నా మానాన నన్ను కాస్త వుండనివ్వు

సాధారణంగా మగవారు ఒత్తిడిలో వున్నప్పుడు, అలసటలో వున్నప్పుడు ఏకాంతాన్ని కోరుతారు అంటాడు రచయిత జాన్ గ్రే. మనం ఆఫీసుకి వెళ్ళి బోలెడంత శ్రమ పడీ, ఒత్తిడి చెందీ ఇంటికి వెళ్ళి ఇలా బూట్లు విడుస్తుంటామా అలా వచ్చేస్తుంటాయి ఇంట్లోంచి మిస్సయిల్స్. ఉదాహరణకి డాడీ మా ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళవా అని అమ్మలూ, ఇంటర్నెట్టు సరిగ్గా రావడం లేదని పెద్దమ్మాయీ, ఇంట్లోని ఏదో ఒక సమస్య గురించి మా ఆవిడా నామీద విసిరేస్తుంటారు. నాకేమో ఎంచక్కా ఓ చిరుతిండి తిని, కాస్త తేనీరు సేవిస్తూ ఇంటర్నెట్టులో ఈనాడు చూడాలని వుంటుంది. పని నుండి రాగానే నామీద పడిపోతారెందుకూ, కాస్త నాకు విశ్రాంతిని ఇవ్వండి అని విసుక్కుంటాను. పిల్లలు ఆగుతారు కానీ పెళ్ళాలు ఆగుతారా? వాళ్లని ధిక్కరించినట్లుగా భావించరూ? వారికి మండుతుంది. చేసేవులే బోడి ఉద్యోగం లాంటి డైలాగులు వస్తుంటాయి. విసురుగా మనం పడగ్గదిలోకి వెళ్ళి నెట్టుతో సంసారం చేస్తుంటాం.
 
అలాంటి పరిస్థితి కొన్ని కుటుంబాలలోనయినా వుంటుండవచ్చు. అందుకు కారణాలేంటో ... పుస్తకంలో వివరించారు. మగవాడు ఒత్తిడి చెందినప్పుడు విశ్రాంతి చెందడానికి ఏదన్నా చదవడమో, సినిమాలు లేదా టివి చూడటమో లేక ఫిజికల్ ఏక్టివిటీనో చేస్తుంటాడు. అలా తన గుహలోకి వెళ్ళి కాస్సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయటకి వచ్చి అందరితో కలుస్తాడు. ఈలోగా మగవాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు కదా ఈ ఆడాళ్ళూ. పలు రకాల సమస్యలతో మీదపడి కరిచేస్తారు. అసలే ఆఫీసులో బాసుతోనో, సహోద్యోగులతోనో అప్పటికే రక్కించుకొని వచ్చిన మగాడికి ఇంట్లో జనాలు కూడా కరిచేస్తుండేసరికి మండిపోతుంది. అంచేత ఓ మహిళామణులారా మీ మొగాడు ఒత్తిడిలో వున్నప్పుడు, అలసటలో వున్నప్పుడు విశ్రాంతి చెందేందుకై కాస్తంత సమయం ఇవ్వండి. ఆ తరువాత విజృంభిద్దురు గానీ.
 
స్త్రీలు ఒత్తిడిలో వున్నప్పుడు మగాడిలా అలా మూలకు కూర్చుంటారా? అబ్బే లేదు. ముచ్చట్లు పెడతారు. పురుషుడు ఏ విధంగా నయితే పుస్తకమో, పేపరో చదువుతూనో, సినిమాలో, టివి నో చూస్తూనో లేదా ఏదయినా ఆట ఆడుతూనో విశ్రాంతి తీసుకుంటాడో అలాంటి విశ్రాంతి ఆడవారు తమ సాధకబాధకాలు ఇతరులకు చెప్పుకోవడం ద్వారా తీసుకుంటారుట. మనం మగవాళ్ళం ఏం చేస్తాం?వాళ్ళు దేనిగురించో దానిగురించి సణుగుడు మొదలెట్టగానే వారి సమస్యలకు పరిష్కారాలు సూచించబోతాం, అవి వినిపించుకోకపోతే ఆ సుత్తి బారినుండి పారిపోతాం. మనం సమస్యల్లో వున్నప్పుడు విశ్రాంతి పొందడానికి ఎలాయితే మన గూహలోనికి మనం వెళ్ళిపోతామో ఆడవారికీ అలాగే అనిపిస్తుందనుకొని వారిని వారి మానాన వదిలేసి వెళ్ళిపోతాం. అదే తప్పంటాడు ఆ రచయిత. బుద్ధిగా వారు చెప్పింది వినమంటాడు అంతే కానీ ఉచిత సలహాలు ఇవ్వద్దంటాడు. అలా వారిని వదిలేసి వెళ్ళిపోకుండా వారు చెబుతున్నది ఓపిగ్గా వినమంటాడు. ఆడవారు విశ్రాంతి చెందే//పొందే విధానం అదే అంటాడు. ఇదీ ఇవాళ Men Are from Mars Women Are from Venus పుస్తకంలో మరో అధ్యాయం చదివి నేర్చుకున్న ముఖ్య విషయం.

ఇది వ్రాస్తుంటే ఇప్పుడే మా ఆవిడ నుండి ఫోన్ వచ్చింది. ఓ సమస్య ప్రస్థావించి దులిపేసింది. నేను అలాగే, అలాగే, ఆలోచిద్దాం, పరిష్కరిద్దాం అన్నాను కానీ ఎదురు వాదన చెయ్యడమో లేక ఆమె నన్ను బ్లేం చేస్తున్నదని వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఆమె ఏదో కాస్త ఫస్ట్రేషనులో వుంది. ఇదివరకయితే నన్ను నేను డెఫెండ్ చేసుకుంటూ మాట్లాడేవాడిని. అయినా సరే వాదిస్తే ఫోను టక్కున కట్ చేసేవాడిని. ఆమె నన్ను బ్లేం చేస్తున్నా కూడా అది వ్యక్తిగతంగా తీసుకోలేదు. తన ఒత్తిడి తొలగించుకోవడానికి నన్ను విమర్శిస్తున్నదే కానీ నిజంగా నన్ను హర్ట్ చెయ్యాలని కాదు అని అర్ధం చేసుకోగలిగాను. అలా ఆమె రిలాక్స్ అయితే మంచిదే కదా. సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ చిన్న సమస్య గురించి సావకాశంగా మాట్లాడదామని చెప్పాను.

నేను ఆ పుస్తకం ఏదో సరదాకోసం చదవడం లేదు. మార్పు కోసం చదువుతున్నాను. అందుకే ఎప్పటికప్పుడు అందులో నేర్చుకుంటున్న విషయాలని అమలు చేస్తున్నాను. నిన్న సాయంత్రం కూడా ఆ రోజు చదివేసిన మొదటి అధ్యాయాన్ని అమలు పరిచాను. ఆ సాయంత్రం ప్రశాంతతను సాధించాను, ప్రతిఫలాలను అందుకున్నాను :) ఈ విధానాలు కేవలం భార్యాభర్తలకే అని కాదు - ఏ జంటకయినా ఉపయోగపడుతాయి. ఏ జంటకయినా అనే కాదు - ప్రతి ఒక్క మహిళనూ, పురుషుడినీ అర్ధం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతాయి.

10 comments:

 1. emito nandi naku anta confusion ga vundi. ma husband mee wife laane intloki vastoone adi idi ani okate complaints nenemo..na laptop lo doori potanu. nenu office lo unna kuda phone chesi ninna ala chesevu monna ala chesevu antadu. naku bhale surprise anipistundi intiki vachhe varaku aaga leva , evening discuss cheddam antanu nenu. emito anta reverse la vundi ma intlo chustunte.

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  ఇందులో అయోమయం పడటానికి ఏమీ లేదండీ. అందరూ ఒక్కలా వుండరు కదా. ఇలాంటి పుస్తకాలు వ్రాసినప్పుడు ఎక్కువమంది ఎలా వుంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వ్రాస్తుంటారు. మీ విషయంలో సీను రివర్స్ అయ్యింది కాబట్టి మీ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసిచూడండి. ఈ పుస్తకంలో ఒక భర్త తన భార్యతో ఎలా వుండాలో సూచించినట్లుగా మీరు మీ భర్త పట్ల ప్రయత్నించి చూడండి. అన్ని రకాల పరిష్కారాలూ అందరికీ వర్తించవు. అందుకు పలు కారణాలు వుండవచ్చు. ఫలితం వచ్చేదాకా పలు విధాలుగా ప్రయత్నిస్తూపోవడమే ఎవరయినా చెయ్యాల్సింది. మీరు ప్రయత్నిస్తే కనుక అవి ఎలా కొనసాగుతున్నాయనేది ఈ బ్లాగులో అప్డేట్స్ ఇవ్వగలిగితే సంతోషిస్తాను.

  ReplyDelete
 3. పై వ్తాఖ్య ప్రచురించాల్సిందే అన్నాయ్‌

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  వద్దు బాబో. మీ కామెంట్లు డిలిట్ చెయ్యలేక సస్తన్నా. నాకెందుకండీ ఆ భాగోతాలూ.

  ReplyDelete
 5. శరత్తన్నాయ్‌ నా సూటి ప్రశ్నలని ఎందుకు ప్రచురించడం లేదో వివరణ ఇవ్వాలి

  ReplyDelete
 6. అలా అంటే ఎలా అన్నాయ్‌
  దేశాన్ని పట్టికుదిపేస్తున్న మూడు సమస్యలని ఒక్కతాటిమీదకి తెచ్చి జనాలమీదికొదిలా. నీ బ్లాగు ప్రముఖ తెలుగు బ్లాగుకదా ఇక్కడపెడితే ఎక్కువమంది కళ్ళబడి నాకు సరైన సమాధానమూ ప్రతిస్పందనా లభిస్తుందని.

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  నా మానాన నన్ను వుండనివ్వండి మహాప్రభో!

  ReplyDelete
 8. @ (మొదటి)అజ్ఞాత
  మా ఇంట్లో అలాంటి పరిస్థితి రోజూ వుంటుందని కాదు కానీ అప్పుడప్పుడయినా వుంటుంది.

  ReplyDelete
 9. ఇటువంటి సందర్బాలు నేను చాలా సార్లు ఫేస్ చేశానండి..... నిజముగా చదువుతుంటే నాకు నవ్వొచ్చింది..... అలాగే మీ గత పోస్ట్ లు కూడా చదువుకోవడానికి ఆహ్లాదంగా ఉన్నాయి...... మీకు వీలయితే నా బ్లాగ్ కూడా చూడగలరని.....

  ReplyDelete
 10. @ రాజీవ్
  నా బ్లాగు మీకు ఆహ్లాదంగా అనిపించడం నాకు ఆహ్లాదంగా అనిపించింది. మీ బ్లాగు కొద్దిగా చూసాను. ప్రేమించొద్దు అని యువతీయువకులకి మీరిచ్చిన సలహాతో నేను ఏకీభవించట్లేదు. మీ బ్లాగు అగ్రిగేటర్లలో లేనట్లుందే. వాటిలో జత చెయ్యమని కోరండి. అప్పుడు మీ బ్లాగు అందరూ చూస్తారు.

  ReplyDelete