ఇందులో వ్రాసిన విషయాలు కొన్ని ఇదివరలో కూడా చెప్పినవే. అతని పేరెందుకు లెమ్మని మిత్రునిగా నడిపిస్తున్నా. నా క్లాస్మేటు అతను. చాలా సన్నిహితుడు. అయితే అతని కులం కారణానా, మా అమ్మ గారి భూస్వామ్య మనస్థత్వం మూలానా అతను మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ గారి చేత అప్పుడప్పుడు స్వల్పమయిన అవమానాలని ఎదుర్కొనేవాడు. మా అమ్మ ధోరణిని నేను నిరసించేవాడిని కానీ ఎదుర్కోలేకపోయేవాడిని. మా నాన్న గారు చక్కగానే అతడిని ఆదరించేవారు.
అప్పుడప్పుడు చేపలు పడదాము రా అని పంట పొలాల బావుల చుట్టూ తిప్పేవాడు. అతను చేపలు పట్టుదాము అంటే ఓకే అన్నాను కానీ ఆ పేరు చెప్పి అటు తీసుకెళ్ళి నన్నే పడతాడని అనుకోలేదు. నాకూ అవంటే ఇష్టం వుంది కనుకనే అతనికి పడిపోయాను. అలా అతను బావుల్లో చేపలు పడుతూ ఆనందించేవాడు, భూమి మీద నన్ను పడుతూనూ ఆనందించేవాడు. ఆ రకంగా ఆ పచ్చటి చేల మధ్య ఎంచక్కా గడిపేవారం. ఆ అనుబంధం ఆ తరువాత ఎంచక్కా ఎన్నో ఏళ్ళు నడిచింది.
ఊర్లో తరచుగా అతని ఇంటికి వెళుతుండేవాడిని. అతని తల్లి తండ్రులూ, అక్కయ్యా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. వారి ఇంట్లో చాలా సార్లు భోజనం చేసాను. కోడికూరో, మేక కూరో అని చెప్పి నాకు గొడ్డు కూర కూడా సరదాగా పెట్టించేవాడు ఆ మిత్రుడు. రెండు ముక్కలు తినగానే విషయం అర్ధమయ్యి నవ్వుతూ ససేమిరా ఆ కూర వద్దు అనేవాడిని. ఆ ఇంట్లో అందరూ నవ్వేసేవారు. నాకు అప్పటికే మత భావనలు ఏమీ లేవు కాబట్టి ఆ కూర మీద ఆ అభ్యంతరం అని కాదు కానీ చిన్నప్పటి నుండీ అలవాటు లేదు కాబట్టి అది సయించకపోయేది.
7 వ తరగతి చదివాక నేను భువనగిరి మారడంతో ఊరికి సెలవుల్లో వచ్చినప్పుడు మాత్రం మేము తప్పకుండా అన్ని రకాలుగా కలుస్తుండేవారం. పదవ తరగతికి నేను మళ్ళీ మా ఊరి దగ్గరే వున్న సూర్యాపేటకి వచ్చేసాను. మా ఊరు దగ్గరే అవడంతో అతను తరచుగా ఊరి నుండి వచ్చి కలవడమో లేక నేనే ఆ ఊరు వెళ్ళినప్పుడు అతన్ని కలవడమో చేస్తుండే వాళ్ళం. కాలక్రమేణా నేను పై చదవుల కోసం దూర ప్రాంతాలకి వెళ్ళడంతో మేము కలుసుకోవడం తక్కువయ్యింది. నేను విజయవాడలో వున్నప్పుడు వచ్చి కొంతకాలం నా దగ్గర వున్నాడు. అప్పటికి అతనూ మారిపోయాడూ, అతని మనస్థత్వమూ మారిపోయింది. అతను అన్ని రకాలుగా నచ్చకపోవడం మొదలవడంతో అతన్ని ఇహ పట్టించుకోవడం మానివేసాను.
ఆ తరువాత మా బాల్య స్నేహితులు కలిసినప్పుడు అతను ఎక్కడ వున్నాడు, ఏం చేస్తున్నాడు అని కనుక్కునేవాడిని కానీ కలుసుకోవాలనే ఉత్సాహం చూపించేవాడిని కాదు. క్రమంగా అతని గురించి స్నేహితులను కనుక్కోవడం కూడా తగ్గిపోయింది కనుక అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అనే విషయాలు కూడా నాకు తెలియవు. తెలుసుకోవాలని, కలుసుకోవాలని కూడా అంతగా ఆసక్తి లేదు. అతన్ని చివరి సారిగా చూసి పదహారేళ్ళకు పైగానే అవుతోంది, కలిసి ఇంకెన్నేళ్ళు అవుతుందో కానీ నాకు అవన్నీ పరిచయం చేసింది అతనే అన్న ఆరాధనా భావం మాత్రం నాలో పదిలంగానే వుంటుంది.
ఆ తరువాత మా బాల్య స్నేహితులు కలిసినప్పుడు అతను ఎక్కడ వున్నాడు, ఏం చేస్తున్నాడు అని కనుక్కునేవాడిని కానీ కలుసుకోవాలనే ఉత్సాహం చూపించేవాడిని కాదు. క్రమంగా అతని గురించి స్నేహితులను కనుక్కోవడం కూడా తగ్గిపోయింది కనుక అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అనే విషయాలు కూడా నాకు తెలియవు. తెలుసుకోవాలని, కలుసుకోవాలని కూడా అంతగా ఆసక్తి లేదు. అతన్ని చివరి సారిగా చూసి పదహారేళ్ళకు పైగానే అవుతోంది, కలిసి ఇంకెన్నేళ్ళు అవుతుందో కానీ నాకు అవన్నీ పరిచయం చేసింది అతనే అన్న ఆరాధనా భావం మాత్రం నాలో పదిలంగానే వుంటుంది.

5 comments:
...అతని పై మీ విరక్తి, నైరాశ్యం చూస్తుంటే ... అతను మిమ్మల్ని వదిలి ఇంకో అందగాడిని తగులు కున్నట్లు ఉంది... అంతేనా ?
హహ్హహ్హా హహ హహ హహ్హహ్హా.....
lol lol... rofl....
@ కాయ
ఛ, ఛ, అలాంటి కోపాలు కాదండీ బాబూ. ఏంటో చిత్రమయిన మనస్థత్వంతో నాకు బాగా విసుగు తెప్పించేవాడు. చూసి చూసి వదిలివేసాను.
నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో " సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
ముందుమాట
అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
-మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రి
I really like the sensitivity you have applied in many contexts like 'AA Kura' ,mataparamina bavalu etc .
And you are like christian bernard who boldly expressed his sexscapades.
Did you see the movie 'brokerback mountain' ? its a good movie ,although checks your patience :) , must see ,
@ అజ్ఞాత
:)
నేను కొంత శాతం స్వలింగ సంపర్కుడినే అయినా కూడా పూర్తి శాతం గే కానందువల్లనో ఏమో 'స్వ' చిత్రాలు ఇష్టపడను. అయితే బ్రోక్ బ్యాక్ మౌంటైన్ మంచి చిత్రం కాబట్టి చూడాలనుకుంటూనే వాయిదా వేస్తూ వస్తున్నాను. ఒకసారి ప్రయత్నించి చూస్తా - బోర్ కొడితే వదిలేస్తా.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి