కారు వీల్ బ్యాలన్సింగ్ లాంటి మన కాళ్ళ బ్యాలన్సింగ్

మన కారుకి అప్పుడప్పుడు వీల్ బ్యాలన్సింగ్ చేయిస్తూ వుండాలి కదా. మరి మన కాళ్ళ బ్యాలన్సింగ్ గురించి ఎప్పుడయినా ఆలోచించారా? రెండు వారాల క్రితం కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు వాళ్ళు నా కాళ్ళు బ్యాలన్సులో లేవు అని చెప్పినంతవరకూ, ఆ తరువాత ఎక్సురేలలో చూసేంతవరకూ నాకు ఆ స్పృహేలేదు. జనాల్లో కొంత శాతం మందికి కాళ్ళ ఎత్తు సరిసమానంగా లేకపోవడం సాధారణమే. అయితే వాటిని సరి చేసుకోకపోతే పలు ఇబ్బందులు తల ఎత్తవచ్చు. ప్రస్థుతానికి మీకు సమస్యలు లేకపోయినా ముందు ముందు సమస్యలు రావచ్చు. శరీరంలో, కీళ్ళలో పలు భాగాల్లో నొప్పి తదితర సమస్యలు రావచ్చు. మీకు ఇప్పటికే అటువంటి సమస్యలు వుంటే మీకు ఈ సమస్య వుందేమో సరిచూసుకోవడం మంచిది. మీకు ఏ సమస్య లేకున్నా కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే నిగూఢమయిన సమస్యలు తెలిసే అవకాశం వుంది.
 
కొన్ని వివరాలకు ఈ క్రింది ఆర్టికల్ చూడండి:
 
కాళ్ల ఎత్తు సమానంగా లేకపోతే శరీరం అందుకు బ్యాలన్సు చేయడానికి కష్టపడుతూ పెల్విక్ ఎముకనూ, వెన్నెముకనూ వంకర చేస్తుండవచ్చు. అలా అలా వెన్నుముకలొ ప్రధమ మరియు ప్రధానమయిన ఎముకలు అట్లాస్ ఎముకలని కూడా వంకర చేస్తుండవచ్చు. అట్లాస్ ఎముకలు మెదడు క్రింది భాగంలో వుంటాయి. మెదడు కాండం వీటిమీద కుదురుగా వుంటుంది.    వీటి వంకరతనం వల్ల మెదడు కాండం మరియు దానినుండి వచ్చే నరాలూ ఒత్తిడికి గురి అయ్యి  పలు శారీరక, మానసిక సమస్యలు ఏర్పడుతాయి. ఒకవేళ అట్లాస్ ఎముకలే బ్యాలన్సులో లేకపోయినా అది బ్యాలన్స్ చేయడానికి మన శరీరం ఒకవేపే ఎక్కువగా పెరిగి అందువల్ల కాళ్ళ ఎత్తు కూడా పెరగవచ్చునట.
 
ఎత్తు కనుక్కున్నాక మీరు చెయ్యాల్సిందేమిటి? ఒక విధానం ఆ ఎత్తు తగ్గుదల సరిచేయడానికి మరోవైపు ఎత్తు పెంచడం. బూట్ల లోపట ప్యాడ్ లు పెట్టి ఎత్తు సరిచేయవచ్చు. అలా కాకుండా అసలు ఆ ఎత్తు హెచ్చుతగ్గులనే సరిచేయడం ఇంకో విధానం. నేను ప్రస్థుతం రెండవది ప్రయత్నిస్తున్నాను. అవసరమయితే కొద్ది వారాల ద్వారా ఆ ప్రయత్నాలకు తోడుగా మొదటి విధానం కూడా వాడుతాను. మన కారు చక్రాలలో హెచ్చు తగ్గులుంటే సరిచేయిస్తాము తప్ప ఒకవైపు ఎత్తు టైర్లు వెయ్యము కదా. ఇక్కడా అంతే కానీ కాళ్ళు సరికానప్పుడు ఎత్తు ప్యాడులు అయినా వాడాల్సి వుంటుంది.
 
నా పరిస్థితి చూసి నవ్వేసుకోకండి. ముందు మీ పరిస్థితి ఏంటో చెక్ చేయించుకోండి. వైద్యుడు చెప్పేదాకా నాలోని అసమానత్వం నాకు కూడా తెలిసిరాలేదు. మీకే కాక మీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ పరీక్ష అవసరం. మున్ముందు సమస్యలు  ముందే బయటపడవచ్చు లేదా నిద్రాణంగా వున్న సమస్యలు తెలిసిరావచ్చు. ఆర్థోపెడిక్ వైద్యుడిని అడిగితే ఈ పరీక్ష చేస్తుండవచ్చు.

Frieberg1 has determined that about 50% of the population have uneven leg length, but found that of the low back pain patients, 75% had leg length inequality of 5mm or more.

1Friberg, Ora. "Clinical symptoms and biomechanics of lumbar spine and hip joint in leg length inequality" Spine 1983


Credits: http://gwheellift.com/why-to-use-heel-lifts.html

2 comments:

  1. @కాళ్ల ఎత్తు సమానంగా లేకపోతే శరీరం అందుకు బ్యాలన్సు చేయడానికి కష్టపడుతూ పెల్విక్ ఎముకనూ, వెన్నెముకనూ వంకర చేస్తుండవచ్చు...................
    మళ్ళీ ఒకసారి కాన్సంట్రేట్ చేసి, ఎక్కడ నుండి చదివారో..జాగ్రత్తగా చూడండి...ఇంకా ఏమయినా వంకర చేస్తుందేమో...

    ReplyDelete
  2. @ kvsv

    ఏమోనండి. నేను చదివిన వాటిల్లో ఆ ప్రస్థావన ఏమీ లేదే :)

    ReplyDelete