ఆడదానికి ఏం కావాలి?

స్త్రీకి పురుషుడి నుండి ప్రేమ కావాలని మరీ పద్ధతిగా చెప్పమాకండి. అది అందరికీ తెలిసిందే కదా. వేరే సంగతులు చూద్దాం. శ్రద్ధ, అవగాహన, గౌరవం, అంకితత్వం, ఆమోదం, భరోసాలు స్త్రీలకు బాగా అవసరమయిన ఆంశాలని రచయిత జాన్ గ్రే చెబుతారు. ఆ ఎమోషన్స్ ఆడవారికి ముఖ్యంట. అవి మగవారికీ, అందరికీ అవసరమే కానీ స్త్రీల విషయంలో మాత్రం మగవారి నుండి అవి బాగా ఆశిస్తారు.

శ్రద్ధ: ఆడవారేమన్నా అప్సెట్టయ్యారని అనిపించిదనుకోండి. మనమేం చేస్తాం? ఆత్మరక్షణకి ప్రయత్నిస్తాం. అలా చెయ్యొద్దు - తల తీసుకువెళ్ళి రోకట్లో పెట్టెయ్యమని చెబుతాడీ రచయిత. వాళ్ళ బాధలూ గట్ర వినెయ్యాలిట. వాళ్ళు మనల్ని తిడుతున్నా, అవమాన పరుస్తున్నా నోరు మూసుకొని కూర్చొని వాళ్లకి కలిగిన కష్టాలకి గాను సానుభూతి ప్రకటిస్తుండాలిట. వాళ్ళ సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తుండాలిట. ముందు కాస్త ఇబ్బంది పడితే పడ్దారు కానీ పారిపొవద్దంటాడు. అలా వాళ్ళు మన బుర్రల్ని దంచీ దంచీ విశ్రాంతి పొందుతారుట. మగవారు  పరుగెత్తితే ఆశాభంగం చెందుతారుట. అలా వారు కష్టపడి అనగా మన బుర్రల్ని తినీ సేదతీరాకా మన ఓపికని మెచ్చుకొని మనతో మంచిగా వుంటార్ట. మరి తెలిసీ, తెలిసీ రోట్లో తల పెట్టే ధైర్యం మీకు వుందా? నాకయితే ఇంకా రాలేదు సుమండీ. ప్రాక్టీసు చేస్తున్నా. ఇదివరలో గొడవ పెట్టేసుకొని మరీ పారిపోయేవాడిని. కాకపోతే ఈ పుస్తకం చదివాక మౌనంగా పారిపోతున్నా. కొంచెం బెటరూ.

అవగాహన: వాళ్ళ పట్ల మనకుండే అవగాహన వారిని సంతోషపెడుతుందంట. ఎప్పుడూ, ఎక్కువగా మన గురించి మనమే పట్టించుకోకుండా వారి యొక్క ఆసక్తులూ, అభిరుచులూ, ఆత్మాభిమానాలూ దృష్టిలో వుంచుకొని ప్రవర్తిస్తే వాళ్ళు ఎక్కువ సంతోషంగా వుంటారు.

గౌరవం: మగవారి కన్నా ఎక్కువగా గౌరవానికి స్త్రీలు ప్రాధాన్యత నిస్తారు. తరతరాలుగా మనం స్త్రీలను చెప్పుకింద తేలులాగా అణిచివేస్తూ వస్తున్నాం  కాబట్టి వారికి తగినంత గౌరవం ఇవ్వడానికి ఇష్టపడుతుండకపోవచ్చు. వాళ్ళు మనకు గౌరవం ఇస్తుండాలి కానీ మనం వారికి ఇవ్వడం ఏంటి అని అనిపిస్తుండొచ్చు. నేను అప్పుడప్పుడు మా ఆవిడని చాలా ఈజీగా తీసిపారేస్తుంటాను. అప్పుడు ఆమె గౌరవానికి భంగం కలిగినట్లు అనిపించినా తేలిగ్గా తీసుకుంటాను. అలాంటి విషయాల్లో నేను సవరించుకోవాల్సివుంది. వారు చెప్పేవి నచ్చకపోయినా, విభేదాలు వున్నా అవి సగౌరవంగా తెలియజెయ్యాలి కానీ తీసిపారేస్తే వారియొక్క అహం దెబ్బతిని మనమీది గౌరవం తగ్గుతుంది. అగౌరపరచకుండా వుండటమే కాకుండా వారి పట్ల బహిరంగంగా కూడా సముచితమయిన గౌరవం చూపిస్తూపోయినప్పుడు బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి. స్త్రీలకు తమ రెస్పెక్ట్ పట్ల అంత పట్టింపు వుంటుందని అనుకోలేదు.

అంకితత్వం: వారి పట్ల మనకుండే నిబద్ధత వారిని చాలా సంతృప్తి పరుస్తుంది. వారి పట్లనే మనం ఫోకస్ చేసి వుండటం వారిని ఆహ్లాదపరుస్తుంది. మనం సాధారణంగా మన పట్లనో లేక మన ప్రియురాలి పట్లనో ఫోకస్ చేసివుంటాం కానీ ఇంట్లో ఆవిడ పట్ల మనకు ఫోకస్ ఎందుకుంటుందీ? బోరు కొట్టదూ. వారికి విశాలభావాలు అయినా నేర్పించాలి లేదా మనం అలాంటి విషయాల్లో కుచించుకుపోవాలి.

ఆమోదం (వాలిడేషన్): ఈ పాయింట్ నాకు సరిగ్గా అర్ధం కాలేదు. మరోసారి చదవాలి కానీ అర్ధం అయినంతవరకు వ్రాస్తాను. అప్సెట్ కావడం ఆడవారి హక్కు అంటాడు రచయిత. వాళ్ళు మానసికంగా బాధల్లో వున్నప్పుడు ఏవో కొంపలు మునిగిపోతున్నాయని ఖంగారు పడి ఎందుకలా కంగారు పడిపోతున్నావంటూ వారిని కంగారు పెట్టకుండా తాపీగా మనల్ని వుండమంటాడు. వారి యొక్క అప్సెట్ మైండ్ వాలిడే అంటాడు. వాళ్ళలా కాసేపు బాధపడి బయటకి వస్తారని ఈలోగా ఎందుకలా అని అడగకుండా వారికి కావాల్సినంత సానుభూతి ప్రవహింపచెయ్యమనీ రచయిత సలహా.

భరోసా: వారికి అన్నివిధాలా, అన్ని వేళలా భరోసాగా వుండాలి. నేనున్నాను కదా, నీకెందుకు భయం, అంతా మంచిగా జరుగుతుందిలే అనే విశ్వాసాన్ని వారికి అందివ్వగలగాలి.  ఇదే సందు అనుకొని ఉచిత సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోవాలి. వారి యొక్క ఆందోళన సబబు అయిందని గుర్తిస్తూ సానుభూతి, ధైర్యం చెప్పాలి కానీ అందులో సమస్య ఏముంది, అంతా నువ్వు చేసుకున్నదే, నీ ఖర్మ, అందుకు బాధ్యత నీదే, నువ్వు ఇలా చేస్తే సమస్యలు కొని తెచ్చుకుంటావు అని వారు వర్రీలో వున్నప్పుడే వాయించొద్దు. ఏ విషయం ఎప్పుడు ఎలా చెబితే బావుంటుందో కూడా ఆ పుస్తకంలో జాన్ గ్రే వివరించాడు.

మరి స్త్రీనుండి పురుషుడికి ఏం అవసరమో ఇంతకుముందు టపాలో చెప్పుకున్నాం కదా.  నమ్మకం, అంగీకారం, ప్రశంస, ఆరాధన, అనుమతి, ప్రోత్సాహం. ఆడవారికి ప్రాధాన్యమయినవేమో ఇవీ: శ్రద్ధ, అవగాహన, గౌరవం, అంకితత్వం, ఆమోదం, భరోసాలు. ఇలా ఆడవారి, మగవారి ప్రాధాన్యతలకు వున్న తేడాల్ని గమనించుకుంటూ పోతే ఎంతో కొంత సఖ్యత అయినా వున్నదానికంటే మెరుగుపడుతుంది కాదూ?

మగవాడికి కావాల్సిందేమిటి?

సెక్స్ అనమాకండి మరీ సీపుగా వుంటుంది :) అది ఎలాగూ కావాలి కానీ కాస్సేపు అది పక్కన పెట్టి వేరే విషయాలు చూద్దాం. స్త్రీ నుండి పురుషుడికి నమ్మకం, అంగీకారం, ప్రశంస, ఆరాధన, అనుమతి, ప్రోత్సాహం అవసరం అని మార్స్ నుండి మగాళ్ళు... పుస్తక రచయిత జాన్ గ్రే అంటాడు. సర్లెండి, 'మా ఆయనే వుంటే...' అన్న సామెత అనుకోవాల్సివస్తుంది. అంతా దృశ్యం వుంటే ఇంకా సమస్యేమిటంటా? సరే, ఆ పుస్తకం చూసయినా ఆడవాళ్ళు ఎవరయినా తమ మగవాడికి కావాల్సిందేమిటో గుర్తిస్తారని రచయిత ఆశాభావం అయ్యుంటుంది.

నమ్మకం: కాస్త మగవాడు చేసే పనుల పట్ల నమ్మకంతో వుండి సలహాలు గట్రా ఇస్తూ పోవద్దంటాడు. అలా సలహాలు ఇస్తూ పోతే మగ అహం దెబ్బతింటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అవసరమయితే అతగాడే అడుగుతాడు, ఎంచక్కా అప్పుడు ఇద్దురు కానీ. అందాకా కాస్త ఆగుదురూ. నీకేమీ తెలీయదు, నీకేమీ తెలియదు, నేను చెబుతాగా అని మీ ఆయన్నో, ప్రియుడినో అస్తమానం అన్నారనుకోండి. సరే, ఇక నాకేమీ తెలియదు కదా అని తమకు తాము నమ్మేసుకొని తాపీగా వుండిపోతుంటారు.

అంగీకారం: మొగుడు ఐడియల్ హి కావాలని ఆశించకుండా అతగాడిని వున్నదున్నట్లుగా అంగీకరించగలిగితే చాలా సమస్యలు వుండవంటాడు. కొంతమని ఆడవారు ఏం చేస్తారంటే పక్కింటాయనలో చూసిన గొప్పతనాలు అన్నీ తమ భర్తలో కావాలంటారు. పోలికలు చెబుతూ అలా మారాలని పోరాటాలు చేస్తుంటారు. మగవాడిలోని గొప్పతనాలని, లోపాలని వున్నదున్నట్లుగా అంగీకరించగలిగితే అనవసరమయిన అంచనాలు పెట్టుకోకుండా సంతృప్తితో వుండగలుగుతారు. ఉదాహరణకు మీ ఆయన చక్కని బ్లాగర్ అనుకోండీ. చక్కని బ్లాగరన్న సంగతేమో కానీ కనీసం బ్లాగరు అని అయినా మీరు గుర్తించగలగాలి కదా.

ప్రశంస: మనం సాధారణంగా వీజీగా విమర్శిస్తుంటాం, చాలా కష్టంతో మెచ్చుకుంటుంటాం. ఆ ధోరణి తారుమారు అయితే ఎంత బావుండును. విమర్శించడానికయితే మనకు ఓపిక, తీరిక, మనస్సూ తేలిగ్గా వచ్చేస్తుంటాయి. అదే ఒక విషయం మెచ్చుకోవాలంటే మనకు అంతగా అవి కలిసి రావు. ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావాలంటే మంచి విషయాలను మెచ్చుకుంటూపోవడం ద్వారా కూడా కొంత వీలు అవుతుంది. అలా కాకుండా పదేపదే విమర్శిస్తుంటే మనిషి బండబారిపోతాడు.

ఆరాధన (అడ్మిరేషన్): కొంతమంది చక్కటి భార్యలు తమ భర్త పట్ల అబ్బురంతో వుంటుంటారు. వారు చేసే పనులకి మురిసిపొతూ, పదేపదే మెచ్చుకుంటుంటారు. ఇండియాలో వున్నప్పుడు ఓ మిత్రుడి భార్య తన భర్తని పదేపదే మెచ్చుకుంటూ మురిసిపోయేది. మా ఆయన అయితే, మా ఆయన అయితేనా అంటూ అతగాడి గొప్పతనాలు చెప్పుకువచ్చేది. అలాంటప్పుడు ఆ భర్తకి తనమీద తనకు ఎంత నమ్మకం ఏర్పడుతుంది చెప్పండి. ఇంకొందరుంటారు - మా ఆయన ఓ సన్నాసి అని చెప్పుకోవడం స్టైల్ అనుకుంటారు. అలాంటి మాటలు వినీ వినీ ఆ మగాడు సన్నాసిగా మారక ఇంకేం అవుతాడూ?

అనుమతి (అప్రూవల్): ఎడ్డెం అంటే తెడ్డెం అనే పెళ్ళాం వున్నప్పుడు మగాడికి ఏమీ చెయ్యబుద్ధి కాదు. మొండికెయ్యబుద్ధి అవుతుంది. ఎలాగూ కొన్ని విషయాల్లో ఏకీభవించడం కుదరకపోయినా వీలయినన్ని విషయాల్లో మొగుడి పని మొగుడిని చెయ్యనిస్తే బావుటుంది. ప్రతి పనినీ విమర్శిస్తూ అడ్డుతగులుతూ వుంటే ప్రియుడికి అయినా సరే తన లవర్ మీద చిరాకు వేస్తుంది.

ప్రోత్సాహం: నిజంగా చెప్పండి. మీవారిని లేదా మీ స్నేహితుడిని లేదా మీ ప్రియుడిని ప్రోత్సహించి ఎన్నాళ్ళవుతోంది? మీరు పదే పదే పలు విషయాల్లో ఎంకరేజ్ చేసే వ్యక్తులయితే మీ భర్తకి అది ఎంత ఆనందకరయిన విషయం! భర్త అంటే భరించువాడు అనుకోవడమే తప్ప తనకో స్వంత వ్యక్తిత్వం వుంటుందనీ, తనకీ ఆసక్తులూ, అభిరుచులు వుంటాయని కొంతమంది గుర్తించరు. ఇంట్లో అలాంటి ప్రోత్సాహకరమయిన వాతావరణం వుంటే పురుషుడికి ఎంతో ఉత్సాహంగా వుంటుంది.

అలాగే స్త్రీలకు పురుషుడు ఇవ్వాల్సిందేమిటో కూడా రచయిత చర్చించాడు. అవి మరోసారి చూద్దాం. మగవారి మరియు ఆడవారి ఎమోషనల్ అవసరాల మధ్య తేడాలుంటాయంటాడు. అందరికీ అన్నీ కావాలి కానీ ప్రాధాన్యతల్లో తేడాలుంటాయి. అవేమిటో దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తే కొన్ని సమస్యలయినా పరిష్కారం అవుతాయి కదా.

మీ అందరికీ రిధ తండ్రి నుండి...

ముందు ఈ టపా చదవండి
ఆ తరువాత ఈ టపా చదవండి
 
I am a li'l lazy guy in some respects one of them being calling people by thier names. Whenever I find someone with a long name, I frankly ask them how I can call them shortly. For ex: Mallikarjun becomes Malli, Sudhakar becomes Sudha, Abhishek becomes Abhi, Chandrasekhar becomes Sheki etc.

I am Naveen, father of "RIDHA". When Sarat mama had discussed about posting our debate in his blog, I took it casually until I checked this page. Thankyou all for involving/contributing your suggestions. Naming our baby is a tough job. Let me give you some idea of my context. This may help you understand why I have opted for RIDHA instead of many other alternatives.

When I had a baby girl, I wanted the name to

1. sound short and sweet

2. sound simple

3. have a simple spelling

4. have some context of a meaning/origin

5. My son - Elder to the new baby - is named ROSHAN.

Since I have a relatively long surname (10 letters) and then "REDDY" (5 letters) as middle name, I wanted my kids to have short names. I remember many times, counting no. of boxes for filling our name on diff. forms in USA.

These names sound long/complex/too heavy to me: Harshini, Jyothirmayi, Sree Harsha, Jyotsna, Bhavani,

These names sound pleasant to me: Hasini, Manasa, Hamsa, Sanvi, Navya, vennela,

These names sound too common: Rani, Kumari, Laxmi,

Now, you may get an idea of my liking towards few names and the reasons behind them. I like "light" names.

Without touching the many factors of decision on why we have shortlisted RIDHA (or its alternative spellings) among many other names, lets look into how it is best spelled vs pronounced?

How do you pronounce RADHA? While pronouncing, just change 'aa' to e'' (Not spelling wise, but pronounciation wise) and pronounce it . That's RIDHA.

If you are OK with this until now, let me share with you another point. As I looked into your comments, and started typing this response, I have realized that the real reason (culprit?) behind our debate arose from this fact. My mama Sarat gave his suggestion in telugu font రిథ in an email to me. Now, since my upbringing has been mainly in English (Central School, Australia, USA, reasonably good standard in English...etc.) I have started typing it/writing it at home in 'names shortlisting exercises' in English and ..... has been written as RIDHA.

Only while confirming/finalizing the name among ourselves, the spelling question came up. I tried RITA, RITHA, RIDA, RIDHA. I have intensionally stayed away from "rYtha" kind of names to avoid complex naming with the letter "Y". Among these, RIDHA looked better to me. The closest comparision was with RITHA, but sounded too soft. RIDHA gave some weightage to the name. I don't mean weightage as in the sense of spirutual/religion/as purohits suggest but in the true sense of boldness/weight. Try speaking out, Boomika vs Bhoomika / Deera vs Dheera / Druva vs Dhruva etc.

Bottomline: (If you are still reading this and having some fun :) )

RHYTHM is the base word for this name. Pronounce it loudly and you will see it close to RIDHAM (as in DHA), and not RITHAM (as in THA). Now, I went by the "sound" of it rather than spelling while shortening it and making a name out of it, simplified the spelling to sound like RIDHA.

OOoooohhh....Telugu lo type chesunte, baagundedhi emo... too lazy to start exploring.

Mama, enjoyed all your friends'/community's responses. Kudos to your energy levels and enthusiasm in maintaining these blogs and keeping them current and live.

Cheers,
Naveen.

నిన్నెక్కడో చూసినట్లుందే!

మీకు ఆమ్వే సంస్థ ఏజెంట్లు ఎప్పుడన్నా తటస్థపడివుండవచ్చు. షాపింగ్ మాళ్ళలోనన్నా, ఎక్కడన్నా మనని ఆపి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే" అని బోలెడంత ఆశ్చర్యపడుతారు. మనం బకరాలం అయివుంటే ఎంచక్కా ఆ మాటలకు పడిపోతాము. అలా వారు మనల్ని కూర్చోబెట్టి కబుర్లు చెప్పి ఇంటర్నెట్టు వ్యాపారం అంటో సుత్తి బయటకి తీస్తారు.  మా చిన్నమ్మాయికి ఆ సంస్థలో సభ్యత్వం ఏమీ లేదు కానీ ఆ టెక్నిక్ బాగనే ఉపయొగిస్తుంది. స్నేహాలు పెంచుకోవడానికి తన వయసు వారెవరన్నా కనపడితే ఆపేసి "నిన్నెక్కడో చూసినట్లుందే!" అని దీర్ఘం తీస్తుంది. లేకపోతే వారి తల్లితండ్రులతో "మీ పాపని ఎక్కడో చూసానూ" అంటుంది. అలా స్నేహం మొదలెట్టి ఆ పిల్లలతో చక్కగా ఆడుకుంటుంది. మంచి విషయమే. ఇతరులతో ఎంతో చక్కగా స్నేహాలు ప్రారంభిస్తావూ అని అమ్మలుతో అంటూవుంటాను.   పెద్దల్లో కానీ, పిల్లల్లో కానీ ఎవరిలోనన్నా మంచి విషయం కనపడితే తను ఎంతో బాగా ప్రశంసిస్తుంది.

వాళ్ళ ఫ్రెండు ఇంటికి Bonfire కి వెళ్ళిన మా పెద్దమ్మాయిని పికప్ చేస్తూ మా ఇంటికి దగ్గర్లోనే వుండే ఇంకో స్నేహితురాలినీ ఈమధ్య మా కారులో పికప్ చేసాను. క్రిస్టినా ఆమె పేరు. మా SUV లోకి ఎక్కడంతోటే పెద్దగా వుందే ఈ కారూ అని మెచ్చుకుంది. అలా ఆమె నన్ను గోకేసింది. బ్లాగుల్లో చూస్తేనే వుంటాం కదా ఒకరి వీపులు మరొకరం   గోక్కోవడం, కామెంట్లు గీక్కోవడమూనూ. మరి ఆమె వీపు కూడా నేను గోకెయ్యాలి కదా. మీ ఇంట్లో చాలా  కార్లు వుంటాయి కదా అన్నాను. అవును - ఆరు కార్లు వుంటాయీ అని అంటూ చెప్పుకువచ్చింది. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు మరియు పెద్ద కుటుంబం మరి. అలా ఒకరి వీపు మరొకరు గోక్కోవడంలో తప్పులేదు. అయితే ఆ మెచ్చుకోళ్ళు హృదయపూర్వకమయినవీ, నిస్వార్ధమయినవీ అయివుండాలి. అప్పుడే అవి ప్రభావవంతంగా వుంటాయి. ఊరికే పొగిడేస్తే వచ్చే ప్రయోజనాలు అంత మంచివి కావు, దీర్ఘకాలంలో తేలిపోతాయవి.

క్రిస్టినా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలేమీ చదివివుండకపోవచ్చు. ఇతరులను ప్రశంసించే సంస్కృతి ఆమెకు కుటుంబ వారసత్వంగా, కుటుంబ కల్చరుగా అందివచ్చియుండవచ్చు. ఆమె ఓ మెచ్చుకోలు ఇవ్వడానికి క్షణకాలం కూడా తటపటాయించలేదు, ఆలస్యం చెయ్యలేదు. మా కారు ఎక్కేసిందో లేదో మెచ్చేసుకుంది. అలా ఆమె వ్యక్తిత్వం నాకు నచ్చేసింది. అలా ఆమె నా మీద తనదైన తరహాలో పాజిటివ్ ముద్ర పడేసింది. ముందుముందు రోజుల్లో ఆమె సమక్షంలో ఆమె బాయ్‌ఫ్రెండో, భర్తో ఎల్లప్పుడూ అహ్లాదంగా గడపగలడనంలో నాకు సందేహం లేదు.

మెచ్చుకోళ్ళలో ధారాళంగానూ, విమర్శలలో పొదుపుగానూ వుండాలని పర్సనాలిటీ గురూలు      చెబుతూవుంటారు.

మొన్న ఓ ప్రముఖుడిని కలిసాను

మొన్న మా కుటుంబంతో కలిసి షికాగో తెలుగు సంఘం వారి పిక్నిక్కుకి వెళ్ళాను. అక్కడ కాస్త దూరంగా మాట్లాడుతున్న వ్యక్తిని చూసి తెల్సిన ముఖం లాగే వుందే అనుకున్నాను. ఆ తరువాత కొంత సేపయ్యాక చెట్టుకింద కుర్చీల్లో కూర్చొని తెలిసినవారితో మాట్లాడుతుంటే వారూ ఇతరులతో కలిసి అక్కడికి వచ్చి నా పక్కనే కూర్చున్నారు. దర్జాగా కాలుమీద కాలు వేసుకొని విలాసంగా కాలు ఊపుతూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరబ్బా ఇంత దర్జా మనిషీ అనుకున్నాను. ఓ ప్రముఖ వ్యక్తి లాగానే పోలికలు వున్నాయే అనుకున్నాను. నాకు మరో పక్క కూర్చున్న మరో వ్యక్తిని అడిగాను వారు ఎవ్వరని. చెప్పారు, ఆశ్చర్యపోయాను. వారిలా వున్నారనుకున్నాను కానీ సాక్షాత్తూ వారే ఇక్కడ, నా పక్కనే ప్రత్యక్షమవుతారని అనుకోలేదు. కస్సేపు వారి ముచ్చట్లు విని పనివుండి పక్కకు వెళ్ళిపోయాను.

ఆ తరువాత నాలో వున్న బ్లాగర్ దురద పెట్టడం మొదలెట్టాడు. ఆ తరువాత అవకాశం చూసుకొని వారిని కదిపాను. మీ పేరిట ఏమయినా వెబ్ సైట్ వుందా అని అడిగాను. లేదు కానీ ఇప్పుడు కాస్త తీరిగ్గానే వుంటున్నాను కాబట్టి ఒక వెబ్ సైటు కానీ బ్లాగు కానీ తెరిచే వుద్దేశ్యం వుంది అని తెలియజేసారు.   హమ్మయ్య దొరికారు అనుకొని వెబ్సైటు కంటేనూ బ్లాగు ప్రారంభించడం తేలిగ్గా వుంటుందని చెప్పాను. ఎలా మొదలెట్టాలో తెలియదు, మీ ఫోన్ నంబర్ వుంటే ఇవ్వండి, ఆ సమాచారం కోసం ఫోన్ చేస్తాను అన్నారు.  మహా సంతోషంగా నా విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను. అందులో నా ఫోన్ నంబర్, ఈమెయిల్, బ్లాగు పేరు వుంటుందని చెప్పి చూపించాను. చూసి శరత్ కలం అన్నారు. కాదు శరత్ కాలం కానీ కలం కూడా అనుకోవచ్చు అని అన్నాను.  ఈమెయిల్ ఇచ్చినా, ఫోన్ చేసినా బ్లాగు ఎలా తేలిగ్గా మొదలెట్టాలో చెబుతాను అని అన్నాను.

నేను వారి వెబ్ సైటు గురించి అడిగినప్పుడే తమ యొక్క ఈమెయిల్ బాధలు నాతో చెప్పుకున్నారు కాబట్టి వారి ఈమెయిల్ నేను అడగలేదు. వారికి టన్నుల కొద్దీ ఈమెయిల్స్ వస్తుంటాయిట. వాటినన్నింటినీ చదవడం కష్టంగా వుందని నాతో వాపోయారు. అంత ప్రముఖులకి ఆ మాత్రం అవస్థ సహజమే కదా. వారికి బ్లాగింగ్ మీద ఆసక్తి వుంటే వారే ఈమెయిల్ ఇస్తారని అనుకున్నాను. చూద్దాం. అయితే ఓ బ్లాగు మొదలవుతుంది కాకపోతే పోయింది నా ఒక్క విజిటింగ్ కార్డ్ అంతే కదా. వారు ఒక చక్కని బ్లాగు మొదలెడతారని, వారియొక్క ఆలోచనలూ, అనుభవాలూ మనతో పంచుకుంటారని ఆశిద్దాం.

వారెవరంటే విజయరామారావు గారు. మాజీ సి బి ఐ డైరెక్టర్. మాజీ రాష్టమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు. వారికిప్పుడు 75 ఏళ్ళుట. అందుకే రాజాకీయాల్లో మరీ అంత చురుకుగా లేనని చెప్పుకువచ్చారు.

రిథ

కొన్ని నెలల క్రిందట మా మేనల్లుడికి పుట్టిన పాపకు పేర్లు సూచించమని కోరాను. గుర్తుండే వుంటుంది. చాలామంది చాలా చక్కటి పేర్లు సూచించారు. అయితే నేను సూచించిన పేరే అన్నిట్లో కన్నా బాగా నచ్చడంతో రిథ పేరు ఆ పాపకి నిర్ణయించారు. పేర్లు సూచించిన వారికి అందరికీ ధన్యవాదాలు.

అయితే ఇప్పుడే ఆ పేరుకి తగ్గ ఇంగ్లీషు స్పెల్లింగ్ గురించి వాడూ నేనూ ఫోనులో కొట్లాడుకున్నాం. తనేమో Ridha స్పెల్లింగ్ పెడితే పేరులో గాఢత వస్తుంది అంటాడు. అలాయితే రిఢ అవుతుంది కదా అంటాన్నేను.  నేనేమో Ritha అంటాను. అలా అయితే రిత అయిద్ది కదా అంటాడు వాడు. రిత కి స్పెల్లింగ్ Rita కదా అంటే అది రీటా అవుద్ది కదా అంటాడు. కాస్త ఇంగ్లీషు స్పెల్లింగుల గురించి తెలిసినవారెవరన్నా రిథ పేరుకి సరి అయిన స్పెల్లింగ్ సూచించగలరు.  పాప ఇండియాలో వుంది కాబట్టి పేరు రిజిస్ట్రేషనుకి అంత తొందరేమీ లేదు. Rhythm పదం నుండి రిథ పేరు సంగ్రహించాము కాబట్టి Rhytha వుంటే బావుంటుందంటారా? అప్పుడు చదివిన వారు రైతా అనుకుంటారేమో.

మీకు బాగా నచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఏంటి?

నచ్చడం అంటే చదవడానికి సరదాగా వున్న పుస్తకాలు అని కాదు. మీలో పరివర్తనకి లేదా మార్పుకీ లేదా విజయానికీ దోహదం చేసిన పుస్తకాలు అన్నమాట. నేను ఎన్నో పుస్తకాలు చదివినప్పటికీ మొదటి స్థానం డేల్ కార్నెగీ వ్రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లుయెన్స్ పీపుల్ అనే పుస్తకానికి ఇస్తాను. అలాగే మీ ఉద్దేశ్యంలో మంచి పుస్తకాలు ఏంటో చెప్పండి. మార్స్ నుండి మగాళ్ళు... అన్న పుస్తకం చదువుతూ సిరీస్ వ్రాస్తున్నా కదా. ఆ తరువాత ఏం పుస్తకం చదివి వ్రాయాలా అని చూస్తున్నాను. అది నా దగ్గర లేకపోతే ఈ లోగా తెప్పించిపెట్టుకోవాలి కదా.

మీరు తెలుగు పుస్తకలు కూడా సూచించవచ్చును కానీ అవి నాకు ఇప్పటికిప్పుడు తెప్పించుకోవడానికి కుదరదు. ఇంగ్లీషు పుస్తకాలయితే వెంటనే అమెజాన్ సైటులో ఆర్డర్ చెయ్యవచ్చు. తెలుగు పుస్తకాలూ వేరే సైటుల్లో దొరికినా తెప్పించుకోవడానికి ఆలస్యం మరియు ఎక్కువ ఖర్చూ అవుతుంది. మీకు నచ్చిన పుస్తకం చెప్పడంతో పాటుగా వీలయితే ఆ పుస్తకం ఎందుకు నచ్చిందో కూడా క్లుప్తంగా నయినా చెప్పగలిగితే ఇంకా బావుంటుంది.

నాకు డేల్ కార్నెగీ పుస్తకం ఎందుకు నచ్చిందంటే అది ఇతరుల మనస్థత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇతరులను ప్రభావితం చెయ్యడం ఎలాగో తేలికపాటి పద్ధతుల్లో సూచిస్తుంది. కొన్ని సమస్యలను ఎలా సులభంగా పరిష్కరించుకోవచ్చో తెలియజేస్తుంది. ఆ పుస్తకం చదవడం సరదాగా, సరళంగా వుంటుంది. 

నేనెందుకిలా పుస్తకాలపై పడ్డాను?

తొలిసారిగా కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్న రోజులవి. ఖమ్మంలోని మెగాబైట్స్ విద్యా సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా చేస్తున్నాను. ఊరికే విద్యార్ధిగా వుండకుండా ల్యాబ్ అసిస్టెంటుగా కూడా చేస్తుండేవాడిని. అలా కొద్దిరోజుల్లోనే ల్యాబ్ మేనేజర్ అయ్యాను. అలా కూడా ఊరుకోకుండా డిప్లమా విద్యార్ధులకు పాఠాలు చెబుతుండేవాడిని. అప్పుడు నా శ్రమ చూసి ఒకరన్నారు "ఇలా చెయ్యడం ఇటు శరత్తుకీ లాభం - అటు ఆ సంస్థకీ లాభం". అది నిజం. అలా చెయ్యడం వల్ల, ఇతరులకి బోధించడం వల్ల నేను నేర్చుకుంటున్న పాఠాలు నాలో బాగా ఇంకిపోయేవి. నేను ఉచితంగా పనిచేస్తుండటం వల్ల అటు ఆ విద్యాసంస్థకూ కొన్ని ఖర్చులు తప్పేవి. ఇలా మనం ఏది చేసినా విన్-విన్ సిచువేషన్ గా వుండేట్లు చూసుకుంటే బహుళ ప్రయోజనాలు వుంటాయి. ఇంకో లాభం కూడా వుండేది. అలా ఆ సంస్థలో పలు పాత్రలు పోషించడం వల్ల అందరికీ తలలో నాలుకలా వుండేవాడిని, అందరికీ ప్రీతిపాత్రుడిని అయ్యేవాడిని, అన్ని విషయాలను నేనే సమన్వయం చేసేవాడిని. క్లాసులో, ఆ సంస్థలో మొదటగా నేనే వచ్చేవాడిని.

ఆ తరువాత అదే టెక్నిక్ విజయం-విజయం పరిస్థితి అన్ని సార్లు కాకపోయినా చాలాసార్లు ఉపయోగించాను. బ్లాగుల్లో కూడా ఎలా ఉపయోగించాలా అని ఈమధ్య ఆలోచించాను. మామూలు కబుర్లు వ్రాస్తే నాకు గాని, చదువుతున్న మీకు గాని ప్రయోజనం ఏముంది? చాలామందికి వుంటుంది తమ నాన్నారి గురించి వ్రాయాలని, తమ పిల్లల గురించి వ్రాయాలని, తాము చదువుతున్న పుస్తకాల గురించి వ్రాయాలని. చాలామంది తమ అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, చదివిన పుస్తకాలు, చూసిన సినిమాల గురించి వ్రాస్తూనేవుంటారు. ఇంకొంతమంది వాటి గురించి విశ్లేషిస్తూనేవుంటారు. అలా తమ గురించి వ్రాసుకోవడం చెప్పుకోవడం ఎవరికయినా సరే అలాగే నాకయినా సరే ఉత్సాహంగానే వుంటుంది. అయితే వాటిని చదివిపడెయ్యడమేనా? ఊరికే మన సొల్లు కార్చుకుంటూ వెళుతుంటే ఎవరికి ఆసక్తి వుంటుంది? మరీ బాగానో, నవ్వు తెప్పించే విధంగానో వ్రాస్తే కాలక్షేపం కోసం కొంతమంది చదువుతుండొచ్చు. అంతకుమించి అలాంటి వ్రాతల వల్ల నాకు గానీ, మీకు గానీ ప్రయోజనం ఏముంటుంది?

అలా అని బొత్తిగా నా గురించి ప్రస్థావించకుండా అస్థమానం ఇతర విషయాలే వ్రాస్తూవుండలేము కదా. అందుకే ఒక వైపు నా విశేషాలు మీతో పంచుకుంటూనే అవి మీకూ, నాకూ కాస్తయినా ప్రయోజనకరంగా వుండేలా ఆలోచించాను. అప్పుడు వచ్చిన ఆలోచనే ఇది. వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుతూ, నామీద ప్రయోగాలు చేసుకుంటూ ఆ విశేషాలను మీతో పంచుకోవడం. అలా అని ఎప్పుడూ దాంపత్య సంబంధాల గురించే వ్రాస్తుంటా అనుకోకండి. వైవిధ్యమయిన ఆంశాలని ఎన్నుకుందాం. అలా అని నా అన్ని టపాలూ ఇలాంటివే వుంటాయని కాదు.

నాకు ఇంఫోటెయిన్మెంట్ అంటే ఇష్టం. బొత్తిగా సమాచారమే ఇస్తూపోతే పాఠ్యపుస్తకాల్లా అవి బోర్ కొడుతాయి.  బొత్తిగా కాలక్షేపం కబుర్లు వ్రాస్తూ పోతే మీకూ నాకూ అంతకుమించి ప్రయోజనం కలిగించవు. అందుకే మీకూ, నాకూ ప్రయోజనకరంగా సమాచారమూ, కాలక్షేపమూ కలగలిపిన ఈ ఇంఫోటెయిన్మెంట్ టపాలు. ఆనందించండిక.

నువ్వింతే - నన్ను ఎప్పుడూ ఎక్కడికీ తీసుకెళ్ళవు...

... ఈ మాటలు మా అమ్మలువి. అప్పుడప్పుడు అలా అంటూ వుంటుంది. ఆ మాటలు అబద్ధం అని నాకు తెలుసు. అందుకే అనునయంగా తన దగ్గర కూర్చొని తనని ఎప్పుడెప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళానో లిస్ట్ చదివేస్తుంటాను. ఎన్ని సార్లు ఎన్ని ఏక్టివిటీసుకి  తీసుకెళ్ళినా మా పాప  ఇలా   అటుందేమిట్రా బాబూ అని   అనుకుంటూవుంటాను. అలాంటప్పుడు ఇంకా ఎందుకు తిప్పడం అని కూడా అనిపిస్తుంటుంది. ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే అని ఓ కవి ఎప్పుడో అన్నాడు. ఆ మాటలే నిజమంటాడు Men Are from Mars Women Are from Venus  పుస్తకం రచయిత జాన్ గ్రే. ఆడవారి మాటలను యథాతథంగా తీసుకోవద్దట. అందులోని అంతరార్ధం కనిపెట్టాలిట. "నువ్వు ఎంతో చక్కటి నాన్నవి. నన్ను ఎప్పుడూ అటో ఇటో తీసుకువెళ్ళి మంచి కాలక్షేపం కలిగిస్తుంటావు. ఇప్పుడు కూడా నాకు అలా నీతో వెళ్ళాలని వుంది. తొందరగా తీసుకెళ్లవూ" ఇదీ అమ్మలు యొక్క ఆ మాటలకు అర్ధం ట! బాప్ రే బాప్. ఈ ఆడవారు ఎంత గడుసువారూ!

స్త్రీలూ, పురుషులూ ఒకే పదాలు ఉపయోగించినా వాటి యొక్క తాత్పర్యం వేరు అని జాన్ వివరిస్తాడు. నిన్న సాయంత్రం ఇంట్లో ఒక చర్చ మొదలెట్టాలనుకున్నాను. మా ఇంట్లో ఒక వేడుక చెయ్యాలి. అనవసరంగా డబ్బు ఖర్చు ఎందుకు చిన్నగా చేద్దామని నేను, ఎప్పుడో ఒకప్పుడు వచ్చే వేడుక కాబట్టి పెద్దగా చెద్దామని మిగతా ముగ్గురూనూ. అలా అలా ఆ నిర్ణయం వాయిదా పడుతోంది. సరే, ఒక నిర్ణయం తీసుకుందామని నిన్న మా ఆవిడతో ప్రస్థావించాను. అంతే. "నువ్వెప్పుడూ ఇలాగే అంటావూ...ఏ వేడుకా చెయ్యవూ" అని మొదలయ్యింది వాదన. నిజంగా? నాలో నేను ఓ లిస్ట్ వేసుకున్నాను. ఆ మాటలు అబద్ధం. ఇదివరకయితే లిస్ట్ చదివేవాడిని. చర్చల వల్ల లాభం వుంటుంది కానీ, వాదనల వల్ల లాభం వుండదు కాబట్టి అది సరి అయిన సమయం కాదు అని మౌనం వహించి బెడ్రూములోకి తోకముడిచాను.

నిజానికి అయితే తన దగ్గర కూర్చొని ఓపిగ్గా తన వర్శన్ విని వుండాలి. నాలో ఇంకా అంత పరివర్తన రాలేదు కాబట్టి, కొంతే వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు అంతొద్దు - కొద్దిగా చాలు అనుకొని గొడవ మాత్రం పెట్టేసుకోకుండా మౌనం వహించాను కానీ ఆ మాటలకు అబ్బురపడ్డాను - నిజం చెప్పాలంటే నిస్పృహ చెందాను. ఎందుకంటే ఈ టపాలో పైన చెప్పిన విషయాలు ఆ పుస్తకంలో అప్పటికి ఇంకా చదవలేదు కాబట్టి ఆమె మాటలు యథాతథంగా తీసుకున్నాను. ఈ ఉదయం రైల్లో వస్తూ ఆడవారి మరియు మగవారి భాషలు అన్న అధ్యాయం కొంత చదివాను. అప్పుడు నా కళ్ళు అలాగే ఆమె మాటలు అర్ధాలు తెరచుకున్నాయి. మా ఆవిడ ఆ మాటల తాత్పర్యం ఇలా అయ్యుంటుంది "ఇదివరకు ఎన్నో వేడుకలు చేసాం, అందరం ఎంతో ఆనందించాం. ఆ ఆనందం మళ్ళీ కావాలి. అందరం కలవాలి. చక్కటి సమయం గడపాలి..." అలా అలా అన్నమాట. ఓసోస్, అలా చెబితే ఎంత బావుండునూ. అలా తేరగా చెబితే ఆడాళ్ళు ఎందుకవుతారూ. మగాళ్ళ బుర్రలకి కాస్త పని పెట్టాలి కదా.  ముల్లులని తొలగించుకొని ఎలాగయితే గులాబి పువ్వు అందుకుంటామో అలాగే వారి మాట్లల్లోని ౠణాత్మక భావాన్ని తొలగించి అసలయిన అర్ధాన్ని వెతుక్కోవాలి. అలా ఏ అర్ధాలు వెతుక్కోవాలో చిన్నపాటి డిక్షనరీనే ఇచ్చాడు ఆ రచయిత.

అలాగే మగవారి మౌనాన్నీ యథాతథంగా తీసుకోకూడదని మహిళలకు చెబుతాడు ఆ రచయిత. ఆడవారు మాట్లాడుతూ ఆలోచిస్తుంటారు. మగవాడు ఆలోచించాక మాట్లాడుతాడు. ఏదయినా ఆలోచించాలనుకున్నప్పుడు మగవాడు మౌనం వహిస్తాడు - నిన్న నేను చేసినట్లుగా. మనస్సులో ఆలోచనలు ప్రాసెస్ చేసి అప్పుడు మాట్లాడుతాడు. అయితే ఆడవారు అలా చెయ్యరు కాబట్టి మగవాడి మౌనాన్ని అపార్ధం చేసుకుంటారు. అలాంటి మగ మౌనాన్ని గురించి మరోసారి మాట్లాడుకుందాం.

అన్నట్లు నిన్న 'మీ పార్ట్‌నర్ని మోటివేట్ చెయ్యడం ఎలా' అన్న అధ్యాయం పూర్తి చేసాను కానీ అది నాకు ఎక్కలేదు. అది మరోసారి చదివి చూడాలి. అందుకే ఆ ఆధ్యాయం గురించి ప్రస్థుతం వ్రాయడం లేదు.

నా మానాన నన్ను కాస్త వుండనివ్వు

సాధారణంగా మగవారు ఒత్తిడిలో వున్నప్పుడు, అలసటలో వున్నప్పుడు ఏకాంతాన్ని కోరుతారు అంటాడు రచయిత జాన్ గ్రే. మనం ఆఫీసుకి వెళ్ళి బోలెడంత శ్రమ పడీ, ఒత్తిడి చెందీ ఇంటికి వెళ్ళి ఇలా బూట్లు విడుస్తుంటామా అలా వచ్చేస్తుంటాయి ఇంట్లోంచి మిస్సయిల్స్. ఉదాహరణకి డాడీ మా ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళవా అని అమ్మలూ, ఇంటర్నెట్టు సరిగ్గా రావడం లేదని పెద్దమ్మాయీ, ఇంట్లోని ఏదో ఒక సమస్య గురించి మా ఆవిడా నామీద విసిరేస్తుంటారు. నాకేమో ఎంచక్కా ఓ చిరుతిండి తిని, కాస్త తేనీరు సేవిస్తూ ఇంటర్నెట్టులో ఈనాడు చూడాలని వుంటుంది. పని నుండి రాగానే నామీద పడిపోతారెందుకూ, కాస్త నాకు విశ్రాంతిని ఇవ్వండి అని విసుక్కుంటాను. పిల్లలు ఆగుతారు కానీ పెళ్ళాలు ఆగుతారా? వాళ్లని ధిక్కరించినట్లుగా భావించరూ? వారికి మండుతుంది. చేసేవులే బోడి ఉద్యోగం లాంటి డైలాగులు వస్తుంటాయి. విసురుగా మనం పడగ్గదిలోకి వెళ్ళి నెట్టుతో సంసారం చేస్తుంటాం.
 
అలాంటి పరిస్థితి కొన్ని కుటుంబాలలోనయినా వుంటుండవచ్చు. అందుకు కారణాలేంటో ... పుస్తకంలో వివరించారు. మగవాడు ఒత్తిడి చెందినప్పుడు విశ్రాంతి చెందడానికి ఏదన్నా చదవడమో, సినిమాలు లేదా టివి చూడటమో లేక ఫిజికల్ ఏక్టివిటీనో చేస్తుంటాడు. అలా తన గుహలోకి వెళ్ళి కాస్సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయటకి వచ్చి అందరితో కలుస్తాడు. ఈలోగా మగవాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు కదా ఈ ఆడాళ్ళూ. పలు రకాల సమస్యలతో మీదపడి కరిచేస్తారు. అసలే ఆఫీసులో బాసుతోనో, సహోద్యోగులతోనో అప్పటికే రక్కించుకొని వచ్చిన మగాడికి ఇంట్లో జనాలు కూడా కరిచేస్తుండేసరికి మండిపోతుంది. అంచేత ఓ మహిళామణులారా మీ మొగాడు ఒత్తిడిలో వున్నప్పుడు, అలసటలో వున్నప్పుడు విశ్రాంతి చెందేందుకై కాస్తంత సమయం ఇవ్వండి. ఆ తరువాత విజృంభిద్దురు గానీ.
 
స్త్రీలు ఒత్తిడిలో వున్నప్పుడు మగాడిలా అలా మూలకు కూర్చుంటారా? అబ్బే లేదు. ముచ్చట్లు పెడతారు. పురుషుడు ఏ విధంగా నయితే పుస్తకమో, పేపరో చదువుతూనో, సినిమాలో, టివి నో చూస్తూనో లేదా ఏదయినా ఆట ఆడుతూనో విశ్రాంతి తీసుకుంటాడో అలాంటి విశ్రాంతి ఆడవారు తమ సాధకబాధకాలు ఇతరులకు చెప్పుకోవడం ద్వారా తీసుకుంటారుట. మనం మగవాళ్ళం ఏం చేస్తాం?వాళ్ళు దేనిగురించో దానిగురించి సణుగుడు మొదలెట్టగానే వారి సమస్యలకు పరిష్కారాలు సూచించబోతాం, అవి వినిపించుకోకపోతే ఆ సుత్తి బారినుండి పారిపోతాం. మనం సమస్యల్లో వున్నప్పుడు విశ్రాంతి పొందడానికి ఎలాయితే మన గూహలోనికి మనం వెళ్ళిపోతామో ఆడవారికీ అలాగే అనిపిస్తుందనుకొని వారిని వారి మానాన వదిలేసి వెళ్ళిపోతాం. అదే తప్పంటాడు ఆ రచయిత. బుద్ధిగా వారు చెప్పింది వినమంటాడు అంతే కానీ ఉచిత సలహాలు ఇవ్వద్దంటాడు. అలా వారిని వదిలేసి వెళ్ళిపోకుండా వారు చెబుతున్నది ఓపిగ్గా వినమంటాడు. ఆడవారు విశ్రాంతి చెందే//పొందే విధానం అదే అంటాడు. ఇదీ ఇవాళ Men Are from Mars Women Are from Venus పుస్తకంలో మరో అధ్యాయం చదివి నేర్చుకున్న ముఖ్య విషయం.

ఇది వ్రాస్తుంటే ఇప్పుడే మా ఆవిడ నుండి ఫోన్ వచ్చింది. ఓ సమస్య ప్రస్థావించి దులిపేసింది. నేను అలాగే, అలాగే, ఆలోచిద్దాం, పరిష్కరిద్దాం అన్నాను కానీ ఎదురు వాదన చెయ్యడమో లేక ఆమె నన్ను బ్లేం చేస్తున్నదని వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఆమె ఏదో కాస్త ఫస్ట్రేషనులో వుంది. ఇదివరకయితే నన్ను నేను డెఫెండ్ చేసుకుంటూ మాట్లాడేవాడిని. అయినా సరే వాదిస్తే ఫోను టక్కున కట్ చేసేవాడిని. ఆమె నన్ను బ్లేం చేస్తున్నా కూడా అది వ్యక్తిగతంగా తీసుకోలేదు. తన ఒత్తిడి తొలగించుకోవడానికి నన్ను విమర్శిస్తున్నదే కానీ నిజంగా నన్ను హర్ట్ చెయ్యాలని కాదు అని అర్ధం చేసుకోగలిగాను. అలా ఆమె రిలాక్స్ అయితే మంచిదే కదా. సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ చిన్న సమస్య గురించి సావకాశంగా మాట్లాడదామని చెప్పాను.

నేను ఆ పుస్తకం ఏదో సరదాకోసం చదవడం లేదు. మార్పు కోసం చదువుతున్నాను. అందుకే ఎప్పటికప్పుడు అందులో నేర్చుకుంటున్న విషయాలని అమలు చేస్తున్నాను. నిన్న సాయంత్రం కూడా ఆ రోజు చదివేసిన మొదటి అధ్యాయాన్ని అమలు పరిచాను. ఆ సాయంత్రం ప్రశాంతతను సాధించాను, ప్రతిఫలాలను అందుకున్నాను :) ఈ విధానాలు కేవలం భార్యాభర్తలకే అని కాదు - ఏ జంటకయినా ఉపయోగపడుతాయి. ఏ జంటకయినా అనే కాదు - ప్రతి ఒక్క మహిళనూ, పురుషుడినీ అర్ధం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతాయి.

ఆ ఇచ్చావులే బోడి సలహాలు

ఈ మధ్య మార్స్ నుండి మగాళ్ళూ - వీనస్ నుండి ఆడాళ్ళు (Men Are from Mars Women Are from Venus) అన్న పుస్తకం చదువుతున్నా అని చెప్పా కదా. అందులో ఒక అధ్యాయం చదివేసాను. అందులో మగవారికి ఆడవారు సలహాలు చెబితే ఎలా వుంటుందీ అలాగే ఆడవారికి మగవారు సలహాలు చెబితే ఎలా వుంటుందీ అన్నది వివరించారు. అడక్కుండా సలహాలూ, విమర్శలూ చేస్తే మగవారికి కాలుతుందిట. అందుకే పురుషులకు ముందుబడి సలహాలు ఇస్తే బోడి సలహాలు అయి కూర్చుంటాయని, నిగ్రహించుకొమ్మని చెబుతాడా రచయిత John Grey. అలా ఉచిత సలహాలు ఇస్తూపోతే మగాడి అహం దెబ్బతింటుందిట. అలా మగ ఇగో దెబ్బతినకుండా ఎలా సోపేస్తూ పనులు సాగించుకోవచ్చో ముందుముందు అధ్యాయాల్లో చెబుతా అన్నాడు.

నిజమే మరి. డ్రైవింగ్  చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా దారి తప్పామనుకోండి. మళ్ళీ సరి అయిన  రోడ్డు ఎక్కడానికి మనం కిందామీదా పడుతుంటామా. పక్కనుండి ఉచిత సలహాలు వచ్చేస్తూనేవుంటాయి. అలా వెళ్ళొచ్చు కదా, ఇలా వెళ్ళొచ్చు కదా, ఆ రోడ్డెక్కొచ్చు కదా, ఈ మలుపు తిరగొచ్చు కదా అని. అప్పుడు సర్..న కాలుతుంది. అప్పుడు నిరసనగా కారు దిగి అసెంబ్లీలోనుండి వాకవుట్ చేసినట్లుగా చెయ్యాలనిపిస్తుంది. లేకపోతే మనం ఏదన్నా రిపేర్ చేస్తున్నామనుకోండి. వీళ్ళు మనపని మనని చెయ్యనిస్తారా - వెనకనుండి దర్శకత్వం వహిస్తారు. దాంతో నాకు చిరాకెత్తిపోయి పానాలు జారవిడిచి నువ్వే చేసుకో అని వెళ్ళిపోతాను. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో, ఎన్నెన్నో. అంచేతా ఓ మహిళామణులారా, మేము చేసే పనులని చూస్తూవుండండంతే, ముందుబడి ఓ సలహాలు మామీద విరెయ్యకండి. మా మగాళ్లకి మండుతుంది.

అలా అని మనం అనగా మగ మహారజులం ఊరుకుంటామా? అబ్బే, అదేం లేదు. మన ఆడాళ్ళు ఏవయినా చిన్న సమస్య చెప్పారంటే చాలు - ఉచిత సలహాలు వరదల్లా వదులుతాము. అది మనం వారి పట్ల చూపించే శ్రద్ధ అనుకుంటాము. అది తప్పంటాడు ఆ రచయిత జాన్. అప్పుడు వాళ్ళు కోరేది మన బోడి సలహాలు కాదుట. వారి సమస్య పట్ల సానుభూతిట. మా ఆవిడ ఎప్పుడన్నా ఏదన్నా శారీరక సమస్య అందనుకోండి. వ్యాయామం, అహారం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ పట్ల లెక్చర్లు దంచేస్తాను. నేను కొద్దిగా మొదలెట్టగానే నేనేం చెప్పబొతున్నానో ఆమే చెప్పేసి ఇక చాల్లే అంటుంది. ఎంత చెప్పినా తలకెక్కించుకోకుదుకదా అని ఆమె సమస్యలని పట్టించుకోవడం తగ్గిస్తుంటాను. ఇలాంటి ఉదాహరణలు కూడా ఎన్నో చెప్పుకోవచ్చు.

మనం మగాళ్ళం అలా చెయ్యకూడదంట. వారి సమస్యలని సానుభూతితో వింటూపోవాలంట అంతే కానీ అప్పుడు మాత్రం సలహాలు, సూచనలు, విమర్శలు చేస్తూపోవద్దంట. అలాచేస్తే వారు ఆశాభంగం పొంది మనపట్ల నిరసన పెంచుకుంటారంట. ఆల్రైట్. అలాగే చేద్దాం. మరి అలా సలహాలు ఇవ్వకుండా మనం చెప్పాల్సింది ఎలా చెప్పాలో మున్ముందు చెబుతాను అన్నాడు ఆ రచయిత. సంతోషం. అందాకా వారు చెప్పింది నోరు మూసుకొని వింటూ ఊ కొట్టమన్నాడు. ఊ అనండి మరీ. ఊ...

ఇలాంటివే ఇంకా ఎన్నో విషయాలు చర్చిస్తున్నాడు ఆ రచయిత. అన్నీ ప్రస్థావించడం కుదరదు కాబట్టి ఆసక్తి వున్నవారు ఆ పుస్తకం చదివెయ్యండి. ఇక్కడ ఎక్కువగా ఉదాహరణలు మా ఆవిడ గురించే ఇస్తున్నా ఆలోచిస్తుంటే ఇవే పద్ధతులు మా అమ్మాయిల పట్ల కూడా పాటించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. వారు ఎప్పుడన్నా ఏదన్నా సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు తెగబారెడు సలహాలు ఇస్తూ పోకుండా వారు చెప్పేది సావధానంగా వింటూ పోవాలని నిర్ణయించుకుంటున్నాను - ఇప్పుడే. ఆడవారి, మగవారి ఆలోచనాధోరణుల్లో చాలా తేడాలుంటాయని వాటిని గుర్తించి వాటికి అనుకూలంగా ప్రవర్తిస్తూపోతే  అన్యోన్యత పెరుగుతుందని ఆ పుస్తకం చెబుతుంది.

ఒట్టిచేపల కూర వుందా? పోనీ అంటు అయినా వుందా?

మొన్న మా ఇంటికి మా ఊర్లోనే వున్న మా బంధువు రాం, అతని భార్యా వచ్చారు. అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ అలా అలా బాల్య స్మృతుల్లోకి వెళ్ళాం. చిన్నప్పుడు ఎలాంటి కూరలు తినేవాళ్ళం అన్న విషయానికి వెళ్ళిపోయింది మా ముచ్చట. ఒట్టిచేపల కూర మా అమ్మమ్మ చేసిపెడితే ఎంతో ఇష్టంగా తినేవాడినని చెప్పాను. ఆ కూర ఎలా వుంటుందో ఓ దృశ్యం వేసుకున్నాం. ఎండబెట్టిన చేపల కూరలో ముదురు గోంగూరా, దోసకాయ, టమాటా వేసి వండితే నా సామి రంగా అంటూ రాం నోరు ఊరించాను. అతనికీ తన ఊర్లో తన తాతయ్య వండించిన కూరలు గుర్తుకువచ్చాయి. అవి తాను చెప్పుకువచ్చాడు. అలాంటి కూరలకు తోడుగా కల్లు వుండాలీ...ఆహా అని నోరు కార్చుకున్నాను నేను.

కట్ చేస్తే ఆ బంధువు/మిత్రుడు ఇంటికి నిన్న నాన్నల రోజు సందర్భంగా పిలిచి పార్టీ ఇచ్చారు. మళ్ళీ ఆ కూరల టాపిక్ వచ్చింది. మొన్న ఇంటికి వచ్చి ఒట్టి చేపల కూర వండేసుకున్నామని చెప్పేడు అతగాడు. ఆ రోజు అలా నేను కూర గురించి చెప్పాకదా. అదే రోజు వాళ్ళావిడ గ్రోసరీకి వెళితే ఎండు చేపలు కనిపించాయిట. ప్రయోగం చేద్దామని తీసుకువచ్చింది. భర్త దర్శకత్వం కొంత తీసుకొని ఆ కూర వండేసింది. అలా ఆ కూర చాలా చక్కగా వచ్చేసిందిట - మా రాం లొట్టలేకుంటూ తిన్నాడంట. నాకు నోరూరింది. ఆ కూర ఏమన్నా మిగిలివుందా అని అడిగా. లేదు అయిపోయింది అని చల్లగా చెప్పాడు. పోనీ అంటు ఏమయినా వుందా అని అడిగేసా నాలుక తడుపుకుంటూ. ఊహు, అంటు చుక్క లేకుండా అయిపోజేసా అని అన్నాడు. నేను ఉసూరుమన్నాను. అలాంటి చక్కని కూర వండుకొని తినడమేనా ఊర్లో వున్న మాకు ఏమయినా ఇచ్చేదిలేదా అని గయ్ మన్నాను. వాళ్ళింటికి మా ఇల్లు కొద్దిదూరంలోనే వుంటుంది. మరోసారి కూరవండితే అలాగే ఇవ్వడమో లేదా నన్ను పిలవడమో చేస్తా అని హామీ ఇచ్చేడు.

వాళ్ళింట్లో లోపలి గదిలో కబుర్లాడుతున్న మా ఆవిడని పిలిచి చెప్పాను - రేపే ఎండు చేపలు పట్రమ్మని. అలాగే అని హామీ ఇచ్చింది కాని నాకంత నమ్మకం లేదు. ఆమెకు ఆ ఎండుచేపల వాసన అంటే అసహ్యం - ఇంకేం తీసుకువస్తుందీ. ఇహ నేనే తెచ్చుకొని వండేసుకొని రాం ని ఊరించెయ్యాలి. కూర సరిగ్గా కుదురుతుందంటారా? ఎలాగూ ఇక్కడ కల్లు వుండదు కాబట్టి వైనో, బీరో ముందెట్టుకోవాలి. చేపల కూరలోకి వైను బెటరా లేక బీరు బెటరా?

మార్స్ నుండి మగాళ్ళు...

నిన్న అమ్మలుని ఈత క్లాసుకి తీసుకువెళ్ళాను. అక్కడ ఒక స్టాఫ్ వ్యక్తి - యువకుడే - ఇంకా పెళ్ళయ్యిందో కాలేదో అనుమానమే - నన్ను పలకరించాడు. నా చేతిలో వున్న పుస్తకాన్ని వుద్దేశ్యిస్తూ 'ఆ పుస్తకం చదువుతున్నారా? ఎలా వుంది' అని అడిగాడు. 'ఇంకా చదవలేదు, ఈ రోజే మొదలెట్టబోతున్నాను' అని అన్నాను. 'చాలా మంచి పుస్తకం - చదవండి - చాలా బాగా రాసేడు' అన్నాడతను. 'తప్పకుండా చదువుతాను, నా స్నేహితులు కూడా చదవమని రికమెండ్ చేసారు' అన్నాను. ఆ పుస్తకం పేరు Men Are from Mars Women Are from Venus. మా పాప ఈత క్లాసు పూర్తవడానికి 45 నిమిషాల సమయం వుంది. పుస్తకం తెరిచాను.

అమెజాన్ సైటులో అ పుస్తకం యొక్క వివరాలు ఇక్కడ చూడండి.
అమెజాన్ సైటులో అ పుస్తకం యొక్క సమీక్షలు ఇక్కడ చూడండి.

ఈ పుస్తకం యొక్క గొప్పదనం గురించి నాకు కొన్నేళ్ళుగా తెలుసు. అయినా కొనడానికి తీరిక దొరకలేదు. కొన్ని నెలల క్రితం తెప్పించుకుని అక్కడక్కడ తిరగేసాను కానీ అప్పుడేందుకో ఆసక్తికరంగా అనిపించలేదు. పక్కనపెట్టేసాను. అహారమయినా, అమ్మాయిలయినా సరే కొన్ని సార్లు మొదటిసారే నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు పక్కనపెట్టెయ్యాలి. అలాగే కొన్ని పుస్తకాలయినా అంతే. పక్కకుపెట్టి మళ్ళీ కొంతకాలం అయ్యాక మూడ్ చూసుకొని మొదలెడితే అప్పుడు నచ్చవచ్చు. అలాగే ఈ పుస్తకాన్ని నిన్న మొదలెట్టాను. ఈ లోగా నా బ్లాగులో కూడా ఈ పుస్తకాన్ని స్వప్నతో సహా కొందరు నాకు రికమెండ్ చేసారు. అందుకని కూడా మళ్ళీ ఆసక్తి పెరిగింది.

క్రితం సారి ఎందుకో ఉపోద్ఘాతం చదవకుండానే అక్కడకడ తిరగేసాను. అదే నేను చేసిన పొరపాటూ అనుకుంటా. ఈసారి మాత్రం ముందు ఉపోద్ఘాతమే మొదలెట్టాను. అప్పుడు ఈ పుస్తకం మీద ఉత్సుకత మొదలయ్యింది. రచయితను ఈ పుస్తకం వ్రాయడానికి ప్రేరేపించిన పరిస్థితులను వివరించాడు. దానితో నేను రిలేట్ చేసుకున్నాను. దాంతో ఆ పుస్తకానికి హుక్కయిపోయాను. నిన్నా, ఇవాళా కలిపి అలా ఇంట్రడక్షన్, మొదటి అధ్యాయంలో కొంత భాగమూ చదివాను. నేను చదివిన దాన్ని బట్టి నాకు అర్ధం అయ్యిందేంటంటే ఈ పుస్తకం పెళ్ళయిన వారికి అని మాత్రమే కాకుండా మానవ సంబంధాలు మెరుగుపరచుకొవాలనుకునే ప్రతివారికీ ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం చదివితే ఆడవారు మగవారినీ, మగవారు ఆడవారినీ ఎంచక్కా అర్ధం చేసుకోగలారనుకుంటా.

అప్పట్లో ఒక పుస్తకం చదివి మా పెద్దమ్మాయి అంతర్ముఖత్వాన్ని అర్ధం చేసుకున్నాను. మా కుటుంబ వైద్యుడు సూచించిన మరో పుస్తకం చదివి టీనేజి పిల్లల మనస్థత్వాన్ని తద్వారా మా పెద్దమ్మాయి ఆలోచనా రీతినీ ఆకళింపు చేసుకున్నాను. అందువల్ల మా అమ్మాయితో మాకు ఏర్పడిన ఫ్రిక్షన్ చాలా చక్కగా దూరం చేసుకోగలిగాము. అదే పద్ధతిలో ఇప్పుడు స్త్రీలనీ తద్వారా మా ఆవిడని అర్ధం చేసుకొనే ప్రయత్నమే ఇది. ఈ పుస్తకం చదువుతూ అప్పుడప్పుడు దీని గురించి టపాలు వ్రాస్తుంటాను. అది చదవడం వల్ల నా ఆలోచనా రీతిలో కలుగుతున్న పరివర్తనను మీకు తెలియజేస్తాను. అందువల్ల పరిస్థితులల్లో ఏర్పడిన మెరుగుదలనూ మీకు వివరిస్తాను. మధ్యలో ఆ పుస్తకం పనికిరానిదనిపించినా అది మీకు తెలియజేస్తాను.

అలాగే ఈ పుస్తకం చదివిన వారు, తద్వారా మార్పు చెందిన వారు ఎవరయినా వుంటే మీ అనుభవాలు, ఆలోచనలు ఇక్కడ పంచుకోండి. ఏళ్ళ తరబడి వందల కొద్ది పుస్తకాలు చదవడం అన్నది లెక్క కాదు, చదివిన ఒక్క పుస్తకం అయినా మనకు నిజజీవితంలో ఎంత వరకు ఉపయోగపడిందీ - అందువల్ల మనలో ఏం మెరుగుదల వచ్చిందీ అన్నది ముఖ్యం. అందుకే నేను పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు చదవకపోయినా చదివిన కొన్నింటినయినా నాలో మార్పు తెచ్చుకోవడానికి ఉపయోగిస్తుంటాను. ఇలా పుస్తకాలు చదువుతూ ఆ ఆలోచనలు మీతో పంచుకోవడం ద్వారా అందులోని సారాంశం నా మదిలో ఇంకా బాగా ఇంకుతుంది. అలాగే మీలో ఎవరికయినా మానవ సంబంధాలు మెరుగుపరచుకోవడం పట్ల ఆసక్తి వున్నా ఉపయోగపడుతుంది. మీరూ వ్యాఖ్యల ద్వారా స్పందిస్తే జరిగే చర్చల ద్వారా అటు మీకూ, ఇటు నాకూ ఇంకా ప్రయోజనకరంగా వుంటుంది.

మేమూ భద్రీనాథునికి బలయ్యాం

బద్రీనాథ్ పెద్దాళ్లకి $9 పిల్లలకి ఉచితం ఈమెయిల్ వచ్చింది. అదీ కాకుండా మొన్న మాకు ఓ ప్రత్యేకమయిన రోజు మరియు నిన్న నాన్నల రోజు అవడం మూలాన కొద్దిగా రిస్క్ తీసుకొని అయినా తమన్నా కోసమయినా అనేసి మా వాళ్ళని తీసుకొని నిన్న వెళ్ళాను. చెత్త సినిమా అని ముందే తెలియడం వల్ల ఆ సినిమా చూసి మా పెద్దమ్మాయి ఎలాగూ గులిగేస్తుందని, మళ్ళీ ఆ శిరోభారం కూడా ఎందుకని తనను తీసుకురాకుండా ఆ భారం ఇంటిదగ్గరే వదిలేసుకున్నాం. ఎంత చెత్త సినిమా అయినా సరే శక్తి కన్నా బెటరే అన్న భరోసా విని వుండటంతో శక్తిని సినిమా హాల్లో చూసి బ్రతికి బట్ట కట్టిన మాకు ఇదో లెక్కా అని సాహసం సేయరా ఢింబకా అని బయల్దేరాం. నా ఉద్దేశ్యంలో తెలుసు సినిమాలని రెండు యుగాలుగా అభివర్ణించవచ్చు. అవి శక్తికి ముందూ - శక్తికి తరువాతా!

బద్రీనాథుని గొప్పతనాలు మిగతావారందరూ వేనోళ్ళా పొగిడేవున్నారు కాబట్టి మళ్ళీ ఆ జోలికి పోవడం లేదు. అయినా సరే దురద ఆపుకోలేక కొన్ని విషయాలు ప్రస్థావిస్తానేం. నీకు సరదాకీ, సంస్కృతికి తేడా తెలియదు అని నాస్తికురాలయిన తమన్నాకి హీరోగారు ఓ సందర్భంలో క్లాసు పీకుతారు. బావుంది కానీ భక్తి పాటలో ఆ మెలికలు తిరిగిపోయే కుప్పిగంతుల స్టెప్పులేమిటో! ఆ సినిమా తీసినవారికి సరదాకూ, సంస్కృతికీ తేడా తెలియదల్లా వుందని నాస్తికుడిని అయినా నాకే అంత చిరాకు పుట్టిందంటే నిజమయిన భక్తులకు ఇహ ఎలా అనిపించిందో. విలన్ భార్యకి ఆ డబ్బింగ్ ఏమిటో. చిన్నపిలాడిని అడిగినా చెప్పేస్తాడు ఆ డబ్బింగ్, ఆ యాస డబ్బాల్లో గులకరాళ్ళు వేసి గిరాగిరా తిప్పినట్టుగా వుందని. ఒక సీనులో తప్ప తమన్నా ఎప్పటిలాగా బాగానే వుంది - నా పైసలు నాకు అలా గిట్టుబాటు అయ్యయిలెండి. అల్లు అర్జున్ తన పాత్రకి చక్కగా నప్పాడు.

ఇంటర్వెల్లో అడిగాను అమ్మలుని సినిమా ఎలా వుందని - బావుంది అంది. సినిమా అయిపోయాకా అడిగాను ఎలా వుందని. సేం రేటింగ్ - శక్తి రేటింగ్ అంది. దానికి శక్తి కూడా భలే నచ్చేసింది లెండి. అవును మరీ ఈ రెండూ పిల్లల సినిమాలాయే. తమన్నా తన ఫేవరేట్ హీరోయిన్. అందువల్ల కూడా ఈ సినిమా నచ్చివుంటుంది. మా ఆవిడని అడిగాను. ఏం అడుగుతావులే అంది. శక్తి కన్నా బోలెడు బెటరని ఇద్దరం అనుకున్నాం.  నేను భద్రీనాథ్ వెళితే అక్కడి జలపాతాలు వెనక్కి వెళతాయంటావా అని ఆసక్తిగా మా ఆవిడని అడిగేసాను. ఆమె ఏమందంటే ... నాకు గుర్తుకులేదు. కొన్ని కొన్ని అడగాలని అడిగేస్తా అంతే కానీ వారి సమాధానం వినాలని కాదు.

మొన్నటి ముచ్చటయిన ముద్దు సంగతేంటో చూడండి

ఈ సంఘటణ కెనడాలోని వాంకూవరులో మొన్న జరిగింది. చాలా ఏళ్ళ నుండి వాంకూవర్ నగరం ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో మొదటిదిగా వస్తోంది. అందుకు ఒక కారణం ఆ నగరంలోని శాంతిభద్రతలు. ఇలాంటి ఘర్షణలు జరిగితే ఆ స్థాయి నిలుపుకోవడం కష్టమే అని ఒకింత విచారపడుతున్న సమయంలో ఊరడింపుగా ఈ సంఘటణ వెలుగులోకి వచ్చింది. అందుకే యుద్ధం వద్దు ప్రేమే ముద్దు అంటున్నారు శాంతి'కాముకులు'.

అన్నట్లు ఈ వార్తకు వచ్చిన వ్యాఖ్యలు కూడా చూడండి మరి ;)
 
 
http://www.thestar.com/news/canada/article/1010521--i-can-t-believe-that-s-us-says-woman-in-kissing-photo?bn=1
 
 

ఆ విషయంలో మా కుమారస్వామిని మెచ్చుకోవాల్సిందే

కుమార్ స్వామి కుటుంబం మాకు కుటుంబ స్నేహితులు. వారు కెనడాలో వుంటారు. మేము వారింటికి వెళ్ళినప్పుడల్లా నేను ఒకటి గమనిస్తుంటాను. వాళ్లింట్లో పండ్లకి బాగా ప్రాధాన్యత ఇస్తుంటారు. వారి పిల్లలు ఓ పండు తింటే తప్ప చెత్త తిండి తిన నివ్వరు. మామూలుగా మనం వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా, వారు మన ఇంటికి వచ్చినా ఏదో ఒక తయారుగా వున్న చిరుతిండి పెట్టడమో లేక తయారు చేసి పట్టడమో జరుగుతుంది కదా. వీళ్ళింట్లో అలా కాదు. మా కుమార్ వంటింట్లోకి వెళ్ళి పళ్ళు కోసుకు వచ్చి పళ్ళాలలో అందరికీ ఇచ్చేస్తాడు. వాటికి తోడుగా పండుకి తగ్గట్టు ఉప్పో, కారమో, చెక్కరో కూడా చల్లుకువస్తాడు. భోజనాలు అయ్యాక మరో రవుండ్ పళ్ళు సర్వ్ చేస్తాడు. పళ్ళు కోసిపెట్టమని వాళ్ళ ఆవిడని అడగడం చెయ్యడు. తనే చకచకా అన్నీ సిద్ధం చేసేస్తాడు. అందుకే అతగాడిని ఈ విషయంలో మెచ్చుకుంటూవుంటాను.

ఇంట్లో మనం ఆరోగ్యకరమయిన ఆహారమే తిన్నా కూడా వారాంతాలు మనం బయటకో, వేరే వారి ఇంటికో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తరచుగా అనారోగ్యకరమయిన ఆహారమే ఎదురవుతుంది. చక్కటి పళ్ళు అలా ఎదురయ్యేది తక్కువ. మన వారి వేడుకలకి వెళ్ళినా కూడా అదే సమస్య. అలాంటప్పుడు ఆ తిండి తక్కువ తిని ఊరకుండటమే మనం చెయ్యగలిగింది.

కుమార్ లాగా నేనూ ఇంట్లో అలా పళ్ళు సెర్వ్ చెయ్యాలని అనుకుంటూనే వున్నా అలా ఇంకా కుదరడం లేదు. ఇంట్లో పిల్లలకి వెళ్ళి పళ్ళు కోసుకొని తినండి అంటే తినరు. పళ్ళు కోసి సిద్ధంగా, ఎదురుగా పెట్టి తినమంటే తినేస్తారు. నేను అలా చెయ్యాలనుకుంటూనే ఆలస్యం అవుతోంది. నాకు శ్రద్ధ పెరిగేందుకై ఈ టపా వ్రాస్తున్నా. కేవలం పళ్ళే కాదు, పచ్చివో, ఉడికించినవో కూరగాయలు కూడా పిల్లలకే కాకుండా ఎవరయినా వచ్చినప్పుడు కూడా పెడుతూవుంటే వారు కూడా మన నుండి స్ఫూర్తి పొంది వారింటికి వెళ్ళినప్పుడు కూడా మనకు మంచి ఆహారం ఎదురయ్యే అవకాశాలు పెరుగుతాయి.

అవుట్డోర్ ఏక్టివిటీసుకి వెళ్ళినప్పుడు కూడా ఏదేదో చెత్త ఫుడ్డు తీసుకెళుతుంటాం. అలా కాకుండా నేనయినా శ్రద్ధ పెట్టి వాటిల్లో కూరగాయలు, పళ్ళు పెంచేద్దామనుకుంటున్నా. వివిధ సందర్భాల్లో ఎలాగయినా సరే జంక్ ఫుడ్డు, హై కేలరీ ఫుడ్డు తినకతప్పదు కానీ ఇలా మనం చేస్తూపోతే కాస్తయినా అనారోగ్యకరమయిన ఆహారం తగ్గించిన వారం అవుతాం కదా.

ప్రశంసకీ, పొగడ్తకీ తేడా ఇదీ

దీని గురించి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లుయెస్ పీపుల్ అన్న చక్కటి పుస్తకంలో డేల్ కార్నెగీ చాలా చక్కగా వివరిస్తాడు. అదో గొప్ప వ్యక్తిత్వ వికాసపు పుస్తకం. వీలుచేసుకొని మరీ చదివెయ్యండి. సరదాగా, సులభ శైలిలో వుంటుందది. పొగడ్తలో స్వార్ధం వుంటుంది, స్వప్రయోజనం వుంటుంది. ప్రశంసలో నిజాయితీ వుంటుంది, నిస్వార్ధం వుంటుంది. మనం ఎదుటివారిని ప్రశంసించినప్పుడు అది ఎదుటివారిని సంతోషపరుస్తుంది, వారికి ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రొత్సాహన్ని ఇస్తుంది. పొగడ్తలో కూడా అవే లాభాలు కనపడ్డప్పటికీ వాటి ప్రయోజనం తాత్కాలికమే. అది ప్రశంస కాదనీ పొగడ్త అని తెలిసాక ఇక వాటికి విలువ వుండదు. పైగా పైకి కాకపోయినా మనస్సులో అయినా పొగిడేస్తున్న వ్యక్తిపై నిరసన భావం ఏర్పడుతుంది.

మనం ఎవరినయినా మెచ్చుకునేటప్పుడు ఊరికే ఉబ్బేస్తున్నామా లేక అందులో వాస్తవం వుందా అనేది గమనించుకోవాలి. ఒక చిన్న ప్రశంస కొన్ని సార్లు ఎన్నో అద్భుతాలు చేస్తుంది. పైన చెప్పిన పుస్తకంలో ప్రశంస యొక్క ప్రాధాన్యతను గురించి రచయిత వివరిస్తూ ఇప్పటికిప్పుడు మీకెదురుగా వున్న వ్యక్తిని ఏదో ఒక విషయంలో మెచ్చుకొని చూడండి అని చెబుతాడు. ఆ పుస్తకం మొదటిసారి చదివినప్పుడు నాకు బకరాగా మా మేనల్లుడు దొరికాడు. వాడు ఆ రోజే కొత్త బూట్లు కొనుక్కున్నట్టున్నాడు. తళతళా మెరసిపోతున్నాయి, బావున్నాయి కూడానూ. అదే విషయం వాడితో అన్నాను. అప్పుడు వాడు చిన్న పిల్లాడు. వాడెంతో సంతోషపడ్డాడు. వాడి బూట్లు నాకు నచ్చిన వైనం మా అక్కయ్యకి కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు మీరు అదే పని చెయ్యండి. మీ ఎదురుగ్గా ఎవరున్నారు? వారిలో మీకు నిజ్జంగా నచ్చిందేంటీ? ఇప్పుడు మీరు నా బ్లాగు చదివేస్తున్నారు కాబట్టి యమర్జంటుగా నన్నే పొగిడెయ్యరు కదా! నన్నొదిలెయ్యండి కానీ మీ ఎదురుగా వున్న ఇంకెవరినన్నా చూసుకోండి. వారిని ప్రశంసించి చూడండి అంతే కానీ పొగిడి చూడకండి.

మా ఇంట్లో పిల్లల్ని సాధారణంగా ప్రశంసిస్తుంటాను. అమ్మలయితే వాటికి అతీతంగా తయారయ్యింది. నువ్వలాగే అంటుంటావులే డాడీ అని తీసిపారేస్తుంది. అది కాదమ్మా నేను నిజంగానే అంటున్నా అన్నా కూడా  అది వినిపించుకోదు. ఆ గడుగ్గాయిని ఏం చెయ్యాలిక చెప్మా? ఇహ మా పెద్దమ్మాయి. దానికి పొగడ్తల సంగతేమో కానీ ప్రెయిజ్ కూడా ఇష్టం వుండదు. ఉదాహరణకి అది సాధారణంగా చెల్లెల్ని పట్టించుకోదు. ఎప్పుడన్నా శ్రద్ధ చూపినప్పుడు మెచ్చుకొని తనలో చెల్లెల్ని బాగా చూసుకుంటున్నా అనే బిలీఫ్ సిస్టం డెవెలప్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటానా - మీరలా మెచ్చుకుంటే నాకసలే చెయ్యబుద్ధికాదంటుంది. ఇంకేం చేస్తాం - నోరు మూసుకుంఠాం. కాపోతే తనకి చేరాల్సిన పాజిటివ్ సజెషన్స్ తనకి సటిల్ గా అయినా చేరేలా కిందా మీదా పడుతూనే వుంటాను.

ఇహ మా ఆవిడనా - ఏం చెప్పమంటారు లెండి. సాధారణంగా తిడుతూనే వుండేవాడిని - ఎప్పుడో కాని మెచ్చుకున్న పాపాన పోయేవాడిని కాదు. అటు ఆమే అంతే లెండి. అదేం ఖర్మొ గానీ అలాంటి వ్యక్తిత్వ (పుస్తక) ప్రవచనాలు పెరటి చెట్టు అనగా పెళ్ళాం దగ్గర ఉపయొగించేంత ఓపిక, తీరికా వుండవెందుకో. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు లెండి.

ఇంతకీ ఈ విషయంపై టపా వ్రాసినందుకు మీరు నన్ను మెచ్చుకుంటారా లేక పొగిడేస్తారా?

విశ్వాస వ్యవస్థ - అది ఏర్పడిందంటే మీ మాట మీ మనస్సే వినదూ

ఊర్లో ఒక గ్రామ సింహం అదేనండి కుక్క వుందనుకోండి. పాపం మంచి కుక్కనే కానీ మీరు పిచ్చి కుక్క అన్నారనుకోండీ. అది విని ఊరుకుంటుంది. ఇంకో ముగ్గురూ దాన్ని అదేమాట అన్నారనుకోండి దానికి అనుమానం వస్తుంది. ఇంకో నలుగురూ అదేమాట అంటే ఆ అనుమానం పెనుభూతమవుతుంది. ఓ పదిమందీ దాన్ని అదేమాట అంటే ఆ అనుమానం నమ్మకమయిపోతుంది. ఆ తరువాత నువ్వు పిచ్చిదానివి కాదూ, మంచిదానివే అన్నా కూడా అది నమ్మను గాక నమ్మదు. పైగా తన బిలీఫ్ సిస్టమ్ని కాపాడుకునేందుకై మిమ్మల్ని కరచి తీరుతుంది. దాంతో అది పిచ్చి కుక్కే అని మీకూ నమ్మకం ఏర్పడుతుంది. అలా అది శాశ్వతంగా పిచ్చిది అయిపోతుంది.

ఇతరులు అలా సూచనల ద్వారా మనలోని విశ్వాస వ్యవస్థలని ప్రభావితం చేస్తుంటారు. అవి ధనాత్మక సూచనలు(పాజిటివ్ సజెషన్స్) అయితే బాగానే వుంటుంది. మీరు ఆహార నియంత్రణ చేస్తున్నారనుకోండి. భలే బక్కపడుతున్నారుగా అని ఎవరయినా అంటే మనకు ఉత్సాహం వస్తుంది. వారి మాటలు మనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. అదేమాట ఇంకా కొద్దిమందీ అంటే మనం చక్కగా డైటింగ్ చేస్తున్నామని విశ్వాసం పెరుగుతుంది. అలా ఇతరుల అంచనాలు అందుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అలా అది మనలో పాతుకొనిపోతుంది. అలాంటప్పుడు ఏదో ఓ రెండు రోజులు మీరు తిని కొద్దిగా బరువెక్కగానే ఓ ముగ్గురు నలుగురు ఏం పొట్ట పెంచేసావే అన్నారనుకోండి. మనమీద మనకు సెల్ఫ్ డవుట్ వస్తుంది. అలాంటప్పుడు కొందరు పట్టుదలగా మళ్ళీ ఆహారనియంత్రణ చెస్తారు. బలహీన మనస్కులు అయితే ఎదుటివారి ఋణాత్మక సూచనలకు ప్రభావితం అయిపోయి ఆహారం మీద నియంత్రణ వదిలేసి ఇక డైటింగ్ తమవల్ల కాదనే నమ్మకాన్ని పాదుకొలుపుకుంటారు. 

అందుచేత ఇంట్లో మన పిల్లలకి మనం ఎప్పుడూ పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ వారిలో పాజిటివ్ బిలీఫ్ సిస్టం నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండాలి. ఇతరులు మన పిల్లల మీదికి  విసిరే నెగెటివ్ సజెషన్స్ బారినుండి వారిని కాపాడుతూవుండాలి. అయితే ఒక్క మన పిల్లల విషయంలో అనే కాకుండా మనకు తారసపడె ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ సజెషన్ ఇవ్వడమే బావుంటుంది - మన శత్రువులకి తప్ప :)

మా ఆవిడా నేనూ ఇదివరలో గొడవ పెట్టుకునేప్పుడు పురాణ సినిమా యుద్ధాలలోని బాణాల లాగా ఒహటే రుణాత్మక సూచనలు విసిరేసుకునేవారం. ఆమె నామీదకి విసిరేసే నెగెటివ్ సజెషన్స్ నా మనస్సులోకి సింక్ కాకుండా బహూళ ప్రయత్నాలు చేస్తుండేవాడిని.  ఎవరికయినా అలా నెగెటివ్ సజెషన్స్ ఇవ్వకూడదని నాకు తెలుసు కానీ గొడవలప్పుడు లాజికలుగా ఆలోచించలేముకదా. అవి ఎంతో కొంత ఆమె బిలీఫ్ సిస్టంలో చేరివుంటాయి.  మన మిత్రులయినా, బంధువులయినా మనలో విష బీజాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వారికి దూరంగా వుండటం మంచిది. కొందరు శ్రెయోభిలషుల రూపేణా మనలో రుణాత్మక భావాలను, పిరికి భావాలను నూరిపోస్తుంటారు. అలాంటివారికీ దూరంగా వుండటమో లేదా వారి మాటలని పట్టించుకోకుండా వుండటమో చెయ్యాలి.

మనలో వున్న నెగెటివ్ బిలీఫ్ సిస్టంస్ ను గుర్తించి వాటిని కూకటివేళ్ళతో పెకలించివెయ్యాలి. నాలోనూ కొన్ని వున్నాయి. కొన్నింటిమీద శ్రద్ధ పెట్టి సవరించుకున్నాను. ఇంకొన్నింటిమీద ఫోకస్ చెయ్యాల్సివుంది. అలాగే పాజిటివ్ బిలీఫ్ సిస్టంస్ నెలకొల్పుకోవాలి. అలా నేను కొన్నిట్లో నెలకొల్పుకున్నాను. అలా నెలకొల్పుకునే విషయాల్లో బ్లాగుల్లో కూడా వ్రాస్తుంటాను. నాకు వచ్చే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పాజిటివ్ సజెషన్స్ గా ఉపయోగపడి నాలో ధనాత్మక విశ్వాస వ్యవస్థని నెలకొల్పుతూవుంటుంది. ఉదాహరణకి నేను చక్కగా ఆహార  నియంత్రణ చెయ్యగలను అనేటువంటి నమ్మకాన్ని నేను నెలకొలుపుకున్నాను. ఆథ్లెటిక్ బాడీ మెయింటెయిన్ చెయ్యగలను అన్న విశ్వాసం కోసం కృషి చేస్తున్నాను. అలాగే నా భార్య చెప్పినట్లే నేను వినాలనే విశ్వాసాన్ని నెలకొల్పుకోవడానికి నేనెంత కృషి చేస్తున్నానో మీకు తెలుసు.

మీరూ మీలోని రుణాత్మక విశ్వాసాలని గుర్తించండి. ధనాత్మకం అయినా వాటిని నాటెయ్యండి. అన్నట్లు నాకప్పుడప్పుడు పాజిటివ్ సజెషన్స్ వదులుతూ వుండండేం.

నేను చెప్పిన ఓ చేదు వార్త

దాదాపుగా ఓ పన్నెండేళ్ళ క్రితం జరిగిందిది. కెనడాలోని టొరొంటోలో వుంటున్నా అప్పుడు. అర్ధరాత్రి ఇండియా నుండి ఫోన్ వచ్చింది. మీ అక్కయ్య గారి దగ్గర మీ నంబర్ తీసుకున్నాం అంటూ మొదలయ్యింది అవతలి వారి నుండి మాట. అప్పుడప్పుడే నాకు నిద్ర విచ్చుకుంటోంది. చెప్పండి అన్నాను. "ఫలానా వారి గురించి (వారి పేరు ఇప్పుడు నాకు గుర్తుకులేదు - అందుకే ఫలానా అంటున్నాను) మీకు తెలిసేవుంటుంది. వారి యొక్క బావను మాట్లాడుతున్నానూ, ఆ సంఘటణ గురించి మాకు ఎక్కువగా వివరాలు తెలియడం లేదు. మీకేమయినా తెలిస్తే చెప్పండి" అని అన్నారు అటువైపునుండి.
 
"నాకూ ఎక్కువ వివరాలు తెలియవండీ. వారు పై అంతస్తు నుండి దూకి మరణించారు అన్న విషయమే తప్ప మిగతా వివరాలు నాకూ తెలియవండీ. వారియొక్క క్లోజ్ ఫ్రెండ్ మా స్నేహితుడే. అతనికి ఫోన్ చేసి వివరాలు కనుక్కొని మీకు తెలియజేస్తాను. ఒక పది నిముషాల తరువాత మళ్ళీ నాకు ఫోన్ చెయ్యండి" అని చెప్పాను. ఆ తరువాత ఆ అర్ధరాత్రి మా ఫ్రెండుకి ఫోన్ చేసి నిద్రలేపి ఆ సంఘటణ యొక్క వివరాలు తెలుసుకున్నాను. ఆ తరువాత ఇండియా నుండి ఫోన్ కోసం ఎదురుచూసాను కానీ ఎంతకూ రాలేదు. మరి నేను అయినా వారికి ఎందుకు ఫోన్ చెయ్యలేదో నాకు గుర్తుకులేదు కానీ వారి యొక్క నంబర్ సరిగ్గా మా ఫోనులో డిస్ప్లే కాకపొవడం కారణం అయ్యుండొచ్చు. వాళ్ళు మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చెయ్యలేదా అని ఆశ్చర్యపోతూ పడుకుండిపోయాను. 
 
తెల్లవారింతరువాత మా అక్కయ్యకి ఫోన్ చేసాను. వాళ్ళని మళ్లీ వివరాల కోసం ఫోన్ చెయ్యమన్నాను కానీ ఎందుకో చెయ్యలేదు అని చెప్పాను. వారికి వివరాలు చెప్పావట కదా అంది అక్కయ్య. నేనెప్పుడు చెప్పానూ? మా ఫ్రెండుని కనుక్కొని చెబుతా అన్నాను కదా అని ఆశ్చర్యపోయాను. అతను మరణించాడన్న విషయం చెప్పింది నువ్వేనట కదా అని అక్కయ్య అన్నది. అప్పుడు అర్ధమయ్యింది నేను చేసిన పొరపాటు. గాఢనిద్రలో నుండి అకస్మాత్తుగా లేచినందువల్ల అనుకుంటా అప్పుడు నా బుర్ర సరిగ్గా పనిచెయ్యలేదు.
 
ఇండియా నుండి ఫోను చేసిన ఆ బంధువులకి అసలు విషయం తెలిసే వుంటుందని భావించాను. విషయం తెలిసే మరిన్ని వివరాల కోసం ఫోన్ చేస్తున్నారనుకున్నాను. ఇంతకీ నేను చెప్పేంతవరకు వారికి తెలిసిందేమిటి అంటే 'పై అంతస్తు నుండి కింద పడ్డాడు - హాస్పిటల్లో చేర్పించారు' అని మాత్రమేనట.  అతను అప్పుడే, ఎప్పుడో మరణించిన విషయం నేను చెప్పేదాకా వారికి తెలియనే తెలియదట. అసలు విషయం తెలిసిపోయింది కాబట్టి వారు మళ్ళీ నాకు ఫోన్ చెయ్యలేదని మా అక్కయ్య చెప్పింది.

ప్చ్!