బుధవారం 24 ఆగస్టు 2011

వ్యాయామానికి వారం విరామం

బాడీ బ్యుల్డింగ్ మీద వెయిట్ లిఫ్టింగ్ మీద ఆర్టికల్స్ చదివినప్పుడు చేస్తున్న వ్యాయామాలు ఓవర్ ట్రైనింగ్ కాకుండా 5,6 వారాలకు ఒకసారి అయినా ఓ వారం విరామం ఇస్తే బావుంటుందని తెలుస్తోంది. ఈమధ్య నా విషయంలో కాస్త ఓవర్ ట్రైనింగ్ అనగా ఎక్కువ కష్టపడటం జరిగింది కాబట్టీ మరియు ఈమధ్య జిం మొదలెట్టి 6 వారాలు అవస్తోంది కాబట్టీ వ్యాయామానికి ఓ వారం విరామం ఇస్తున్నాను. ఇలాంటి విరామమే మిగతా అన్ని రకాల వ్యాయామాలకూ అవసరమా లేదా అన్నది నాకు తెలియదు కానీ అలా వ్యవధి ఇస్తే బావుంటుందనుకుంటా.  మోనాటనీ అనిపించకుండా, బోర్ కొట్టకుండా మళ్ళీ కొత్త ఉత్సాహంతో వ్యాయామాలు చెయ్యడానికి అది ఉపకరిస్తుంది. మీరు వారాల కొద్దీ వరుసబెట్టి వ్యాయామాలు చేస్తున్నవారయితే ఓ వారం విరామం మీకూ మంచిదేమో చూడండి.

వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు కండరాలు అలసిపోతాయి, వాటిల్లోని ఫైబర్ గాయపడుతుంది కాబట్టి అవి మళ్ళీ రికవర్ అవడానికి ఓ రెండు రోజులయినా పడుతుంది. అందుకే అలాంటి వ్యాయామాలు రోజు విడిచి రోజు చెయ్యమంటారు. అలాగే వారానికి ఓ రెండు రోజులు విశ్రాంతి ఇమ్మంటారు. అప్పటికీ మానని కండరాల ఇబ్బందులు ఏమయినా వుంటే ఇలా అయిదు ఆరు వారాల కొకసారి ఓ వారం జిమ్ముకి వెళ్ళకుండా వుంటే అవి పూర్తిగా విశ్రాంతి పొంది బాగా పుంజుకుంటాయి. మళ్ళీ ఉవ్విళ్ళూరుతూ వెయిట్ లిఫ్టింగ్ మొదలు పెట్టవచ్చు. అలా కాకుండా వరుసగా బరువులు ఎత్తుతూపోతే కండరాలు అలవాటు పడిపోయి వృధా శ్రమ తప్ప పెద్దగా ప్రయోజనం వుండదు.

ఇలా వ్యాయామం చెయ్యని సమయాన్ని ఎంచక్కా ఎప్పటినుండో వాయిదా వేస్తున్న ఇతర పనులు చక్కపెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.   ఇలా వ్యవధి ఇస్తేనే మళ్ళీ జిమ్ముకి వెళ్ళేది ఎప్పుడా అని ఆత్రంగా వుంటుంది. మళ్ళీ జిమ్ముకా అనే నిరాసక్తత వుండదు.  నాకయితే ఫుల్లు స్వింగులో వున్న ఎక్సర్సైజుకి ఇలా గ్యాప్ ఇవ్వాల్సిరావడం అసహనంగా వుంది. మళ్ళీ ఎప్పుడు జిమ్ము గడప ఎక్కాలా అని ఆత్రంగా వుంది. ఈ ఆత్రాన్ని పెంచడానికేనేమో అలా ఓ వారం దూరంగా వుండమంటారు. ఆలుమగల మధ్య ఆషాఢమాసం లాగా నాకు ఈ వారం వ్యవధి తయారయ్యిందన్నమాట. ఈలోగా ఎంచక్కా నా బరువు టార్గెట్ సాధించొచ్చు. ఇప్పుడు 56 కిలోలు వున్నాను. ఈ వారాంతం లోగా ఇంకో రెండు కిలోలు పెరగాలి.

7 comments:

అజ్ఞాత చెప్పారు...

గురూగారూ, కాసేపు మీ వ్యాయామానికి, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ కి బ్రేక్ ఇవ్వండి...మీ ఆర్టికల్స్ మరీ "శ్యాం బెనగళ్" సినిమాల్లా ఉన్నాయి..అర్ధం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ..కానీ చూడ్డానికే చికాకొస్తుంది...

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
హ హ. నేను వ్రాసేవి అర్ధం చేసుకోగలిగే వారికేలెండి. జీవితాన్ని ఓ సినిమాగా లైటుగా తీసుకునేవారికోసం కాదు కదా. ఇంకో విధంగా చెప్పాలంటే నా కోసం నేను వ్రాసుకుంటాను. అలా వ్రాసుకోవడం వల్ల నా భావాల్లో, ఆలోచనల్లో స్పష్టత ఏర్పడి ఆచరణలో మరింత ముందడుగు వెయ్యడానికి వీలవుతుంది.

ప్రజాదరణ పొందే టపాలు కూడా వ్రాయొచ్చును కానీ ఇప్పుడు అంత ఆసక్తి లేదు.

అజ్ఞాత చెప్పారు...

@agnatha: hahahahhahahhahahahahaha on syam benegal movies.nenu okka movie kuda chudaledu ayanadi, kani mee comment chusaka chudalanipistondi.

అజ్ఞాత చెప్పారు...

annay...koncham Masala Tapalu rayochuu kada...roju emina masala tapalu vunava leva ani chusi ...lekapovadam valla ne blog close chesthunna...

అజ్ఞాత చెప్పారు...

chusara sarat garu,mee kottha spoorthi nunchi mallinchataniki entha mandi try chestunnaro.chuddam taggutaro, taggaro. nakaite mee ee atma sakshatkaram baga nachindi.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత @ 29 ఆగస్టు 2011 2:00 సా
ఎందుకో అంతగా అర్ధం కావడం లేదు కానీ రోజురోజుకీ నేనూ మిగతా అందరు బ్లాగర్ల లాగా అయిపోతున్నా అనిపిస్తోంది. మసాలా అందరి జీవితాల్లోనూ వుండేదే కదా అని వ్రాయడం లేదు. ఏవయినా విభిన్నగా చేస్తుంటే అవి పంచుకుంటేనే కాస్తొ కూస్తో సార్ధకత వుంటుంది. కుటుంబ బాధ్యతలు వగైరాల వల్ల పలు ఆసక్తులు వున్నా అవి అమలు పరిచే సమయం లేకపోతోంది. నెమ్మదిగా వెసులుబాటు చేసుకుంటున్నాను. చూద్దాం - కొద్ది వారాల్లో.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత @ 29 ఆగస్టు 2011 2:52 సా
నా జీవితం ఒకే దగ్గర ఎప్పుడూ ఆగిపోదండీ. పడుతూ లేస్తూ అయినా సరే పరుగులెత్తుతూనే వుంటుంది. ఎన్నటికీ మారనిది మార్పు ఒక్కటే కదా. అ మార్పులో భాగంగా మళ్ళీ మొదటికే రావచ్చు కూడానూ. ప్రస్థుతానికి సంధి కాలంలో వున్నాను. నా పయనం ఎటు మళ్ళుతుందో తెలియదు. దాన్ని బట్టే నా వ్రాతలూ వుంటాయి.