పెద్దల, పిల్లల నేర చట్టాల గురించి తెలుసుకున్నాం

నిన్నటి పౌర పోలీసు శిక్షణలో పెద్దల చట్టం గురించీ, పిల్లల చట్టం గురించీ వివరిస్తూ వాటిల్లోని కొన్ని తేడాలను  వివరించింది లేడీ ఆఫీసర్. ఆమె సివిల్ దుస్తుల్లో వున్నా కూడా నడుముకి పిస్టల్ పెట్టుకొని డైనమిక్ గా అనిపించింది. ఆమె కాస్త అందంగానే వుండటంతో ఆమె లెక్చర్ వింటున్న నాకు ఉత్సాహంగా అనిపించింది. ఆమె పోలీసు అనుభవాలు రంగరించి ఉపన్యాసం ఇచ్చింది. మధ్యలో మమ్మలందరినీ నాలుగు గ్రూపులుగా వివరించి ఒక్కో గ్రూపుకీ ఒక్కో కేస్ స్టడీ ఇచ్చి అవి పరిష్కరించమని కోరింది. తరువాత అందరికీ ఇచ్చిన కేస్ స్టడీలకు వివరణలు ఇచ్చింది. 

మా పక్క గ్రూపుకి ఆసక్తికరమయిన కేస్ స్టడీ వచ్చింది. అది ఆ ఆఫీసర్ నిజ జీవిత అనుభవం అట. ఒక కారు వెళుతుండగా ఆమె పట్టుకుంటే అందులో మత్తు మందులు దొరికాయి. ఎవరూ కూడా అవి మావి కాదు అంటే మావి కాదు అంటున్నారంట. మరి ఎవర్ని అరెస్టు చెయ్యాలి? అందర్నీనా? కుదర్దు. ఎందుకంటే అందులో ఒకరు పది నెలల పసి బాలుడు! సరే ఆ అబ్బాయిని వదిలేద్దాం కానీ మరి ఎవర్ని అరెస్ట్ చెయ్యాలి. ఆ మత్తు మందులు ఎవరి దగ్గర వున్నాయో వారిని. కదా. అవి ఆ అబ్బాయి సీటు కింద వున్నాయిట మరి. ఇప్పుడు? అందరం తలా ఒక సమాధానం చెప్పాం. ఆమె మాత్రం మిగతా ముగ్గురినీ అరెస్ట్ చేసేసిందిట.  అందులో ఖచ్చితంగా ఎవరి తప్పువుందో తేల్చే బాధ్యత తనది కాదనీ అది లాయర్ల, న్యాయాధీశుల మరియు జ్యూరీల యొక్క బాధ్యత అని తేల్చివేసింది.

జూవనైల్ లా గురించి చెబుతూ ఒక దృష్టాంతరం చెప్పింది. ఒక రోజు 911 కాల్ వస్తే ఒక ఇంటికి వెళ్ళిందిట. అక్కడ పదహారేళ్ళ అమ్మాయి తన తండ్రిని అప్పటికప్పుడు అరెస్ట్ చెయ్యమని డిమాండ్ చేస్తోందిట. ఎందుకంటే ఆ తండ్రి ఆ అమ్మాయి చెంప మీద చాచి ఒక్కటి కొట్టాడంట.  ఎక్కడ కొట్టినా దాదాపుగా ఓకే కానీ తల భాగం మీద కొడితే మాత్రం సీరియస్ కేస్ అవచ్చు. క్రమశిక్షణ కోసం అయినా కూడా ఇక్కడి పిల్లలని తల మీద మాత్రం కొట్టవద్దు. ఇక్కడి తల్లితండ్రులూ గుర్తుంచుకోండి!  ఇక్కడి చట్టం ప్రకారం ఆ తండ్రి చేసింది నేరమే...కానీ... అంతకు ముందే ఆమె చెప్పింది... చట్టం శిలా శాసనం కాదని! దాని ఎవరు నిర్వచిస్తున్నారు అనే దాన్ని బట్టి అర్ధం మారిపోతుంది. పోలీసు అధికారులు, లాయర్లు, జడ్జిలు, జ్యూరీలు అలా తలా ఒకరకంగా చట్టాన్ని నిర్వచించవచ్చు. అలా అని మరీ అడ్డంగా నిర్వచిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి కానీ ఎవరికి వారు తమ విచక్షణా శక్తిని సరిగా వినియోగించాలి. పిల్లల విషయం కాబట్టి పిల్లల సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ఇక్కడ ఆమె తన విచక్షణాధికారం వినియోగించి ఆ తండ్రికి మీ అమ్మాయిని మీరు ఇంకా గట్టిగా చెంప దెబ్బ కొట్టాల్సి వుండింది అని సలహా ఇచ్చిందిట. ఎందుకంటే ఆ 911 కాల్ వచ్చింది రాత్రి మూడు గంటల తరువాత. అప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని మీ నాన్న ఎందుకు కొట్టాడూ అని అడిగితే మా నాన్న రోజూ 9 గంటల వరకల్లా ఇంటికి రమ్మంటాడు కానీ ఈ రోజు వచ్చేసరికి   రాత్రి మూడు అయ్యింది. అందుకే కొట్టాడూ అని చెప్పిందిట. ఆ అమ్మాయి రాత్రి మూడింటి వరకూ బాయ్ ఫ్రెండుతో తిరిగి వస్తోంది మరి. అందుకే ఆ తండ్రికి ఆ సలహా ఇచ్చి చక్కా వచ్చింది మా ఆఫీసర్. లెక్క ప్రకారం అయితే, చట్ట ప్రకారం అయితే ఆ తండ్రిదే తప్పు కానీ పరిస్థితులు కూడా గమనించుకోవాలని పిల్లల చట్టంలో వుంటుందిట.  

3 comments:

  1. Sarat garu

    Mee Roku box ela undi. memu order cheddamanukuntunnam. meeru yupp lonchi order chesera. konchem telupagalaru.
    Also, mee 50K savings progress ela undo telupagalaru.

    Thanks

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    రోకు బాక్స్ చక్కగా పనిచేస్తోంది. మేము డైరెక్టు గానే తీసుకున్నాం.

    50 కే సంగతి ఏడ్చినట్టుగానే నడుస్తోంది. అసలిక్కడ ఎకానమీ రోజురోజుకీ దరిద్రంగా అవుతోంది కాబట్టి ఎడ్వెంచర్లు ఏమీ చెయ్యదలుచుకోలేదు. అలా ఆ లక్ష్యం పడకేసింది.

    ReplyDelete
  3. Very interesting posts. I ppreciate you for these posts.

    >> కానీ ఎవరికి వారు తమ విచక్షణా శక్తిని సరిగా వినియోగించాలి.

    అవునండీ ఎక్కడైనా జరగాల్సింది ఇదే. కాకపోతే, విచక్షణా అధికారాన్ని డబ్బుకు అమ్ముకుంటే ఎంచక్కా నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకునె వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ చట్టాలూ వ్యవస్థలూ నాశనమవటం ఎక్కువవుతుంది.

    ReplyDelete