రెండు ప్రయోగాలు ఒకేసారి చెయ్యకూడదు

కొన్నేళ్ళ క్రితం నేను ఇండియాకి వచ్చినప్పుడు మా బంధువుల ఇంట్లోని కంప్యూటరు చాలా వరకు వైరసులతో ఇంఫెక్ట్ అయ్యిందని గమనించాను. వారి అనుమతితో వారి సిస్టం క్లీన్ చేసాను. సరే ఒక సాఫ్టువేరుతో ప్రయత్నించి నేను ఆగాలా. ఊహు. మనకు ఆనందం ఎక్కువయ్యి ఆ సిస్టం ను మరింత పరిశుద్ధం చెయ్యాలనుకొని అత్యుత్సాహంతో నాకున్న పరిజ్ఞానం అంతా ఉపయొగించి ఇంకో రెండు విధాలుగా కూడా ప్రయత్నించి అంతా పరిశుద్ధం చేసాను. ఆ తరువాత చిద్విలాసం చేస్తూ సిస్టం రిస్టార్ట్ చేసాను. ఏమయ్యింది? ఏమీ కాలేదు. అరే, హేమీ కాలేదంటే నమ్మరే. అసలుకి ఆ సిస్టం స్టార్టే కాలేదూ! ఆ తరువాత వారు కంప్యూటర్ రిపైర్ మ్యానుని పిలిపించి బాగుచేసుకున్నారనుకోండి.

పై సంఘటణతో నాకు బాగా తెలిసివచ్చినదేమంటే ఒకటి కంటే ఎక్కువ ప్రయోగాలు ఒకేసారి చెయ్యొద్దని. అదే విషయం నాకు నిన్న కూడా అర్ధమయ్యింది. ఈమధ్య డైటింగ్ చేస్తున్నాను కదా. నిన్న సాయంత్రానికి ఆకలి కాస్త ఎక్కువయ్యింది. రాత్రి త్వరగా నిద్ర పట్టక మిడ్ నైట్ మరో స్నాక్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ అర్ధరాత్రి ఆకలి ఏంటని మా ఆవిడ గులుగుళ్ళూ వినాల్సి వచ్చింది. నా తిండితో తనకు నిద్రాభంగం అయ్యిందిట లెండి. సాయంతం చూసుకుంటే బరువు 53 కి పైగానే వుంది. ఆ తరువాత మళ్ళీ ఆ 150 కేలరీల స్నాకూ. ఇహ పొద్దున్నే బరువు తగ్గినట్లే అని గులుక్కుంటూ పడుకున్నా. పొద్దున లేచి చూసుకుంటే బరువు తేడా లేకుండా దాదాపు నిన్నటి అంతే వుంది.

తేడా ఎక్కడొచ్చింది అని పరిశీలించుకున్నా. ఈమధ్య ఆకలి తగ్గడం మరియు తదితర కారణాల కోసమని ఒక డైటరీ సప్లిమెంట్ తీసుకుంటున్నా. అది గాబా అని అమినో ఏసిడ్. అయితే ఇంకా దానికంటే మంచిది దానికి ప్రి కర్సర్ అయిన ఎల్-గ్లుటమైన్ అనే ఎమినో ఏసిడుకి స్విచ్ అవుతూ వస్తున్నాను. ఈ గ్లుటమైన్ ఇంకా కిక్కు ఇవ్వకపోయినదువల్లనూ ఆ గాబా ఉపసంహరణ లక్షణాల వల్లనూ మనలో ఆకలి ఎక్కువయ్యింది, నిద్ర తక్కువయ్యింది. ఒక వైపు స్ట్రిక్ట్ డైటింగు చేస్తూ మరో వైపు మందులు మారుస్తుంటే ఫలితాలు ఇలాగే ఏడుస్తయి మరి. సరే, జరిగిందేదో జరిగిందని గ్లుటమైన్ కే కట్టుబడివున్నాను. ఇంకో ఒకటి రెండు రోజుల్లో అది నాకు పూర్తిగా పనిచెయ్యడం ప్రారంభిస్తుండవచ్చు. 

ఆహార వ్యసనం కానీ, సిగరెట్ వ్యసనం కానీ, తాగుడు వ్యసనం కానీ లేదా ఏ ఇతర వ్యసనం కానీ వున్న వారు ఎంచక్కా ఈ క్రింది డైటరీ సప్లిమెంట్లు వాడి చూడవచ్చు. వాటితో ఇంకా బహుళ ప్రయోజనాలు వున్నాయి. ఆహార నియంత్రణ చెయ్యాలనుకునేవారికి ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఆకలి తగ్గిస్తాయి.  ఆసక్తి వున్న వారు ఆ పదాలను ఉపయోగించి నెట్టులో పరిశోధించి వాటిగురించి వివరాలు తెలుసుకోండి.  నాకు గాబా అయితే చక్కగా పనిచేసింది. దానికంటే కూడా గ్లుటమైన్ ఇంకా మంచిది, చక్కగా పని చేస్తుంది అంటారు. నేను వాడి చూస్తున్నాను. వాడబట్టి మూడురోజులే అవుతోంది కాబట్టి ఇప్పుడే దాని గురించి నేను చెప్పలేను.  ఇవి మందుల దుకాణాల్లో దొరకకపోతే న్యూట్రిషన్ షాపుల్లో చాలావరకు లభిస్తాయి. ఈ సప్లిమెంట్స్ ఇండియాలో అందుబాటులో వున్నాయో లేదో నాకు తెలియదు.

L-Glutamine, GABA

సప్లిమెంట్స్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఇంకో ముచ్చట. మీలో ఎవరికయినా, మీకు తెలిసిన వారికి ఎవరికయినా ఆర్థిరైటిస్ (కీళ్ళ నొప్పులు) వుంటే నాకు చక్కని డైటరీ సప్లిమెంట్లు తెలుసు. మా పెద బావ తన ఫార్మసిస్ట్ కొడుకు సలహాతో అవి వాడితే ఆ తీవ్రమయిన నొప్పులు 99% కనుమరుగు అయ్యాయి. ఇప్పుడు ఏ నొప్పులు లేకుండా ఎంచక్కా వుంటున్నారు. అన్ని సప్లిమెంట్లు అందరికీ పనిచేస్తాయని చెప్పలేము కాబట్టి అవి వాడి చూడండి.  

Glucosamine, Chondroitin

6 comments:

  1. Sharatji,

    Do you know any supplements for RA?

    ReplyDelete
  2. @ అజ్ఞాత

    RA అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని కదా మీ భావం. నాకు ఆర్ధరైటిస్ (ఇంకా) లేదు కాబట్టి దాని గురించి మరీ ఎక్కువగా పరిశోధించలేదు. మా బావకి వున్నది ఏ రకమయిన కీళ్ళ నొప్పులో నాకు తెలియదు. నేను సూచించిన సప్లిమెంట్స్ అన్ని రకాల కీళ్ళ నొప్పులకీ పనిచేస్తుండొచ్చు. వాటిగురించి నెట్టులో పరిశోధించి చూడండి. ఫిష్ ఆయిల్ కూడా ఆ నొప్పులకి చక్కగా పనిచేస్తాయిట. అయితే వాటిల్లో వుండే ఒమెగా ఫ్యాటీ ఏసిడ్స్ కనీసం ఎన్ని గ్రాములు రోజూ వాడితే తగ్గుతాయో చూసుకోండి. ఉదాహరణకి ట్రగ్లిసరాయిడ్స్ తగ్గాలంటే కనీసం రోజూ 4 గ్రాముల ఫాటీ ఆసిడ్స్ మనం పొందాలి. అవీ, ఇవీ వాడితే ఇంకా మంచిది.

    మా ఆవిడకీ ఆర్ధరైటిస్ అని మా కైరోప్రాక్టర్ అనుమానపడ్డాడు. మా డాక్టర్ RA కాదు కానీ స్పైనల్ ఆర్ధరైటిస్ కావచ్చు అన్నాడు. ఫిష్ ఆయిల్ మరియు నేను సూచించిన సప్లిమెంట్స్ వాడి చూడమన్నాడు. నేను గత కొన్ని నెలలుగా మా ఆవిడకి ఆ మందులు, ఫిష్ ఆయిల్ తెచ్చిపెట్టి రోజూ వేసుకొమ్మని వత్తిడి చేస్తూనే వున్నా వేసుకోవట్లేదని మొన్నే మా డాక్టరుకి ఫిర్యాదు చేసాను. నా పరిస్థితీ అంతేనని, నా సలహా కూడా నా భార్య పటించదని ఆ డాక్టర్ నాకు విన్నవించుకున్నాడు. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదని మేమిద్దరమూ ఏకాభిప్రాయానికి వచ్చాం. మీవారు సూచించిన మందులు వేసుకుంటూ వుండమని, అవి చక్కటి సూచనలు అనీ ఆ వైద్యుడు మా ఆవిడకి ఉచిత సలహా పడేసాడు. మరి మందులు వేసుకుంటున్నావా అని నిన్న అడిగితే తల అవును కాదు అన్నట్లుగా తిప్పేసింది. దాని భావమేమి మీ తిరుమలేశా?! గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేము కదా.

    ReplyDelete
  3. this is common universal issue between wife and husband.

    ReplyDelete
  4. వెలమకన్ని పతోడుMay 6, 2011 at 1:43 PM

    హా ఏమయ్యా షరత్తూ. కాస్త అర్ధం అయ్యేల్లా వ్రాయవోయ్‌. హేమి హేమిహేమిషో రాష్తావు. భొథ్థిగా వంటభట్టకుంఢా

    ReplyDelete
  5. @ పతోడు
    ఆహార నియంత్రణ చెయ్యలేక అవస్థ పడేవారికీ, ఆర్థిరైటిస్ తో అగచాట్లు పడేవారికీ విషయం అర్ధం అవుతుండొచ్చు లెండీ.

    ReplyDelete
  6. ఆరోగ్య సమస్యలొచ్చినప్పటినుంచీ నేనైతే..
    పొద్దుటే జొన్నపిండిలో కొన్ని ఉల్లిపాయ్ ముక్కలు కొట్టి..
    రెండో మూడో దోశలు..
    మధ్యాన్నం ముందు ఓ బీట్రూట్ ఓ టమాటా..రెండు కారట్లు ముక్కలు కొట్టి..
    మిక్సీలో తెప్పేసి..వడకట్టి..కొంచం ఎక్కువ బెల్లంవేసి జూస్ తర్వాత నోటి చాపల్యానికి కావాలంటే అన్నమో పాడో కాస్త తినచ్చు..మొదటే కడుపు నిండిపొయుంటుంది కాబట్టి ఎక్కువ తినమనుకొండీ..
    సాయంత్రం జూస్ బండి వాణి దగ్గరో ఫ్రూట్ జూస్..
    రాత్రికి చపాతీ ముక్కలు కూర ఎక్కువగా నంచుకో కుండా తినేస్తూ ఉంటా..
    ఈ పాపిష్టి పొట్టకు ఈ మాత్రం తప్పదు కదండీ..

    ReplyDelete