కెనడా కోర్టులో బురఖా వేసుకోవచ్చా?

ఇతరదేశాల సంగతీ, భారత్ లో సంగతీ నాకు తెలియదు కానీ కెనడా సుప్రీం కోర్టు ముందుకు ఈ విషయం వచ్చింది. చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. ఆ వార్తకు వచ్చిన వ్యాఖ్యలు చూస్తే ఈ ఆంశం మీద వివిధ కెనడియన్ల, ఇతరుల అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవచ్చు.

కెనడాకి వలస వచ్చిన వారు ఆ దేశపు విలువలను పాటించాలా లేక తమ తమ వ్యక్తిగత మత స్వేఛ్ఛను పాటించాలా అన్నది ఇక్కడ ప్రశ్న. నేనయితే దేశాభిమానినే.

http://www.thestar.com/news/canada/article/955500--supreme-court-agrees-to-hear-case-of-woman-who-wanted-to-testify-in-niqab?bn=1

7 comments:

 1. ఇప్పుడు ఇంగిలీసు సదివే ఓపికలేదుగానీ బాబయ్యా... కోర్టుల్లోనూ, ఇంటరాగేషను రూముల్లోనూ బురఖాలేసుకోవడం వల్ల అసలు పనికే మోసం వస్తుందేమోకదా. ఇహ ఆమాత్రానికి teliphone విచారణలు, telephone ఇంటరాగేషనులు చేసుకోవచ్చికదా మళ్ళీ కోర్టులుదేనికీ డబ్బు దండగ. పనిలో పనిగా అందాలపోటీలు కూడా బురఖాల్లో నిర్వహిస్తే ఇంకా శాణా బాగుంటాది. సాంప్రదాయ విలువలను గౌరవించేవారికీ ఒక శాన్సిచ్చినట్టుంటది.

  ReplyDelete
 2. నా వరకు నాకు ..మీరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశ నిబంధనలకు కట్టుబడి ఉండాలి అన్నది నా అభిప్రాయం....

  ReplyDelete
 3. హహహ్హ..హహ్హ హహ్హా...పిచ్చి లేస్తుంది నాకు.... కళ్ళు మాత్రమే కనిపించేలా బట్టలేసుకునుడెందో.. అనుకుంటే.. న్యాయం చెప్పే న్యాయ మూర్తి ముందు కూడా వీళ్ళ పిచ్చి పైత్యం... ఇంట్లో తండ్రి ముందు బురఖా వేస్కుంటే.. న్యాయమూర్తి ముందు కూడా వేస్కోవాలి.. ఇంకా డాక్టర్ ముందూ, సినిమాలల్ల ఆక్టింగు కి.. నా బొందకీ,.. నా భోషాణానికి .. అన్నింటికీ.. వేస్కోవచ్చు...

  ReplyDelete
 4. గురువు గారు,
  మీరేమైనా అన్ పాపులర్ అయ్యారా ? మీరు అంత ఎఫెక్టివ్ గా వ్రాయటం లేదా ?.. ఎవరూ పట్టీంచుకోటం లేదేంటి ఇంత మంచి టాపిక్ ని... తెలంగాణా అంటే ఉరికి వస్తారు కానీ.. దీనికి మాత్రం సప్పుడు లేదు.. అభిప్రాయం చెప్పటానికి కూడా ఓపిక లేదా ?..
  సమస్య మెడకు చుట్టుకునే వరకు వెయిట్ చేసి చివర్లో మాకేం సంబంధం లేదు అంటరు..

  ReplyDelete
 5. @ కాయ
  ఎక్కువమందికి ఈ టాపిక్ ఆసక్తికరంగా లేదేమో. మరొ విషయం సువార్తా కూటమిల్లాగా బ్లాగుల్లో కామెంట్ల కూటమిలు తయారు అయ్యయిలెండి. ఎవరి గ్రూపు బ్లాగుల్లో వారు మాత్రమే వేసుకుంటారన్నమాట. పొరపాటున ఎదుటి వాడి గ్రూపులో ఎవడయినా వేసాడా వాడు చచ్చాడే. బ్లాగుల్లో, బజ్జుల్లో, మెయిల్లో వాడిని వారి గ్రూపు వాళ్ళు ఏదో మాహాపరాధం చేసినట్లు చూసి హితోపదేశాలు చేస్తుంటారు. మనకేమో గ్రూపులు లేకపాయే. అందుకే మనకు కామెంట్లు వేసేవారు తక్కువయ్యారు.

  ReplyDelete
 6. హహ్హాహ్హ.. ఎక్కువ మంది కంట్రోల్ లో ఉండబడే వాళ్ళే నన్న మాట..

  ReplyDelete
 7. మీరు ఇచ్చిన లింకులో ఉన్న విశేషం ప్రకారం, ఆ అమ్మాయిని చుట్టాలే బలాత్కారం చేసారని, ఆ కేసు కోర్టులోకి వచ్చిందని, ఆ అమ్మాయి కోర్టులో కూడా బురఖా వేసుకునే తన వాదం వినిపిస్తానని పట్టుబట్టిందని అర్ధం అవుతున్నది. అసలు బురఖా ఉద్దేశ్యమే ఆమెకు ఎంతమాత్రం ఉపయోగపడనప్పుడూ, ఆ కారాణానే కోర్టుకు ఎక్కాల్సిన ఖర్మ పట్టినప్పుడు, ఇంకా కోర్టులో కూడా బురఖానే వేసుకుంటానని వాదించటం చిత్రంగా ఉన్నది.

  ReplyDelete