నేను మీరు కాదూ - మీరు నేను కాదూ

మీ గురించేనండోయ్ నేను వ్రాస్తున్నది. మన మధ్య వున్నది బ్లాగానుబంధం. అయితే ఈ అనుబంధం కొన్ని కారణాల వల్ల పలుచనయిపోవచ్చూ లేదా చిక్కనయిపోనూవచ్చు. నేను కాస్తో కూస్తో బాగా వ్రాస్తూవుంటానని మీరు నా బ్లాగులు చదువుతూవుండొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు మీకు నచ్చని విషయం ఏదో ఒకటి నేను వ్రాయకపోను. నామీద మీకు మండకపోదు. అలా నామీదా, నా వ్రాతల మీదా మీకు విరక్తి కలిగే అవకాశం వుంది. అందుకే అంటున్నాను - మీరు నేను కాదు - నేను మీరు కాదని.

ఉదాహరణకి మన స్నేహితులు వుంటారు. ఏదో ఒక విషయం అతనిలో మనకు నచ్చలేదని అతన్ని మనం దూరం చేసుకోము కదా. అతనిలో మనకు నచ్చని ఆంశాలు మరీ ఎక్కువయితే దూరం అవుతాము. అది ఓకే. అలాగే నా అభిప్రాయాలూ, మీ అభిప్రాయాలూ మరీ ఎక్కువగా కలవబోవు కాబట్టి ఆంశాల ప్రాతిపాదికన మీరు నన్ను నన్నుగా ఆమోదించండి.  మీకు నచ్చినట్లు నేను వ్రాయాలనో, మీకు నచ్చిందే నేను వ్రాయాలనో ఆశించకండి. నాకంటూ ఓక వ్యక్తిత్వం అంటూ వుంటుంది కదా. దానికంటూ నేను గౌరవం ఇవ్వాలి కదా. మన వ్యక్తిత్వాల మీద మనకు గౌరవం లేనప్పుడే ఇతరుల వ్యక్తిత్వాలకూ, అభిప్రాయాలకూ అమిత ప్రాధాన్యతను ఇచ్చి మిగతా వారందరి మెప్పు కోసమే వ్రాయాల్సివుంటుంది. నేనూ అలా వుండాలని ఆశించకండి.

ఇతర మీడియాలు వ్యాపారాలు కాబట్టి ఎలాగూ టీఅర్పీ రేటింగుల కోసమనో, ఎక్కువమంది చదవడం కోసమనో, ఎక్కువ లాభాల కోసమనో మెజారిటీ ప్రజలు మన్నించేవే వ్రాయాల్సి వస్తుంది, ప్రసారం చెయ్యాల్సి వస్తుంది. కనీసం బ్లాగుల్లో లాభార్జన చెయ్యలేము కనుక ఆ రేటింగుల కోసమంటూ మన వ్యక్తిత్వాలని కుదవబెట్టుకుంటూ వ్రాయాల్సిన అవసరంలేదు. ఇతర లాభాల కోసం ఇతరుల ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు వ్రాస్తుండవచ్చు. కానీ నాకు ఏ ఇతర అవసరాలూ, లాభాలూ నా దృష్టిలో లేవు కనుక పూర్తిగా నా ఇష్ట ప్రకారమే వ్రాసుకుంటాను. మీ ఇష్ట ప్రకారం కాదు. అందువల్ల మీ ఇష్టాలూ, నా ఇష్టాలూ అన్ని వేళలా కలిసే అవకాశాలు వుండబోవు కనుక మనం   మనలోని   పరస్పర   విరుద్ధమయిన    అభిప్రాయాలను   గౌరవించుకుందాం. మనలో భిన్నాభిప్రాయాలుండవచ్చనే ఏకాభిప్రాయానికి వద్దాం. మనిద్దరికీ ఇష్టమయిన విషయాల్లో కలిసి పనిచేద్దాం, కష్టమయిన విషయాల్లోనూ కలిసిపనిచెయ్యకున్నా కూడా కలిసేవుందాం. ఏమంటారు? 

10 comments:

 1. k..... sure.. :)) good post.

  ReplyDelete
 2. అసలు ఒక్కరిని చూపించండి... నేనూ మీ టైపే అనే వాడిని... (బ్లాగుల్లో.)..
  ..ఎవరూ లేరు కదా...
  అంతే... దీనికి ఇంత పెద్ద పోస్ట్ ఎందుకేయాల్సి వచ్చింది గురువు గారు...

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  :)

  @ కాయ
  కొన్ని సార్లు మీలాంటి కొందరు బ్లాగ్మిత్రుల మనోభావాలు నా వ్రాతలతో ఇబ్బంది పెట్టడం జరుగుతూనేవుంటుంది. అందుకే మీలాంటి వారు మరీ కోపగించుకోకుండా సవ్యంగా నన్ను అర్ధం చేసుకునేందుకై నాతో వుండాల్సిన బ్లాగానుబంధాన్ని మరోసారి ఇలా నిర్వచిస్తున్నాను, గుర్తుచేస్తున్నాను.

  ReplyDelete
 4. అయితే ప్రతీ పోస్ట్ కిందా ఒక గమనిక పెట్టండి...
  గమనిక: మీకు ఈ పోస్ట్ లో నా అభిప్రాయాలు నచ్చక పోతే అని ఈ పోస్ట్ లింక్ ఇవ్వండి... హహ

  ReplyDelete
 5. @ కాయ
  :) మరీ అంతలా అవసరంలేదు కానీ అప్పుడప్పుడిలా పరిమితులు గుర్తు చేసుకోవడం బావుంటుంది.

  ReplyDelete
 6. if this true, why did you delete some of your posts ?

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  తీసివేయడానికి వెనుక వాటి కారణాలేవో (ఇతర కారణాలు) వాటికి వుంటాయి.

  ReplyDelete
 8. hahahhaha mastaru..em chepparandi, nenu meeru kadu,meeru nenu kaadu..naa blog naa istam ani..:P, anthekada malli dani vivaristu o post vesi alasipoyaru...:):P

  ReplyDelete
 9. మనలో భిన్నాభిప్రాయాలుండవచ్చనే ఏకాభిప్రాయానికి వద్దాం.

  Keka Sentence

  ReplyDelete