పచ్చని పరిసరాల మధ్య...

(ఇది మాఇంటి చిత్రం కాదు. అంత దృశ్యం మాకు లేదు)

...మా ఇల్లు వుంటుంది. ఇప్పుడు ఆ ఫోటోలేదు. ఎప్పుడన్నా వేస్తాలెండి. పల్లెల్లో నివసించే వారికి అది సాధారణమే కానీ పట్నాల్లో నివసించేవారికి అలాంటి పరిస్థితి అరుదుగానే వుంటుంది కదా. కళ్ళు తెరచిచూస్తే ఇంటిముందు విశాలంగా పచ్చటి పచ్చిక. ఇంకొంత దూరం చూస్తే అటు పక్కా, ఇటుపక్క చిన్న సరస్సులూ, వాటి ఒడ్డునే కువకువలాడే బాతులూ. ఇంటి బయట ఇలాంటి ఆహ్లాదకరమయిన వాతావరణం వుండటం కొద్దిమందికే కుదురుతుంది. నాకు వున్న అదృష్టాల్లో అది ఒకటి (ఒక నాస్తికుడిగా అదృష్టం అనే మాట నేను వాడటం సబబు కాదేమో గానీ సులభత్వం కోసం నేను ఆ మాటే వాడుతుంటాను) . అయితే ఇంకా కొన్ని ప్రకృతి సందర్యాలూ వుంటే బావుండనిపిస్తుంది. సెలయేళ్ళూ మరియూ సుదూరాన అయినా పర్వతాలూ కనిపిస్తూవుంటే కన్నులకు ఇంకా ఇంపుగా వుంటుంది కాదూ? అలాగే గార్డెన్ పెంచుకోవడానికీ, పనిచేయడానికి వీలు వుంటే బావుండేది. కిరాయి ఇండ్లల్లో అవన్నీ ఏమి కోరతాము లెండి. ఇదివరకు కెనడాలో స్వంత ఇల్లు వున్నప్పుడు తోటను పెంచేవాళ్ళం, తోటపని చేసేవారం కానీ ఆ ఇంటి బయట ఇంత అందంగా వుండేది కాదు.   

మొత్తమ్మీద ఇంట్లో సౌందర్యానికి గానీ, ఇంటి బయట సౌందర్యానికి గానీ ప్రస్థుతం కొదవలేదు.  అందరికీ అన్నీ కలిసిరావు కానీ కొన్ని ఎంచక్కా కలిసివస్తుంటాయి. ఆ కొన్నిట్లో నాకున్న కొన్నే ఇవీ.  కొన్ని కలిసిరాకున్నా ఎంచక్కా మార్చేసుకొని కలిసేసుకోగలం.  కొన్ని కలిసి రావు - మనమే కలిసిపొవాలంతే. కలిసిరాకున్నా కనీసం  కలిసిపోలేకున్నా అప్పుడొస్తుంది కష్టకాలం. అలా అనేసి అన్నిట్లో మారిపోతే మన వ్యక్తిత్వం మనకు మిగిలిపోదు. మారడం మొదలుపెడితే మనకంటూ ఏమీ మిగలకుండా మార్చేస్తారు కొందరు. 

యు ఎస్ లో వుంటొ భారత దేశపు పల్లె వాసాన్ని దూరం అవుతున్నా కాబట్టి ఈ సారి ఇండియా వస్తే ఓ వారం రోజులయినా పల్లె వాసం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కుదరకపోతే ఓ మూడు రోజులయినా సరే. క్రితం సారి ఓ వారం రోజులే వచ్చినందున ఓ రోజు మాత్రం పల్లెవాసం చెయ్యగలిగాను. అయితే ఈసారి ఒక్క పల్లెవాసం మాత్రమే కాకుండా అక్కడ వున్నన్ని రోజులూ వ్యవసాయం కూడా చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నా. ఊరకే తిని తిరుగుతూ క్యాలరీలు కూడబెట్టకుండా కూలీలతో కలిసి కష్టపడితే మరింత జీవన వైవిధ్యం చవిచూరవచ్చు కదా.  ఏమంటారు?

అలా నేను పుట్టిన ఊరికి వెళ్ళి మా చుట్టల లేదా స్నేహితుల ఇండ్లల్లో వుంటూ ఆ పని చెయ్యొచ్చు. లేదా మా మామగారి ఊర్లో, ఇంట్లో వుండొచ్చు. నా పుట్టిన ఊరు మండల కేంద్రం అయినందువల్ల కొన్ని పట్నం ఛాయలు వచ్చాయి. మామగారి ఊరయితేనే కాస్తయినా పూర్తి పల్లెలాగా వుంటుందనుకుంటా. మామ గారి ఊరయితే ఇంకా దర్జాగా వుండొచ్చు. అయితే ఓ మూడు రోజుల వరకు ఫర్వాలేదు గానీ అంతకంటే ఎక్కువగా ఓ వారం రోజులు వున్నానంటే ఓ జీతగాడి కిందనే జమకట్టరు కదా!  

నా వ్యవసాయ ఆర్తిని తీర్చుకోవడం కోసం మీరెవరయినా ఇంకా వేరే ప్రదేశాలు , సూచనలు చేసినా ఆలోచిస్తాను మరి. 

18 comments:

  1. 'Vyavasayam' cheyyalani annaraa. Nenu marolaa chadivaanu.

    ReplyDelete
  2. Nenu oka vaaram polam panulu chesa :-)

    ReplyDelete
  3. i have the exact same dream like you..nenu oka illu kattukoni polala madhyalo untu 'athadu' movie lo laga oka chinna size library pettukoni ala life ni enjoy cheyyalani na idea..adi eppatiki teereno teliyadu gani dream lo aithe chala baguntundi :)

    ReplyDelete
  4. అయిదు రోజుల క్రితం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళా , (ఆవిడని చివరు చూపు చూద్దామని)

    నాకు మళ్ళీ తిరిగి hyd రావలనిపించలేదు :(

    ReplyDelete
  5. @ అప్పి
    నేనూ నా చిన్నప్పుడు పంట పొలాల్లో అప్పుడప్పుడు కూలీలకు సహాయపడేవాడిని. ఇండియాలో వుంటే అప్పుడప్పుడయినా పల్లెటూర్లకి వెళ్ళి వచ్చే అవకాశం దొరుకుతుంది కానీ ఇలా ఇక్కడికి వచ్చిన మా లాంటివారం ఇక్కడ ఎక్కడికి అలా వెళ్లగలం? అందుకే ఫార్మ్ బెడ్ & బ్రేక్ఫాస్టులు చూసుకొని వారాంతాలు అలా పల్లెల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో గడిపేస్తుంటాం.

    @ వినీల

    మనం రిటైర్మెంట్ అయ్యాక అలాంటి అవకాశం వుంటుందేమో కానీ అప్పటికి మన పల్లెలు పల్లెలు గానీ మిగిలి వుంటాయంటారా? వాటికీ దూరంగా వుండాల్సొస్తుందేమో. నేనయితే విశ్రాంతి రోజులని ఆ విధంగా గడిపివెయ్యాలనుకుంటున్నాను. ఇక్కడే వుండదలుచుకున్నా కూడా ఏ పర్వత ప్రాంతాల్లోనో గూడు కట్టుకుంటాను.

    ReplyDelete
  6. ఏమోయ్‌ షరత్తూ
    మా ఖర్మకి తెచ్చిపెడతావోయ్‌ .. ఎవడు కనిపెట్టమన్నాడోయ్‌ నిన్నీ ట్రేడ్మార్క్‌ పేర్లు మా ఖర్మకి చూడు మా ఖర్మ ఎట్టా కాలిందో

    వెలమకన్ని పతోడు

    ReplyDelete
  7. గులకరాళ్ళని విడిచి కాకిగూళ్ళని వలచి
    పళ్ళూడిన బోసినోట మూడుముళ్ళ కలలేలరా?
    గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా
    వెళ్ళదీయక ఈ లొల్లి ఏలరా? రెల్లివీధిన గిల్లుడేమిరా

    నిను

    వాయించన ఇనుపగుళ్ళు,దొర్లించన చెరకుమళ్ళు
    కోయించన పాత బ్లేళ్ళు కుమ్మించన అడవిలేళ్ళు
    మూయించన పాడు నోళ్ళు, పొడిపించన నాటుకోళ్ళు
    జుయి జుయ్యిన ముంచి తేల్చ నడిచెన్‌ పరవళ్ళు

    ReplyDelete
  8. @ వెలమకన్ని పతోడు
    ఆ టపాలోనే ఎవరో అజ్ఞాత అన్నట్లుగా నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి పతోడు గారూ. పతోడు పేరుదేముంది లెండి - ఆ పేరు పోతే పది పేర్లు కనిపెట్టుకోవచ్చు.

    @ అజ్ఞాత
    ఆ పద్యాలేవో బావున్నట్టున్నయ్ కానీ ఇంతకీ మీరు గానీ నన్ను గానీ తిట్టేసారా వాటిల్లో!?

    ReplyDelete
  9. @ అజ్ఞాత
    ఇప్పుడే మళ్ళీ చూసా ప్రమోదవనం కామెంట్లు. ఓ అక్కడ ఎత్తుకొచ్చారా ఆ పద్యాల్నీ. నాకు పద్య సారాంశం అర్ధం కాక కాసేపు తల బరుక్కున్నా. నన్ను నరుకుతా అని అంత ముద్దుగా పజ్జెం వ్రాసి పొడుస్తానంటారేవిట్రా అని ఖంగారు పడ్డా.

    ReplyDelete
  10. పనీ పాట లేక ఇలాంటి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి.. అందరినీ ఆకర్షించేలా ఇలాంటివి వ్రాయాలనే మీ కుట్ర ని ఖండిస్తున్నా....

    ReplyDelete
  11. సర్లెండి. అందరినీ అకర్షించాలనుకుంటే "ఆ" విషయాలే విరివిగా వ్రాసేవాడిని కదా. అయినా మీరు తిడుతూనే మెచ్చుకున్నారని నాకు అర్ధం అయ్యింది లెండి.

    ReplyDelete
  12. nijamenandi..retire ayyedaka agithe pallelu pallella vundavu..and manaki mana panulu chesukodanike opika vuntundo ledo ;)

    ee sari nenu ma nanamma valla vuru velli ma nanna to polam velli ravali..vachina chikkalla vurlo kanapadda prati vallu emi sampayinchavu ani okate question lu..aa gola tattukoleka innallu manesanu..ika oka sari velli anni chutti ravali..chinnappudu polam gatla venta nadustu vellinavi..inka bore pump lo atalu gurtu vachayi..tapa vesinanduku thanks..ika na english lo telugu ki mannincheyyandi office lo baraha ledu.

    ReplyDelete
  13. @ వినీల
    బరహా లేకపోతే తేలిగ్గా లేఖిని (lekhini.org)వాడొచ్చు.

    హహ. నన్నెవరయినా ఎంత వెనకేసావని అడిగితే ఎంత ముందేసానో చెబుతూంటా. అప్పట్లో క్రెడీట్ కార్డ్ బ్యాలన్సులు చాలా వుండేవి - అవి చెప్పేవోడినన్నమాట. మీ అభీష్ట సిద్ది రస్తు. ఎంచక్కా మీ నానమ్మ ఊరు వెళ్ళి రండి - విశేషాలు మాకు చెప్పండి.

    ReplyDelete
  14. శరత్ .. ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా శారీరక శ్రమ చేశారా? ట్రెడ్ మిల్లు మీద నడవడం, పరిగెట్టడం కాదు - నడుంవంచి విరామం లేకుండా గంటా గంటన్నర పాటు పని చెయ్యడం .. చాలా కష్టం - మీరేదో నాస్టాల్జియా పింక్ మబ్బుల్లో తేలుతున్నట్టుంది మీ ఊహల్లో!!

    ReplyDelete
  15. @ కొత్తపాళీ
    శారీరక శ్రమ చెయ్యడానికి అవకాశం ఎక్కడుందండీ? తోటపని చేసి చూద్దామన్నా మాకు గార్డెన్ కానీ, అందుకు స్థలం కానీ లేవు. అందుకే ఈ సారి ఇండియా వెళ్ళి చెయ్యాలనుకునేది. అలా కష్టపడటం కష్టం లాగుంది కానీ ఇష్టమయింది కాబట్టి ప్రయత్నించి చూస్తాను.

    మీరు చేస్తుంటారా? తోటపని అయ్యుంటుంది. అది కాకుండా ఇక్కడ ఇంకా వేరే మార్గాలు ఏమున్నాయబ్బా!

    ReplyDelete
  16. శరత్, మాకు ఊర్లో చానా పొలముంది.నేను ఇట్టాగే అనుకుంటా కానీ ఆడికి పొయ్యి గెనము దాటి దిగకముందే ఆయాసం. అమ్రెకా లో వుండి మనం కనే కలలు ఇట్టాగే వుంటాయి మరి :)

    ReplyDelete
  17. @ భారారే
    ప్రయత్నం పురుష లక్షణం కదా. కష్టించి చూస్తా. ఎంత వీలయితే అంతే. ఆ తరువాతా కుదరకపోతే కాళ్ళు బారజాపుకుంటా.

    ReplyDelete
  18. అవును, తోటపనే.
    వీలైనప్పుడు పోయిన వేసవి అనుభవాలు ఇక్కడ చూడండి.
    http://kottapali.blogspot.com/2010/07/blog-post_15.html
    అప్పుడప్పుడూ, అంటే సంవత్సరానికోసారి, స్ప్రింగ్ క్లీనింగ్ అంటారే .. అలా ఇంటో ఉపయోగం లేని వస్తువులన్నీ బయటికి తీసి వాటిని దానం చెయ్యడమో, పారెయ్యడమో - ఇది కూడా చాలా శ్రమతో కూడుకున్న విషయం.
    నేనైనా మిమ్మల్ని చెయ్యొద్దు అనడం లేదు, జస్ట్ కాషన్ అంతే.
    భారారె - బాగా చెప్పారు.:)
    మనబ్లాగర్లలో పల్లెలు, వ్యవసాయపు నేపథ్యం ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఒకసారి విహారి చిన్నప్పుడు శనగచేల అనుభవాలు కొన్ని రాశారు.

    ReplyDelete