ప్రతి రోజూ బరువు చూసుకునేవారే బరువు తగ్గుతారు

కొద్దిరోజులు నా బరువు పోస్టుల బరువు మీమీద వేస్తున్నాను. కాస్త భరించండి. నా 50 కిలోల లక్ష్యం సాధించేదాకా నా ఫోకస్ మారకుండా వుండేందుకై, ఆత్మ విమర్శ చేసుకుంటూ నా లోపాల్ని సవరించుకునేందుకై నా టపాలు నాకు ఉపయోగపడతాయి. అలాగే మీరు సూచనలు, సలహాలు, ప్రోత్సాహాలు ఇస్తుంటే ఇంకా ఉపయోగకరంగా వుంటుంది. ఎంకరేజ్ చెయ్యండర్రా. బాబుగారూ , మీరు తప్పకుండా బరువు తగ్గుతారు బాబుగారు అని ఉత్సాహపరచండర్రా. అలా అని నేనేదో నా బరువు గురించి మహా వర్రీ అయిఫొతున్నా అని అనుకోకండి. నా బరువు కంట్రోల్లోనే వుంది. కాకపోతే దాన్ని మరింత కంట్రోల్ చెయ్యాలనే ఉత్సాహం అంతే.

నిన్న ఉదయం చూసుకుంటే 53 వున్నాను. ఇవాళ ఉదయం చూసుకున్నా 53 వున్నాను. తేడా లేదు - తగ్గలేదు. అవును - నిన్న కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసాను. ఉదయం లంచ్ పట్టుకెళ్ళడం మరచి నందువల్ల పాండా ఎక్స్‌ప్రెస్ నుండి లంచ్ తెచ్చుకున్నాను. పాండా బవుల్ లో సగం కూరగాయలు, సగం అన్నం తెచ్చుకున్నా. వాటిలో నిమ్మకాయ పచ్చడి కలుపుకొని బవుల్ మొత్తం లాగించా. మొత్తం లాగించెయ్యకురా, ఎదవా అని నా మనస్సు మొత్తుకుంటున్నా నిమ్మకాయ పచ్చడి రుచికి మరిగి మనస్సు మూసుకున్నా. పాండా వారు నిమ్మకాయ చట్నీ కూడా ఇస్తారనుకునేరు. అంత సీన్ లేదు. ఆ పచ్చడి ఎప్పుడో ఇంటి నుండి కొంత తెచ్చి ఆఫీసులో పెట్టుకున్నాను. 

సాయంత్రం ఇంటికి వెళ్ళాక మాండరిన్ ఆరంజెస్ నుష్టుగా లాగించాను. ఆరోగ్యకరమయిన ఆహారమే కదా అని నన్ను నేను సమర్ధించుకుంటూ పొట్ట నింపేసాను. జంక్ ఫుడ్డు కన్నా, వరి అన్నం కన్నా వాటిల్లో క్యాలరీలు తక్కువే కానీ కూరగాయల కంటే పళ్ళలో క్యాలరీలు ఎక్కువే. క్యాలరీలు తగ్గించాలనుకున్నప్పుడు మంచి ఆహారమయినా సరే మితంగానే తినాలి. మరీ కడుపు నింపాలనుకుంటే కూరగాయలో లేక ఆ సలాడో తినడం వల్ల ఎక్కువ నష్టం జరగదు. 

మా ఆవిడ హెల్త్ చెకప్ కి నేనూ తోడుగా వెళ్ళి ఆమె సమస్యలు చర్చించాల్సి వచ్చినందున సాయంత్రం ట్రెడ్మిల్ మీద పరుగెత్తడానికి సమయం చిక్కలేదు. అందువల్ల కూడా నిన్న చిక్కలేకపోయాను. హ్మ్. మరి ఇవాళన్నా తగు జాగ్రత్తలు తీసుకొని తగ్గాలిక. అందుకే నిన్నటి పొరపాట్లు ఇలా మీముందు విశ్లేషించుకుంటున్నాను. మనల్ని మనం సరి చేసుకోవాలంటే ముందు మనం చేస్తున్న పొరపాటు అవగతం కావాలి కదా. ఈ వారం 52 కిలోల మైలు రాయి దాటాల్సి వుంది. మరి ఆ చిరు లక్ష్యాన్ని చేరుకోగలనంటారా?

సమయం పది గంటలు దాటింది. ఇప్పటివరకు ఓ అరకప్పు పాలు తప్ప ఇంకేమీ తీసుకోలేదు. కడుపులో ఎలుకలు పెరుగెడుతున్నాయి. వెళ్ళి ఓ టీ అయినా తెచ్చుకుంటా మరి.

8 comments:

  1. namasthe, gents ki 52, 53 ekkuva emi kaadu.
    meeru relax avachu.

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    కంగారేమీలేదండీ. ఈ టపాలోనే చెప్పినట్లు ఉన్నది కాస్తా ఉత్సాహమే. అయితే నేను బరువు సరిగ్గానే వున్నా కూడా కాస్తంత బొజ్జ వుంది. అది మంచిది కాదు. అందుకే ఈ ప్రయత్నాలు.

    నా బరువు గురించి కొద్దిగా నాకు కాన్సెర్న్ ఎందుకో ఈ క్రింది టపాలో వివరించాను:

    http://sarath-kaalam.blogspot.com/2011/04/blog-post_27.html

    ReplyDelete
  3. then you have to reduce your size of abdomin.I sujjest u to try some sauna belt

    ReplyDelete
  4. apart from your regular jogging, Please do "Uthana Padaasana" and "Nouka(Ship) Asana" for 15 mins, this will give better resuts to control/ Reduse Abdomin fat.
    You can get the poistures and procedure in any Yoga website

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    సానా బెల్ట్ గురించి మీరు చెప్పాక చూసాను. ఊహు నాకు అటువంటి గిమ్మిక్స్ నచ్చవు. వ్యాయామం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా పలు లాభాలు వున్నాయి. బరువు తగ్గడానికి సులభ సూత్రం, మంచి సూత్రం ఒక్కటే "వంట్లో వున్న కాలరీలు కరగదీయడం - తక్కువ కాలరీలు తీసుకోవడం"

    ReplyDelete
  6. @ అజ్ఞాత
    నేను వ్యాయామం కోసం ఎక్కువగా ట్రెడ్‌మిల్ ఎందుకు వాడతానంటే అది చేస్తున్న శ్రమ తెలియకుండా టివిలో సినిమా చూస్తూ పరుగెత్తొచ్చని. మిగతా విధానాలలో అంతగా ఆ సౌకర్యం వుండదు. అయితే ఎప్పుడూ ట్రెడ్మిల్ మాత్రమే చెయ్యడం బాగోదు కాబట్టి వాతావరణం బాగుంటే నడుస్తుంటాను (పరుగెత్తడం మొదలెట్టాలి ఇక). అలాగే టివి చూస్తూ స్ట్రెచింగ్ లాంటివీ చేస్తుంటాను. నెమ్మదిగా బరువులు ఎత్తడం కూడా మొదలెట్టాలి.

    అయితే మీరు చెప్పిన ఆసనాల కన్నా కూడా పొట్టదగ్గడానికయితే కాలరీల నియంత్రణనే నేను ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే నా తిండిని బట్టి నా బెల్ట్ సైజు వెంటనే నాకు తెలుస్తూనేవుంటుంది. సాధారణ ఆరోగ్యానికి యోగా చక్కనిదే. అది క్రమం తప్పకుండా చేస్తూవుంటే మనలో నియంత్రణ ఏర్పడి తక్కువ తినడం, కాలరీలు ఖర్చు అవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు.

    ఇదివరలో ఇండియాలొ వున్నప్పుడు యోగా క్లాసులకి వెళ్ళేవాడిని. అయితే అది క్రమం తప్పకుండా కంటిన్యూ చెయ్యలేకపోయాను. బరువు తగ్గే విషయంలో నేను చేసిన రిసర్చ్ మరియు నా స్వానుభవాలను బట్టి నేను నమ్మే సూత్రం ఒకటే. కాలరీలు కోల్పోవడం - కాలరీలు కనిష్టంగా పొందడం. యోగా అయినా మరే విధం అయినా ఒకవేపు కాలరీలు ఖర్చు చేస్తూ మరో వైపు మితాహారం అనగా తక్కువ కాలరీల ఆహారం తింటూపోతే చచ్చినట్లు బరువు తగ్గుతాము.

    మీరు శ్రద్ధతో ఇచ్చిన సూచనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  7. బాబుగారూ , మీరు తప్పకుండా బరువు తగ్గుతారు బాబుగారు, all the best Sarat garu.

    ReplyDelete
  8. @ రిషి
    ఒక్కరన్నా నన్ను అలా, అంతగా ప్రోత్సహిస్తారేమో చూద్దామనుకున్నాను. మీరొక్కరయినా అన్నారు. సంతోషం మరి :)

    ReplyDelete