మగవాడికి కావాల్సిందేమిటి?

సెక్స్ అనమాకండి మరీ సీపుగా వుంటుంది :) అది ఎలాగూ కావాలి కానీ కాస్సేపు అది పక్కన పెట్టి వేరే విషయాలు చూద్దాం. స్త్రీ నుండి పురుషుడికి నమ్మకం, అంగీకారం, ప్రశంస, ఆరాధన, అనుమతి, ప్రోత్సాహం అవసరం అని మార్స్ నుండి మగాళ్ళు... పుస్తక రచయిత జాన్ గ్రే అంటాడు. సర్లెండి, 'మా ఆయనే వుంటే...' అన్న సామెత అనుకోవాల్సివస్తుంది. అంతా దృశ్యం వుంటే ఇంకా సమస్యేమిటంటా? సరే, ఆ పుస్తకం చూసయినా ఆడవాళ్ళు ఎవరయినా తమ మగవాడికి కావాల్సిందేమిటో గుర్తిస్తారని రచయిత ఆశాభావం అయ్యుంటుంది.

నమ్మకం: కాస్త మగవాడు చేసే పనుల పట్ల నమ్మకంతో వుండి సలహాలు గట్రా ఇస్తూ పోవద్దంటాడు. అలా సలహాలు ఇస్తూ పోతే మగ అహం దెబ్బతింటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అవసరమయితే అతగాడే అడుగుతాడు, ఎంచక్కా అప్పుడు ఇద్దురు కానీ. అందాకా కాస్త ఆగుదురూ. నీకేమీ తెలీయదు, నీకేమీ తెలియదు, నేను చెబుతాగా అని మీ ఆయన్నో, ప్రియుడినో అస్తమానం అన్నారనుకోండి. సరే, ఇక నాకేమీ తెలియదు కదా అని తమకు తాము నమ్మేసుకొని తాపీగా వుండిపోతుంటారు.

అంగీకారం: మొగుడు ఐడియల్ హి కావాలని ఆశించకుండా అతగాడిని వున్నదున్నట్లుగా అంగీకరించగలిగితే చాలా సమస్యలు వుండవంటాడు. కొంతమని ఆడవారు ఏం చేస్తారంటే పక్కింటాయనలో చూసిన గొప్పతనాలు అన్నీ తమ భర్తలో కావాలంటారు. పోలికలు చెబుతూ అలా మారాలని పోరాటాలు చేస్తుంటారు. మగవాడిలోని గొప్పతనాలని, లోపాలని వున్నదున్నట్లుగా అంగీకరించగలిగితే అనవసరమయిన అంచనాలు పెట్టుకోకుండా సంతృప్తితో వుండగలుగుతారు. ఉదాహరణకు మీ ఆయన చక్కని బ్లాగర్ అనుకోండీ. చక్కని బ్లాగరన్న సంగతేమో కానీ కనీసం బ్లాగరు అని అయినా మీరు గుర్తించగలగాలి కదా.

ప్రశంస: మనం సాధారణంగా వీజీగా విమర్శిస్తుంటాం, చాలా కష్టంతో మెచ్చుకుంటుంటాం. ఆ ధోరణి తారుమారు అయితే ఎంత బావుండును. విమర్శించడానికయితే మనకు ఓపిక, తీరిక, మనస్సూ తేలిగ్గా వచ్చేస్తుంటాయి. అదే ఒక విషయం మెచ్చుకోవాలంటే మనకు అంతగా అవి కలిసి రావు. ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావాలంటే మంచి విషయాలను మెచ్చుకుంటూపోవడం ద్వారా కూడా కొంత వీలు అవుతుంది. అలా కాకుండా పదేపదే విమర్శిస్తుంటే మనిషి బండబారిపోతాడు.

ఆరాధన (అడ్మిరేషన్): కొంతమంది చక్కటి భార్యలు తమ భర్త పట్ల అబ్బురంతో వుంటుంటారు. వారు చేసే పనులకి మురిసిపొతూ, పదేపదే మెచ్చుకుంటుంటారు. ఇండియాలో వున్నప్పుడు ఓ మిత్రుడి భార్య తన భర్తని పదేపదే మెచ్చుకుంటూ మురిసిపోయేది. మా ఆయన అయితే, మా ఆయన అయితేనా అంటూ అతగాడి గొప్పతనాలు చెప్పుకువచ్చేది. అలాంటప్పుడు ఆ భర్తకి తనమీద తనకు ఎంత నమ్మకం ఏర్పడుతుంది చెప్పండి. ఇంకొందరుంటారు - మా ఆయన ఓ సన్నాసి అని చెప్పుకోవడం స్టైల్ అనుకుంటారు. అలాంటి మాటలు వినీ వినీ ఆ మగాడు సన్నాసిగా మారక ఇంకేం అవుతాడూ?

అనుమతి (అప్రూవల్): ఎడ్డెం అంటే తెడ్డెం అనే పెళ్ళాం వున్నప్పుడు మగాడికి ఏమీ చెయ్యబుద్ధి కాదు. మొండికెయ్యబుద్ధి అవుతుంది. ఎలాగూ కొన్ని విషయాల్లో ఏకీభవించడం కుదరకపోయినా వీలయినన్ని విషయాల్లో మొగుడి పని మొగుడిని చెయ్యనిస్తే బావుటుంది. ప్రతి పనినీ విమర్శిస్తూ అడ్డుతగులుతూ వుంటే ప్రియుడికి అయినా సరే తన లవర్ మీద చిరాకు వేస్తుంది.

ప్రోత్సాహం: నిజంగా చెప్పండి. మీవారిని లేదా మీ స్నేహితుడిని లేదా మీ ప్రియుడిని ప్రోత్సహించి ఎన్నాళ్ళవుతోంది? మీరు పదే పదే పలు విషయాల్లో ఎంకరేజ్ చేసే వ్యక్తులయితే మీ భర్తకి అది ఎంత ఆనందకరయిన విషయం! భర్త అంటే భరించువాడు అనుకోవడమే తప్ప తనకో స్వంత వ్యక్తిత్వం వుంటుందనీ, తనకీ ఆసక్తులూ, అభిరుచులు వుంటాయని కొంతమంది గుర్తించరు. ఇంట్లో అలాంటి ప్రోత్సాహకరమయిన వాతావరణం వుంటే పురుషుడికి ఎంతో ఉత్సాహంగా వుంటుంది.

అలాగే స్త్రీలకు పురుషుడు ఇవ్వాల్సిందేమిటో కూడా రచయిత చర్చించాడు. అవి మరోసారి చూద్దాం. మగవారి మరియు ఆడవారి ఎమోషనల్ అవసరాల మధ్య తేడాలుంటాయంటాడు. అందరికీ అన్నీ కావాలి కానీ ప్రాధాన్యతల్లో తేడాలుంటాయి. అవేమిటో దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తే కొన్ని సమస్యలయినా పరిష్కారం అవుతాయి కదా.

10 comments:

 1. ఈ పుస్తక౦ వ్రాసినప్పటి టై౦ కి వర్తిస్తాయేమో ఇవి. ఇలాగే ఉ౦డాల౦టే బోల్డ౦త నటి౦చాలేమో (ఇద్దరు) :)

  ReplyDelete
 2. >ఈ పుస్తక౦ వ్రాసినప్పటి టై౦ కి వర్తిస్తాయేమో ఇవి. ఇలాగే >ఉ౦డాల౦టే బోల్డ౦త నటి౦చాలేమో (ఇద్దరు) :)

  అంత టైమ్‌గ్యాప్ ఏముంది ఆ పుస్తక రచనాకాలానికీ, ఇప్పటికీ ?

  ReplyDelete
 3. @ "పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బ్లాగరు"
  మీ వ్యాఖ్య ప్రచురించలేనండీ. ఎప్పుడోఒకప్పుడు, ఎందుకో ఒకందుకు తప్ప సాధారణంగా టపాకి సంబంధించని వ్యాఖ్యలు ప్రచురించదలుచుకోలేదు. బ్లాగు గొడవల్లో నాకు అంతగా ఆసక్తి లేదు. అసలే ఆసక్తి లేదూ అని కూడా అనను :) నా శత్రువు అయినా సరే నా బ్లాగులోకి వచ్చి టపాకి సంబంధించిన వ్యాఖ్య వేస్తే ప్రచురిస్తాను. ఒహవేళ ఎవరయినా నాతో నాటకాలాడినా సరే టపా విషయంలో సరిగ్గా స్పందిస్తే నేనూ సరిగ్గానే స్పందిస్తాను.

  మీరు కావాలంటే బార్లా తలుపులు తెరచి వుంచే బ్లాగులు చాలా వున్నాయి. ఆ వ్యాఖ్య అక్కడ వేసుకోవచ్చు.

  ReplyDelete
 4. @ మౌళి
  ఆ పుస్తకం ప్రచురించింది 1992 లో. శతాబ్దాలేమీ గడిచిపోలేదు కదా. దేశకాలమాన పరిస్థితులకి అతీతం ఆ భావావేశాలు. మరీ నటించనక్కరలేదు - కాస్తంత ప్రయత్నం చాలు. ఒకింత ఆసక్తి చాలు.

  ReplyDelete
 5. శరత్,

  మీరు వ్రాసిన వివరణ కేవల౦ భర్త లేదా ప్రియుడిని ఉద్దేశి౦చి ఉన్నాయి. శీర్షిక మాత్ర౦ 'మగవారి' గురి౦చి సూచిస్తున్నది. వీరిద్దరి విషయ౦ కు, మిగిలిన వారికి వ్యత్యాస౦ వు౦ది అ౦టారా!

  ReplyDelete
 6. @ మౌళి
  ఒక్క మగవారే అని కాదండీ అందరికీ వర్తిస్తాయి ఆ విషయాలు. కాకపోతే మగవారు ఆ ఎమోషన్సుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆడవారు తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆడవారి ప్రాధాన్యాల గురించి త్వరలో వ్రాస్తాను.

  ReplyDelete
 7. శరత్,

  నా అభిప్రాయ౦లో కవి హృదయ౦ మగవారు అ౦టే, త౦డ్రి, సోదరుడు, స్నేహితుడు, భర్త ఇలా అ౦దరూ.

  కాబట్టి ఈ నమ్మకం, అంగీకారం, ప్రశంస, ఆరాధన, అనుమతి, ప్రోత్సాహం అన్నీ త౦డ్రి ను౦డి, భర్త వరకూ ప్రతి ఒక్కరి విష్య౦ లో ఒకప్పుడు స్త్రీ పాటి౦చేది/పాటి౦చాల్సి వచ్చేది.

  ReplyDelete
 8. @ మౌళి
  ఇప్పుడు అలా పాటించనక్కరలేదు అనేది మీ అభిప్రాయమా? మంచి విషయాలు ఎప్పుడూ, ఇప్పుడూ పాటించొచ్చు. అందులో అభ్యంతరం ఎందుకు వుండాలి?

  ReplyDelete
 9. పాటి౦చాలి అని కాని, అవసర౦లేదు అని కాని నేను నిర్ణయి౦చడ౦ లేదు శరత్. మీరే విశ్లేషి౦చుకోవచ్చు.

  అది కాక ఈ చాప్టర్ మగవారు ఏమి ఆశిస్తారు అని చెప్పడ౦ అ౦తే కదా.

  ReplyDelete
 10. ఉదాహరణకు మీ ఆయన చక్కని బ్లాగర్ అనుకోండీ. చక్కని బ్లాగరన్న సంగతేమో కానీ కనీసం బ్లాగరు అని అయినా మీరు గుర్తించగలగాలి కదా

  rolf .... :))

  ReplyDelete