మీకు బాగా నచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఏంటి?

నచ్చడం అంటే చదవడానికి సరదాగా వున్న పుస్తకాలు అని కాదు. మీలో పరివర్తనకి లేదా మార్పుకీ లేదా విజయానికీ దోహదం చేసిన పుస్తకాలు అన్నమాట. నేను ఎన్నో పుస్తకాలు చదివినప్పటికీ మొదటి స్థానం డేల్ కార్నెగీ వ్రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లుయెన్స్ పీపుల్ అనే పుస్తకానికి ఇస్తాను. అలాగే మీ ఉద్దేశ్యంలో మంచి పుస్తకాలు ఏంటో చెప్పండి. మార్స్ నుండి మగాళ్ళు... అన్న పుస్తకం చదువుతూ సిరీస్ వ్రాస్తున్నా కదా. ఆ తరువాత ఏం పుస్తకం చదివి వ్రాయాలా అని చూస్తున్నాను. అది నా దగ్గర లేకపోతే ఈ లోగా తెప్పించిపెట్టుకోవాలి కదా.

మీరు తెలుగు పుస్తకలు కూడా సూచించవచ్చును కానీ అవి నాకు ఇప్పటికిప్పుడు తెప్పించుకోవడానికి కుదరదు. ఇంగ్లీషు పుస్తకాలయితే వెంటనే అమెజాన్ సైటులో ఆర్డర్ చెయ్యవచ్చు. తెలుగు పుస్తకాలూ వేరే సైటుల్లో దొరికినా తెప్పించుకోవడానికి ఆలస్యం మరియు ఎక్కువ ఖర్చూ అవుతుంది. మీకు నచ్చిన పుస్తకం చెప్పడంతో పాటుగా వీలయితే ఆ పుస్తకం ఎందుకు నచ్చిందో కూడా క్లుప్తంగా నయినా చెప్పగలిగితే ఇంకా బావుంటుంది.

నాకు డేల్ కార్నెగీ పుస్తకం ఎందుకు నచ్చిందంటే అది ఇతరుల మనస్థత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇతరులను ప్రభావితం చెయ్యడం ఎలాగో తేలికపాటి పద్ధతుల్లో సూచిస్తుంది. కొన్ని సమస్యలను ఎలా సులభంగా పరిష్కరించుకోవచ్చో తెలియజేస్తుంది. ఆ పుస్తకం చదవడం సరదాగా, సరళంగా వుంటుంది. 

10 comments:

  1. who moved my cheese..andi. naku idi sari ayina time lo chadivina pustakam. idi chadiveka nenu change ni accept cheyyatam nerchukunna.

    ReplyDelete
  2. అవును. ఆ ఛీజ్ పుస్తకం ఛేంజ్ మేనేజెమంట్ మీద చాలా చక్కటి పుస్తకం. అది నా దగ్గర వుంది. అది మళ్ళీ చదవాల్సివుంది. ఎప్పుడన్నా దాని గురించీ చర్చిద్దాం.

    ReplyDelete
  3. It's Not About The Bike: My Journey Back to Life - By Lance Armstrong.

    This book has helped me to regain my life when i met with a major accident and was bed ridden for 2 years at starting of my career.

    ReplyDelete
  4. @ కంఫ్యూజ్డ్
    ఆ పుస్తకం గురించి ఎక్కడో చదివినట్లు లీలగా గుర్తుకువుంది. అయితే అది ప్రమాదాలు జరిగిన వారికే ఉపయోగపడుతుందా లేక అందరికీ కూడా ఉపయోగపడే పుస్తకమా?

    ReplyDelete
  5. Hi Sarath,

    The book is the autobiography of Lance Armstrong - professional cyclist who survived cancer at age of 25 and won Tour de France 7 times after recovery. You can find more details about him here

    http://en.wikipedia.org/wiki/Lance_Armstrong

    It is helpful to those who want some inspiration to get more from their life and come out of their problems.

    This book is a present from our family doctor at that when I lost a lot in that major accident and was permanently disabled and going suicidal. The book has changed my perception towards my life.

    You can check the review of the book here.

    http://www.reviewcentre.com/reviews17850.html

    ReplyDelete
  6. @ కంఫ్యూజ్డ్
    వెరీ గుడ్. వ్యక్తిత్వ వికాసం (పుస్తకాలు) ఎందుకూ అనుకునేవారు మీ కామెంట్ చూసి అయినా వారి అభిప్రాయం మార్చుకుంటారని ఆశిస్తాను. మీకు హృదయపూర్వక అభినందనలు. మీకే కాదు మీ కుటుంబ వైద్యునికి కూడా. ఈసారి వారిని కలిసినప్పుడు నా ప్రశంసలు వారికి తప్పకుండా తెలియజెయ్యండి. మీరు యు ఎస్ లోనే వుండి వుంటారనుకుంటాను. భారత్ లోని చాలా మంది వైద్యులు రోగుల దగ్గర డబ్బులు దోచుకోవడం ఎలా అన్న పుస్తకాలు చదువుతారు కానీ పేషెంట్లకి పుస్తకాలు సూచిస్తారని అనుకోను. కొద్ది మంది మంచి డాక్టర్లు అలా చేస్తుండవచ్చు. ఆ పుస్తకం గురించి అమెజాన్ సైటులో కూడా రెసెర్చ్ చేస్తాను. వీలయితే తెప్పిస్తాను. నచ్చితే కొద్ది రోజుల్లో లేకపోతే కొద్ది వారాల్లో దానిగురించి బ్లాగేస్తాను.

    ReplyDelete
  7. Think and Grow Rich!

    ReplyDelete
  8. Spencer Johnson, Ken Blanchard పుస్తకాలన్నీ బావుంటాయి. who moved my cheese మీరు ముందే చదివేసారు కాబట్టి one minute appology, one minute manager ప్రయత్నించండి....నేను చదివిన, కొంతలో కొంత నచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఇవే....otherwise నాకు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నచ్చవు.

    ReplyDelete
  9. @ మౌళి
    థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం నా దగ్గర వుంది - చాన్నాళ్ళ క్రిందటే చదివాను కానీ అది ఒక సిద్ధాంత వ్యాసం లా అనిపిస్తుంది. అలా కాకుండా చదవడానికీ, పాటించడానికీ సులభంగా వుండేవి నాకు నచ్చుతాయి.

    @ సౌమ్య
    మీరు చెప్పిన మిగతా పుస్తకాలేవీ చదవలేదు. వాటి గురించీ, మీరు ప్రస్థావించిన రచయితల గురించీ తెలుసుకుంటాను.

    ReplyDelete
  10. sarat garu,
    the book that inspire me the most is - the amazing results of positive thinking by norman vincent peale. i re-read it 5-6 times before it got to me.I'm able to take life as it is & enjoy it, without feeling depression like before. the key is to take 15 mins regularly to remember the points in the book, so it soaks into you & is part of you.

    ReplyDelete