గత కొద్ది నెలలుగా రోజూ ఉదయమే బరువు చూసుకుంటున్నాను. కొన్ని సార్లు పడుకునేముందు కూడా చూసుకుంటుంటాను. కొద్ది రోజుల క్రితం ఓ శుక్రవారం రాత్రి పడుకునేముందు బరువు చూసుకున్నాను. ఉదయం అయిదు గంటలకే మెలకువ వస్తే బరువు చూసుకున్నాను. రాత్రి కంటే ఒక కేజీ తగ్గింది. సాధారణంగా రాత్రికీ, ఉదయానికీ నా బరువు ఓ అరకేజీ తగ్గుతూ వుంటుంది కానీ ఈ రోజుల్లో ఓ కేజీ తగ్గుతున్నానేమోలే అనుకున్నా. ఈమధ్య బాగా వ్యాయామం చేస్తున్నా కదా, మెటబాలిజం బాగా ఎక్కువయి వుంటుంది - అందుకే అంతగా తగ్గానేమో అని సరిపెట్టుకున్నా. శనివారం కాబట్టి ఆఫీసు లేదు కాబట్టి మళ్ళీ పడుకొని తొమ్మిదింటికి లేచి మళ్ళీ బరువు చూసుకున్నా. ఇంకో అరకేజీ బరువు తగ్గాను. బాప్ రే బాప్. ఒక్క రాత్రిలో ఒకటిన్నర కేజీలు తగ్గాను. నాకు మూర్ఛ వచ్చినంత పనయ్యిది కానీ సంబాళించుకున్నా.
ఏం మెటబాలిజం ఏమో కానీ మరీ ఇలా కేజీలకు కేజీలు నా బరువు తగ్గితే ఇహ నాలో మిగిలేది ఎముకల గూడే అని వణికిపోయి ఆ రోజు అడ్డమయిన ఫుడ్డు అంతా తిని బ్యాలన్స్ చేసేసా. అంతటి మెటబాలిజం మంచిదో కాదో నాకు అర్ధం కాలేదు. ఇన్నాళ్లకి అర్ధమయ్యింది - మంచిది కాదని. బాడీ బ్యుల్డింగ్ మీద నెట్టులో రెసెర్చ్ చేస్తుంటే తెలిసింది - బరువు బాగా తగ్గడమూ, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు ఓవర్ ట్రైనింగ్ అనగా ఎక్కువగా బరువులు ఎత్తడం లక్షణాలు అని తెలిసివచ్చాయి. అది మంచిది కాదుట.
బరువు బాగా తగ్గుంతున్నానేంటా అని నా వ్యాయామం గురించి వ్రాస్తూ వాపోతూనేవున్నా కానీ ఒక్కరూ ఓవర్ ట్రైనింగ్ కావచ్చునేమో అని సూచించలేదు. ఏవయినా పొరపాట్లు చేస్తుంటే తెలుస్తుంటాయనే ఇలాంటివన్నీ నా బ్లాగులో వ్రాస్తుంటాను. గుడ్డెద్దు చేలో పడ్డట్లు జిమ్ము చేయడం మాత్రమే కొందరికయినా తెలిసివుంటుంది కానీ ఇలాంటి జాగ్రత్తలు పెద్దగా ఎవరికీ తెలిసినట్లు లేదు. తెలిసివుంటే చెప్పేవారేమో. తెలిసినా శరత్ ఖర్మ శరత్తుది అని వదిలేసారేమో మరి. మిగతావారికయినా ఓవర్ ట్రైనింగ్ లాంటిది ఒకటుంటుందని తెలియజేద్దామనే ఈ టపాలు వ్రాస్తూంట.
బరువు బాగా తగ్గుంతున్నానేంటా అని నా వ్యాయామం గురించి వ్రాస్తూ వాపోతూనేవున్నా కానీ ఒక్కరూ ఓవర్ ట్రైనింగ్ కావచ్చునేమో అని సూచించలేదు. ఏవయినా పొరపాట్లు చేస్తుంటే తెలుస్తుంటాయనే ఇలాంటివన్నీ నా బ్లాగులో వ్రాస్తుంటాను. గుడ్డెద్దు చేలో పడ్డట్లు జిమ్ము చేయడం మాత్రమే కొందరికయినా తెలిసివుంటుంది కానీ ఇలాంటి జాగ్రత్తలు పెద్దగా ఎవరికీ తెలిసినట్లు లేదు. తెలిసివుంటే చెప్పేవారేమో. తెలిసినా శరత్ ఖర్మ శరత్తుది అని వదిలేసారేమో మరి. మిగతావారికయినా ఓవర్ ట్రైనింగ్ లాంటిది ఒకటుంటుందని తెలియజేద్దామనే ఈ టపాలు వ్రాస్తూంట.
అయ్యా, అదీ సంగతి. ఒక్క బరువు లెత్తే విషయానికే కాకుండా ఏ రకమయిన వ్యాయామానికయినా ఓవర్ ట్రైనింగ్ వుంటుందంటున్నారు. మరీ అత్యుత్సాహంతో దాని బారిన పడకుండా కాస్త జాగ్రత్త పడండి. దాని యొక్క లక్షణాలు క్రితం టపాలో వ్రాసాను. చాలా సార్లు జిమ్ములో చేరినా కూడా నేను మానివెయ్యడానికి ఇదే కారణభూతం అయివుండవచ్చు! మానసిక మాంద్యం, ఆందోళన, నిరాసక్తత, వ్యాయామానికి వెళ్ళాలనిపించకపోవడం లాంటి లక్షణాలు కూడా ఒవర్ ట్రైనింగ్ లక్షణాలంటా. కొద్దిరోజులు వీరోత్సాహంతో విపరీతంగా జిమ్ముచేసి అది మూలకు పడేయ్యడానికి బహుశా అదే కారణం అయ్యుంటుంది. మీరు కూడా జిమ్ముకో, వ్యాయామానికో మొరాయిస్తుంటే ఆ సమస్యేమో చూసుకోండమ్మా.


5 comments:
1. మెటాబలిజం అంటే తిన్నది అరిగించుకోవడం. దీనివల్ల అరిగించుకున్న ఆహారం వొంట్లో చేరాల్సిన చోట చేరి అవసరమైనట్టుగా వినియోగం అవుతుంది. అందులో కొంత కండరాలుగాను, కొవ్వుగానూ నిక్షేపం కూడ అవుతుంది - it also adds mass to the body. అంచేత మెటాబలిజం కేవలమూ బరువు తగ్గించే ప్రక్రియ కాదు.
2. రాత్రినించి పొద్దుటికి బరువు తగ్గడం బహుశా నీటి వల్ల అవ్వచ్చు. మూత్రం ద్వారానే కాక చెమట ఆవిరి ద్వారా కూడా వొంట్లోని నీరు చాలా ఖర్చవుతుంది. చెమట పట్టిందే అనిపించనక్కర్లేదు. మెదలకుండా హాయిగా కూర్చున్నప్పుడు కూడా వొంట్లోంచి నీరు ఆవిరి అవుతూనే ఉంటుంది. ఆ మేరకి బరువు తగ్గుతూనే ఉంటారు.
అనబాలిజం మరియు కేటాబోలిజం కలిపి మెటబాలిజం అంటారు. ఇందులో మనం తిన్నదానిని జీర్ణం చేసి ఆ జీర్ణమయిన దానిని మనకి శక్తి కింద మార్చి కావలసినది వెంటనే ఇచ్చి మిగతాది దాచుకునే ప్రక్రియని మరియు మనకి జ్వరం వచ్చినప్పుడు లంఖణాలు చేస్తాం కదా అప్పుడు మనకి శక్తి ఈ దాచుకున్న దాని నించి వస్తుంది ఈ ప్రక్రియని రెంటినీ కలిపి మెటబాలిజం అంటారు.
ఇహ రాత్రి నించి పొద్దున్నకి బరువు తగ్గడం అనేది మాములుగా జరిగే ప్రక్రియే అర కేజీ నించి కేజీ తేడా ఉండటం సహజమే. మనం తిన్న వెంటనే బరువు చూసుకున్నా కూడా మాములుగా ఉండే దానికన్నా అరకేజీ నించి కేజీ తేడా చూపిస్తుంది. ఇహ ఎక్కువగా వ్యాయామం చేసిన తరువాత శరీరానికి బాగా విశ్రాంతి అవసరం అలానే ప్రోటీన్లు తప్ప మిగతా ఆహారం తీసుకుంటే ఇలాంటి తేడాలు వచ్చే అవకాశం చాలా ఉంది. వ్యాయామం బాగా చేసి అలసిన తరువాత ప్రోటీన్లు మాత్రమే ఇవ్వడం వలన కండరాలు బాగా పెరిగి మనం అనుకున్న చోట శరీరాన్ని పెంచచ్చు అలానే తగ్గించచ్చు. అటువంటి సమయంలో వాటికి చాలా విశ్రాంతి అనేది తప్పనిసరి. ఇవేమీ పాటించకుండా వ్యాయామం కేవలం గంట చేసినా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
@ @ కొత్తపాళీ, రసజ్ఞ
మెటబాలిజం గురించి:
There are many benefits to increasing your metabolism. You can have an increase in energy through out the day, you'll sleep much better and probably the most important health benefit of all is you will lose weight and then be able to keep that weight off. And here's a benefit most people don't think about. By simply increasing your metabolism you will burn more calories even when you are sleeping.
Article Source: http://EzineArticles.com/444803
Exercise is widely regarded as the most prominent way to increase metabolism and certainly the most natural of ways to increase metabolism. Carbohydrates that we consume are broken down by our body as and when it requires energy. This is the body's initial source of energy, after breaking down the carbohydrates it will then break down fat and lastly protein. All of these are broken down in order to provide fuel for the body. Excess carbohydrates are converted into body fat joining the fat that you consume that is also initially compounded into body fat. By taking part in regular and efficient exercise the fat that is stored can be burned quickly and thus increase your metabolism. Without exercise the fat will just build up and you will be subjected to a slower metabolism.
http://www.metabolism-boosting-foods.com/increase-metabolism.php
@ కొత్తపాళీ, రసజ్ఞ
రాత్రి బరువు తగ్గుదల గురించి:
రాత్రి తగ్గే బరువు విషయమై మీరు చెప్పినవి సరి అయినవే అయినప్పటికీ నా శారీరానికి ఒక రాత్రికి ఒక అరకిలో చుట్టుపక్కల తగ్గడం సాధారణ విషయం. అది ఒకటిన్నర కేజీలు అయితే అసాధారణం. అందుకు కారణం అతి వ్యాయామం వలన పెరిగిన అతి మెటబాలిజం కారణం అని విశ్వసిస్తున్నాను. కార్డియో వ్యాయామాలు చేస్తున్నంత సేపు మాత్రమే బరువు తగ్గుతాం. వెయిట్ వ్యాయామాలు చేసినప్పుడే కాకుండా ఇంకా 48 గంటల పాటు బరువు తగ్గుతూనే వుంటాం.
అన్నట్లు ఈమధ్య వెయిట్ ట్రైనింగ్ తగ్గించి ఓవర్ ట్రైనింగ్ తగ్గించాను. అలా బరువు పెంచాను. ఇప్పుడు నా బరువు 56 కిలోలు. ఇంకో రెండు కేజీలు పెంచి ఆపేస్తాను. మొత్తమ్మీద ఎల్లప్పుడూ 60 కి పెరగకుండా చూస్తాను. 58 - 60 బఫర్ జోనుగా వుంటుంది. వారాంతం ఆహార జోనుగా కూడా అది ఉపయోగపడుతుంది :) ఎందుకంటే వారాంతం ఆహార నియంత్రణ చెయ్యడం కాస్త కష్టం కాబట్టి ఆ వెసులుబాటు వుంచాను.
@ఒక్క రాత్రిలో కేజీన్నర తగ్గానని చెప్తున్నరు గానీ...రా.......................త్రంతా ఏం చేస్తున్నారో బయట పెట్టడడం లేదు...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి