ఓ చిన్న విజయం

ఇవాళ ఆమె నాకు ఫోన్ చేసి 1200 డాలర్లకు గాను నా పేరిట చెక్ పంపిస్తున్నట్లుగా చెప్పింది. సంతోషం వేసింది. వెంటనే మా ఆవిడకి ఫోన్ చేసి ఓ చిన్న గుడ్ న్యూస్, ఆ వచ్చే వారం వెళ్ళి బంగారు ఆభరణాలు కొనుక్కుందువు గానీ అని చెప్పాను. ఎందుకంటే అవి ఆమెకు చెందాల్సిన డబ్బులు.

గత నెల 13 వ తారీఖున ఒక ప్లాజాలో మా ఆవిడ బంగారమూ, డబ్బూ పోగొట్టుకుందని చెప్పాను - మీకు గుర్తే వుంటుంది. వాటి మొత్తం విలువ అప్పుడు $2500 కంటే పైగా వుంటుండొచ్చు. అంత విలువయినవి పోయినప్పుడు చాలామంది పోలీసు రిపోర్ట్ ఇస్తారు కనుక మేమూ రిపోర్ట్ ఇచ్చి వచ్చాము. చాలా అరుదుగా ఎప్పుడయినా దొంగలు పట్టుబడితే ఎంతో కొంత మనవి మనకు తిరిగి రావచ్చు. మావేవో తిరిగి వస్తాయనే నమ్మకం లేకపోయినా ఫార్మలుగా, మా బాధ్యతగా, ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నట్లుగా వారికీ తెలియాలి కాబట్టి ప్లాజా సెక్యూరిటీకీ, పోలీసుకీ రిపోర్ట్ ఇచ్చి వచ్చేసాము.

మా ఇంటికి రెంటల్ ఇన్సూరెన్స్ వుంది. అలాంటి భీమాలలో ఇంట్లో దొంగలు పడ్డా కవర్ అవుతుంది. ఆ విషయం చాలా మందికి తెలియదనుకుంటా. మా పక్కింటతనికి చెబితే అతనికి ఆ విషయమే తెలియదన్నారు.  మరి మా నగలు, డబ్బులు దొంగలు ఎత్తుకెళ్ళారు కానీ మా ఇంట్లో ఎత్తుకెళ్ళలేదే! ఎలా భీమా క్లెయిం చెయ్యడం చెప్మా? భీమా వివరాలు జాగ్రత్తగా చదివాను. ఇంట్లోనే అఖ్ఖరలేదు, ప్రపంచంలో ఎక్కడ మీ వస్తువులు పోయినా ఎంతో కొంత ఇచ్చెస్తామని ఏదేది ఎంత ఇస్తారో లెక్కేసి వుంది. హింకేం. దర్జాగా క్లెయిం చేసాను. మా భీమా ప్రకారం నగదు ఎంత పోయినా కూడా $200 వరకే ఇస్తారు. మా ఆవిడ అందాజాగా $300 పోగొట్టింది. ఆభరణాలు ఎంత విలువ అయినవి పోయినా కూడా $1000 మాత్రమే ఇస్తారు. మా ఆవిడ దాదాపుగా $2200 విలువయైన ఆభరణాలు పొగొట్టుకుంది. ఆ లెక్కన మాకు ఎక్కువలో ఎక్కువ $1200 అయినా రావాలి. అంటే మేము పోగొట్టుకున్న వాటిల్లో సగం విలువ మాకు తిరిగి రావచ్చు. మరి వస్తాయా లేదా?  వస్తే ఎన్నాళ్ళకి వస్తాయి. ఇలా రెంటల్ భీమా కోసం దరఖాస్తు చెయ్యడం  ఇదే మొదటి సారి. అలా చేసి వున్నవారు కూడా మాకు తెలియదు. చూద్దాం అనుకున్నాం.

భీమా వారు ఆధారాలు, రిసీట్లూ సమర్పించమన్నారు. ఒక్క జత చెవి రింగులకు ఇక్కడి రసీదు తప్ప ఇతర ఆభరణాలు ఇండియాలో కొన్నవి కనుక రసీదులు లేనే లేవు. వున్న వరకు పంపించి మిగతావి ఇండియాలో కొన్నామనీ, రసీదులు లేవనీ చెప్పాం. వాళ్ళు అడిగిన ఆధారాలు సమర్పించాం. ఇండియాలో కొన్నా, ఇక్కడ కొన్నా మీ ఆభరణాల రసీదులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాగే ఎప్పుడన్నా మీకు అవసరం పడవచ్చు. 

ఇవాల మా భీమా కంపెనీ మేనేజర్ ఫోన్ చేసి ఈ రోజే $1200 కు గానూ చెక్కు పంపిస్తున్నామనీ 4,5 రోజుల్లో అందుతుందనీ చెప్పింది. సంతోషం. అన్నట్లు ఒక విషయం ఇక్కడ ప్రస్థావించాలి. మేము క్లెయిం చెసాక భీమా ఎసెస్మెంట్ ఏజెంట్ నాకు ఫోన్ చేసి మేము ఏదో దొంగలమా అన్నట్లుగా గట్టిగా మాట్లాడాడు. అప్పటికి తమాయించుకున్నాను. నేను మళ్ళీ ఫోన్ చెసినప్పుడు అతనితో ఆ విషయం ప్రస్థావించి మెల్లగా మాట్లాడమని సూచిద్దామనుకున్నాను. అప్పుడు అతను దొరకకపోతే అతని మేనేజరుతో మాట్లాడాను. మా క్లెయిం గురించి మాట్లాడాక ఆ భీమా ఏజెంట్ మాట్లాడె విధం గురించి ఆమెతో ప్రస్థావించాను (ఫిర్యాదు కాదు). అతను మా ఆవిడ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు అతనిని స్మూత్ గా మాట్లాడమని చెప్పమని ఆమెను కోరాను. మా ఆవిడ బెదిరిపోకుండా చూడమని కోరాను. ఆవిడ నాకు క్షమాపణలు తెలియజేసి అతనికి న్యూయార్క్ ఏక్సెంట్ అనీ, మానుకోలేకపోతున్నాడనీ తెలియపరచింది. అతనికి తెలియజేస్తా అని చెప్పింది. ఆ తరువాత అతనెప్పుడూ మా ఆవిడతో గానీ, నాతో గానీ కర్కశంగా మాట్లాడలేదు. మా క్లెయిం కూడా స్మూత్ గా పరిష్కరించాడు.  

అన్నట్లు మేము రెంటల్ ఇన్సూరెన్స్ కోసం నెలకు $12 చెల్లిస్తాము. మా ఇంటికి ఆ భీమా తప్పని సరి. అందుకే తీసుకున్నాం - అది ఈ విధంగా అయినా ఉపయొగపడింది. వచ్చే ఏడాది మళ్ళీ భీమా రెన్యూయల్ చేయిస్తున్నప్పుడు ఒక క్లెయిం చేసాము కాబట్టి  నెల సరి భీమా కొంత పెరగవచ్చు.

మా ఊరి జ్ఞాపకాలు: అబ్బమ్మ

అబ్బమ్మ అనగానే ఏ అచ్చమ్మ లాంటి కథో అనుకునేరు.  అస్సలు కాదు. . ఈమె నాకు తల్లి లాంటిది. మా ఇంటి చాకలి ఈమె. ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నదో మా ఇంట్లో ఈమె గానీ నేను పుట్టినప్పటి నుండీ కనపడుతూనే వుండేది. నన్ను ఎంతో శ్రద్ధగా, ప్రేమగా చూసుకునేది. అలా అని ఆమె మెతక మనిషి అనుకున్నారా? కానే కాదు. నేను స్నానం చెయ్యను మొర్రో - అది ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎంత లబలబలాడుతున్నా బరబరా నన్ను లాక్కెళ్ళి వీర లెవల్లో వీపు రుద్దేసి నన్ను ఉతికేసి, కడిగేసి ఆరేసేది :(     అలా మా అమ్మకు భయపడకున్నా ఆమెకు భయపడేవాడిని.

ఆమె అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం వుండేది. పనులు శ్రద్ధగా, నమ్మకంగా చేసేది. ఆప్యాయంగా, ఆత్మీయంగా ప్రవర్తించేది.  ఆమె కొడుకులు కూడా మాకు జీతగాళ్ళుగా పనిచేసారు. మా తాతయ్య, అమ్మమ్మలతో ఎన్నో ముచ్చట్లు చెబుతూ వారికి కాలక్షేపం కలిగిస్తుండేది. మేము ఆ ఊరినుండి వెళ్ళొచ్చినా మా అమ్మమ్మా, తాతయ్యలు ఆ ఇంట్లోనే వుండేవారు కనుక ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఆమె కలుస్తూనే వుండేది. మా అమ్మమ్మా, తాతయ్యలు మరణించాక ఊరు వెళ్ళడం తక్కువయ్యింది. ఈ దేశాలకి వచ్చాక మరీ తక్కువయ్యింది. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కనపడేది. ఆమె సంతోషం కోసం నేను సంతోషంగా ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చేవాడిని. నా పెళ్ళికి కూడా ఆమె ఊరునుండి వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ ఆమె గుర్తు కోసం దానిని ప్రత్యేకంగా వీడియో తీయించాను.

ఆమె బాగా వృద్ధురాలయిపోయింది కాబట్టి ఇప్పటికి ఆమె మరణించివుండవచ్చు. మా అమ్మగారిని కనుక్కోవాలి. ఆమెకు ఒకసారి బట్టలు పెడదామని అనుకునేవాడిని కానీ అప్పుడు కుదరలేదు. ఆమె ఇంకా బ్రతికి వుంటే కనుక ఈసారి వెళ్ళినప్పుడయినా ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టి వస్తాను. ఆమె వున్నా లేకున్నా ఆమె చూపించిన ప్రేమా, ఆదరణా మా కుంటుంబం మనస్సుల్లో నిలిచేవుంటాయి.

రెండు మూడు (బెల్టు) రంధ్రాలు


మన ఆకారాలు ఆపిల్ పండులాగా వుండకూడదు. గంట గ్లాసు ఆకారంలో వుండాలి.

నా బొజ్జ భారతం గురించి అప్పుడప్పుడు టపాలు వేస్తుంటాను కాదా. నేను నా గురించి సిగ్గుపడే విషయాల్లో అది ఒకటి. అది కంట్రోల్లో వుంచుకుంటాను మళ్ళీ పెంచేస్తుంటాను. నా బుర్రలో తినగానే ఇహ తిన్నావు చాల్లే అని హెచ్చరించి మూసుకునే ఫ్లాగ్/స్విచ్చు సరిగ్గా పనిచెయ్యడం లేదనుకుంటా. అలాంటి ఫ్లాగ్ పనిచెయ్యని వారే ఎక్కువగా ఊబకాయులవుతారు. మనకి ఊబకాయం లేదు గానీ కొద్దిగా పొట్ట వుంది. దాని గురించి కిందా మీదా పడుతూ పెంచుతూ తగ్గిస్తూ వుంటాను. తగ్గించినప్పుడు రెండో బెల్టు రంధ్రం, పెంచినప్పుడు మూడో రంధ్రం వాడుతుంటాను. ఒకటో రంధ్రమే వాడాలనుకునే ఆ చిరు ఆశ ఇప్పటికింకా తీరనేలేదూ. 

ప్రస్థుతం రెండో రంధ్రంలో వున్నాలెండి. పని దినాల్లో సాధారణంగా రెండోదే వుంటుంది. ఆఫీసులో వుంటాను కనుక మితాహారం అమితంగా మెయింటేన్ చేస్తుంటా. వారాంతం ఇంట్లో వుంటే మా ఆవిడ ప్రేమతో ఎన్నో పనికిమాలిన వంటలు నాతో తినిపిస్తుంది.  బయట తిన్నా బంధువులు మరియు స్నేహితుల ఇళ్ళల్లో తిన్నా లేక వారొచ్చినా మేము పెట్టి వారితో తినేది అంత ఆరొగ్యకరమయిన ఆహారం కాదు కాబట్టి మండే వచ్చేసరికి మూడో రంధ్రానికి తక్కువగా, రెండో రంధ్రానికి ఎక్కువగా నా పరిస్థితి వుంటుంది. ఎవర్నీ తిట్టలేక నన్ను నేను తిట్టుకుంటూ వారమంతా మళ్ళీ నా కడుపు నేనే ఎండబెట్టుకుంటాను.

ఏం, ఆ తినే చెత్తేదో తక్కువ తినొచ్చు కదా అని మీరు అంటారు. అంతేనా? అలా తక్కువ తినాలని మీకు తెలుసు, నాకు తెలుసు. నా బుర్రకేం తెలుసు? కడుపు నిండింది మహా ప్రభో - ఇహ చాలించండి అని అది గాఠ్ఠిగా మొత్తుకోవాలా? ముచ్చట్లలో పడి మొత్తంగా లాగించడమే కానీ దాని మెత్త మెత్తని మొత్తుకోళ్ళు నేను వినేదేమయినా వుందా?  

అందుకే ఇలాక్కాదని నా బుర్రలో వుండే తిండి సిగ్నలును సరి చేసే ప్రయత్నాలు చేసాను.  కొద్దిగా సైకాలజీ మరియు సైకియాట్రీ ల మీద అవగాహన వుంది కాబట్టి నా మనస్సు మీద నేను కొన్ని ప్రయోగాలు చేస్తుంటాను. అలాగే ఫుడ్డు సిగ్నలు మీద ఈమధ్య ఫోకస్ చేసి చూస్తున్నాను. ఆ ప్రయోగాలు ఏవో కాస్త ఫలిస్తున్నట్లే వున్నయ్.  చాలా మంది ఆహార నియంత్రణ మీదనే ఫోకస్ చేసి నానా పాట్లు పడుతుంటారు కానీ ఆ ఆహార నియంత్రణ ఎందుకు సాధ్యపడటం లేదో ఆలోచించరు.  మీరు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎక్కువగానే తిండి తినేస్తున్నారంటే బహుశా అది మీ మీ స్వీయ మానసిక నియంత్రణ లోపం కాకపోవచ్చు. ఎంత ఆహారం తింటున్నాము మరియు కడుపు నిండిందా లేదా అని మానిటర్ చేసి చెప్పే మెదడులోని వ్యవస్థ సరిగ్గా పని చేస్తూవుండకపోవచ్చు. ఊరకే మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా ఆ దిశగా కూడా దృష్టి సారించి చూడండి.  అవి సరిచేసుకోవడానికి సులభమయిన మార్గాలు వున్నాయి. కొద్దిగా తినగానే ఇహ చాల్లేరా బాబూ అనిపిస్తాయి. చూస్తుంటే నేను మొదటి రంధ్రానికి వెళ్ళే రోజులు దగ్గర్లో, చాలా దగ్గర్లోనే వున్నట్టున్నాయి. బహుశా వచ్చే వారం ఆ మైలు రాయి దాటేస్తా అనుకుంటా. 

మొత్తం మీద నేను ఇన్నాళ్ళూ నా పొట్ట గురించీ, బరువు గురించీ కిందా మీదా పడుతూనే అయినా మొదటి బెల్టు రంధ్రానికి వెళ్ళలేకపోయినా రెండో రంధ్రం దగ్గరే ఆగేసి మళ్ళీ వెనక్కు వస్తున్నా. మూడో దానికయితే ఇంతవరకు చేరుకోలేదు - అదీ నా సంతోషం. మీది కూడా ఏ రంధ్రమో చెప్పేసెయ్యండి మరీ. నో చీటింగ్! నాది చాలా చిన్న పర్సనాలిటీ. పిట్ట ప్రాణం అన్నమాట. నా ఎత్తు 5' 3'' మాత్రమే. మా ఆవిడ ఎత్తు 5' 1''. ఈ విషయంలో నాకు తగ్గ పెళ్ళాన్ని చూసుకున్నాలెండీ. నా ప్రస్థుత బరువు  53 కిలోలు. నేను కనీసం 52 వుండాలి, 58 కి పెరగకుండా వుండాలి. 55 సరాసరి. నా సరాసరి బరువు కంటే తక్కువే వున్నా కూడా నాలోని బరువు కొంత బొజ్జలో వుండిపోయింది. అది అలా వుంటే మధుమేహం, గుండె జబ్బులు వగైరాలు మనం వెల్కం చెప్పకున్నా వచ్చేసి తిష్ఠవేసే అవకాశాలు మెండు. 

అందుకే నా పనిదినాల బరువు 50 కి తగ్గించేస్తే వారాంతం అయిపోయేలోగా 51 కి ఎక్కినా ఫర్వాలేదు. మరీ ప్రత్యేక సందర్బల్లో 52 అయినా ఆందోళన వుండదు. మన వయస్సు పెరుగుతున్నా కొద్దీ మెటబాలిజం తగ్గుతుంది కాబట్టీ, ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ కాలం జీవిస్తాము కాబట్టీ నేను కంట్రోల్డుగా బరువు తగ్గుతున్నా కాబట్టీ నా వయస్సు, ఎత్తుకి 52 కనీసం వుండాలి కానీ 50 కి దిగినా ఫరవాలేదు  అనుకుంటున్నా. ఆ తరువాత 50 - 52 మధ్య ఫ్లక్చువేటు అయినా ఫర్వాలేదు కదా. ఏమంటారు?

గత కొన్నేళ్ళుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా బరువు 52 కి దిగలేదు. అందుకే మూల కారణాన్ని గుర్తించి దానిపై పడుతున్నాను. ఈ నా సోది అంతా ఎందుకు చెబుతున్నా అంటే నాలాగా కష్టపడేవారికి ఉపయోగకరంగా వుంటుందనీ. అలాగే నాలో నాకు స్పష్టత (క్లారిటీ) వస్తుందనీ, నాకు మోటివేటింగుగా వుంటుందని కూడా ఇలాంటివి వ్రాసుకుంటూవుంటాను.

మా ఊరి జ్ఞాపకాలు: వీరయ్య

జ్ఞాపకాలు అనగానే అలాంటివే అనుకోకండి. ఇది కాదు. మా ఇంటి జీతగాడుగా వుండేవాడు. గొల్లతను. అందుకే గొల్ల వీరయ్య అని పిలిచేవారం. చాలా ఏళ్ళుగా మా ఇంట్లో పనిచేస్తుండేవాడు. అమాయకుడు. భోళా శంకరుడు. మంచివాడు. చెప్పిన పనులన్నీ బుద్ధిగా చేస్తూ నమ్మకంగా పనిచేసేవాడు. అందుకే మాఇంటి వారందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు.

అప్పట్లో అతని పెళ్ళయ్యింది. పెళ్ళాం ఏమాత్రం బావుండేది కాదు. కాస్త బావున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అనుకునేవాడిని. ఏదయినా పని బడి వారి ఇంటికి వెళితే కూర్చో బాబూ అని మంచం వాల్చేవాడు.  మా వ్యవసాయం పనులు కూడా ఇతర జీతగాళ్ళతో కలిసి శ్రద్ధగా చూసేవాడు. మా పొలాలు, చేల దగ్గరికి పని చెయ్యడానికి వచ్చినప్పుడు ఇంటినుండి జొన్న గటక, మామిడికాయ పచ్చడి చద్ది కట్టుకొనివచ్చేవాడు (నోరూరుతోందండీ బాబూ) . అతను అది తింటూవుంటే ఆరు బయట గాలి కూడా తోడయ్యి నాకు బాగా ఆకలి వేసేది.

అది నా చిన్నప్పుడు కాబట్టి సిగ్గుపడకుండా అతని చద్ది నేనూ తింటానని మారాం చేసేవాడిని. ఛీ జీతగాడి బువ్వ నువ్వు తింటావా అని మా నాన్నగారు నన్ను ... కోప్పడకుండా సరే అనేవారు. అతను చిరునవ్వుతో, ప్రేమతో, శ్రద్ధగా అతని చద్ది నాకు వడ్డించేవాడు. చక్కటి రుచితో వుండే ఆ గటకా, మజ్జిగా రంగరించీ మామిడికాయ ముక్కను చీకుతూ వుంటే నా సామిరంగా... ఇహ నేను వర్ణించలేనండీ బాబూ.   చక్కటి ఆహ్లాదకరమయిన వ్యవసాయ వాతావరణంలో అది లొట్టలు వేసుకుంటూ లాగించేవోడిని. అలా అతని చద్ది చాలా సార్లు నేనూ లాగించాను.  వీరయ్యా, అన్నదాతా సుఖీభవా!

కొన్నేళ్ళకి మేము వ్యవసాయం తగ్గించడంతో అతను మా దగ్గర పని మానివెయ్యాల్సివచ్చింది. మేము భువనగిరికి మారాము. తాతయ్య, అమ్మమ్మలు మాత్రం ఊర్లోనే వుండేవారు. ఎప్పుడయినా ఊరికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద బస్సు స్టాండులో తనూ బస్సు కోసం వేచిచూస్తూనో లేక ఊర్లోనో  కనిపించేవాడు. ఆత్మీయంగా పలకరించుకునేవారం. మా కుటుంబం యోగక్షేమాలు శ్రద్ధగా కనుక్కునేవాడు. ఈమధ్య నేను ఇండియాకి వెళ్లడమూ, అందునా మా స్వస్థలానికి వెళ్లడమూ తక్కువయ్యింది కాబట్టి అతన్ని చూడక చాలా ఏళ్ళవుతుంది. ఎలావున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ వున్నాడో తెలియదు. ఈసారి మా అమ్మగారితో మాట్లాడినప్పుడు అతని వివరం కనుక్కోవాలి. వీలయితే ఈసారి వెళ్ళినప్పుడు కలిసి ఏదయినా చక్కటి బహుమతి ఇవ్వాలి.

అతని భోళత్వానికి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకసారి మా అన్నయ్య మా ఊరి బస్సుస్టాండులో  బస్సుకోసం ఎదురుచూస్తూ ఒక మూటని గమనిస్తూ వుండమని వీరయ్యకి చెప్పి దగ్గర్లో ఎక్కడికో వెళ్ళాడంట. వెళ్ళి వచ్చి చూసేసరికి మూటమీదినుండి ఒక ఎడ్ల బండి వెళ్ళినట్లుగా కనపడిందంట. ఏంటి వీరయ్యా నువ్వు అది గమనించలేదా అని మా అన్నయ్య అడిగితే గమనిస్తూనే వున్నాను కదా సార్ అని అన్నాడంట.  అతని జవాబు విని మా అన్నయ్యకి కోపం రాకపోగా బిగ్గరగా నవ్వేసేడంట. ఈ విషయం విని మేమందరమూ నవ్వుకున్నాం. ఇలాంటిది ఏదో కథలో విన్నప్పుడు నిజంగా కూడా అలాంటి అమాయకులు వుంటారనుకోలేదు.

పచ్చని పరిసరాల మధ్య...

(ఇది మాఇంటి చిత్రం కాదు. అంత దృశ్యం మాకు లేదు)

...మా ఇల్లు వుంటుంది. ఇప్పుడు ఆ ఫోటోలేదు. ఎప్పుడన్నా వేస్తాలెండి. పల్లెల్లో నివసించే వారికి అది సాధారణమే కానీ పట్నాల్లో నివసించేవారికి అలాంటి పరిస్థితి అరుదుగానే వుంటుంది కదా. కళ్ళు తెరచిచూస్తే ఇంటిముందు విశాలంగా పచ్చటి పచ్చిక. ఇంకొంత దూరం చూస్తే అటు పక్కా, ఇటుపక్క చిన్న సరస్సులూ, వాటి ఒడ్డునే కువకువలాడే బాతులూ. ఇంటి బయట ఇలాంటి ఆహ్లాదకరమయిన వాతావరణం వుండటం కొద్దిమందికే కుదురుతుంది. నాకు వున్న అదృష్టాల్లో అది ఒకటి (ఒక నాస్తికుడిగా అదృష్టం అనే మాట నేను వాడటం సబబు కాదేమో గానీ సులభత్వం కోసం నేను ఆ మాటే వాడుతుంటాను) . అయితే ఇంకా కొన్ని ప్రకృతి సందర్యాలూ వుంటే బావుండనిపిస్తుంది. సెలయేళ్ళూ మరియూ సుదూరాన అయినా పర్వతాలూ కనిపిస్తూవుంటే కన్నులకు ఇంకా ఇంపుగా వుంటుంది కాదూ? అలాగే గార్డెన్ పెంచుకోవడానికీ, పనిచేయడానికి వీలు వుంటే బావుండేది. కిరాయి ఇండ్లల్లో అవన్నీ ఏమి కోరతాము లెండి. ఇదివరకు కెనడాలో స్వంత ఇల్లు వున్నప్పుడు తోటను పెంచేవాళ్ళం, తోటపని చేసేవారం కానీ ఆ ఇంటి బయట ఇంత అందంగా వుండేది కాదు.   

మొత్తమ్మీద ఇంట్లో సౌందర్యానికి గానీ, ఇంటి బయట సౌందర్యానికి గానీ ప్రస్థుతం కొదవలేదు.  అందరికీ అన్నీ కలిసిరావు కానీ కొన్ని ఎంచక్కా కలిసివస్తుంటాయి. ఆ కొన్నిట్లో నాకున్న కొన్నే ఇవీ.  కొన్ని కలిసిరాకున్నా ఎంచక్కా మార్చేసుకొని కలిసేసుకోగలం.  కొన్ని కలిసి రావు - మనమే కలిసిపొవాలంతే. కలిసిరాకున్నా కనీసం  కలిసిపోలేకున్నా అప్పుడొస్తుంది కష్టకాలం. అలా అనేసి అన్నిట్లో మారిపోతే మన వ్యక్తిత్వం మనకు మిగిలిపోదు. మారడం మొదలుపెడితే మనకంటూ ఏమీ మిగలకుండా మార్చేస్తారు కొందరు. 

యు ఎస్ లో వుంటొ భారత దేశపు పల్లె వాసాన్ని దూరం అవుతున్నా కాబట్టి ఈ సారి ఇండియా వస్తే ఓ వారం రోజులయినా పల్లె వాసం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కుదరకపోతే ఓ మూడు రోజులయినా సరే. క్రితం సారి ఓ వారం రోజులే వచ్చినందున ఓ రోజు మాత్రం పల్లెవాసం చెయ్యగలిగాను. అయితే ఈసారి ఒక్క పల్లెవాసం మాత్రమే కాకుండా అక్కడ వున్నన్ని రోజులూ వ్యవసాయం కూడా చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నా. ఊరకే తిని తిరుగుతూ క్యాలరీలు కూడబెట్టకుండా కూలీలతో కలిసి కష్టపడితే మరింత జీవన వైవిధ్యం చవిచూరవచ్చు కదా.  ఏమంటారు?

అలా నేను పుట్టిన ఊరికి వెళ్ళి మా చుట్టల లేదా స్నేహితుల ఇండ్లల్లో వుంటూ ఆ పని చెయ్యొచ్చు. లేదా మా మామగారి ఊర్లో, ఇంట్లో వుండొచ్చు. నా పుట్టిన ఊరు మండల కేంద్రం అయినందువల్ల కొన్ని పట్నం ఛాయలు వచ్చాయి. మామగారి ఊరయితేనే కాస్తయినా పూర్తి పల్లెలాగా వుంటుందనుకుంటా. మామ గారి ఊరయితే ఇంకా దర్జాగా వుండొచ్చు. అయితే ఓ మూడు రోజుల వరకు ఫర్వాలేదు గానీ అంతకంటే ఎక్కువగా ఓ వారం రోజులు వున్నానంటే ఓ జీతగాడి కిందనే జమకట్టరు కదా!  

నా వ్యవసాయ ఆర్తిని తీర్చుకోవడం కోసం మీరెవరయినా ఇంకా వేరే ప్రదేశాలు , సూచనలు చేసినా ఆలోచిస్తాను మరి. 

బాబానా బకరానా మరియు కబుర్లు

(మరిన్ని కబుర్లు ఎప్పటికప్పుడు కామెంట్స్ ద్వారా)

(సత్య?!)సాయి బాబా పరిస్థితి చూస్తుంటే అతగాడు బాబానా లేక బకరానా అన్న సందేహం వస్తోంది. మనిషేనా అన్న సందేహం మాత్రం రావడం లేదు.

IMDB సైటు గురించి తెలుసు కానీ ఇప్పుడూ శ్రద్ధగా పరిశీలించలేదు. కొద్దిరోజుల క్రితం చూస్తే సినిమాల గురించీ, ఒక్కో సినిమా గురించీ ఎన్నో కబుర్లూ, విశేషాలు వున్నాయి అని తెలిసింది. ఉదాహరణకు అవతార్ సినిమా నిర్మాణ విశేషాలు కానీ, దానిని సంబంధించిన కబుర్లు గానీ గూఫ్స్ కానీ అక్కడ తెలుసుకోవచ్చు. మనం ప్రశ్నలు అడగవచ్చు అలాగే వివిధ విషయాలు చర్చించవచ్చు. పలు మార్లు అడగబడే సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.

ఇక్కడ అవతార్ చిత్రీకరణలో జరిగిన పొరపాట్లు (గూఫ్స్) తెలుసుకోండి.

అభిప్రాయాల ప్రభావం

కెనడాకి కొత్తగా వచ్చిన రోజులవి. 1997 చివర్లో కొంతమంది తెలుగు వారితో కలిసి ఒక ఇంట్లో వుంటున్నాను. కుటుంబానికీ, కన్న దేశానికీ దూరంగా, బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళబుచ్చుతున్న రోజులవి. మా వాళ్ళదెవరిదో జూనియర్ వేణుమాధవ్ మిమిక్రీ క్యాసెట్టులో హాస్య సన్నివేశాలుంటే అందరం తరచుగా కలిసి వింటూ నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ మా బాధలనీ, భయాలనీ మరచిపోయేవాళ్ళం.

కొన్ని వారాలకి మా రూమ్మేట్స్ యొక్క మరో స్నేహితుడు ఇండియా నుండి దిగాడు. ఓ రెండు రోజులయ్యాక వేణు మాధవ్ క్యాసెట్టు బావుందనీ, అప్పుడప్పుడు వింటుంటామని ఆ క్యాసెట్టు వినిపించారు. అతనూ మా అందరిలాగే విని నవ్వుతే అతని గొప్పదనం, ప్రత్యేకత ఏముంటుంది? కొద్దిసేపు విని ముఖం చిట్లించాడు. చీప్ కామెడీ అనేసి మరో పనిలో మునిగిపోయాడు. మా వాళ్ళు మరికొద్దిసేపు విని ఆక్యాసెట్టు మూసివేసారు. 

కొద్దిరేజులయ్యాక మా (పాత) రూమేట్లను సరదాగా ఆ క్యాసెట్టు విందామా అని అడిగాను. ఆ ఏం కామెడీ లెండి అది అని ముఖం చిట్లించారు. ఇప్పుడు వాళ్ళు ఆ క్యాసెట్టు వింటామంటే వారి స్నేహితుని ముందు చులకనయిపోరూ? అంతేకాకుండా వారి అభిప్రాయాన్ని వారి స్నేహితుని అభిప్రాయం ప్రభావితం చేసివుంటుంది. వార్నీ అనుకున్నా. వీరికి స్వంతంగా ఓ వ్యక్తిత్వం లేదనుకున్నా. నా మానాన నేను ఆ క్యాసెట్టు వినేసుకున్నా. ఎవడేమనుకుంటే నాకేం, ఎవడి అభిప్రాయం ఏదయితే నాకేం? చక్కటి హాస్య సన్నివేశాలవి. అప్పుడప్పుడు నేనొక్కడినే వింటూ ఎంచక్కా ఆనందించేవాడిని. 

అలాగే మనలో చాలమందికి స్వంత వ్యక్తిత్వాలూ, అభిప్రాయలూ వుండవు. ఒహవేళ వున్నా కూడా ఎంతో కాలం నిలబడవు.  పక్కోడో లేదా ఓ ప్రముఖుడో ఓ అభిప్రాయం వ్యక్తం చెయ్యగానే అదే నిజమే అనుకుంటాం. మన భావాన్ని తుంగలో తొక్కేస్తాం. అలా మనకంటూ ఓ వ్యక్తిత్వం లేదని నిరూపించుకుంటూనే వుంటాం. ఎంతటి స్నేహితుడయినా, ఎంతటి గౌరవనీయుడే అయినా కూడా అతగాడు అన్నిట్లో పరిపూర్ణుడు కాడనీ, కొన్నిట్లోనే అతని అభిప్రాయాలు గణనీయమయినవిగా వుంటాయనీ మనం గుర్తించం. ఈజీగా ఇతరుల ప్రభావానికి దాసోహం అవుతాం.

అలా అని ప్రతియొక్క సలహానూ, అభిప్రాయాన్ని తిరస్కరించాలని కాదు. ఏది సరి అయిన సలహానో కాదో నిర్ణయించుకోగల సత్తా మనకుండాలి. అందరి సలహాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి కానీ నిర్ణయం, వ్యక్తిత్వం మనదయివుండాలి. మనం వీజీగా ప్రభావితం అయిపోతున్నామని తెలిస్తే ఇతరులు మరింత ఉత్సాహంగా మనల్ని, మన భావాలని ఆజమాయిషీ చేయడానికి ప్రయత్నిస్తూనేవుంటారు.  అలా క్రమంగా మనం ఇతరుల చెప్పుచేతల్లోకి వచ్చి మనం వారికి అనుయాయుల్లాగా అయిపోతాము. ఇహ మనకంటూ ఓ స్వంత వ్యక్తిత్వం వుండబోదు కనుక ఇక మనం వారికి చెంచాలు అయిపోతాం. ఎవరినెక్కడ, ఏ భావాన్ని ఎక్కడ నిరోధించాలో తెలిస్తేనే నిలదొక్కుకోగలుగుతాము.     

అయితే ఈ విషయాలకో మినహాయింపు వుందండోయ్. బిడిఎస్సెం (Search: BDSM) జీవిత విధానంలో మనం కావాలనే మన మనస్సు మీద, శరీరం మీద అధికారాన్ని, ఆజమాయిషీనీ  ఇచ్చెయ్యవచ్చు. అప్పుడు మన వ్యక్తిత్వాన్ని ఇష్టపూర్తిగా దాసోహం చేస్తామన్నమాట. అలాగే మనం ఆరాధించే వ్యక్తులు ఏమి చెప్పినా, ఏది చెప్పినా, తప్పు చెప్పినా, అది మనకు తెలుస్తూనే వున్నా అది మనకు మధురంగానే వుండి వింటూనే వుంటాం, ఆచరిస్తూనేవుంటాం. ఆరాధనలో, ప్రేమలో ఏదయినా (దాదాపుగా) సరి అయినదే కాబట్టి, ప్రియురాలి వ్యక్తిత్వమే మన తత్వం అయిపోతుంది కాబట్టి ఈ లెక్కలేమీ అక్కడ వేసుకోనఖ్ఖరలేదు. మనకు ఇష్టం అయినవారికి పూర్తిగా, సంపూర్తిగా, సంతృప్తిగా సమర్పించుకోవడమే బావుంటుంది. అక్కడ భేషజాలకు, పట్టింపులకూ పోనవసరం లేదు. అయితే బిడిఎసెంలో రక్షణ పదాలు ఎలాగయితే వుంటాయో ఈ ధోరణికీ కొన్ని మినహాయింపులు వున్నాయి, వుంటాయి. ఎందులోనయినా అతి అనేది మితంగానే వుండాలి కదా :)  

నేనూ కొంతమందిని ఆరాధిస్తూవుంటాను. వారు చెప్పింది సాధారణంగా వింటూ వుంటాను. అలాంటివారి దగ్గర నాకో వ్యక్తిత్వం వుందనే విషయం గుర్తుకుతెచ్చుకోను. అజెర్టివ్ గా అస్సలే వుండను. విషయాలు మరీ మించిపోతున్నాయంటే మాత్రం స్పృహలోకి వస్తుంటాను. అయితే నా భావాలకు తగ్గ వారినే ఆరాధిస్తుంటాను కాబట్టి వారు చెప్పేవన్నీ, ఆజ్ఞాపించేవన్నీ సాధారణంగా నాకు మోదాన్ని కలిగించేవే అయివుంటాయి. మరీ కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఏర్పడితే అప్పుడో పని చేస్తాను - అప్పుడు నాకో మనస్సంటూ వుందనేది గుర్తుకు తెచ్చుకుంటాను. ఆ ప్రియురాల్ని పీకి పడేసి  మరో ప్రియురాలిని వెతుక్కుంటాను. అందులో సందేహమేమీలేదు - ఎంతయినా సరే తనకు మాలిన ధర్మం, ఆరాధన పనికి రాదు కదా.

అది శరత్ సమయం

ఆఫీసులో బాస్ కోసమో, కంపెనీ కోసమో పనిచేస్తాం, ఇంట్లో కుటుంబం కోసం కష్టపడుతుంటాం. మరి మనకోసం సమయం ఎప్పుడు. ప్రతి వ్యక్తికీ తమదైన ప్రత్యేక సమయం వుండాలంటారు మానసిక నిపుణులు. నాకయితే ఆ సమయం వుంది. రోజుకి రెండు సార్లు - పని రోజుల్లోనే అనుకోండి. ఆఫీసు డవున్ టవునులో వుంటుంది కాబట్టి రోజూ రైలులో వస్తుంటాను. సీట్లు తప్పనిసరిగా దొరుకుతాయి కాబట్టి ఆ ఆదుర్దా ఏమీ వుండదు. 45 - 50 నిమిషాల సమయం తీసుకుంటుంది. పేపరో లేక ఇష్టమయిన పుస్తకమో కొద్దిసేపు చదువుతాను. ఆ తరువాత ఎంచక్కా ఓ ఇరవై నిమిషాల కునుకు తీస్తాను. అలా రోజూ వచ్చేటప్పుడూ, వెళ్ళేటప్పుడూనూ. ఆ సమయంలో ఏ ఒత్తిడులూ వుండవు. పని ఒత్తిడి వుండదూ, ఇంటి వత్తిడీ వుండదు. అది నా సమయం. ఆ సమయంలో ఫోన్ కాల్స్ వచ్చినా మరీ అవసరం అయితె తప్ప ఎత్తను. ఎత్తినా ఇతరులకు ఇబ్బందిగా వుంటుందని చెప్పి త్వరగానే ముగిస్తాను.

ఆ సమయంలో తీరిగ్గా వుంటాను కాబట్టి ఎంచక్కా కిటికీ అద్దాల లోనుండి కనపడే శికాగో నగర సౌందర్యాలనూ, ఆ తరువాత నగర పొలిమేరల్లో వుండే పాతబడ్డ, పాడుబడ్డ నిర్మాణాలనీ చూస్తూ వెళుతుంటాను. ఆ తరువాత పచ్చటి ప్రకృతి సౌందర్యాన్నీ తిలకిస్తూ వెళుతుంటాను. చలికాలంలో అయితే కురుస్తున్న లేక కురిసిన మంచును వీక్షిస్తూ వెళుతుంటాను. అయితే ఓ అసంతృప్తి వుంటుంది. రైలులోవి ఏసీ కోచులు కాబట్టి విమానాల్లో లాగానే కిటికీలు తెరిచే అవకాశం వుండదు. బయట ఎంత బాగున్నా కిటికీ అద్దాల్లోంచి  చూసి ఆనందించాల్సిందే. బయట చక్కటి పిల్లగాలులు వీస్తున్నా చేతులు చాచి తాకలేము కాబట్టి  చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే. ఉడుక్కొని అలా లాభం లేదనుకుంటూ కళ్ళు మూసుకొని తియ్యటి కలలు కంటూ కునుకులోకి జారిపోతుంటాను.

నా సమయం నాకుంది మరి మీకంటూ ఓ సమయం మీకుందా? ఇలా మనకంటూ సమయం వున్నప్పుడు మనని మనం సమీక్షించుకునే అవకాశం, ఆలోచనలూ కలుగుతుంటాయి. అలాక్కాకపోతే నిలబడి సేదతీరే వెసులుబాటు లేకుండా జీవిత గమనంలో అలా పరుగెత్తుతూనేవుంటాము. ఆగి మనం ఏం చేస్తున్నామో, ఏం చెయ్యాలో ఆలోచించుకోవడానికి అంతగా తగిన వ్యవధి, అవకాశం వుండవు మరీ.

తీన్‌మార్ వేసామండీ - బావుంది

నేను హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ చూడలేదు. నేను పవన్ వీరాభిమానిని కాదు, అభిమానిని కూడా కాదు. బావుంటే చూస్తాను - బాగోలేకపోతే తిట్టుకుంటాను. నిన్న మా ఆవిడ, అమ్మలు, నేను ఈ సినిమాకి వెళ్ళాం. మా పెద్దమ్మాయి ఐ హేట్ లవ్ స్టోరీస్ అన్చెప్పి ఈ సినిమాకి రాలేదు. ఈ సినిమా మా ముగ్గురికీ నచ్చింది. చాలా బావుందా అంటే ఏమో కానీ బాగానయితే వుంది.

త్రిష నాకు నచ్చదు, ఫీల్ రాదు కాబట్టి ఏం పొట్టి పొట్టీ బట్టలు వేసుకున్నా నాకు వేస్టే. ఇంకా నయ్యం ఈ సినిమాలో మరీ ఒక్కిగా, బక్కిగా లేక నాకు వాంతులు రాకుండా కాపాడింది. కృతి ఎలా వుంటుందా అనుకున్నా - ఛండాలంగా వుంది - స్వీట్ షాప్ సీనులో అయితే అచ్చం ఓ వేశ్యలా అనిపించింది. మెగా ఫ్యామిలీకి చాలా సందర్భాల్లో హీరోయిన్లని ఎన్నిక చేసుకోవడం రాదనుకుంటా - డొక్కు హీరోయిన్లని ఎక్కడినుండి పట్టుకువస్తారో కానీ భలే తెస్తారు.  మరొకరెవరో (శ్రీ అనుకుంటా) చెప్పినట్లుగా త్రిష, కృతి కన్నా మరో (తెల్ల) హీరోయిన్ బావుంది.
 
ఏంటర్టైన్మెంట్ సినిమాల్లో కూడా కళాఖండాలను చూడాలనుకునేవారికీ ఈ సినిమా నచ్చకపోవచ్చునేమో గానీ మామూలుగానయితే కాలక్షేపం సినిమాలు నచ్చేవారందరికీ ఇది నచ్చాలి మరి.  మిగతా సినిమా విశేషాలు అందరూ చెప్పేరుగా - మళ్ళీ నేను ఎందుకులెండి.  అన్నట్టు ఏ సినిమా అయినా సరే కనీసం మూడు సార్లు కదిలింపజేస్తే అంటే మనల్ని మంచిగా ఏడిపించేస్తే (ఆడాళ్ళ కన్నీళ్ళ కొసం తీసే ఏడుపుగొట్టు సినిమాలు, సన్నివేశాల గురించి కాదండోయ్ నేను అంటూంట) ఆ సినిమా చక్కని సినిమానే అయి వుంటుంది. ఈ సినిమా ఆ పాస్ మార్కును కూడా దాటింది. అలా అని చందమామ, బొమ్మరిల్లు సినిమాల్లాగా మరీ బావుంది కూడా అనలేను. విశ్వనాథ్ మంచి సినిమాల్లాంటి కళాఖండమూ కాదు కాని రంధ్రాన్వేషణలు చెయ్యకుండా వుంటే హాయిగా ఓ సారి చూసి రావచ్చు.    

చిత్రం: బైసెంటిన్నియల్ మ్యాన్

రాత్రి ట్రెడ్‌మిల్లు మీద పరుగెడుతూ ఈ సినిమా చూసాను. ఎంత బావుందో. ముఖ్యంగా పెళ్ళి సన్నివేశం నాకు నచ్చింది. దీని రచయిత ఐజాక్ ఎసిమోవ్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. రోబోట్లూ, భవిశ్యత్తుల మీద సినిమాలు నచ్చేవారికి ఇది బాగా నచ్చుతుంది. ఈ చిత్రం 1999 లో విడుదల అయ్యింది.  రాబిన్ విలియమ్స్ మరియు హీరోయిన్ ఎంత చక్కగా నటించేరూ. 

http://www.imdb.com/title/tt0182789/

ఓ విమాన ప్రయాణ ప్రమోదం :))

కొన్నేళ్ళ క్రితం కెనడాలోని టొరొంటో నుండి (నిజానికి అక్కడినుండి కాదు గానీ సింప్లిసిటీ కోసం అలా వ్రాస్తున్నా) యు ఎస్ లోని ఫ్లోరిడాకి విమాన ప్రయాణం చేసాము. ఏదో అప్పుడప్పుడు తప్ప ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే అవసరం మాకు వుండేది కాదు. అందుకే ఆ ప్రయాణానికి గాను టికెట్లు తీసుకునేముందు మా పిల్లలని అడిగాను - నాన్ స్టాప్ కావాలా, సింగిల్ స్టాప్ కావాలా లేక మల్టి స్టాప్ కావాలా అని. ఎన్నిసార్లు విమానం ఎక్కిదిగితే పిల్లలు ఒహవేళ అంత సంతోషపడతారేమో అని అలా అడిగా. పెద్దమ్మాయి కాస్సేపు ఆలోచించి మల్టి స్టాప్ కావాలంది. చిన్నది అప్పుడు మరీ చిన్నది కాబట్టి స్వంత బుర్ర ఉపయోగించకుండా అక్క చెప్పిన దానికి బుర్ర ఊపేసింది.

హింకేం, మనకూ మల్టి స్టాపులంటే ఆనందమాయే. టిక్కెట్టు ఒక్కోదానికి ఓ పది డాలర్లు ఎక్కువయినా సరే మధ్యలో రెండు స్టాపులు చూసుకొని మరీ బుక్ చేసి పడేసా. అదేంటో కానీ సాధారణంగా మల్టి స్టాపులకు ధర తక్కువుంటుంది కానీ ఆ రోజు వాటికే కొద్దిగా ఎక్కువ రేటు ఏడ్చింది. అయినా సరే పిల్లలు ( వారి పేరు చెప్పుకొని నేనూనూ) సంతోషపడుతారని చెప్పి అలా డిసైడ్ చేసేసా.   

ఇహ మా ప్రయాణంలోని పదనిసలు గురించి ఏం చెప్పమంటారు మహాశయా. అసలే ఇక్కడ ఇండియాలో ఆర్టిసీ బస్సుల్లా సరి అయిన వేళకి వస్తాయాయే. ఆపై మధ్యలో రెండు సార్లు విమానాలు మారాలాయే. కనెక్టింగ్ ఫైట్లు వేళకి అందుకోవద్దూ, అవి తప్పితే మళ్ళీ ఫైట్లు వుండొద్దూ. మా ఆవిడా, పిల్లలూ నా బుర్ర వాచిపోయేలా గులిగేసారు. అలా అలా ఫ్లోరిడా వెళ్ళేప్పుడు బుర్ర ఎర్రగా అయిపోయింది. నేను చేసిన తప్పేంటో నాకు అర్ధం కాలేదు. అన్ని అడిగే సక్రమంగా ప్రణాళిక వేసా కదా ఇలా బొక్క బోర్లా పడిందేంటీ? పైగా ప్రతి టెక్కెట్టుకీ పది డాలర్ల బొక్క కూడా పెట్టుకున్నా కదా!   

ఇలాక్కాదని మా పిల్లల్ని పిలిచి మీరే కదా ప్రయాణం మధ్యలో పలు సార్లు ఆగాలని కోరిందీ అని కయ్ మన్నాను. మనం ఫ్లోరిడాకి వెళుతున్నామని అనుకోలేదు - మనం ఇండియాకు వెళుతున్నాం అనుకున్నా అంది మా పెద్దమ్మాయి తాపీగా! అలా అని తమ పొరపాటే కదా అని తిరిగివచ్చేటప్పుడయినా నన్ను మన్నించారా? అబ్బే, మళ్లీ నన్ను ఇరగదీసారంతే. ఓ నాలుగ్గంటల ప్రయాణం నానా విధాలుగా సాగి, దేశమంతా సగం తిరిగేసి, ఇరగేసి  ఓ పద్నాలుగు గంటలయ్యింది మరీ. ఎవరి పొరపాటయితేనేం లెండి. చికాకు చికాకే కదా. అది తీర్చుకోవడానికి ఓ బకరా దొరకాలి కదా.

ప్రకృతిలో పవళించడం కోసం...పరవశించడం కోసం...

... కెనడాలో వున్నప్పుడు అప్పుడప్పుడు క్యాంపింగుకి వెళుతుండేవారం. ఇక్కడ ఓ రెండేళ్ళ క్రితం వెళ్ళాం కానీ మా కుటుంబంలో అదంటే ఆసక్తి తగ్గింది. ఎందుకూ అంటే ప్రకృతిని అంత దూరం వెళ్ళి అంత కష్టపడి చూడ్డం ఎందుకూ ఎంచక్కా హాయిగా ఆన్లైనులో చూసుకోవచ్చు కదా అని మా పెద్దదాని వాదన! ఏం చెబుతాం? ఇహ చిన్నది వివరణ కూడా ఇవ్వదు - స్టేట్మెంట్ ఇచ్చేసి ఇహ చాలు నోరు మూసుకొమ్మంటుంది. ఇహ మా ఆవిడేమో చిన్నప్పుడు పల్లెటూర్లోనే కదా పెరిగిందీ ఇంకా ఎందుకూ ప్రకృతీ - వికృతి కావాలి గానీ అంటుంది. ఇహ వీళ్ళతొ లాభం లేదని క్యాంపింగ్ గేర్ వెసుకొని ఈ సారి నేనొక్కడినే వెళ్దామనుకున్నాను.

అయితే ఈమధ్య మళ్లీ వావాళ్ళు క్యాపింగుకి ఓక్కే అంటున్నారు. అలాగే పక్కింటివారూనూ. వచ్చేనెల నుండి మొదలెడుతున్నాం. మొదట ఒక రోజుతో మొదలెట్టి మంచిగా వర్కవుట్ అయితే తరువాత్తరువాత వారాంతాలంతా వెళ్ళాలని ఆలోచన. మీలో క్యాంపింగుకి వెళ్ళిన వారు మీ అనుభవాలు, అనుభూతులూ మాతో పంచుకుందురూ. మావి నెమ్మదిగా వ్రాస్తాలెండీ. 

జీవితం అంటే ఇదేనా, ఇంతేనా?

జీవితానికి ఓ అర్ధం, పరమార్ధం ఇవ్వాలని ఎంతోమంది మేధావులూ, తత్వవేత్తలూ శ్రమించారు కానీ ఆ వాదనలన్నీ చాలా వరకు చచ్చిన చేపని నీళ్ళల్లో వేస్తే అది మునుగుతుందా లేక తేలుతుందా అని చేపని ముందెట్టుకు కూర్చొని చేసే చర్చల్లా వుంటాయి. అలా కాకుండా కొంచెం ప్రాక్టికలుగా ఆలోచిద్దామేం.

నా ఇంటరు చివర్లోనో లేక డిగ్రీ మొదట్లోనో నాకు ఈరకమయిన సంశయాలు ఎక్కువయ్యాయి. చుట్టొ వున్న సమాజన్ని బాగా గమనించి అందరూ అనుకునే లేక చాలామంది జీవించే జీవితం ఇదేనని ఒక ముక్తాయింపుకి వచ్చేసాను. ఆ ఏముందీ, పెరగడం, చదవడం, పెళ్ళిచేసుకోవడం, పిల్లలని కనడం, సంపాదించడం అది చేతకాకపోతే సీరియళ్ళు చూస్తూ గడిపేయడం, పిల్లల్ని మనలాగే 'ప్రయోజకులుగా' పెంచడం, వారికి పెళ్ళిళ్ళు చేయడం, వారి పిల్లలకి అమెరికా వెళ్ళి బేబీ సిట్టింగు చెయ్యడం అంతే కదా ది గ్రేట్ జీవితం అంటేనూ?  సీరియళ్ళో లేక సంపాదనో మన ముందు వున్నాక ఇంకా వేరే పనులేముంటాయి మనకు? పనులంటే అనుభూతులు అనే అర్ధంలో వాడా లెండి. ఇంకా జీవిత గమనంలో అర్ధాలూ, అనుభూతులూ వెతుక్కుంటామా? పక్కోడు ఎంత సంపాదించాడూ, మనమూ ఎంత సంపాదించాలనే లెక్కలే కానీ ఎవరెంత జీవిస్తున్నారూ అనేది చూసుకుంటామా? లేదు లేదు. అలా చూస్తే మన ఇంట్లో వాళ్ళే మనల్ని వింతగానూ, దేనికీ పనికిరాని దద్దమ్మలుగానూ చూసెయ్యరూ?  

ఇలాక్కాదని ఆ గానుగెద్దు జీవితం మనకు వద్దని అచ్చమయిన జీవితం ప్రకృడి ఒడిలో, మనుష్యుల, మనస్సుల సమక్షంలో గడిపెయ్యాల్ని తీర్మానించుకున్నాను. ఆ తీర్మానాన్ని మా నాన్నగారికి తెలియపరిచాను. డిగ్రీ పూర్తిచేసాక నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో అన్నారు. మహానుభావులు - మా నాన్న గారు చచ్చి ఏ నాస్తిక స్వర్గంలో వున్నారో కానీ నా స్వేఛ్ఛకీ, అభిప్రాయాలకీ అంతగా అడ్డుచెప్పేవోరు కాదు. 

ఒఠ్ఠినే సన్నాసి అయిపోయి చెట్లు, పుట్టల వెంట తిరగడం కంటేనూ సాంఘిక సేవ చేస్తే మనస్సుకి తృప్తిగా వుంటుంది కదా అని అటువైపు ఆలోచించాను. సాంఘిక సేవ చేస్తూ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటే ఆ సేవకి చెడ్డపేరు వచ్చే అవకాశం వుంటుందని అప్పుడు బుద్ధిగా వుండాలి కాబట్టి ఈలోగా జీవితం ఫుల్లుగా ఎంజాయి చేసి వాటిమీద విరక్తి కలిగించుకోవాలనుకున్నాను. అలా ఎంతోమందితో సాన్నిహిత్యంగా గడివివేసి బాగానే తృప్తి చెందాను.

డిగ్రీ అయిపోయాక వెంటనే విజయవాడలో గ్రామీణాభివృద్ధి మీద ఒక ఏడాది రెసిడెన్షియల్ ట్రైనింగులో చేరాను. ఇహ అది పూర్తిచేసి సాంఘిక సేవలో ఇహ దూకేద్దామనుకుంటున్న రోజుల్లోనే... ఓ మరదలు నన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నానంటూ, నేను కూడా తనని చాలా కాలంగా ప్రేమిస్తున్నాననుకున్నానంటూ నాకు టెండర్ పెట్టింది. నేను నిన్ను ప్రేమించడం ఏంటీ, అందరితోనూ అలాగే ప్రేమతో వుంటానూ అన్నా వినిపించుకోక నన్ను ప్రేమ ముగ్గులోకి దింపింది.

మరి నా సోషల్ సర్వీసో అని దిగాలుగా అడిగాను. పిచ్చి కన్నా, ముందు నువ్వు నా సర్వీసు చేసుకో, ఆ తరువాత మనిద్దరం కలిసి సాంఘికసేవ చేద్దాం అని ముద్దు ముద్దుగా చెప్పింది - నేను బుద్ధిగా వినేసాను.  ఇంకెక్కడి సోషల్ సర్వీసూ? అప్పుడలా అంత తేలిగ్గా చవటని ఎందుకయ్యా నంటారూ? రెండు మూడేళ్ళ తరువాత మా మధ్య విభేదాలు వచ్చి గౌరవంగా విడిపోయాము కానీ నేను మళ్ళీ సర్వీసులోకి మాత్రం వెళ్ళలేకపోయాను. అక్కడే రాంగ్ స్టెప్ వేసేను. వెళ్ళివుంటే బావుండేది కానీ ఎందుకో గుర్తుకు లేదు కానీ అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ఇలా చిక్కడిపోయాను.  ఇంకేముంది శరత్ సొషల్ సర్వీస్ కంచికెళ్ళింది. మీ అందరిలాగే నేనూ రొటీన్ జీవితంలోకి లాగబడ్దాను. చక్రం మొదలయ్యాక మనం ఆగమంటే ఆగుతుందా - పెళ్ళి, పిల్లలూ, సంపాదనా ఈతి బాధలూనూ.   ఎలాగూ యోగిని కాలేకపోయాను కదా అన్న కచ్చతో ఈ జీవితాన్ని భోగిగా జీవించాలనుకుని మాస్టర్ ప్లాన్ వేసా కానీ అక్కడ కూడా బోల్తా పడ్డా.    ఆ వివరాలు ఇదివరలో చెప్పాను - మీకు గుర్తుకువుండేవుంటుంది.

ఆ విధంగా నేను రొటీన్ లైఫ్ స్థిరపడ్డాను. మన సంగతి సరే కానీ మన పిల్లలూ మనలాగే నలుగురితో నారాయణ, పదిమందితో కలిసి గోవిందా అనాల్సిందేనా? గొప్ప గొప్ప చదువులు చదివి ప్రయోజకులు అయ్యి పెళ్ళి చేసుకొని పిల్లలని కని దేశాన్ని ఉద్ధరించాల్సిందేనా?  వారికి ప్రత్యామ్నాయ మార్గాలు నిర్దేశించే అధికారం మనకు లేకపోయినా కనీసం సూచించగలమా? వారి జీవితం కూడా ఇలాగే రొటీనుగా అంతం కావాల్సిదేనా? కనీసం వారినయినా జీవించనియ్యలేమా? మీరేమంటారూ?   

ఇది విమాన విహారం - అది ఎర్రబస్సు ప్రయాణం

ఈ దేశాల్లోకి వచ్చేక కాలం చాలా వేగంగా పయనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటారూ? చూస్తుండగానే వారాంతం వచ్చేస్తుంది. అంతలోకే పని వారం వస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే సైకిల్. వేగంగా తరుముకుంటూ వారాలకు వారాలు అలా దొర్లిపోతూనే వుంటయ్. వెనక్కి తిరిగి చూస్తే ఇన్నాళ్ళల్లో మనం సాధించినదేమీ పెద్దగా కనపడదు - మనం పోగుట్టుకున్న వయసు తప్ప. మంచి ఉద్యోగం వుంటే చాలు మిగతా పనులు పెద్దగా ఇబ్బంది కలిగించవు. రోజువారి పనులన్నీ యాంత్రికంగా దాదాపుగా ఠంచనుగా సాగిపోతుంటాయి. అందుకే ఈ దేశాలలోని జీవితం విమాన ప్రయాణం లాంటిది అంటాను. విమానం ఎక్కాక ఇహ మనం చెయ్యడానికి పెద్దగా ఏమీ వుండదు - తినడం, పడుకోవడం తప్పించి. బయటి అందాలన్నీ అద్దాల్లోంచి చూడాల్సిందే కానీ అద్దం ఎత్తలేము, బయటి వాతావరణాన్ని ఆహ్లాదించలేము (ఆహ్లాదం కలిగించలేదు అని అర్ధం). ఎసి గట్రా వుంటాయి కాబట్టి మనకు చలి, వేడి పుట్టడం తక్కువే. చూస్తుండగానే మన సుదూర గమ్యాలని సులభంగా, వేగంగా చేరుతాము. చేరాల్సిన గమ్యం వచ్చేసిందని దిగిపోతాము. ప్రయాణంలో గుర్తుంచుకోవడనికి అంటూ పెద్దగేమీ వుండదు - తొలి ప్రయాణాలు చేసిన వారికి తప్ప.

ఈ దేశాల్లో జీవితమూ అంతే. ఎసి గట్రాలు వుంటాయి కాబట్టి కిటికీలు తెరవము. వాన పడుతున్నా, గాలి జోరుగా వీస్తున్న అద్దాల లోనుండి చూస్తూ వుంటాం కానీ అనుభూతి చెందము. బయట ప్రకృతికి పరవశించలేము కానీ ఇంట్లో వీడియో పెత్టుకొని సినిమాలోని ప్రకృతి దృశ్యాలను అభినందిస్తుంటాం. అలా అలా రోజులు యాంత్రికంగా దొర్లుతూనే వుంటాయి. వారాలూ, వారాంతాలూ అలా అలా గడిపేస్తూ వుంటాము. అలా ఎలా ఎన్నడో ఒకనాడు మనం మన జీవిత గమ్యం చేరుకుంటాము - వేగంగా, సులభంగా. వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా వైవిధ్యం ఏమీ వుండదు - కూడబెట్టిన డబ్బులు తప్ప.    

ఇండియాలో ఇప్పటి జీవితాలు ఎలా వుంటున్నాయో తెలియదు కానీ మా అప్పుడు అయితే ఎర్రబస్సు ప్రయాణాల్లాగా వుండేవి. సమస్యలూ వుండేవి, సంతోషాలూ వుండేవి. ఏదీ అనుకున్న విధంగా, సరి అయిన సమయానికి జరగవు కాబట్టి వైవిధ్యం వుండేది. ఏ రోడ్డు మీదనన్నా ప్రయాణించినా గతుకులు, గతుకులు గా వుండి థ్రిల్లింగుగా వుండేది. ఇక్కడ అన్నీ మంచి రోడ్లే కాబట్టి గతుకుల రోడ్డు పొరపాటున కనపడిందంటే ఆ గతుకుల మీద నుండే కారు పోనివ్వమని పిల్లలు సబరపడుతూ కోరుతుంటారు. అలాంటి చిన్న చిన్న సంతోషాలకూ స్థానం లేకుండా పోయిందిక్కడ.  ఎండాకాలం వస్తే ఎంచక్కా  మిద్దె మీద అందరం కబుర్లు చెప్పుకుంటూ, నక్షత్రాలనూ అవలోకిస్తూ చందమామతో ఊసులాడేవారం. ఇక్కడ ఇళ్ళకి ఎసిలు తప్ప డాబాలే వుండవాయే. నగరపు ధూళి మధ్య మరుగున పడి మిణుక్కు మిణుక్కు మంటున్న నక్షత్రాలను చూసేంత ఓపిక, తీరిక మనకెక్కడిది - అవతల మొగిలిరేకులకు సమయం అవడం లేదూ?     

ఇండియాలో జీవితం ఎర్రబస్సు ప్రయాణం లాగా మనకు ఇష్టం వచ్చినప్పుడు బస్సు కిటికీలు తెరచి ఝామ్మున కొడుతున్న వర్షపు నీటిని తాకేలా వుంటుంది. బస్సు పక్కగా వీస్తూ వెళుతున్న పిల్ల తెమ్మెరలకు ఎంచక్కా హాయ్ చెబుతూ వెళ్ళొచ్చు. చలి పెట్టినప్పుడు ముణగదీసుకొని పడుకోవచ్చు, ఎండవేడికి అపసోపాలు పడొచ్చు. సమయానికి బసు రాకపోవచ్చు, వచ్చిన బస్సు ఎప్పుడు గమ్యాన్ని చేరుతుందో మనకు తెలియకపోవచ్చు కానీ అందులో జీవిస్తూ వెళ్ళవచ్చు. ఎర్రబస్సుల్లో ( ఎసి బస్సుల్లో అని కాదు) మనం వెళతాము, ఎసి బస్సులూ, విమానాలూ మనల్ని తీసుకువెళతాయి. ఎలాంటి జీవితం మనకి కావాలేంటి? ఎసి బస్సులో కూర్చొన్నాక ఓ సినిమా వేస్తే మనకు ఇంకా ఇలాంటి మీమాంసలు కూడా కలుగుతాయా? గమ్యం వచ్చాక చూసుకుంటే చూసిన సినిమా గుర్తుకువుంటుంది కానీ చేసిన ప్రయాణం గుర్తుకు వుండేదేమయినా వుందా?    

విషయం ఏమిటంటే ఇండియా కూడా ఈమధ్య బాగా అభివృద్ధి సాధిస్తోంది. అక్కడి జీవితం కూడా విమాన ప్రయాణం లాగే అయ్యేలా వుంది.  ఈ పరిణామ క్రమంలో మనం మిస్సయ్యేది మన జీవితాలని - పొందేది మాత్రం యాంత్రిక జీవనాలని. అందరి జీవితాలూ అవే అయినప్పుడు ఇహ ఎవరయినా కోల్పోయేదేముంది అన్న విషయమే మనకు సాంత్వన కలిగిస్తుంది. ఇండియా - నీకిదే నా ఆహ్వానం.     

పూనం పాండేకి నా మద్దతు

చట్ట పరమయిన కారణాల వల్ల ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెటర్ల ముందు నగ్నంగా నడుస్తాను అన్న ఆమె అభిమతం తీరుతుందో లేదో కానీ అలా అని ముందుకు వచ్చినందుకు గాను ఆమెను అర్ధం చేసుకుంటున్నాను, అభినందిస్తున్నాను.


నగ్నత్వం నేరం కాదు - నగ్నత్వం మన సహజత్వం.

కుక్కేసెయ్ కుక్కేసెయ్ అన్నం...

ఒక సీను అల్లుకుందాం. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్లందరూ ఓ కుర్చీకి కట్టేసి... ఆ... కట్టేసీ మీకు బలవంతంగా వద్దు మొర్రో అనకుండా భోజనం తినిపిస్తున్నారనుకోండి. అహ అనుకోండంతే. మీకు పొట్ట నిండిపోయాక మీరు వద్దంటారు. వాళ్ళు వినరు. మీరు ఫుల్లుగా తినకపోతే మీకు సరిగ్గా నిద్ర పట్టక అర్ధరాత్రులు లేచి నన్ను గోకుతారండీ అని మీ అవిడ నోట్లో అన్నం కుక్కుతుంది. నువ్వు బాగా బక్కగా అయిపోతున్నావు బాబూ అని మీ అమ్మగారు మరో ముద్ద మీ నోట్లో కుక్కుతుంది. తినరా భడవా, తిని వెంటనే పడకేసెయ్, సరిగ్గా తినక నీకు సరిగ్గా నిద్ర రాక రాత్రి ఏఝాము దాకానో ఇంటర్నెట్టూ గట్రా చూసుకుంటూ గడుపుతున్నావ్ అని ఏ కోట లాంటి తండ్రో మీ తలకాయ బిర్రుగా పట్టేసి మీ అమ్మగారికీ, మీ ఆవిడకి ఇంకా ఇంకా మీ నోట్లో అన్నం కుక్కడానికి సహకరిస్తుంటారని ఊహించేసుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుందీ? అహ మీకు ఏమనిపిస్తుందీ అంటాను.

ఇలాంటి దృశ్యం ఇంట్లో చిన్నపిల్లలు వున్న ప్రతి ఇంట్లో దాదాపుగా కనపడుతూనేవుంటుంది.  చిన్నపిల్లల్ని బలవంతంగా పట్టెసి వద్దు మొర్రో అని వాళ్ళు గింజుకులాడుతున్నా వినకుండా తల్లి, అమ్మమ్మా, నానమ్మలు ఓ ఒకటే భోజనం అంతా కుక్కేస్తూవుంటారు. అది వారి దృష్టిలో పిల్లల మీది ప్రేమ మరియు శ్రద్ధ. అలా కుక్కెయ్యకపోతే చూసిన వాళ్ళు హేమనుకుంటారూ! పిల్లల మీద ప్రేమ లేదనుకోరూ? పైగా పక్కింటి పిల్లాడేమో బొద్దుగా ఆరోగ్యంగా వుండే. మన పిల్లోడేమో బక్కగా వుండే. లావు కావద్దూ. సరిగ్గా తినకపోతే సరిగ్గా పడుకోరు కదా. నిద్ర లేస్తారు. నిద్ర లేచీ? ఆడుకుంటారు. హన్నా. పిల్లలు ఆడుకోవడమే! హెంత పొరపాటు హెంత పొరపాటూ - పిల్లలు బుద్ధిగా భోజనం కక్కేదాకా మింగేసి బజ్జోవాలి కానీ. అప్పుడు మేము ఎంచక్కా నెట్టో, బజ్జులో, బ్లాగులో చూసుకుంటామూ.  

ఎందుకండీ అలా పిల్లలని టార్చర్ చెయ్యడం? మిమ్మల్ని కుర్చీకి కట్టెసి అలా కుక్కికుక్కి అందరూ తినిపిస్తే తెలుస్తుంది అందులోని బాధ. భోజనం చెయ్యడం అన్నది ఒక ఆనందకరమయిన విషయం అవాలి కానీ రోజుకి మూడు పూటలూ హింస లాగా తయారవకూడదు.  పిల్లలు ఆరోగ్యంగా వుంటే చాలు - బొద్దుగా వుండనక్కరలేదు. వయస్సుకి తగ్గ బరువుకంటే మరీ తక్కువుంటే అలా కొద్దిగా బలవంతంగా తినిపించినా అర్ధం చేసుకోవచ్చు. పిల్లలు చక్కగానే వున్నా ఇంకా ఇంకా లావు కావాలని, చూసిన వారందరూ అబ్బొ ఎంత బావున్నాడూ అని మెచ్చుకోవాలనే తాపత్రయంతో మరో వైపున ప్రతి పూటా మన పిల్లలకి ఇబ్బంది కలగజేస్తున్నామన్న సంగతి ఎందుకు మనం గుర్తించం? అసలు ఆ ఆలోచనే  మన మనస్సుల్లోకి ఎందుకు రాదు? పిల్లలు మనుషులు కారా? వారికి అబ్యూజ్ నుండి రక్షణ అవసరం లేదా? తల్లితండ్రులు అయినంత మాత్రాన మనం పసిపిల్లల పట్ల ఏది చేసినా  చెల్లుతుందనేనా? పిల్లలకూ హక్కులుంటాయి. వారూ మనుషులే. వారికీ వేధింపుల నుండి రక్షణ అవసరం. బయటివారెవరో వేధిస్తే మన ప్రాణాలు అడ్డేసి అయినా అయినా మన పిల్లలని కాపాడతామే - అలాంటిది రోజులు మూడు పూటలా మనమే మన స్వంత పిల్లలని వేధిస్తున్నామంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏవో తొట్టి  కారణాలు చూపెట్టి సమర్ధించుకోకుండా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ లోనుండి, వారికీ మనస్సుంటుందనీ, అది కూడా బాధపడుతుందనే కోణంలో ఆలోచించి చూడండి. మీ హృదయం ద్రవిస్తుందేమో చూడండి. ఇది ఒక్క పూట, ఒక్క రోజు విషయం అయినా ఏమోలే అనుకోవచ్చు. ప్రతి రోజూ ప్రతి పూటా పిల్లలకి నరకం చూపిస్తున్నారు కదండీ మీరు. ఆత్మ పరిశీలన చేసుకోండి. అది వేరే ఎవ్వరికోసమో కాదు - మన పిల్లల కోసం. 

మీ పిల్లలు బాగా తినాలంటే పిల్లలని బాగా ఆడిపించండి. అలసిసొలసేదాకా ఆడిపించండి. అప్పుడు చచ్చినట్టి వారికే ఆకలవుతుంది. అలసిపోయి ఒకవేళ వెంటనే నిద్రపోయినా కంగారేమే లేదు - లేచాక వారే ఆవురావురు మనుకుంటూ అన్నం మీద పడిపోతారనుకుంటాను.  ఎందుకమ్మా అలా బలవంతంగా తినిపించడం అని సున్నితంగా సజెస్ట్ చేస్తుంటాను. వారు ఏవో కారణాలు చెబుతారు. ఏమని చెప్పగలం వారికి? చేసేది లేక, చూసేది లేక ముఖం తిప్పేసుకుంటాను. అంతకుమించి మనం ఏం చేయగలం  - ఇలా నా బ్లాగులో ఓ పోస్టేసుకోవడం తప్ప? 

ఈ విషయంలో మా పిల్లలు అదృష్టవంతులు. వారి చిన్నప్పుడు నేను ఎదుట లేనప్పుడు సంగతి చెప్పలేను కానీ నేను వున్నప్పుడు మాత్రం మా ఇంట్లో ఇలా జరగనిచ్చేవాడిని కాదు. నేను ఇంట్లో లేనప్పుడు కూడా పిల్లలకి ఇలాంటి పరిస్థితి వుండకూడదని ఇంట్లో ఆదేశించాను. 

Scratch Free పెంపకం!

మేము అప్పుడు కెనడాలో వుండేవారం. మాకు తెలిసిన వారికి కెనడా ఇమ్మిగ్రేషన్ రావడంతో యుఎస్ నుండి కెనడాకి మారారు. ఒకసారి మాటల సందర్భంలో వాళ్ళ యొక్క మూడు నాలుగేళ్ళ బాబుని గురించి ఆ ఇంటామె ఇలా చెప్పింది. "మా బాబుకి కెనడా వచ్చాక వంటి మీద రెండు సార్లు గీతలు పడ్డాయండీ. యు ఎస్ లో స్క్రాచ్ ఫ్రీగా పెరిగాడు". నేను హ అని కళ్ళు తేలవేసినతపని చేసాను. ఇలా పిల్లలని అలా స్క్రాచ్ ఫ్రీగా కూడా పెంచాలనుకునేవారు కూడా వుంటారని నాకు అప్పుడే తెలియడం!

ఇహ మాకు తెలిసిన డాక్టర్ దంపతులు ఒకరు వుండేవారు. వాళ్ళ పిల్లలని ఎంత సున్నితంగా పెంచేవారంటే పిల్లల్ని అస్సలు ఎగరనీయకపోయేవారు, దుమకనీయకపోయేవారు. అలా చేస్తుంటే అదో మహాపరాధంగా చివాట్లేసి కూర్చోబెట్టేవారు. మా పిల్లలు స్వేఛ్ఛగా ఆడుతుంటే ఏంటీ పెంపకం అన్నట్లుగా చూసేవారు.  మా మిత్రుడు ఒకతను అయితే పిల్లలు ఆడుకుంటుంటే ఏంటీ గొడవ అని చిరాకు పడుతుంటాడు. బుద్ధిగా టివి చూస్తూ కూర్చోక ఏంటీ ఆటలు అని విసుక్కునేవాడు. అతను నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అతని విధానం తప్పని అర్ధం చేయించాను లెండి.  

ఒకసారి మా ఇంటికి ఓ రెండు కుంటుంబాలు వాళ్ళ పిల్లలతొ సహా వచ్చారు. వాళ్ళ పిల్లలు, మా అమ్మాయి కలిసి పిల్లో ఫైటింగు చేయసాగారు. ఏంటీ పిల్లోలతో ఫైటింగు అని ఆ తండ్రులు చిరాకు పడ్డారు. అవును, పిల్లలు కత్తులతో ఆడుకోవాలి గానీ మెత్తలతో ఆడుకోవడం ఏంటీ అని నేను దీర్ఘం తీసాను.

ఇలా పిల్లలని స్వేఛ్ఛగా ఆడుకోనివ్వకుండా, మరీ మరీ హద్దులు చెబుతూ అతి సున్నితంగా పెంచడం ఎప్పటినుండో ఫ్యాషన్ అయినట్లుంది. ఈ అతి సున్నితత్వం స్త్రీలలో ఎక్కువగా గమనిస్తుంటాం. తల్లితండ్రులిద్దరూ అలాంటి వారయితే ఇహ పిల్లలు చచ్చారన్నమాటే. ఇహ హద్దులే హద్దులు. వాటికిక అంతే వుండదు. చాలామందికి తమ తెలివి మీద తమకు కాస్త నమ్మకం కలిగిందంటే చాలు వారికి తెలిసిన జాగ్రత్తలు, మంచివనుకున్న మ్యానర్స్ అన్నీ తమ పిల్లలమీద యధేఛ్ఛగా రుద్దేస్తారు. పాపం చిన్న పిల్లలు అంతగా ఎదురు చెప్పలేరు గనుక వినేస్తారు. తమ పిల్లలు అపర బుద్ధిమంతుల్లా మెలగాలని ఆశిస్తారు కానీ ఆ పిల్లలు కోల్పోతున్న బాల్యాన్ని గుర్తించరు. చాలా క్రమశిక్షణతో పెంచుతున్నామనుకుంటారు కానీ మరో వైపున తమ పిల్లలు కోల్పోతున్నదేమిటో గుర్తించరు. పైగా నాలాంటివారెవరయినా పిల్లలని అర్ధం చేసుకుంటూ వారి బాల్యాన్ని వారికి ఇవ్వజూపుతుంటే గారాబం చేస్తున్నారంటారు.

పిల్లలని ఆడుకోనిద్దాం - అలా ఆడుకోవడం వారి యొక్క హక్కు అని గుర్తిద్దాం. వారి బాల్యాన్ని వారికి ఇచ్చేద్దాం.

ముచ్చటగా నా మూడో డ్రైవింగ్ టెస్ట్ జరిగిన విధంబెట్టిదన...

అప్పటికి కెనడాలో రెండు సార్లు డ్రైవింగ్ పరీక్షలో విఫలం చెందాను. అలాంటి పరీక్షలు చేసే ప్రభుత్వ పరీక్షకులు అలా ఎందుకు ఓటమి చెందిస్తారనడానికి పలు కుట్ర కారణాలు వినపడుతుండేవి. రెండుసార్లు ఓటమి చెందినా వెరవక ముచ్చటగా మూడోసారి ఆ పరీక్షకి వెళ్ళాను. ఆ రోజున వచ్చిన ఎగ్జామినర్ నల్లతను. ఇంకేం నీ పండగ పండినట్టేపో అని చెప్పాడు నా శిక్షకుడు. ఆ నల్ల పరీక్షకుడు సులభంగా పాస్ చేయిస్తాడంట. అది విని నేను మహా ఆనందంగా పరీక్షకు వెళ్ళి కారులో డ్రైవర్ సీటులో కూర్చున్నాను.
 
ఎగ్జామినర్ వచ్చి కూర్చొని పద అన్నాడు. నేను ఉత్సాహంగా కారు పెడల్ నొక్కాను. కారు కదల్లేదు. మరింత ఉత్సాహంగా పెడల్ గాఠ్ఠిగా నొక్కాను.  అయినా కదల్దే! ప్రశ్నార్ధకంగా పరీక్షకుని వైపు చూసాను. అతను గుర్రుగా నావైపు చూస్తున్నాడు. ఏదో భయంకరమయిన పొరపాటు చేస్తున్నానని అర్ధమయ్యి ఒహవేళ పెడలుకు బదులుగా బ్రేక్ ఏమయినా నొక్కుతున్నానా అని కంగారుగా చూసాను. అదేమీలేదు. ఇహ నావల్ల కాదురా అన్నట్టుగా అతగాడివైపు చూసాను. అతను నిస్పృహ చెంది గుర్రుగా చూస్తూ "కారు స్టార్ట్ చెయ్యి" అని వీలయినంత కూల్గా చెప్పాడు. అప్పుడు నాలుక్కరచుకొని కారు స్టార్ట్ చేసాను. 
 
ఆ మాత్రం తెలియదా అని మీరనవచ్చు. ఒట్టు, అది నాకు తెలియదు. మన దేశీ కారు ట్రైనర్ అది మాత్రం నేర్పించలేదు. ఎప్పుడయినా సరే స్టార్ట్ చేసివున్న కారు నాకు ఇచ్చేవాడు. అంతకుముందు రెండు సార్లు పరీక్ష కూడా స్టార్ట్ చేసి వున్న కారుతోనే ఇచ్చాను. ఈసారి మాత్రం అంతకుముందు పరీక్షకి వెళ్ళిన మానవుడు పరీక్ష అయిన తరువాత కారును అలాగే వదలెయ్యకుండా ఆఫ్ చేసి దిగినట్లున్నాడు - దుర్మార్గుడు - ఎగ్జామినర్ ముందు నా పరువులు తీసేడు.   
 
సరే అయ్యిందేదో అయ్యిందని ఇహ జాగ్రత్తగా కారు డ్రైవ్ చెయ్యాలని నా బోధకుడు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుని గేర్ మార్చాలి కదా అని గేర్ మార్చబోతే ఆ గేర్ రాడ్ కదల్దే! మళ్ళీ గట్ఠిగా ప్రయత్నించాను. ఊహు. అలా లాభం లేదని రెండు కాళ్ళూ కారుకి తన్ని పెట్టి గేర్ రాడును పట్టుకు వేళ్ళాడా కానీ ఊహు లాభం లేక పోయింది. ఎదవ నవ్వు నవ్వుతూ నా ఎగ్జామినర్ వైపు సిగ్గుతో చూసాను. అతను గుర్రుగా చూస్తూనేవున్నాడు. నేను హిహి అని ఇకిలించాను - ఇంకేం చెయ్యాలో తెలీక.  అతను నెత్తికొట్టుకొని గేర్ వేసేముందు బ్రేక్ నొక్కిపట్టి వుంచాలని, అలా చేస్తేనే గేర్ రాడ్ కదులుతుందనీ, అదో రక్షణ విధానమనీ వివరించుకొచ్చేడు.  నేను నాలిక్కరచుకున్నాను. ఆ తరువాత ఎగ్జాం బాగానే జరిగింది. చక్కగా చేస్తున్నావు అని చెప్పి ఎంచక్కా నన్ను ఫెయిల్ చేసాడు ఆ బ్లాక్ ఎగ్జామినర్.   
 
నా దేశీ బోధకుని దగ్గరికి వచ్చి కారు ఎలా స్టార్ట్ చెయ్యాలో కూడా నేర్పించేది లేదా అని ధుమధుమలాడాను. అతను ఏదో సమర్ధించుకోబోయాడు కానీ కారులో వున్న నా తోటి కారు విద్యార్ధులు కూడా అతని పొరపాటుని విమర్శిస్తూ నాకు వత్తాసు పలకడంతో ఆగిపోయాడు.  ఇందులో మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే కారు నేర్చుకునేటప్పుడు కారు స్టార్ట్ చెయ్యడం కూడా నేర్చుకోవాలి. అలాగే అందులోని రక్షణ పద్ధతులు కూడా నేర్చుకోవాలి. గుడ్డెద్దు చేలో పడినట్లు మన దేశీ బోధకులను పెట్టుకొని నేర్చుకుంటే నాకు వచ్చిన అనుభవాల్లంటివే మీకు ఎదురు కావచ్చు. తక్కువ ధరకు బోధన అయిపోతుందని దేశీవారిని ట్రైనరుగా తెచ్చుకుంటాము గానీ వారు కారు నడపడం గురించి చెబుతారు కానీ సేఫ్టీ గురించి దాదాపుగా చెప్పరు. అలాంటప్పుడు మనం వేరే విధాలుగా కారు డ్రవింగులో రక్షణ గురించి తెలుసుకోవాల్సివుంటుంది. డెఫెన్సివ్ డ్రైవింగ్ మొదలయిన టెక్నిక్కులు మనం డ్రైవింగ్ స్కూలుకి వెళితే కానీ సాధారణంగా తెలియవు.          

చెయ్యి పట్టి నడిపించుకెళ్ళమని చెబుతాను

అప్పుడప్పుడు నా తరహాగా ఆలోచించే వ్యక్తుల సమావేశాలకి వెళుతుంటానని చెబుతుంటానుగా. రేపు ఆ సమావేశం మళ్ళీ వుంది. ఈ సారి విశేషం ఏమిటంటే ఆ గుంపులో నాకు బాగా నచ్చిన సు అనే యువతిని నాకు మెంటరుగా వుండమని కోరాను. సరే అనేసి హుం నీ గురించి నాకు ఎక్కువగా తెలియదుగా అంది. రేపటి సమావేశంలో వివరంగా మాట్లాడుకుందాం అనేసింది. అప్పుడు వివరంగా చెబుతాను - నా చెయ్యి పట్టుకొని ఈ జీవిత విధానంలో నడిపించుకు వెళ్ళమని. ఈమధ్య కుదరక వుండి ఆ సమావేశాలకి వెళ్ళలేదు. చాన్నాళ్ళ తరువాత మళ్ళీ వెళ్ళడం. ఇదివరలో కూడా రెండు సార్లు మాత్రమే వెళ్ళాను.

మొదటి సమావేశంలో సు ని చూసి నచ్చాను. నిజం చెప్పాలంటే అంతకుముందే మా గ్రూపు సైటులో ఆమె ఫోటోలు చూసి నచ్చేసాను. అయితే ఆ రోజు ఆమె కనీసం నా వేపు కూడా చూడకపోయేసరికి వళ్ళు మండి ఆమెని నా మనస్సులో బ్లాక్ లిస్టులో పెట్టేసాను. అయితే ఆశ్చర్యకరంగా ఒక రెండు రోజులకే ఆమెనుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో సంతోషించా. మరుసటి సమావేశంలో నా పక్కనే కూర్చొని ఎంచక్కా కబుర్లు చెప్పడంతో నాకు సంతోషం కలిగింది. ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా తీసుకొనే ఆమెని మా సెక్స్ ప్రో గ్రూపులో మెంటరుగా వుండమని కోరను. ఆమె మా గ్రూపులో చాలా చురుకయిన వ్యక్తి. ఎన్నో వైవిధ్యమయిన సమూహాలలో, కార్యక్రమాలలో ఆమె ఉత్సాహంగా పాల్గొంటూవుంటుంది. ఆమెతో పాటు నడిస్తే అవన్నీ కూడా నాకు పరిచయం అవుతాయని నా ఆశ. ఇప్పటిదాకా ఈ జీవిత విధానం ముంగిట తచ్చట్లాడటమే సరిపోతోంది కానీ సరి అయిన తోడులేక సాలిడ్ గా చేసిందేమీలేదు. అందుకే ఆమెను అడిగి ముందడుగు వేసాను. ఇహ అంతా ఆమె బాధ్యతే. ఆమె సూచించడం - నేను చెయ్యడమూనూ.   

ఇదివరలో నాకు దేవతగా వుండమని ఒకరిని కోరాను కానీ ఆమె కాస్త ప్రొఫెషనల్ దేవతగా అనిపించి ముందే దూరం అయ్యాను. అలాంటివారు మనలాంటి నా లాంటి భక్తుల కోరికలు తెరుస్తారు కానీ వారికి తృణమో, పణమో బహుమతులుగా అప్పుడప్పుడయినా సమార్పిస్తూ సంతోషపెట్టాల్సి వుంటుంది. అంత ఆనందం మనకు వద్దులే అని ఆమెని పక్కకుపెట్టాను. సు చక్కటి స్నేహితురాలు కాబట్టి అలాంటి సమస్యలు వుండవు కానీ ఎంతవరకు, ఎంతదూరం నాకు మార్గదర్శకత్వం చేస్తుందో చూడాలి. 

ఓ మిత్రుని మరణం

నిజానికి రాజు మా మేనల్లుని మిత్రుడు కానీ వాళ్లింట్లో, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబరుగానే వుంటుండేవాడు. మాకు దూరపు బంధువు కూడానూ. నేను ఈ దేశాలకి వచ్చాక క్రమంగా స్నేహాం సన్నగిల్లినా ఆ ఆదరాభిమానాలు అలాగే వుండేవి. ఓ వారం క్రితం గొంతు క్యాన్సర్తో పోయేడు. కొన్నాళ్ళు బొంబాయిలో ఉద్యోగం చేసాడు. అక్కడ అలవాటు పడ్డాడుట - గుట్కాకి. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ సోకినట్లు తెలిసి ట్రీట్మెంట్ ఇప్పించుకున్నా ఫలితంలేకపోయింది. ఇహ అది నయం కాని వ్యాధి అని అర్ధమయ్యాక ఇక ఖర్చులు పెట్టకుండా వైద్యం మానేసాడు. ఎందుకంటే డబ్బులు మిగిలితే తాను పోతే మిగిలిపోయే భార్యకీ, ఎదిగిన కూతుర్లకూ అయినా పనికివస్తాయి అనేది అతని ఆలోచనగా వుండింది.

ఇప్పుడు ఆ కుటుంబం కష్టాల్లో పడినట్లే. ఇంటర్ మరియు పది చదివే ఇద్దరు కూతుర్లు, ఇంటర్ మాత్రమే చదివిన భార్యా వున్నారు. అతని భార్యది మంచి మనస్థత్వం. ప్రేమ పెళ్ళి వారిది (ఒకే కులం). స్నేహితులు తలో కొంత సహాయం చేస్తున్నారు. అతను బ్రతికి వున్నప్పుడే నేనూ సహాయం చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడయినా సహాయం చెయ్యాలి. అప్పట్లొ అతని ఉద్యోగం కోసం నేను కూడా ధన సహాయం చేస్తే అందులో చక్కగా స్థిరపడ్డాడు. ఆ ఉద్యోగం కోసమే బాంబేలో వుంటూ గుట్కా బారిన పడ్డాడు. త్వరలో పోతాడని తెలిసి కూతుర్ల బాధ్యతలు దగ్గరి బంధువులకు ఇచ్చేసాడు. తాను పోయిన తరువాత తన భార్య ఒక చిన్న ఉద్యోగంలో చేరేలా ఏర్పాటు చేసాడు.

అప్పట్లో నాకు మా పెళ్ళి సంబంధం సూచించింది కూడా అతనే. మా పెళ్ళయ్యాక కొన్నేళ్ళ తరువాత దంపతులం మేమిద్దరమూ ఏకగ్రీవంగా అందుగ్గానూ అతగాడిని తిట్టుకున్నామన్నది వేరే విషయం. అతని ఫ్రెండు ఒకతను వన్ వేలో అప్పట్లో మా ఆవిడ కాని మా ఆవిడని ప్రేమిస్తుండేవాడుట. అలా తెలిసింది ఈమె రాజుకి. ఆ ప్రేమ జరిగేపని కాదని అర్ధమయ్యి ఆ అమ్మాయిని రాజు నాకు పెళ్ళి సంబంధంగా సూచించాడు.  అమ్మాయితో పరిచయం లేకపోయినా అటువైపు వారు పరిచయం వుండటంతో వారితో మాట్లాడి పెళ్ళి చూపులు ఏర్పాటు చేయించాడు.

ఎందుకొస్తార్రా వీళ్ళంతా!

దాదాపు పదేళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఅర్ ఒక సినిమా షూటింగు కోసం కెనడాలోని టొరోంటోకి వచ్చాడు. అప్పట్లో మేము టొరొంటోలోనే వుంటుండేవారం. సినిమా పేరు గుర్తుకులేదు. అతని తొలి సినిమాల్లో ఒకటి అయ్యుంటుంది. మా స్నేహితునికి ఒకతనికి డైరెక్టరో, నిర్మాతో దూరపు బంధువు. అందువల్ల అతను ఆ సినిమా షూటింగు చూడటానికి వెళ్ళాడు. అతనితో పాటుగా ఇలా షూటింగ్ చూస్తున్న తెలుగువాళ్ళు మరో ఇద్దరో ముగ్గురో వున్నారనుకుంటా.

షూటింగ్ బ్రేకులో జూనియర్ విశ్రాంతి తీసుకుంటూ ఇలా షూటింగు చూడటానికి వచ్చిన తెలుగు వాళ్లని చూస్తూ తన సహాయకుడితో ఇలా అన్నాడంట "ఎందుకొస్తార్రా వీళ్లంతా". ఆ మాటతో మా వాడికి తలకొట్టేసినంత పని అయ్యిందంట. అప్పటిదాకా కాస్తొ కూస్తో జూనియర్ మీద అభిమానం వున్నా అతని తల పొగరు తెలిసాక అది ఎగిరిపోయింది. అప్పటినుండీ అతను ఇప్పటిలాగా శక్తి విహీనం అయినప్పుడల్లా సంతోషిస్తుంటాను.  బృందావనంలోలాగా విహరించినప్పుడల్లా చేదు టానిక్ తాగినట్లుగా  అతని సినిమాలు చూస్తుంటాను. కొంపదీసి వీడు ఎన్నడో ఒకనాడు మన ముఖ్యమత్రి అయిపోడు కదా అని ఖంగారూ పడుతుంటాను.

మొదట్లో తన సినిమాల తొలి విజయాల ఊపులో తల పొగరు వచ్చి వుంటుందిలే - ఆతరువాత అపజయాలతో దిగివుంటుందేమోలే అనుకున్నా కానీ ఇంకా దిగలేదని అర్ధమయ్యింది. మెహర్ రమేశ్ శక్తి సినిమా కథ వినిపిస్తే ఈ సినిమా నేను కాకపోతే ఇంకెవరు చేయగలరు అని ఆ సినిమా ఒప్పుకున్నాట్ట. అవును మరీ.