కామెంట్లెయ్యడం కష్టమే సుమీ

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

వ్యాఖ్యానించడం అన్నది అన్ని సందర్భాల్లోనూ అంత సులభమేమీ కాదని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. బ్లాగులని మనం తీసుకున్నంత సీరీయస్సుగా అందరూ తీసుకుంటారని అనుకోవద్దు. ఆషామాషీగా అలా వచ్చేసి ఇలా ఓ చూపు చూసేసి వెళ్ళిపోయేవారుంటారు. వారిని ఆగండి కామెంటెయ్యండి అంటే దులిపించుకొని వెళ్ళిపోతారు. మీరు మరీ మొహమాటపెట్టేస్తే మన వైపు రాను కూడా రారు. ఇంతోటి టపాని చదవడమే ఎక్కువ ఇంకా కామెంటా, చాల్చేల్లేవయ్యా అని అనుకుంటారు కూడానూ. అంచేతా అలాంటి తీరికలేని మహా బ్యుజీ వ్యక్తులను దృష్టిలో వుంచుకొని మనమే కొన్ని ఏర్పాట్లు చేసి వుంచాలి మరి. ఓపిక వున్నా, తీరిక వున్నా కామెంటేసే మూడూ వుండాలి కదా. మరి ఆ మూడింటిలో ఏ ఒక్కటి ఎదుటివారికి లేకున్నా మనకు ఓ కామెంట్ పడదు కదా. మరి ఎలా? ఎదుటి వారి భావం తెలిసేది ఎలా?

అందుకే వున్నాయి రియాక్షన్స్. ప్రతి టపా క్రింద వచ్చేలా కొన్ని స్పందనలను మనం నిర్వచించవచ్చును. ఉదాహరణకు నా బ్లాగులో ప్రతి టపా క్రింద చాలా బావుంది, బావుంది, బాగోలేదు అనే గడిలు (చెక్ బాక్సులు) వుంటాయి. సులభంగా టపా మీద  అభిప్రాయం చెప్పాలనుకునేవారు ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. బ్లాగు సెట్టింగ్సులోకి వెళ్ళి టపా సెట్టంగ్సులో అలాంటి రియాక్షన్స్ నిర్వచించాల్సివుంటుంది. వీటివల్ల చదువరుల అభిప్రాయం మీకు సులభంగా చేరుతుంది. అటు వారికీ సులభంగా వుంటుంది. కష్టపడి కామెంటు వెయ్యనవసరం లేకుండా ఈజీగా ఇలా స్పందించేస్తారు. 

అయితే ఇందువల్ల స్థూలంగా చదువరి యొక్క అభిప్రాయం తెలుస్తుంది కానీ వివరంగా తెలియదు. అందువల్ల ఇలా రియాక్షన్స్ పెట్టామని అలా కామెంట్లు మూసుకోకూడదు. రెండూ ఉపయోగకరమే. వివిధ కారణాల వల్ల కామెంట్ల మీద చిరాకు ఎత్తేసి కొందరు బ్లాగర్లు కామెంట్లు మూసివేస్తారు. అలాంటప్పుడు కనీసం ఇలాంటి రియాక్షన్స్ అయినా వుంటే చదివిన వారి అభిప్రాయం అర్ధం అవుతుంది. 

అలా అని చెప్పి అందరూ సరిగ్గా తమ అభిప్రాయం వ్యక్తపరుస్తారనీ అనుకోలేము. ఎవరికయినా మీమీద కోపం వుందనుకోండి - మీ టపా బావున్నా బాగోలేకపోయినా బావోలేదనే స్పందిస్తారు. అలాగే మీ బ్లాగుకో లేక మీకో వీరాభిమానులు వుంటేనో లేక మీకు చాలా దగ్గరివారో అయితే టపా బాగాలేకున్నా సూపర్ అని స్పందించొచ్చు. ఈ స్పందనలు పరిశీలిస్తూ వుంటే అప్పుడప్పుడు మీకు జుట్టు పీక్కోవాలని కూడా అనిపిస్తుండొచ్చు. మనం వీర లెవల్లో వ్రాసామని, అందరికీ నచ్చుతాయని అనుకున్న టపాలకి చాలామంది చెత్తగా వుంది అనవచ్చు. లేదా మనం చెత్తగా వచ్చింది అనుకున్న టపా చాలామందికి నచ్చవచ్చు. అయితే కొన్ని సార్లు ఎన్నో కారణాల వల్ల ఎక్కువమందికి నచ్చని ఆంశం వ్రాస్తున్నప్పుడు వారి స్పందన ఎలా వుంటుందో ముందే ఐడియా వుంటుంది కాబట్టి అలాంటప్పుడు ఎక్కువమంది నచ్చలేదు అని అన్నా పట్టించుకోనక్కరలేదు. అయితే చక్కని ఆంశం తీసుకొని వ్రాస్తున్నప్పుడు, అందరికీ నచ్చే ఆంశమే అనుకున్నప్పుడు కూడా మీ టపా ఎక్కువమందికి నచ్చకపోతే ఆ టపాలో లోపం ఎక్కడ వుందో వెతుక్కోవడం మంచింది.

అయితే మనం వ్రాసిన టపా గురించి సులభంగా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కలిగించినా కూడా చాలామంది అది పట్టించుకోరు. టపా చదివాక కనీస బాధ్యతగా కష్టపడి కామెంటు వెయ్యకపోయినా కూడా మీ కనీస స్పందన తెలియజేస్తే బావుంటుంది. పాఠకుల అభిప్రాయం ఎలా వుందో తెలిస్తే రచయిత అందుకు తగ్గ విధంగా తన రచనలు సాగించడానికి, తమను తాము సవరించుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది. తాము వ్రాసింది ఇతరులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చట్లేదో అర్ధం అవుతుంది. అందువల్ల ఇహనుండి మనం ఇతరుల స్పందనలను ఆశించడంతో పాటుగా ఇతరుల బ్లాగులు చూసినప్పుడు తప్పకుండా స్పందిద్దాం. అలా ఎంత ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తపరిస్తే బ్లాగరుకి అంత ఉత్సాహంగా వుంటుంది. నెగటివ్ కామెంట్ల కంటే కూడానూ పాఠకుల నిశ్శబ్దమే రచయితను ఎక్కువగా నిరాశకి గురిచేస్తుంది అనేది గుర్తుకువుంచుకొని ఇహ మీదటయినా వీలయినంతవరకూ స్పందిద్దాం. బ్లాగావరణంలో అది మన కనీస బాధ్యత అని గుర్తిద్దాం.

12 comments:

  1. నా టపాలకు స్పందించండి అన్నట్టు వుంది ..

    ReplyDelete
  2. Much ado about comments. బ్లాగింగ్ అనేది హాబీగానే వుండాలని నా అభిప్రాయమండీ. అలాకాకుండా వృత్తయిపోయి మన సక్సెస్‌కి కొలమానమైపోరాదు.అలా ఐపోతే చాలా సిల్లీగా వుంటుంది.

    @అజ్ఞాత : :D

    ReplyDelete
  3. చాలా బావుంది. హాప్పీ బర్త్ డే లూ, పండగ శుభాకాంక్షలు లాంటి వాటిని రాయటం వల్ల ఉండే పరిణామాలని కూడా రాయండి.

    భజన పరులు రాసే అహా ఓహో లాంటి గోకుడు ని తలకెక్కించుకోకుండా ఎలా నియంత్రించుకోవాలో కూడా రాయండి.

    అలాగే, అదే పనిగా వ్యక్తిగత దాడులకి దిగే వాళ్ళ గురించి అతిగా గాభరా పడకుండా ఉండేలా మెళుకువలు కూడా రాయండి.

    ReplyDelete
  4. నిన్న ఒకబ్లాగులో కడుపుబ్బా నవ్వి౦చే ఒక సీరియల్ భాగం చదివి, 'కామెడి సీరియల్ బాగా వ్రాస్తున్నారు' అని కామె౦టాను. ఆ బ్లాగరు వ్యాఖ్యను తీసివేసారు :)
    కాబట్టి మొదటివ్యాఖ్యాత ఏ౦ రాసారో చూసి అదే వ్రాయాలి. మనదే మొదటివ్యాఖ్య అయ్యేట్లయితే 'సూపర్ గా వ్రాసారు' అని జనరల్ గా ఉ౦డేట్లు వ్రాస్తే మన వ్యాఖ్య తీసివేయరు.

    ReplyDelete
  5. pardhaya pratiboditam....:))

    ReplyDelete
  6. ఎక్కువ కామెంట్లు వస్తే బాగున్నాయి అని అనుకుంటున్నట్లు ఉంది మీరు. అవి నచ్చినా నచ్చక పోయినా ఎక్కువ రావచ్చు. పాటకుడు సంత్రుప్తి చెందితే మౌనముగా కూడ ఉండొచ్చు.

    ReplyDelete
  7. @ అజ్ఞాత
    భవతీ స్పందన దేహీ!
    అమ్మా, ఒక్క కామెంటన్నా పడెయ్యమ్మా!!

    @ మినర్వా
    నిజమే
    @ వీకెండ్
    అలాంటి విషయాలని కూడా తగిన వ్యాసాల్లో ప్రస్థావిస్తాను. నా బ్లాగానుభవసారం వీలయినంత వరకు ధారపోయడానికే ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  8. @ మౌళి
    :)

    @ సాయి
    అర్ధం కాలేదు! తిట్టారా లేక పొగిడారా నన్ను :)

    @ అజ్ఞాత
    నిజమే. ఎక్కువ కామెంట్లకీ మంచి టపాకి సంబంధం లేకపోవచ్చు. అందుకే టపా ఎక్కువమందికి నచ్చిందా లేదా తెలుసుకోవడానికి రియాక్షన్స్ ఉపయొగపడతాయి.

    ReplyDelete
  9. బ్లాగ్ లో పెట్టిన ఫోటో వికారం గా వుంది .టపా మాత్రం అదుర్స్ అనుకోండి

    ReplyDelete
  10. @ అజ్ఞాత
    అది ఒక ఫన్నీ రియాక్షన్. ఈ టపా రియాక్షన్స్ కి సంబంధించింది అవడంతో అది పెట్టాను కానీ ఎంత మంది రిలేట్ చేస్తారా అని అనుమానపడుతూనేవున్నా. మీ వ్యాఖ్యతో అది తీసేసాను.

    ReplyDelete
  11. భవతీ స్పందన దేహీ అని ఎంత దీనం గా అడుగుతున్నారో శరత్ గారు ,కడుపు తరుక్కు పోతోంది .ఇదే టపా ని మీరు buzz లో పెడితే కెవ్వుమంటూ కామెంట్లతో పరిగేట్టుకోస్తారనుకుంటా .ఈ మధ్య బ్లాగ్ ట్రాఫ్ఫిక్ అంతా buzz కి షిఫ్ట్ ఐపోయింది మీరు ఎప్పుడో buzz కి transfer ఐపోతారనుకుంటా ఇప్పటికే వున్నారా ?

    ReplyDelete
  12. @ అజ్ఞాత
    లేకపోతే ఏం చెయ్యను చెప్పండీ. నేనేదో స్పందనలకున్న ప్రాముఖ్యత వివరిస్తుంటే ఈ పోస్టు కామెంట్లు అడుక్కుంటున్నట్లుగా వుంది అంటే ఏం చెయ్యను మరీ. అంగీకరించాల్సిందే కదా.

    బజ్జులు మన హితులు, స్నేహితులూ మాత్రమే చూస్తారు అందువల్ల ఎక్కువమందికి రీచ్ కాము, వివిధ వర్గాల నుండి తెలుసుకోలేము కాబట్టి వాటికి ప్రస్థుతం అయితే దూరంగా వుంటున్నాను. కాలక్షేపానికి వేసుకునే కామెంట్లు నాకు అంతగా అవసరం లేదు లెండి. బజ్జులు ఎక్కువగా విషయానికి కాకుండా కాలక్షేపానికే పనికివస్తాయని నా అనుమానం.

    ReplyDelete