కైరోప్రాక్టిక్ మీద పుస్తకం

అంతర్ముఖి పుస్తకం ప్రూఫ్ రీడింగ్ అయిపోయి చివరి దశ ఎడిటింగులో వుంది. బ్లాగుల మీది పుస్తకం కొన్ని కారణాలవల్ల ప్రస్థుతానికయితే పక్కన పడేసాను. 

ఇక పై కైరో మీద పుస్తకం వ్రాయదలుచుకున్నాను. అందు గురించి ముందుగా ఈ బ్లాగులో వరుసగా టపాలు వెలువడుతాయి.  మీలో ఎక్కువమందికి ఆ టాపిక్ మీద ఆసక్తి లేదనుకుంటాను కానీ తెలుగు వారికి చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన లేదు కాబట్టి ఈ పుస్తకంతో అది పరిచయం చెయ్యబోతున్నాను.  కైరో వల్ల మాకు ప్రయోజనాలు కలుగుతున్నాయి కాబట్టి అది పదిమందికీ ఉపయొగపడవచ్చనే  ఉద్దేశ్యంతో ఈ పుస్తకం కోసం ఉపక్రమిస్తున్నాను. కైరో తో మాకు కలిగిన అనుభవాలు కూడా వరుసగా పొందుపరుస్తాను కాబట్టి ఒక రియాలిటీ పుస్తకంగా కూడా అవుతుంది. ఒకవేళ మేము ఆశించిన ప్రయోజనాలు సమకూరకపోయినా అందులో తెలియజేస్తాను.

ఇందువల్ల కలిగే ప్రయోజనాలతో పాటుగా దీని మీద వున్న విమర్శలు, అపోహలు కూడా వివరిస్తాను. ఇందులో జరిగే మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నాకు తెలిసినంత వరకు పొందుపరుస్తాను. మీరు ఎవరయినా నిర్మాణాత్మక వ్యాఖ్యల ద్వారా ఈ విషయానికి సహకరించినా అవి పొందుపరుస్తాను.

4 comments:

 1. hi sir, this is latha from hyd.
  anitha gari lage naku backpain.
  enni hospitals ki tirigana palitam ledu. meru cheppe kiro practic treatment hyd. lo unnada? please dani gurinchi vivaralu cheppandi.
  thanking you.

  ReplyDelete
 2. @ లత
  హైదరాబాద్ కైరోప్రాక్టర్స్ గురించి వెతికితే ఈ లింకులో వున్న రెండు రిజల్టులు మాత్రమే వస్తున్నాయి. ఆయా సెంటర్ల పేర్ల మీద నొక్కితే వాటి యొక్క వివరాలు వస్తాయి. ఒక పోస్ట్ వేసి హైదరాబాదులో కానీ ఏపి లో గానీ ఎవరయినా వున్నారేమో కనుక్కుంటా.
  http://yellowpages.sulekha.com/hyderabad/health-services-medicine/clinics-doctors/chiropractors/33.htm

  మిగతావాటికేమో కానీ, నొప్పులకీ, ముఖ్యంగా బ్యాక్ పెయిన్స్ కీ ఈ కైరో బాగా పనిచేస్తుందని చాలామంది వీర్శకులు కూడా అంగీకరిస్తారు. అందువల్ల మీరు ఈ ప్రయత్నం తప్పకుండా చెయ్యవచ్చు.

  http://www.lifepositive.com/practitioner/SearchResults/Practitioners_Chiropractic%20Care_India.asp

  ReplyDelete
 3. @ లత
  Sanjeevini Yoga Clinic, Hyderabad
  040-65504229
  Road No.16, Himyathnagar Banjara Hills Hyderabad - 500034

  Sanjeevini Yoga Clinic has provide the best services and facilities. It has most popular yoga clinic in Hyderabad. It is situated in the Banjara Hills, Hyderabad City. It has offer best treatment for neck, knee and back pain, diabetes mellitus, high blood pressure, gastric, intestinal, urinary and menstrual problems, allergies, psoriasis, paralysis, migraine and giddiness. Color therapy, Acupressure, acupuncture, chiropractic manipulations, osteopathy, hydrotherapy, yoga, pranayama and meditation, aerobics, pre and post natal exercises and memory power increasing techniques are the other methods of treatment that are followed here.

  ReplyDelete
 4. namesthe sir.
  meeru echina phone no. pani cheyadam ledu. meeru cheppina vivaraluto try chesthunnanu.
  thanking u.

  ReplyDelete