చెయ్యి పట్టి నడిపించుకెళ్ళమని చెబుతాను

అప్పుడప్పుడు నా తరహాగా ఆలోచించే వ్యక్తుల సమావేశాలకి వెళుతుంటానని చెబుతుంటానుగా. రేపు ఆ సమావేశం మళ్ళీ వుంది. ఈ సారి విశేషం ఏమిటంటే ఆ గుంపులో నాకు బాగా నచ్చిన సు అనే యువతిని నాకు మెంటరుగా వుండమని కోరాను. సరే అనేసి హుం నీ గురించి నాకు ఎక్కువగా తెలియదుగా అంది. రేపటి సమావేశంలో వివరంగా మాట్లాడుకుందాం అనేసింది. అప్పుడు వివరంగా చెబుతాను - నా చెయ్యి పట్టుకొని ఈ జీవిత విధానంలో నడిపించుకు వెళ్ళమని. ఈమధ్య కుదరక వుండి ఆ సమావేశాలకి వెళ్ళలేదు. చాన్నాళ్ళ తరువాత మళ్ళీ వెళ్ళడం. ఇదివరలో కూడా రెండు సార్లు మాత్రమే వెళ్ళాను.

మొదటి సమావేశంలో సు ని చూసి నచ్చాను. నిజం చెప్పాలంటే అంతకుముందే మా గ్రూపు సైటులో ఆమె ఫోటోలు చూసి నచ్చేసాను. అయితే ఆ రోజు ఆమె కనీసం నా వేపు కూడా చూడకపోయేసరికి వళ్ళు మండి ఆమెని నా మనస్సులో బ్లాక్ లిస్టులో పెట్టేసాను. అయితే ఆశ్చర్యకరంగా ఒక రెండు రోజులకే ఆమెనుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో సంతోషించా. మరుసటి సమావేశంలో నా పక్కనే కూర్చొని ఎంచక్కా కబుర్లు చెప్పడంతో నాకు సంతోషం కలిగింది. ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా తీసుకొనే ఆమెని మా సెక్స్ ప్రో గ్రూపులో మెంటరుగా వుండమని కోరను. ఆమె మా గ్రూపులో చాలా చురుకయిన వ్యక్తి. ఎన్నో వైవిధ్యమయిన సమూహాలలో, కార్యక్రమాలలో ఆమె ఉత్సాహంగా పాల్గొంటూవుంటుంది. ఆమెతో పాటు నడిస్తే అవన్నీ కూడా నాకు పరిచయం అవుతాయని నా ఆశ. ఇప్పటిదాకా ఈ జీవిత విధానం ముంగిట తచ్చట్లాడటమే సరిపోతోంది కానీ సరి అయిన తోడులేక సాలిడ్ గా చేసిందేమీలేదు. అందుకే ఆమెను అడిగి ముందడుగు వేసాను. ఇహ అంతా ఆమె బాధ్యతే. ఆమె సూచించడం - నేను చెయ్యడమూనూ.   

ఇదివరలో నాకు దేవతగా వుండమని ఒకరిని కోరాను కానీ ఆమె కాస్త ప్రొఫెషనల్ దేవతగా అనిపించి ముందే దూరం అయ్యాను. అలాంటివారు మనలాంటి నా లాంటి భక్తుల కోరికలు తెరుస్తారు కానీ వారికి తృణమో, పణమో బహుమతులుగా అప్పుడప్పుడయినా సమార్పిస్తూ సంతోషపెట్టాల్సి వుంటుంది. అంత ఆనందం మనకు వద్దులే అని ఆమెని పక్కకుపెట్టాను. సు చక్కటి స్నేహితురాలు కాబట్టి అలాంటి సమస్యలు వుండవు కానీ ఎంతవరకు, ఎంతదూరం నాకు మార్గదర్శకత్వం చేస్తుందో చూడాలి. 

2 comments:

  1. nijamga mee postulu choostunte oka manishilo inni konaalu ela vuntai anipistundi.

    ReplyDelete
  2. @ రవి
    చెప్పుకుంటే ఎన్నో వుంటాయి - చెప్పుకోకపోతే కొన్నే వుంటాయి.

    ReplyDelete