ఆ విషయంలో మా కుమారస్వామిని మెచ్చుకోవాల్సిందే

కుమార్ స్వామి కుటుంబం మాకు కుటుంబ స్నేహితులు. వారు కెనడాలో వుంటారు. మేము వారింటికి వెళ్ళినప్పుడల్లా నేను ఒకటి గమనిస్తుంటాను. వాళ్లింట్లో పండ్లకి బాగా ప్రాధాన్యత ఇస్తుంటారు. వారి పిల్లలు ఓ పండు తింటే తప్ప చెత్త తిండి తిన నివ్వరు. మామూలుగా మనం వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా, వారు మన ఇంటికి వచ్చినా ఏదో ఒక తయారుగా వున్న చిరుతిండి పెట్టడమో లేక తయారు చేసి పట్టడమో జరుగుతుంది కదా. వీళ్ళింట్లో అలా కాదు. మా కుమార్ వంటింట్లోకి వెళ్ళి పళ్ళు కోసుకు వచ్చి పళ్ళాలలో అందరికీ ఇచ్చేస్తాడు. వాటికి తోడుగా పండుకి తగ్గట్టు ఉప్పో, కారమో, చెక్కరో కూడా చల్లుకువస్తాడు. భోజనాలు అయ్యాక మరో రవుండ్ పళ్ళు సర్వ్ చేస్తాడు. పళ్ళు కోసిపెట్టమని వాళ్ళ ఆవిడని అడగడం చెయ్యడు. తనే చకచకా అన్నీ సిద్ధం చేసేస్తాడు. అందుకే అతగాడిని ఈ విషయంలో మెచ్చుకుంటూవుంటాను.

ఇంట్లో మనం ఆరోగ్యకరమయిన ఆహారమే తిన్నా కూడా వారాంతాలు మనం బయటకో, వేరే వారి ఇంటికో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తరచుగా అనారోగ్యకరమయిన ఆహారమే ఎదురవుతుంది. చక్కటి పళ్ళు అలా ఎదురయ్యేది తక్కువ. మన వారి వేడుకలకి వెళ్ళినా కూడా అదే సమస్య. అలాంటప్పుడు ఆ తిండి తక్కువ తిని ఊరకుండటమే మనం చెయ్యగలిగింది.

కుమార్ లాగా నేనూ ఇంట్లో అలా పళ్ళు సెర్వ్ చెయ్యాలని అనుకుంటూనే వున్నా అలా ఇంకా కుదరడం లేదు. ఇంట్లో పిల్లలకి వెళ్ళి పళ్ళు కోసుకొని తినండి అంటే తినరు. పళ్ళు కోసి సిద్ధంగా, ఎదురుగా పెట్టి తినమంటే తినేస్తారు. నేను అలా చెయ్యాలనుకుంటూనే ఆలస్యం అవుతోంది. నాకు శ్రద్ధ పెరిగేందుకై ఈ టపా వ్రాస్తున్నా. కేవలం పళ్ళే కాదు, పచ్చివో, ఉడికించినవో కూరగాయలు కూడా పిల్లలకే కాకుండా ఎవరయినా వచ్చినప్పుడు కూడా పెడుతూవుంటే వారు కూడా మన నుండి స్ఫూర్తి పొంది వారింటికి వెళ్ళినప్పుడు కూడా మనకు మంచి ఆహారం ఎదురయ్యే అవకాశాలు పెరుగుతాయి.

అవుట్డోర్ ఏక్టివిటీసుకి వెళ్ళినప్పుడు కూడా ఏదేదో చెత్త ఫుడ్డు తీసుకెళుతుంటాం. అలా కాకుండా నేనయినా శ్రద్ధ పెట్టి వాటిల్లో కూరగాయలు, పళ్ళు పెంచేద్దామనుకుంటున్నా. వివిధ సందర్భాల్లో ఎలాగయినా సరే జంక్ ఫుడ్డు, హై కేలరీ ఫుడ్డు తినకతప్పదు కానీ ఇలా మనం చేస్తూపోతే కాస్తయినా అనారోగ్యకరమయిన ఆహారం తగ్గించిన వారం అవుతాం కదా.

7 comments:

  1. నేనూ ఆ మద్య ఆఫీస్ కి ఉడకపెట్టిన కారెట్లు, కట్ చేసిన ఆపిల్ ముక్కలూ, విడదీసిన ఆరెంజ్ పళ్ళ భాగాలు(?) ఒక ఫోర్కు తీసుకెళ్ళేవాడిని.. ఇప్పుడు ఉద్యోగం మారి ఆ సంగతే మర్చిపోయా... మళ్ళీ మొదలు పెట్టాలి..గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు..

    ReplyDelete
  2. @ కాయ
    మాండరిన్ ఆరెంజ్ తొనలు బావుంటాయి. అవి తింటుంటారా? తేలిగ్గా వచ్చేసే పొట్టు తీసేసి పండు మొత్తం గుటుక్కున నోట్లోవేసుకోవచ్చు. చక్కటి రుచిగా, రసంగా వుంటాయవి.

    ReplyDelete
  3. sarat garu....

    Nenu Chennai lo vunnapudu naku eddaru friends viundevallu....every weekend fruit market ki velli oka auto rikshaw ninda Fruits thechuukoni BF ki,Lunch ki fruits matrame thinevaru...kani variki eppudu ROGALE(jabbule).....mari fruits matrame thinadavalla healthy ga vunta ra....

    ReplyDelete
  4. @ అజ్ఞాత
    పళ్ళకి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి కానీ మొత్తం పళ్ళు మాత్రమే తింటూపోతే అనారోగ్యం వస్తుంది. పళ్ళల్లో అన్ని రకాల పోషక పదార్ధాలు లభించవు కదా. రోజూ ఏమేం తింటే మంచిదో ఇక్కడ చూడండి.

    http://www.choosemyplate.gov/

    ReplyDelete
  5. అవే అవే... పండు మొత్తం తొన తీసి నోట్లో వేస్కోవచ్చు కానీ.. మెల్లగా చప్పరించి చప్పరించి మింగటం సూపర్ ఉంటుంది.. అందుకని ఒక్కో ఆరెంజ్ ముక్క(?) గుటకలు వేస్తూ, చప్పరిస్తూ తింటా..

    ReplyDelete
  6. మా ఫ్రెండ్ కూడా అలానే చేస్తుంటాడు
    వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు , టిఫిన్స్ తినరు
    కేవలం ఆపిల్ , ద్రాక్ష, సపోటా ఆరెంజ్ ... ఇట్లా తింటారు
    సరే కదా అని నేను కూడా తలొక వెరైటీ 50 తీసుకెళ్ళి ఫ్రిజ్ నింపెసా
    మొహం మొత్తి తినటం మానేశారు
    ఆఖరికి మా నాన్న గారు , అమ్మ గారు కూడా తినలేదు
    సరే లే గుంపులో గోవిందా అని నేను కూడా ఉప్మా, దోశ, ఇడ్లీ లతో సరిపెట్టుకుంటున్నా

    ReplyDelete
  7. @ అప్పి
    ఎక్కువ భాగం పళ్ళు, కూరగాయలు తింటే మంచిదే కానీ అస్తమానం అవే తినాలంటే ఎవరికయినా మొహం మొత్తుతుంది. ఏదయినా సరే బ్యాలన్స్ చేసుకోవాలి.

    ReplyDelete