మీ అందరికీ బ్లాగు నీహారిక తెలిసేవుంటుంది. నేను చెబుతున్నది ఆ నీహారిక గురించి కాదు - మరో నీహారిక గురించి - ఆమే హిట్స్ నీహారిక. ఈమె వేడివేడి యాహూ గ్రూపులు నిర్వహించే కామశాస్రికి సహాయకురాలు. కొంతమంది నన్నే కామశాస్త్రి అనుకోవడం కద్దు కానీ కాదు. అప్పట్లో ఆ యాహూ గ్రూపుల్లో సరసమయిన కథలు వ్రాసేవాడిని. మొదట్లో చాలా నెలలు ఆ నీహారిక మరెవరో కాదనీ కామశాస్తికి ఆల్టర్ ఎగో అని అనుకునేవాడిని. అలా అనుకుంటున్న రోజుల్లోనే ఆ గ్రూపుల్లో వ్రాస్తున్న నా సరసమయిన సీరియళ్ళకు ఆమె సహకారం అందిస్తూవుండేది. నేను రఫ్ రాసి ఆమెకు పంపిస్తుంటే ఆమె తెలుగులిపిలో ఫెయిర్ చేసి ఇస్తుండేది. అలా ఆమె సహకారంతో పుంఖానుపుంఖాలుగా అప్పట్లో రచనలు చేసేవాడిని.
అప్పటికీ ఆమె కామశాస్త్రి అనే అనుకొనేవాడిని. అలా ఆమెని అపార్ధం చేసుకొని ఒకసారి ఆమెతో గొడవపడ్డాను. ఆ సందర్భంలో ఆమె కామశాస్త్రి కాదనీ వేరే వ్యక్తి అనీ తెలిసివచ్చింది. తన పొరపాటు గుర్తించి నాకు క్షమాపణ చెప్పింది. ఆ తరువాత మామధ్య చక్కని స్నేహం పెరిగింది. మరిన్ని రచనలు ఆమె సహకారంతో చేసాను. చతుర మాసపత్రికలో ప్రచురింపబడిన ఎవరు నవల కూడా ఆమె ఫెయిర్ చేసి సహకరించినదే.
హిట్స్ యాహూ గ్రూపుల గురించి, శాస్త్రి గురించీ, ఇతర రచయిత్రుల గురించీ నాకు కబుర్లు చెబుతుండేది. తను ఏదో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు శాస్త్రి కథలు తెలిసి తన మిత్రురాళ్లతో కలిసి చదివేదిట. అలాంటిది తనకు శాస్త్రి వ్యక్తిగతంగా పరిచయం అవుతాడని ఎన్నడూ అనుకోలేదట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా వుండిపోయారుట. అలా అలా తాను శాస్త్రికి సహాయకురాలిగా గ్రూపుల్లో పనిచేస్తూవున్నా కూడా శాస్త్రికి తెలియకుండానే నాతో కొంత చనువు ఎక్కువయ్యింది.
ఈమధ్యలో నాకు శాస్త్రికి గొడవలు అయ్యాయి. అంతలోకే మా స్నేహం ఎక్కువయ్యిందని తెలిసినట్టుంది. మరి ఆమెకు ఏం చెప్పాడో ఏమో కానీ నాతో ఆమె స్నేహం తగ్గించింది. అలా ఒక చక్కటి మిత్రురాలు దూరం అయ్యింది. తను వ్రాసే ఈమెయిల్స్ ఎంతో బావుండేది. భలే సరదాగా, క్రిస్ప్ గా వుండేవి. వ్రాతల్లో చమక్కులు మెరిపిస్తుండేది. నేనో గొప్ప రచయితను అవాలని ఆశిస్తుండేది. తాను అందంగా వుంటానని చెప్పేది. మాది ఈమెయిల్ స్నేహమే కానీ ఫోన్ల వరకు వెళ్ళలేదు, ఫోటోలు కూడా చూడలేదు.
తనకు ఎవ్వరితో సెక్సువల్ రిలేషన్స్ లేవు అనేది. మరి ఇంతగా బూతు కథల నిర్వహణలో వుంటున్నావు - అలా అనుకుంటే ఇది మాత్రం తప్పు కాదా అని అడిగితే పూర్వం ఆశ్రమాల్లో మునికన్యలు శృంగార కథలు చాలా క్యాజువలుగా చదువుతుండేవారనీ అందువల్ల కథలు చదివినంత మాత్రాన తప్పేమీ కాదని సమర్ధించుకునేది. ఆ సమర్ధింపు మాత్రం నాకు నచ్చేది కాదు.
ఆ మరో నీహారిక స్నేహం కోసం మళ్ళీ ఎదురుచూస్తూ...
12 comments:
అయితే ?... ఇదంతా మాకెందుకు ?
@ కాయ
మీకెందుకు అన్న ప్రశ్న నాకెందుకు?
శరత్ గారూ, ఆమె పేరు నిజంగా అదేనా లేక మరో పురాణ పాత్ర గురించి జనాలకి బాఘా తెలియజెప్పాలనే తంత్రమూ, తాపత్రయమా? ఏమో..., వూరక బ్లాగరు మహానుభావులు...
@ యజ్ఞ
అదేమీలేదండీ. ఈ టాపిక్ ఎప్పటినుండో వ్రాయాలనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది. బ్లాగ్పోలిటిక్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు - కెల్కింగ్ మీద ఆసక్తి తగ్గింది. ప్రస్థుతానికయితే చాలావరకు నామానాన నేను వ్రాసుకోవడమే.
@ యజ్ఞ
మీరు హిట్స్ (హాట్ ఇండియన్ టెలుగు స్టోరీస్) యాహూ గ్రూపులు చూస్తే తరచుగా ఆ పేరే కనపడుతుంది కాబట్టి ఆ పేరు గురించి సందేహం అక్కరలేదు.
HITS లో మీరు ఏ పేరుతో వ్రాసేవారు శరత్ భాయ్? అప్పట్లో తెగ ఫాలో అయ్యేవాడిని. మీ కనపడకుండా పోయిన ’ఉరి’/’తుదిశ్వాస్’ కూడా వుందేమోనని నా ఆర్కైవులన్నీ తెగవెతికాను. కనపడలేదు.
మొత్తం HITS లో పోస్ట్ చేసిన కధలన్నీ ఎవరిదగ్గరన్నా కలెక్షన్ లాగ వుంటే upload చెయ్యగలరేమో మీ బ్లాగ్ ద్వారా ఒక పబ్లిక్ అభర్ధన.
@ పండు
హిట్స్ లో శరత్ నవల్స్ అన్న పేరుతో వ్రాసేవాడిని కానీ బూతు కథలు, నవలలు వ్రాసేవాడిని కాదు. కేవలం సరసమయిన నవలలు వ్రాసేవాడిని. అందుకే అవి హిట్స్ 3 గ్రూపులో వచ్చేవి. తుదిశ్వాస మరియు నేస్తమా నవలల గురించి వెతికినందుకు ధన్యవాదాలు.
కొన్నేళ్ళక్రితం చాలా ఆసక్తికరంగా ఆ గ్రూపులు నడిచేవి కానీ ఇప్పుడంత రసవత్తరంగా అవి నడుస్తున్నట్లు లేవు. మళ్ళీ అందులో బిడిఎసెం థీముతో రసవత్తరమయిన నవలలు వ్రాస్తే ఎలా వుంటుందని అనుకుంటూవుంటాను.
సరసమైన అంటే పెద్ద కష్టం తో కూడనివి అని కదా అర్థం.. సరసం తో కూడిన కథలు వ్రాసే వాడిని అనాలేమో ?
@ కాయ
భలే పట్టేసారే :) మీరు అన్నది నిజమే కానీ సరసమయిన అంటే చవగ్గా అని అర్ధం. సులభం అని కాదనుకుంటా.
సరసమైన ధరలు అనేది నేనూ లక్ష సార్లు విన్నా... స రసం అని విడగొట్టా... మంచి ఫీలింగ్ తెచ్చేది అనిపించింది ... వాడకం లో మాత్రం సరసమైన అంటే ఒకటి.. సరసం అంటే ఒకటి అనిపిస్తుంది.. ఏదో కొంచెం తెలుగు జ్ఞానం...
............... అసలు వదిలేసి కొసరు మీద పడ్డా.. ఇంతకీ అలాంటి సరసం కూడిన కథలు ఎక్కడ వెతికితే దొరుకుతాయి ...గురువు గారు...
@ కాయ
ఇక్కడ దొరుకుతాయి. ఇవి బూతు కథలు కాదు కాబట్టి సరసంతో కూడిన కథలు మాత్రమే కాబట్టి ఇక్కడ లింక్ ఇస్తున్నాను.
http://in.groups.yahoo.com/group/hot-indian-telugu-stories-003/
వావి వరస లేకుండా తల్లి చెల్లి తో కూడా నీచమైన కధలు రాసే ఆ నికృష్టుడు ఎక్కడ ఉంటాడు?
అలాంటి వాడితో పరిచయం ఉందని చెప్పుకోడానికి సిగ్గు పడాలి శరత్ గారు.
ఉద్రేకంలో ఉండే యువతని ఉన్మాదంలోకి నెట్టడానికి రాసే నీచులు వాళ్ళు.
ఇలాంటివి చదివి తమ career ni , జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి