కుక్కేసెయ్ కుక్కేసెయ్ అన్నం...

ఒక సీను అల్లుకుందాం. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్లందరూ ఓ కుర్చీకి కట్టేసి... ఆ... కట్టేసీ మీకు బలవంతంగా వద్దు మొర్రో అనకుండా భోజనం తినిపిస్తున్నారనుకోండి. అహ అనుకోండంతే. మీకు పొట్ట నిండిపోయాక మీరు వద్దంటారు. వాళ్ళు వినరు. మీరు ఫుల్లుగా తినకపోతే మీకు సరిగ్గా నిద్ర పట్టక అర్ధరాత్రులు లేచి నన్ను గోకుతారండీ అని మీ అవిడ నోట్లో అన్నం కుక్కుతుంది. నువ్వు బాగా బక్కగా అయిపోతున్నావు బాబూ అని మీ అమ్మగారు మరో ముద్ద మీ నోట్లో కుక్కుతుంది. తినరా భడవా, తిని వెంటనే పడకేసెయ్, సరిగ్గా తినక నీకు సరిగ్గా నిద్ర రాక రాత్రి ఏఝాము దాకానో ఇంటర్నెట్టూ గట్రా చూసుకుంటూ గడుపుతున్నావ్ అని ఏ కోట లాంటి తండ్రో మీ తలకాయ బిర్రుగా పట్టేసి మీ అమ్మగారికీ, మీ ఆవిడకి ఇంకా ఇంకా మీ నోట్లో అన్నం కుక్కడానికి సహకరిస్తుంటారని ఊహించేసుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుందీ? అహ మీకు ఏమనిపిస్తుందీ అంటాను.

ఇలాంటి దృశ్యం ఇంట్లో చిన్నపిల్లలు వున్న ప్రతి ఇంట్లో దాదాపుగా కనపడుతూనేవుంటుంది.  చిన్నపిల్లల్ని బలవంతంగా పట్టెసి వద్దు మొర్రో అని వాళ్ళు గింజుకులాడుతున్నా వినకుండా తల్లి, అమ్మమ్మా, నానమ్మలు ఓ ఒకటే భోజనం అంతా కుక్కేస్తూవుంటారు. అది వారి దృష్టిలో పిల్లల మీది ప్రేమ మరియు శ్రద్ధ. అలా కుక్కెయ్యకపోతే చూసిన వాళ్ళు హేమనుకుంటారూ! పిల్లల మీద ప్రేమ లేదనుకోరూ? పైగా పక్కింటి పిల్లాడేమో బొద్దుగా ఆరోగ్యంగా వుండే. మన పిల్లోడేమో బక్కగా వుండే. లావు కావద్దూ. సరిగ్గా తినకపోతే సరిగ్గా పడుకోరు కదా. నిద్ర లేస్తారు. నిద్ర లేచీ? ఆడుకుంటారు. హన్నా. పిల్లలు ఆడుకోవడమే! హెంత పొరపాటు హెంత పొరపాటూ - పిల్లలు బుద్ధిగా భోజనం కక్కేదాకా మింగేసి బజ్జోవాలి కానీ. అప్పుడు మేము ఎంచక్కా నెట్టో, బజ్జులో, బ్లాగులో చూసుకుంటామూ.  

ఎందుకండీ అలా పిల్లలని టార్చర్ చెయ్యడం? మిమ్మల్ని కుర్చీకి కట్టెసి అలా కుక్కికుక్కి అందరూ తినిపిస్తే తెలుస్తుంది అందులోని బాధ. భోజనం చెయ్యడం అన్నది ఒక ఆనందకరమయిన విషయం అవాలి కానీ రోజుకి మూడు పూటలూ హింస లాగా తయారవకూడదు.  పిల్లలు ఆరోగ్యంగా వుంటే చాలు - బొద్దుగా వుండనక్కరలేదు. వయస్సుకి తగ్గ బరువుకంటే మరీ తక్కువుంటే అలా కొద్దిగా బలవంతంగా తినిపించినా అర్ధం చేసుకోవచ్చు. పిల్లలు చక్కగానే వున్నా ఇంకా ఇంకా లావు కావాలని, చూసిన వారందరూ అబ్బొ ఎంత బావున్నాడూ అని మెచ్చుకోవాలనే తాపత్రయంతో మరో వైపున ప్రతి పూటా మన పిల్లలకి ఇబ్బంది కలగజేస్తున్నామన్న సంగతి ఎందుకు మనం గుర్తించం? అసలు ఆ ఆలోచనే  మన మనస్సుల్లోకి ఎందుకు రాదు? పిల్లలు మనుషులు కారా? వారికి అబ్యూజ్ నుండి రక్షణ అవసరం లేదా? తల్లితండ్రులు అయినంత మాత్రాన మనం పసిపిల్లల పట్ల ఏది చేసినా  చెల్లుతుందనేనా? పిల్లలకూ హక్కులుంటాయి. వారూ మనుషులే. వారికీ వేధింపుల నుండి రక్షణ అవసరం. బయటివారెవరో వేధిస్తే మన ప్రాణాలు అడ్డేసి అయినా అయినా మన పిల్లలని కాపాడతామే - అలాంటిది రోజులు మూడు పూటలా మనమే మన స్వంత పిల్లలని వేధిస్తున్నామంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏవో తొట్టి  కారణాలు చూపెట్టి సమర్ధించుకోకుండా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ లోనుండి, వారికీ మనస్సుంటుందనీ, అది కూడా బాధపడుతుందనే కోణంలో ఆలోచించి చూడండి. మీ హృదయం ద్రవిస్తుందేమో చూడండి. ఇది ఒక్క పూట, ఒక్క రోజు విషయం అయినా ఏమోలే అనుకోవచ్చు. ప్రతి రోజూ ప్రతి పూటా పిల్లలకి నరకం చూపిస్తున్నారు కదండీ మీరు. ఆత్మ పరిశీలన చేసుకోండి. అది వేరే ఎవ్వరికోసమో కాదు - మన పిల్లల కోసం. 

మీ పిల్లలు బాగా తినాలంటే పిల్లలని బాగా ఆడిపించండి. అలసిసొలసేదాకా ఆడిపించండి. అప్పుడు చచ్చినట్టి వారికే ఆకలవుతుంది. అలసిపోయి ఒకవేళ వెంటనే నిద్రపోయినా కంగారేమే లేదు - లేచాక వారే ఆవురావురు మనుకుంటూ అన్నం మీద పడిపోతారనుకుంటాను.  ఎందుకమ్మా అలా బలవంతంగా తినిపించడం అని సున్నితంగా సజెస్ట్ చేస్తుంటాను. వారు ఏవో కారణాలు చెబుతారు. ఏమని చెప్పగలం వారికి? చేసేది లేక, చూసేది లేక ముఖం తిప్పేసుకుంటాను. అంతకుమించి మనం ఏం చేయగలం  - ఇలా నా బ్లాగులో ఓ పోస్టేసుకోవడం తప్ప? 

ఈ విషయంలో మా పిల్లలు అదృష్టవంతులు. వారి చిన్నప్పుడు నేను ఎదుట లేనప్పుడు సంగతి చెప్పలేను కానీ నేను వున్నప్పుడు మాత్రం మా ఇంట్లో ఇలా జరగనిచ్చేవాడిని కాదు. నేను ఇంట్లో లేనప్పుడు కూడా పిల్లలకి ఇలాంటి పరిస్థితి వుండకూడదని ఇంట్లో ఆదేశించాను. 

8 comments:

 1. Ala chala mandi unnarandi. Maa friend valla two years kuda leni pilaldiki pizzalu , cokelu ichedi. Health padavutundemo ani evarina ante vadiki ave ishtam anedi. Vadu sariga tine vadu kadu. Maa vadiki pizza ishtam burger ishtam ani ave pettedi. vadu edi sariga tine vadu kadu.ippatiki 4 yrs vachina vadu 11 kgs anthe.

  ReplyDelete
 2. Kontha mandi chanti pillalaku neyyanu kooda ekkuvaga peduthuntaru(kukkadam). Daantho vaariki Garbha Vaatham vacchi jabbuna paduthunnaru. Chanipoyina sangatanalu kooda vunnayi. Schoolki velle varaku pillalu annam vishayamlo pechilu pedatharu. Orputho konchem konchem ekkuva saarlu pettali.

  Mee article bagundi. Keep it up.

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  ధన్యవాదాలు. అసలే ఈ దేశాల్లో ఊబకాయం ఎక్కువ. కనీసం ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయస్థులే. అలాంటప్పుడు మన పిల్లలు తక్కువ తినడమే మంచి విషయం అనుకోవాలి. ఎక్కువ తినడం అలవాటు అయిపోతే ఈ తిండికీ, పాసివ్ జీవితానికీ తేలిగ్గా బరువు పెరుగుతారు.

  ReplyDelete
 4. మొదటి నాలుగైదు లైన్లు చూసి.. మీకలా తినిపించేదెవరబ్బా అని ...సస్పెన్స్ అయ్యాను... తర్వాత జాలి పడ్డాను .. ఆ తర్వాత ఆలోచించాను... ఇలా ఈ మధ్య ఎక్కువగా పిల్లల స్వాతంత్ర్య పోరాటాలు చేస్తున్నారెందుకో అని..
  ఎనీ వేస్ .. మంచి ప్రయత్నాలే..

  ReplyDelete
 5. @ కాయ
  ఆ ఏమీలేదండీ. ఒక్కోప్పుడు అలా ఒక్కో దానిమీద పడాలనిపిస్తుంది. ప్రస్థుతం పిల్లల సమస్యల మీద పడ్డా అంతే.

  ReplyDelete
 6. good one.....vallaki akali vesthe valle thintaru ani enduku anukoro....

  ReplyDelete
 7. నిజంగా చాల మంచి పొస్ట్ రాసారు. ఈ విషయాని ఎలా చెప్పినాకూడా ఇంట్లో వినటం లేదు .
  ఇంకా మీ పోస్ట్ ని చుపిడ్డంనుకుంటున్న.
  మంచి పొస్ట్ రాసినందుకు ధన్య వాదములు

  ReplyDelete