అయినా ఆ వ్రతం అవలేదు. ఇంకొద్దిసేపట్లో అయిపోతుందేమోనని చూసా కానీ అది అయ్యే సూచనలు అనిపించలా. నాకేమో బాగా ఆకలవుతోంది. మిగతా జంటల్లోని ఒకరిద్దరు స్త్రీలు కాస్సేపు బయటకి వెళ్ళి మళ్ళీ వచ్చారు. దాంతో నాకు ధైర్యం వచింది. మా ఆవిడకి ఓ నమస్కారం పెట్టేసి కాఫిటీరియాకి వచ్చాను. ఇక్కడ నేను ఆహార వ్రతం చేస్తుండగా అక్కడ మా ఆవిడ ఆ వ్రతం చేసేసింది. 

ఆ వ్రతం మూడు గంటలు పట్టిందండీ బాబూ. అక్కడే కూర్చొని వుంటే అలాగే అవస్థ పడేవాడిని. మామూలుగా అయితే మళ్ళీ రానని ప్రసాదం పెడుతున్నారని ఫోను చేసి పిలిచింది. పరుగుపరుగున వెళ్ళాను. అక్కడికి వచ్చిన జంటలు అందరూ తాము తెచ్చిన ప్రసాదం అందరికీ పంచారు. నాకు అలా బాగానే గిట్టుబాటు అయ్యింది లెండి.  నేను ఓ గంట సేపయినా వ్రతంలో పక్కన కూర్చున్నందుకు మా ఆవిడా సంతోషించింది - తిండి గిట్టుబాటు అయినందుకు నేనూ సంతోషించాను.

ఆ తరువాత కొన్ని రోజులకి మా చుట్టాలతో మా అనిత మాట్లాడుతూ ఈ సారి వ్రతంలో శరత్ కూడా కూర్చున్నాడు అని చెప్పింది. అది విని నేను నన్ను చీట్ చేసి తీసుకెళ్ళింది అని వారికి చెప్పాను. కదా! అలా వ్రతాలకు కూడా లంచం ఇవ్వడం అవినీతి కాదూ?       

9 comments:

  1. శరత్ గారు
    పంచేంద్రియాలతొ ప్రత్యకంగా అనుభూతమై, హేతువాదానికి నిలువబడెదె "సత్యం" గా పాశచ్హాత్యమ్ యెంచుకొన్నది

    సార్ ఈ వాక్యాలు శ్రీరామక్రిష్ణపరమహంస గారి జీవితచరిత్ర నుంచి.
    మీరు ఎన్నొ పుస్తకాలు చదువుతారు మీకు వీలుకుదిరితె శ్రీరామక్రిష్నగారి కథామ్రుతమ్ చదవగలరు.
    మీకు చాలసమాధానాలు దొరుకుతాయ్.
    ఒకదానికి మిమ్ములను నేను ఆభినందిస్తాను మిరు నమ్మినదానిని ఆచరనకు ప్రయత్నిస్తారు.

    ReplyDelete
  2. ఐనా ఎప్పుడో సంవత్సరినికోసారి కూడ సతీసమేతంగా పూజలో పాల్గోపోతే ఎలా మాస్టారు. పూజ పునస్కారాలు మీకు ఇస్టం లేకపోయినా, మీతో కలిసి చేస్తే అదో తుత్తి ఆమెకి, మంచి పని చేసారు మీ ఆవిడ :D

    ReplyDelete
  3. శరత్ గారు...
    మీ టపాలలో శైలి, కథనం, హాస్య స్ఫోరకత చక్కగా మేళవిస్తారు. అభినందనలు.
    రామకృష్ణ

    ReplyDelete
  4. గురువు గారు, ఆ మధ్య భార్య విధేయుడినని అన్నారు మరి ఫుడ్ కోసం వెళ్లానని అంటున్నారేంటి? భార్య కోసం కాదా? ఇంకొక సారి మీరు రూల్స్ రివైజ్ చేసుకోవాల్సిందేనేమో.

    ReplyDelete
  5. Sharad: as an atheist myself, I can appreciate the sacrifice you make for your family sitting through the torture :)

    "అలా వ్రతాలకు కూడా లంచం ఇవ్వడం అవినీతి కాదూ?" No, Hindu religion is in fact nothing but a collection of bribes. All rituals are essentially bribes (swaha) offered to various "gods"

    ReplyDelete
  6. @ రమేశ్
    మీ సూచనకి ధన్యవాదాలు. ఎన్నో తెలుగు పుస్తకాలు చదవాలనే వుంటుంది కానీ ఇక్కడ అవన్నీ లభ్యం కాక నిరుత్సాహపడుతుంటాను.

    @ గాయత్రి
    మరి నా తుత్తి సంగతో :)

    @ రామక్రిష్ణ
    ధవ్యవాదాలండీ. అప్పుడప్పుడయినా ఇలాంటి మెచ్చుకోళ్ళు చూడకపోతే ఏం వ్రాస్తాము లేబ్బా అనిపిస్తుంది.

    ReplyDelete
  7. @ అజ్ఞాత
    భార్యకీ, తిండీకి మధ్య కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు తిండే గెలుస్తుంది అని డార్విన్ లాంటి ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఏవరో సెలవిచ్చినట్లుగా గుర్తు. మానవ మనుగడకి అవి సర్వైవల్ ఇన్స్టింక్ట్స్. దానికి ఆలోచించాల్సిన పనిలా. తిండి పోతే దొరకదు, పెళ్ళాం ఎక్కడికి పోతుంది లెద్దూరూ. అదే (పెళ్ళాం కాని) ప్రియురాలు అయితే అప్పుడు ప్రాధాన్యతలు వేరేలావుంటాయి :) ఎందుకంటే ఆ ప్రియురాలు పోతే మళ్ళీ దొరకడం కష్టం మరీ.

    @ జై
    అవును లెండి. భక్తులు దేవుడికి సమర్పించే కానుకల్లో చాలావరకు లంచాలే కదా. ఎంతమంది నిస్వార్ధంగా సమర్పిస్తారు?

    @ శ్రీకాంత్
    :))

    ReplyDelete
  8. :) నాస్తికుడి నారాయణ వ్రతం టైటిల్, మీ వ్యాఖ్యానం.. రెండూనూ.. బాగున్నాయి.

    ReplyDelete