మార్స్ నుండి మగాళ్ళు...

నిన్న అమ్మలుని ఈత క్లాసుకి తీసుకువెళ్ళాను. అక్కడ ఒక స్టాఫ్ వ్యక్తి - యువకుడే - ఇంకా పెళ్ళయ్యిందో కాలేదో అనుమానమే - నన్ను పలకరించాడు. నా చేతిలో వున్న పుస్తకాన్ని వుద్దేశ్యిస్తూ 'ఆ పుస్తకం చదువుతున్నారా? ఎలా వుంది' అని అడిగాడు. 'ఇంకా చదవలేదు, ఈ రోజే మొదలెట్టబోతున్నాను' అని అన్నాను. 'చాలా మంచి పుస్తకం - చదవండి - చాలా బాగా రాసేడు' అన్నాడతను. 'తప్పకుండా చదువుతాను, నా స్నేహితులు కూడా చదవమని రికమెండ్ చేసారు' అన్నాను. ఆ పుస్తకం పేరు Men Are from Mars Women Are from Venus. మా పాప ఈత క్లాసు పూర్తవడానికి 45 నిమిషాల సమయం వుంది. పుస్తకం తెరిచాను.

అమెజాన్ సైటులో అ పుస్తకం యొక్క వివరాలు ఇక్కడ చూడండి.
అమెజాన్ సైటులో అ పుస్తకం యొక్క సమీక్షలు ఇక్కడ చూడండి.

ఈ పుస్తకం యొక్క గొప్పదనం గురించి నాకు కొన్నేళ్ళుగా తెలుసు. అయినా కొనడానికి తీరిక దొరకలేదు. కొన్ని నెలల క్రితం తెప్పించుకుని అక్కడక్కడ తిరగేసాను కానీ అప్పుడేందుకో ఆసక్తికరంగా అనిపించలేదు. పక్కనపెట్టేసాను. అహారమయినా, అమ్మాయిలయినా సరే కొన్ని సార్లు మొదటిసారే నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు పక్కనపెట్టెయ్యాలి. అలాగే కొన్ని పుస్తకాలయినా అంతే. పక్కకుపెట్టి మళ్ళీ కొంతకాలం అయ్యాక మూడ్ చూసుకొని మొదలెడితే అప్పుడు నచ్చవచ్చు. అలాగే ఈ పుస్తకాన్ని నిన్న మొదలెట్టాను. ఈ లోగా నా బ్లాగులో కూడా ఈ పుస్తకాన్ని స్వప్నతో సహా కొందరు నాకు రికమెండ్ చేసారు. అందుకని కూడా మళ్ళీ ఆసక్తి పెరిగింది.

క్రితం సారి ఎందుకో ఉపోద్ఘాతం చదవకుండానే అక్కడకడ తిరగేసాను. అదే నేను చేసిన పొరపాటూ అనుకుంటా. ఈసారి మాత్రం ముందు ఉపోద్ఘాతమే మొదలెట్టాను. అప్పుడు ఈ పుస్తకం మీద ఉత్సుకత మొదలయ్యింది. రచయితను ఈ పుస్తకం వ్రాయడానికి ప్రేరేపించిన పరిస్థితులను వివరించాడు. దానితో నేను రిలేట్ చేసుకున్నాను. దాంతో ఆ పుస్తకానికి హుక్కయిపోయాను. నిన్నా, ఇవాళా కలిపి అలా ఇంట్రడక్షన్, మొదటి అధ్యాయంలో కొంత భాగమూ చదివాను. నేను చదివిన దాన్ని బట్టి నాకు అర్ధం అయ్యిందేంటంటే ఈ పుస్తకం పెళ్ళయిన వారికి అని మాత్రమే కాకుండా మానవ సంబంధాలు మెరుగుపరచుకొవాలనుకునే ప్రతివారికీ ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం చదివితే ఆడవారు మగవారినీ, మగవారు ఆడవారినీ ఎంచక్కా అర్ధం చేసుకోగలారనుకుంటా.

అప్పట్లో ఒక పుస్తకం చదివి మా పెద్దమ్మాయి అంతర్ముఖత్వాన్ని అర్ధం చేసుకున్నాను. మా కుటుంబ వైద్యుడు సూచించిన మరో పుస్తకం చదివి టీనేజి పిల్లల మనస్థత్వాన్ని తద్వారా మా పెద్దమ్మాయి ఆలోచనా రీతినీ ఆకళింపు చేసుకున్నాను. అందువల్ల మా అమ్మాయితో మాకు ఏర్పడిన ఫ్రిక్షన్ చాలా చక్కగా దూరం చేసుకోగలిగాము. అదే పద్ధతిలో ఇప్పుడు స్త్రీలనీ తద్వారా మా ఆవిడని అర్ధం చేసుకొనే ప్రయత్నమే ఇది. ఈ పుస్తకం చదువుతూ అప్పుడప్పుడు దీని గురించి టపాలు వ్రాస్తుంటాను. అది చదవడం వల్ల నా ఆలోచనా రీతిలో కలుగుతున్న పరివర్తనను మీకు తెలియజేస్తాను. అందువల్ల పరిస్థితులల్లో ఏర్పడిన మెరుగుదలనూ మీకు వివరిస్తాను. మధ్యలో ఆ పుస్తకం పనికిరానిదనిపించినా అది మీకు తెలియజేస్తాను.

అలాగే ఈ పుస్తకం చదివిన వారు, తద్వారా మార్పు చెందిన వారు ఎవరయినా వుంటే మీ అనుభవాలు, ఆలోచనలు ఇక్కడ పంచుకోండి. ఏళ్ళ తరబడి వందల కొద్ది పుస్తకాలు చదవడం అన్నది లెక్క కాదు, చదివిన ఒక్క పుస్తకం అయినా మనకు నిజజీవితంలో ఎంత వరకు ఉపయోగపడిందీ - అందువల్ల మనలో ఏం మెరుగుదల వచ్చిందీ అన్నది ముఖ్యం. అందుకే నేను పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు చదవకపోయినా చదివిన కొన్నింటినయినా నాలో మార్పు తెచ్చుకోవడానికి ఉపయోగిస్తుంటాను. ఇలా పుస్తకాలు చదువుతూ ఆ ఆలోచనలు మీతో పంచుకోవడం ద్వారా అందులోని సారాంశం నా మదిలో ఇంకా బాగా ఇంకుతుంది. అలాగే మీలో ఎవరికయినా మానవ సంబంధాలు మెరుగుపరచుకోవడం పట్ల ఆసక్తి వున్నా ఉపయోగపడుతుంది. మీరూ వ్యాఖ్యల ద్వారా స్పందిస్తే జరిగే చర్చల ద్వారా అటు మీకూ, ఇటు నాకూ ఇంకా ప్రయోజనకరంగా వుంటుంది.

7 comments:

 1. Last Para is nice.

  Taara.

  ReplyDelete
 2. Could you pl share the title of the book suggested by your family doctor about teenegers..

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  టీనేజీ పిల్లల మనస్థత్వం పై పుస్తకం యొక్క వివరాలకు, లింకులకు ఈ క్రింది టపా చూడండి:
  http://sarath-kaalam.blogspot.com/2009/09/yes-your-teen-is-crazy-loving-your-kid.html

  అంతర్ముఖత్వంపై పుస్తకం యొక్క వివరాలకు, లింకులకు ఈ క్రింది టపా చూడండి:
  http://sarath-kaalam.blogspot.com/2009/09/hidden-gifts-of-introverted-child.html

  ReplyDelete
 4. @ తార
  :) చాన్నాళ్లకి కనిపిస్తున్నారు మీరు (నా బ్లాగులో)!

  ReplyDelete
 5. రచయిత చెప్పినట్లే అనిపిస్తారు చాలా వరకు నిజ జీవితం లో ఆడ, మగ వారు నాకు. మంచి పుస్తకం.

  ReplyDelete
 6. కొద్దిగా విరామం ఇచ్చాను :)(అన్ని బ్లాగులకి) ప్రయాణం కొద్దిగా గతుకుల రోడ్లో ఉన్నదని..

  తార

  ReplyDelete
 7. @ రిషి
  అనిపించడం మాత్రమే కాదు - మరి ఆ పుస్తకం చదివాక మీలో మార్పు ఏమయినా కనిపించిందా?

  @ తార
  :)

  ReplyDelete