తీన్‌మార్ వేసామండీ - బావుంది

నేను హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ చూడలేదు. నేను పవన్ వీరాభిమానిని కాదు, అభిమానిని కూడా కాదు. బావుంటే చూస్తాను - బాగోలేకపోతే తిట్టుకుంటాను. నిన్న మా ఆవిడ, అమ్మలు, నేను ఈ సినిమాకి వెళ్ళాం. మా పెద్దమ్మాయి ఐ హేట్ లవ్ స్టోరీస్ అన్చెప్పి ఈ సినిమాకి రాలేదు. ఈ సినిమా మా ముగ్గురికీ నచ్చింది. చాలా బావుందా అంటే ఏమో కానీ బాగానయితే వుంది.

త్రిష నాకు నచ్చదు, ఫీల్ రాదు కాబట్టి ఏం పొట్టి పొట్టీ బట్టలు వేసుకున్నా నాకు వేస్టే. ఇంకా నయ్యం ఈ సినిమాలో మరీ ఒక్కిగా, బక్కిగా లేక నాకు వాంతులు రాకుండా కాపాడింది. కృతి ఎలా వుంటుందా అనుకున్నా - ఛండాలంగా వుంది - స్వీట్ షాప్ సీనులో అయితే అచ్చం ఓ వేశ్యలా అనిపించింది. మెగా ఫ్యామిలీకి చాలా సందర్భాల్లో హీరోయిన్లని ఎన్నిక చేసుకోవడం రాదనుకుంటా - డొక్కు హీరోయిన్లని ఎక్కడినుండి పట్టుకువస్తారో కానీ భలే తెస్తారు.  మరొకరెవరో (శ్రీ అనుకుంటా) చెప్పినట్లుగా త్రిష, కృతి కన్నా మరో (తెల్ల) హీరోయిన్ బావుంది.
 
ఏంటర్టైన్మెంట్ సినిమాల్లో కూడా కళాఖండాలను చూడాలనుకునేవారికీ ఈ సినిమా నచ్చకపోవచ్చునేమో గానీ మామూలుగానయితే కాలక్షేపం సినిమాలు నచ్చేవారందరికీ ఇది నచ్చాలి మరి.  మిగతా సినిమా విశేషాలు అందరూ చెప్పేరుగా - మళ్ళీ నేను ఎందుకులెండి.  అన్నట్టు ఏ సినిమా అయినా సరే కనీసం మూడు సార్లు కదిలింపజేస్తే అంటే మనల్ని మంచిగా ఏడిపించేస్తే (ఆడాళ్ళ కన్నీళ్ళ కొసం తీసే ఏడుపుగొట్టు సినిమాలు, సన్నివేశాల గురించి కాదండోయ్ నేను అంటూంట) ఆ సినిమా చక్కని సినిమానే అయి వుంటుంది. ఈ సినిమా ఆ పాస్ మార్కును కూడా దాటింది. అలా అని చందమామ, బొమ్మరిల్లు సినిమాల్లాగా మరీ బావుంది కూడా అనలేను. విశ్వనాథ్ మంచి సినిమాల్లాంటి కళాఖండమూ కాదు కాని రంధ్రాన్వేషణలు చెయ్యకుండా వుంటే హాయిగా ఓ సారి చూసి రావచ్చు.    

No comments:

Post a Comment