మా ఆవిడ నొప్పులకి కైరోప్రాక్టర్ ట్రీట్మెంట్

చాలా ఏళ్ళుగా పలు నొప్పులతో మా ఆవిడ బాధపడుతూ రకరకాల డాక్టర్లని, ట్రీట్మెంట్లని, సర్జరీలని పలు దేశాల్లో ఆశ్రయించిందనీ లాభం లేకపోయిందనీ కొన్ని నెలల క్రితం ఒక టపాలో చెప్పుకువచ్చేను. ఆమెకు కుడి భాగం మాత్రమే దాదాపుగా పైనుండి కింది దాకా నొప్పి వుంటోంది. కొందరేమో టెండనీటిస్ అనీ కొందరేమో ఆర్థరైటిస్ అనీ కొందరేమో వెన్నుపూస సమస్య అనీ చెప్పారు.

ఇహ అలాక్కాదని మొన్న ఓ కైరోప్రాక్టరు (వెన్నుపూస నిపుణుడు) ని కలిసాము. ఎక్సురేలు తీసి వెన్నుపూసలో మెడ భాగం వుండాల్సిన దానికన్నా నిటారుగా వుందనీ, ఖాళీ ఎక్కువుందనీ చూపించేడు. అందువల్ల నెర్వ్ స్టెం వత్తుకుపోయి ఈ నొప్పులన్నీ వస్తుండవచ్చు అని తీర్మానించేడు. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంటు వల్ల నెలలోనే కొంత ఫలితం అయినా కనపడవచ్చని సూచించాడు. ఈ రోజు నుండి చికిత్స మొదలవబోతోంది.

ఆ చికిత్స పూర్తిగా మాకు ఆరోగ్య భీమాలో కవర్ అవుతోంది కాబట్టి డబ్బు సమస్య లేదు. మీలో ఎవరయినా కైరోప్రాక్టిక్ చికిత్స తీసుకున్నారా? ఈ చికిత్స వల్ల ప్రయోజనాలు వుంటాయా? మీ అభిప్రాయాలూ, అనుభవాలూ ఏమిటి? ఇలాంటి చికిత్సకు వెళ్ళడం మొదటిసారి కాబట్టి ప్రయోజనకరమా కాదా అన్న సందేహాలు వస్తున్నాయి. 

9 comments:

 1. namasthe andi..sarath gaaru..nenu prabandh..Norway lo chadhuvuthunnanu..naakoo oka 5 years nundi severe back pain vundhi..asalu problem ento kooda clear gaa thelusukoleka poyanu india lo...ikkadakocchaka kooda doctors dhaggariki vellanu..vallu chiropractor ki recommend chessaru..thanu problem ni clear gaa explain chesindhi..akkada nundi malla hospital ki akkadi nundi physiotherapy trweatment ki vellanu..ippudu 90% thaggipoyindhandi...
  useful andi..kakapothe baagaa costly..panichesthadhi..

  blog raasthu vundandi saaru..vere vaalla godavalatho yendhuku..mem chadhuvuthu vuntamgaa..

  ReplyDelete
 2. @ ప్రబంధ్
  మీరు వివరంగా స్పందించి మీ అనుభవం తెలియపరచినందుకు సంతోషంగా వుంది. కొన్నాళ్ళ క్రితం అనిత (మా ఆవిడ) ఫిజియో థెరపీకి వెళ్ళేది. మొన్నటిదాకా ఫిజియో థెరపీ, కైరో థెరపీ ఒక్కటే అనుకొని కైరో గురించి రెసెర్చ్ చెయ్యలేదు. అదీ ఇదీ వేరువేరు అని తెలిసివుంటే ఎప్పుడో ఈ విధానం మీద శ్రద్ధపెట్టివుండేవాడిని. మా ఇన్సూరెన్సు ఏడాదికి $5000 వరకు భరిస్తుంది. ఈ ఏడాది ఆ లిమిట్ మించవద్దని, ఆ లిమిట్ లోనే క్వాలిటీ చికిత్స చెయ్యాలని కిరోకి ఖండితంగా చెప్పాను. అంగీకరించారు.

  కైరోప్రాక్టీస్ లాంటిదే ఆస్టియోపాథిక్ అనుకుంటా. దాని గురించి కూడా పరిశీలిస్తున్నా. మీరు అది కూడా ఏమయినా ప్రయత్నించారా?
  http://en.wikipedia.org/wiki/Osteopathy

  నేను వ్రాయడం ఆపింది ఏ గొడవలో జరిగాయని కాదండీ. ఎవరికోసమనో నేను వ్రాయకుండా మానను. నాకు వ్రాయాలనిపించకపోతే అప్పుడప్పుడూ వ్రాయనంతే. మీలాంటి వారి ఆసక్తి చూస్తుంటే ఎంచక్కా వ్రాయాలని అనిపిస్తూనేవుంటుంది - అప్పుడప్పుడు మానినా సరే.

  ReplyDelete
 3. Adhi osteopathy, avuno kadho cheppalenu kaani andi..oka rakam gaa alantidhe..concept entante...basical gaa longterm pains valla aa senses ki respond ayye nerves ika permenant gaa alane fix ayyi..persisent gaa,
  actual gaa problem emi lekapoyina..pain vunnattu respond avuthay anedhi concept..andhuvalla vaatini aa position nunchi relieve chesthe ala respond kakunda vuntaay..dhaniki physical exercise tho paatu gaa mental preparation koodaa mukyam..ee process lo naaku treatment jarigindhi..mental preparation anedhi dheeniki chaalaa mukyam..veetilo konni doctor chepithe,dadaapu gaa oka 70-80 doctors ni ee problem meedha kalavadam valla nakocchinna experience...
  meeku concept ardhamaindhanukuntaanu.....

  meeru raayandi,mem chadhuvuthune vuntaam...

  ReplyDelete
 4. @ ప్రబంధ్
  ఆస్టియోపతీ గురించి కొంత చదివాను. ఆసక్తికరంగా వుంది, నచ్చింది. వీలయితే దానిగురించి రేపు వ్రాస్తాను.

  ReplyDelete
 5. saar
  When we lived in a small village in AP, about 35 yrs ago we used to go to our barber for treatment of ankle sprains, neck pain and back pain. The'd apply castor oil and massage the area....vigorously till we shout and cry...
  Chiropractors comes close to that except these people study anatomy.
  I have nothing against Choropractors.
  I had seen two people came to us with "stroke" ( rael stroke) after neck manipulation by chiropractors, where they injured blood vessels going to brain.
  It could get that worse.
  No physician would refer their patients to Chiros...they'd refer to Ortho, neurology and / or physical therapy. If some body reffered you to a Chiro..you need to change your doctor.
  Chiros will say..Oh there is a big gap here, there is misalignment of vertebra..that need to be adjusted...pushed back into place...trash...you can not manipulate any vertebra from outside..you need to do surgery for that.....
  If you have great faith in chiros...at least don't allow them to touch her neck...let them manipulate her mid back or low back..even that i do not advice.
  The relief she'd get is only short lived....
  because it is a placebo effect.
  Good luck

  ReplyDelete
 6. IF Your other responder had seen 60-70 doctors, and given his symptoms described and theory he proposed he should see a psychiatrist. ( no offense meant it is pure medical science )

  ReplyDelete
 7. agnatha gaaru,physician chiropractor dhaggariki pampindhi problem ento thelusukovadaaniki..thanu clear gaa explain chesevaraku asalu problem ento kooda clear gaa thelusukolekapoyanandi.adhi naa experience andi chiropractor tho.

  ika doctors vishayaanikosthe,norway lone ippativaraku 12 mandhi dhaggaraku vellanandi..okalla dhaggara nunchi inkokalla dhaggariki..ika long term paint efect on nerves anedhi naa final treatment icchina doctors cheppina vishayamandi...adhi scientifical gaa prove kooda ayyindhatandi..okasari eenaadu lo nenu kooda chadhivaanu.
  mental preparation mukyam annadhi inthamandhi doctorla valla nenu thelusukunna vishyamandi..dheenimeedha kooda reserch chesthunnarandi...nenu kooda naa doctor recomendation meedha naa experience share chesukunnanu vallatho...vallu cheppindhi kooda idhenandi.

  offensive gaa thisukoni kaadhandi,information chepdhaamane raasaanu idhantha.

  ReplyDelete
 8. @ అజ్ఞాత
  మీరు వివరంగా మీకు తెలిసిన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. మీ సమాచారం వల్ల ఇందులో వుండే రిస్కులు తెలిసివచ్చాయి. మీరు చెప్పాక ఆ రిస్కుల గురించి మరింత పరిశోధించాను. స్ట్రెయిట్ మెడికల్ విధానాలతో ప్రయోజనం జరగనప్పుడు ప్రత్యామ్నాయ ఆరోగ్య విధానాలు ప్రయత్నించి చూడక తప్పదు. అందుకే కొంత రిస్కుకి సిద్ధపడుతున్నాం. మీరు చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకుంటాం.

  @ ప్రబంధ్
  మీరు లేఖిని లాంటివి ఏవయినా ఉపయోగించి తెలుగులో వ్రాయకూడదూ.

  మీరు చెప్పిన కాన్సెప్ట్ అర్ధమయ్యింది. ఆ కాసెప్ట్ కి సంబధించిన లింకులు ఏమయినా ఇస్తే మాకు ఇంకా ఉపయోగకరంగా, విశదంగా వుంటుంది.

  ReplyDelete
 9. సారీ అండి.ఏదో అలా అలవాటయ్యింది.తెలుగు లోనే రాస్తానండి ఇకనుంచి..

  ReplyDelete