ఇక్కడే వ్యవసాయం చేద్దామని...

నేను ఇండియా వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు అయినా వ్యవసాయం చెయ్యాలని వుందని కొన్నాళ్ళ క్రిందట ఓ టపా వ్రాసాను. ఆ వెళ్ళేదెప్పుడో, ఆ ఎగసాయం చేసేదెప్పుడో అని ఏం ఇక్కడే ఎందుకు చెయ్యకూడదూ అనిపించింది. ఆ అవకాశాల గురించి పరిశీలించాను. మాకు మరీ దగ్గర్లోనూ లేదా అరగంట దూరంలోనూ కూడా కొన్ని వ్యవసాయ క్షేత్రాలు వున్నాయి. వారిని కనుక్కుంటాను. సరదాగా తోటపని లేదా వ్యవసాయం వీకెండ్సులో వారితో కలిసి చెయ్యాలని వుంది అని అడుగుతాను. అలాగే ఫ్లోరిస్టులను, నర్సరీలను కూడా కనుక్కుంటాను.

ముందయితే మా ఇంటికి దగ్గర్లో వున్న క్షేత్రంలో కనుక్కుంటాను. మరి వాళ్ళు నేను అడిగినదానికి ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ కొందరినయినా అడిగి చూస్తాను. ఎవరూ ఒప్పుకోకపోతే మరో విధంగా చూద్దాం. మనకు మనస్సుంటే మార్గం వుండకపోదు.

ఎందుకు వ్యవసాయం అప్పుడప్పుడయినా చెయ్యాలనుకుంటున్నాను? మనం ఎలాగూ మన ఆరోగ్యం కోసం వ్యాయామం చెయ్యక తప్పదు కదా. ఆ చేసేదేదో తోటపనో, వ్యవసాయమో చేస్తే ఇటు ఆరోగ్యమూ అటు ప్రకృతితో మమేకమూ వస్తాయి. స్వచ్చమయిన గాలి, పరిసరాలు ఆ కాస్సేపయినా దొరుకుతాయి. అలాగే అక్కడవున్న ఆలమందలతో మనకు సన్నిహిత్వం ఏర్పడుతుంది. ఎప్పుడూ కృత్రిమ ప్రపంచంలో పడి దొర్లకుండా ఆటవిడుపు లభిస్తుంది. అటు రైతులకూ సహాయకరంగా వుంటుంది. నా పనికి ప్రతిఫలంగా డబ్బులు రాకపోయినా ఓ బుట్టెడు తాజా పళ్ళో, కూరగాయలో నాకు రాకపోవు.

ఇక్కడి వ్యవసాయం, గార్డెనింగ్ మీద అవగాహన వస్తుంది. ముందు ముందు విశ్రాంత రోజుల్లోనో లేక అంతకుముందేనో నేనూ ఓ చిన్న ప్లాట్ తీసుకొని హాబీగా తోటపనో లేక హాబీ అగ్రికల్చరో చెయ్యడానికి ఉత్సాహం వస్తుంది. మా పిల్లలకీ తరచుగా ప్రకృతిని పరిచయం చెయ్యగలవీలుంటుంది. వారికీ ఇష్టమయితే ఎప్పుడయినా నాతో పాటు పని చెయ్యడానికి అవకాశం దొరుకుతుంది. వేగవంతమయిన ఆధునిక జీవితం నుండి ఇలా పలాయనం చెందడానికి, సేదతీరడానికి ఈ విధంగా నాకు వీలవుతుంది.

ఎప్పుడన్నా ఖర్మకాలి కంప్యూటర్ కళాకారుల బ్రతుకు అలాగే నా బ్రతుకూ బజారున పడాల్సి వస్తే ఎంచక్కా కెనడాకి వెళ్ళిపోయి ఏ ఎగ్రికల్చర్ నర్సరీలో లేదా ఫ్లోరిస్ట్ దగ్గరో, అంతక్కాకపోతే ఏ రైతు దగ్గరో పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషించగలిగే ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది. నాకు శ్రమ అంటే గౌరవం వుంది కాబట్టి ఏ పనికయినా నేను వెనుకాడను. ఇక్కడ రిక్షాలు వుండవు కాబట్టి రిక్షా తొక్కి అయినా నా కుటుంబాన్ని పోషించుకోగలను అన్న డైలాగ్ చెప్పలేను.

వీలయితే ఈ రోజే మా దగ్గరి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళివస్తాను. మీలో ఎవరికయినా ఇలాంటి ఆలోచనలు వుంటే, ప్రయోగాలు చేసివుంటే, లేదా సమాచారం వుంటే నాతో, మాతో కూడా పంచుకోండి. 

7 comments:

 1. Sarat garu

  ikkada memu vunte state lo summer lo konta sthalam lease ki istaru . mokkalu penchukovataniki. oka 500 sq ft yard monthly 40 to 60 dollars vuntundi. water valle supply chestaru kani manam pipes, fencing itlantivi arrange chesukovali. manaki ishtamaina mokkalu vesukovachhu 6 months. aa pandinavanni manave. daily velli water petti, gardening chesukuni vastamu memu. week ki iddariki saripada vegetables pandutunnayi ippudu. memu start chesi one month avvindi
  India nunchi vittanalu teppinchi gongura , aanapa kuda pettamu.
  Last year ekkuva idea lekapovatam valla tomatos , vankaya , flower plants ekkuva vesemu.
  memu vundedi maryland area lo.
  mee chicago lo kuda vunnayemo chudandi mari.

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  ఎంత చక్కటి అవకాశం మీకు దొరికింది! కాదు కాదు. చక్కటి అవకాశాన్ని వెతుక్కొని చక్కగా వినియోగించుకుంటున్నారు. అభినందనలు. నేనూ మా చికాగో దగ్గ్గర అలాంటి గార్డెన్ స్పేస్ ల గురించి పొద్దుటినుండీ వెతుకుతున్నా కానీ లింకులేమీ దొరకడం లేదు. అలాంటి స్థలాల కోసం ఎలా వెతకాలో చెప్పి కాస్త పుణ్యం మూటగట్టుకుందురూ. ఎన్ని రకాలుగా వెతికినా కూడా ఆ సమాచారం నాకు దొరకట్లేదు.

  ReplyDelete
 3. @ కన్నా
  :)

  @ అజ్ఞాత
  వాటిని 'గార్డెన్ ప్లాట్స్' అంటారని తెలిసింది. మా టవున్ వాళ్ళు కూడా కిరాయికి ఇస్తున్నారని నిన్న నేను కలిసిన నర్సరీ వాడు చెప్పాడు. మా పట్టణం కమ్యూనిటీ ఆఫీసుకి వెళ్ళి కలిస్తే ఈ ఏడాది కిరాయికి ఇవ్వట్లేదు అని చెప్పారు. హుం. మళ్ళీ ఆ ఫార్మ్/నర్సరీ వాడిని కలవాలి.

  ReplyDelete
 4. Annay..." community garden " ani search chesthe vasthvi....

  ReplyDelete
 5. You can search for "your town" community garden. I live in in NE and here we get our own plot 12X16 and top soil, water, compost provided by them and its a nominal fees all you have to do is maintain our own site. At the end of the yr u can donate some of your harvest to charity. Even we have potluck lunch in mid of the season its so much fun to do it.

  ReplyDelete
 6. @ అజ్ఞాతలూ
  ధన్యవాదాలు. మీరు చెప్పకముందే అలా వెతికాను కానీ దానిమీద లింక్స్ దొరకలేదు కానీ బయట ఆ సమాచారం తెలుసుకున్నా. మా టవునులో ఈ సారి ప్లాట్స్ ఇవ్వడం లేదు. పొరుగు పట్టణంలో అయిపోయాయి. ప్లాట్స్ వున్న వేరే టవునులు దూరంగా వున్నాయి. అందువల్ల వచ్చే ఏడాది త్వరగా మేల్కొని మా దగ్గర్లోని టవునులో ప్రయత్నిద్దామనుకుంటున్నాం. ఏమయినప్పటికీ నా మీది శ్రద్ధతో సమాచారం ఇచ్చినందులకు మరోసారి థేంక్స్.

  ReplyDelete