మిత్రుని మరణం వెనుక...అనారోగ్యకరమయిన జీవన విధానం

నిన్న మరణించిన మా మిత్రుడు కుప్పుస్వామి పొదుపుగా జీవితం వెళ్ళదీసి కాస్త డబ్బు కూడబెట్టే వెళ్ళాడు. దాదాపుగా ఒక లక్ష డాలర్ల బ్యాంకు బ్యాలన్సూ, ఒక లక్ష డాలర్ల ఇతర పెట్టుబడులూ, రెండు చిన్న ఇళ్ళు (వాటి మీద లోన్ లేదు) వున్నాయి అతనికి. అదే కాకుండా తను పనిచేస్తూ వచ్చింది ఒక ప్రముఖ భీమా సంస్థలోనే కాబట్టి చక్కటి భీమా పాలెసీలు కూడా చేసే వుంటాడు. అందువల్ల భార్యకి గానీ, ఇంకా చదువుకుంటున్న పిల్లలకి గానీ ఆర్ధికంగా అంతగా ఇబ్బంది వుండదు. అయితే ఆ ఆస్థులు వారు సమర్ధవంతంగా నిర్వహించుకోవడం పై అది ఆధారపడివుంటుంది.

అతని పొదుపయిన జీవన సరళి గురించి, తన సంతానానికి మిగిలించిన ఆస్థుల గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. అతను ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ వున్నవాడు. అతనికి షేర్స్ మొదలయిన వ్యవహారాలు, పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా వృద్ధి చెయ్యాలో బాగానే తెలిసినవాడు. అందులో అతను మెచ్చుకోదగ్గవాడు.

అయితే అదే శ్రద్ధ తన ఆరోగ్యం గురించి చూపలేకపోయాడు. ఇక్కడి ఆరోగ్య భీమాల్లో సాధారణంగా ప్రతి ఏడాదీ పూర్తి శారీరక పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు. అలాంటి విషయాల్లో అతగాడు ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదని తెలిసింది. రెస్టారెంటులల్లో జంక్ ఫుడ్డు ఎక్కువగా తింటుండేవాడుట. ఇంట్లో కూడా ఎప్పుడూ మాంసహారమేనట. అలాంటప్పుడు తప్పకుండా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ లాంటివి ఎంతగానో పెరిగిపోయేవుంటాయి. అందువల్ల ఆ మనిషి ఒకేసారి కుప్ప కూలిపోయాడు. నాకు అతను సాధారణ మిత్రుడు మాత్రమే అవడంతో ఈ వివరాలు నాకు నిన్ననే తెలిసాయి. శారీరకంగా కూడా ఎలాంటి ఏక్టివిటీ అతనికి వుండేది కాదుట. కనీసం సాయంత్రం నడక కూడా నడిచేవాడు కాదుట.

సంపాదనలో పెట్టిన శ్రద్ధలో ఏకొంత కూడా ఆరోగ్యం మీద పెట్టకపొవడంతో 57 ఏళ్ళకే పరమపదించాడు. మన కోసం కాకపోయినా మన కుటుంబాన్ని, సంతానాన్ని దృష్టిలో వుంచుకొని అయినా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ తీసుకుంటూవుండాలి. మనం పోయాక మన అంత దిక్కుగా మిగతావారు మన పిల్లల పట్ల వుండలేరు కదా. వాళ్ళమ్మాయి 16 ఏళ్ళకే తండ్రిని కోల్పోయింది. అబ్బాయి తన చదువు పూర్తి కాకముందే, తను ఇంకా స్థిరపడక ముందే తండ్రిని కోల్పోయాడు. భార్యేమో అమాయకురాలు.

ఈ సందర్భంలో మా ఫార్మసిస్ట్ ఫ్రెండుని ఒకతడిని ఉదహరించాలి. అతను ఎప్పుడూ శారీరక/వైద్య పరీక్షలకు వెళ్ళడు. ఎందుకులే బాబూ, వెళ్ళిన కొద్దీ, నీలో ఆ సమస్య వుంది, ఈ సమస్య వుంది, అది చెయ్యి, ఇది చెయ్యీ అంటారు, ఇలా వైద్యుడి దగ్గరికి పరీక్షల కోసం వెళ్ళకపోవడమే హాయిగా వుంది అని అంటాడు. అలా కాలం గడిపేవారూ వుంటారు. అలాంటివారికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సమస్య తెలిసేటప్పటికి రోగం ముదిరిపోతుంది. అలా పరిస్థితి చెయ్యి దాటిపొతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమస్య రావచ్చు కానీ అలాంటి అవకాశాలని తగ్గించుకున్నవారం అవుతాము, తీవ్రతను తగ్గించిన వారం అవుతాము.

ఏమో బాబూ, నేనయితే మితాహారం, మంచి ఆహారం పాటిస్తూ రోజూ గంట గంటన్నర నడుస్తున్నాను. రోజూ రైలు స్టేషనికి నడిచి రావడం, అటునుండి నడిచి ఇంటికి వెళ్ళడమే కాకుండా షికాగో నగర అందాలను చూస్తూ మధ్యాహ్న భోజనాంతర వ్యాహ్యాళి చేస్తుంటాను. అలా ఆరోగ్యమూ, అందమూ రెండూ లభిస్తున్నాయి. చాలామంది సోఫాలో చేరగిలబడి టివిలూ, టివిల్లో సినిమాలూ చూస్తుంటారేమో కానీ నేనయితే చాలావరకు ట్రెడ్మిల్ చేసుకుంటూ చూస్తాను. అయినా సరే.... నాకున్న బుల్లి బొజ్జను పూర్తిగా కరిగించలేకపోతున్నానండీ బాబూ. సూస్తున్నా...సూస్తున్నా.. .

9 comments:

 1. రోజూ రైలు స్టేషనికి నడిచి రావడం, అటునుండి నడిచి ఇంటికి వెళ్ళడమే కాకుండా షికాగో నగర అందాలను చూస్తూ మధ్యాహ్న భోజనాంతర వ్యాహ్యాళి చేస్తుంటాను. అలా ఆరోగ్యమూ, అందమూ రెండూ లభిస్తున్నాయి.
  ---------

  మీరేం బయపడకండి గురువుగారు...పాపి చిరాయువు అన్నారు పెద్దలు -:)

  ReplyDelete
 2. @ సీను
  అవునుకదా. అయితే ఇంకా పాపాలు చేస్తూ పోతా. నాకు పొయ్యేదేముంది - వచ్చే వయస్సే గానీ.

  ReplyDelete
 3. తిన్నది అరక్క మానదు. తిరిగితే కరక్క మానదు.
  ప్రయత్నే ఫలి.

  ReplyDelete
 4. Mr.Sarat,

  Good to know you care for your health.

  You won't lose belly fat by walking or running on treadmill.It's because whatever glucose you get from daily eating will be expended in such exercises, and stored fat won't dissolve an inch from your body.Moreover, since glucose from food is expended, you'll feel more hungry and feel like eating slightly more than usual.People never lose fat walking or running or doing gym exercises for years.Try it if you want.It's just impossible.Walking is over-rated and it's only good exercise for old people.Young people ( below 50-55) need better exercise than that, and yoga is perfect exercise for body.

  This is where yoga helps,in yoga, you stay in one pose ( asana )for sometime, pressure is applied on one body part, and to stay in the pose, you need energy from that body part,since glucose can't go to that body part instantly, energy from stored fat is expended to remain in the pose, hence fat converts to energy and fat dissolves slowly.Glucose is not spent, so no extra hunger from doing yoga.If you practice some yoga poses for 2-3 months,along with good diet,you'll lose your belly,depending on how protruding it is.

  It also helps to learn surya namaskara along with any yoga postures for extra benefit.

  I hope you'll heed this advice and benefit from it.

  Watch these videos carefully and follow them.

  http://www.youtube.com/watch?v=9Opt-NH_8kM

  http://www.youtube.com/watch?v=kdEZBHZLkzA

  ^^^^^^^^^^^^^^^^^^^^^^^^
  http://www.youtube.com/watch?v=UdqrK4rvqzI


  see part 2, part 3 of adhika baruvu taggalante in related videos.

  I know people who followed this and lost around 10-20 kgs in one year( reducing belly also), and for people who're slim with belly fat, they have no belly or unnecessary fat in their bodies.

  Don't forget to thank me when you look totally fit. :-P Just kidding. Thank Yoga and thank manthena.Amen.

  ReplyDelete
 5. @all

  About papi chirayuvu, Sidelining from the original intended statement-

  I think papi or punyi has nothing to do with living long.If we don't follow good diet or lifestyle ( and don't have good thoughts and/or virtues),we pass away quickly.It's like gravity,it's same for everyone.Once you drop from tall building,gravity doesn't care if you're a good guy or bad guy.

  I apologize for typing in english.

  ReplyDelete
 6. Let us see..

  Sarath
  You always talk about financial management and lack of it and so many such things. Let us assume you die abruptly like that other guy. Can you post how your family will manage? Give a thought to your mind and let us see it. You know your people and family. How would they react and manage your insurance money, life etc.

  ReplyDelete
 7. @ అజ్ఞాత @9 జూలై 2011 1:28 సా

  మీరు చాలా ఓపికగ, వివరంగా నాకు సూచనలు ఇచ్చినందుకు సంతోషంగా వుంది. మీరు చెప్పిన కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాను - కొన్ని విషయాల్లో కాదు. బెల్లీ ఫ్యాట్ అయిన ఏ ఫ్యాట్ అయినా తగ్గడానికి ప్రాధమిక సూత్రం - మనం వినియోగించే క్యాలరీల కన్న తక్కువ క్యాలరీలు తీసుకోవడం లేదా ఎక్కువ క్యాలరీలు ఖర్చు చెయ్యడం. అలా నా బెల్లీ చాలావరకు తగ్గించాను. కాకపోతే నేను కనీస బరువుకి తగ్గాను కాబట్టి ఇంకా బరువు తగ్గిస్తూ మరోవైపు బొజ్జ తగ్గించలేను. ఇహ కండ పెంచుతూ కొవ్వు తగ్గించడమే మిగిలిన పని. ఇల్లు మారడం తదితర పనులు వల్ల అది అశ్రద్ధ అయిపోయింది. మళ్ళీ కేర్ తీసుకుంటున్నా.

  యోగాతో పలు లాభాలు వున్నాయనేదానితో ఏకీభవిస్తాను.అయితే అది స్వంతంగా ప్రాక్టీసు చేసేంత ఓపిక లేదు. యోగాశ్రంకి వెళ్ళాలంటే మా పాప స్విమ్మింగ్ క్లాస్ అడ్డు వస్తోంది. వచ్చే నెల ఆ క్లాసు వేళలు మార్చి చూడాలి.

  ReplyDelete
 8. @ అజ్ఞాత 11 జూలై 2011 3:18 సా
  కీడించి మేలెంచమన్నారు పెద్దలు. అందువల్ల కీడించి జాగ్రత్త పడటం మంచిదే. సరిగ్గా ఆ విషయాల మీద కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడే మీ కామెంట్ వచ్చింది. మా మిత్రుడు అకస్మాత్తుగా మరణించడం వల్ల అతని ఆర్ధిక విషయాలు కానీ, భీమా విషయాలు కానీ ఫ్యామిలీకి ఇప్పటికిప్పుడు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరం చందాలు వేసుకొని భౌతిక కాయాన్ని, కుటుంబాన్ని (బహుశా రేపు) భారత్ పంపిస్తున్నాం. అలాంటి స్థితి మాకు రాకుండా నేను ఒక ఎమెర్జెన్సీ ఫైల్ తయారు చేస్తున్నాను. ఇలాంటి సలహా ఎప్పుడో యండమూరి అనుకుంటా ఓ పుస్తకంలో ఇచ్చారు కానీ అలాంటి ఫైల్ చేద్దాం, చేద్దాం అనుకుంటూ అలా గడిచిపోయింది. ఇప్పటికయినా తెలివి తెచ్చుకొని అన్ని ఆర్ధిక విషయాలు, భీమా విషయాలు,ముఖ్యమయిన వివరాలు ఒక ఫైలులో పెట్టి కుటుంబ సభ్యులందరికీ వాటి వివరాలు తెలియపరచి భద్రపరచి ఆ చోటు వారికి తెలియజేస్తాను.

  ఆ అత్యవసర ఫైల్ కోసమని డాక్యుమెంట్లు ఇప్పుడే ప్రింట్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక మా వాళ్లకి వివరిస్తాను. ఇక్కడ నాకు ఆరోగ్య భీమా, ఆర్ధిక భీమాలు, కెనడా, యు ఎస్ సోషల్ సెక్యూరిటీలు, రిటైర్మెంట్ సేవింగ్స్ తప్ప వేరే ఆస్థులు లేవు. ఇండియాలో ఆస్థులు కొన్నాం. ఇంకా ముందు ముందు ఇండియాలో ఆస్థులు పెంచుతూనే వుంటాం. ఏమన్నా ఇక్కడ జరిగితే లైఫ్ ఇన్సూరెన్స్, ADD ఇన్సూరెన్స్ లు బాగానే వున్నాయి మాకు. కెనడా పౌరులు కాబట్టి అక్కడి బెనిఫిట్స్ కూడా వస్తాయి. అలా అందరి జీవితానికి అంతగా వచ్చే ఢోకా ఏమీ లేదు.

  ఇహ మిగిలిన ఆస్థులు నిలుపుకోవడం అన్నది ఇప్పుడు అంతగా క్రమశిక్షణ లేకపోయినా పరిస్థితుల ప్రాబల్యం వల్ల, బంధుమిత్రుల ప్రోద్బలం వల్ల అది అలవడవచ్చు. అదీ ప్రాప్తించకపోతే ఆస్థులు హారతి కర్పూరం అవచ్చు. చెప్పలేం.

  ReplyDelete
 9. @నగర అందాలను చూస్తూ....నడక వల్ల ఇదో ఉపయోగం ఉంది చూసారా..

  ReplyDelete