ఏదో ఒక రోజు

మా ఆవిడ చాలా చక్కగా కారు డ్రైవింగ్ నేర్చేసుకుంది. కారు తోలడంలో నేను చెప్పే టెక్నిక్కులు, మెళకువలు విని మీకెంత అనుభవం వుందండీ అని ఆశ్చర్యపోతూ ప్రశంసిస్తూవుంటుంది. మీరే లేకపోతే ఇంత త్వరగా కారు నేర్చుకునేదానినా అంటూ వుంటుంది. నేను ఏదయినా పొరపాటు చేస్తున్నావు అని చెబితే తను ఆ తప్పుని వెంటనే సరిదిద్దుకుంటుంది. తను అలా చెప్పినట్టు చెయ్యడం వల్ల ఆమెకు డ్రైవింగ్ నేర్పుతుంటే ఇంకా నేర్పబుద్ధి అవుతోంది. ఏనాడు ఈ డ్రైవింగ్ పాఠాలకు ముహూర్తం పెట్టానో కానీ అప్పటినుండీ క్లాసులు చాలా చక్కగా సాగుతూ వస్తున్నాయి. ముహూర్తబలం మరీ. ఈసారి లాంగ్ డ్రైవుకి వెళ్ళినప్పుడు వెనక సీట్లో పడకేసి శుబ్బరంగా గురకెయ్యొచ్చు.

సర్లెండి. పైదంతా కల కాదు గానీ అందరూ ఎలాగయితే తమ కుటుంబ కబుర్లు వ్రాస్తారో అలా వ్రాసి చూసానన్నమాట. బావుందా? ఇక శరత్ బ్లాగింగులోకి వెళదాం.

మా ఆవిడ డ్రైవింగ్ చూస్తుంటే నాకు ఒణికిపోతోంది. పోనీ చెబితే వింటుందా నేను అలా చెప్పడం తన మానవ హక్కుల భంగం అనేలా చూస్తుంది. పోనీ కారు కీస్ తీసుకొని పెట్టుకుందామంటే ఆకాశంలోని సగం స్త్రీల హక్కుల భంగం అని ఇంట్లో రభస తప్పదు. అలా అని వదిలేస్తే ఏనాడో ఒహనాడు ఏదో ఒక ప్రమాదం జరుగకపోదు అనిపిస్తోంది. ఇంకా నయ్యం, వీలయినంతవరకు తానొక్కతేనో లేక తన స్నేహితురాళ్ళతోనో వెళుతూవుంటుంది, నన్ను వీలయినంత వరకు ఎవాయిడ్ చెస్తుంది. నేను పక్కనుంటే నెర్వస్ అవుతుందిట. చూసారా, నేనంటే మా ఆవిడకి ఎంత భయ్యమో!   కారు కీస్ లాగేసుకొని రోజూ తన తిట్లు తినేకంటేనూ ఏదో ఒక ఆ రోజు, ఎప్పుడొస్తుందో తెలియని ఆ రోజు కోసం ఎదురుచూడ్డమే  బెటర్ లా వుంది. ఆ రోజు మా కారు ఏ గోడకో, చెట్టుకో గుద్దేస్తే జరిగే ఖర్చులను ప్రత్యేక భరించడం కోసం ఒక భవిష్య నిధిని పోగేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నాను. నెలానెలా అందులో పడెస్తే ఏనాడో, ఒకనాడు ఉపయోగానికి రాకపోదు.  ఎందుకూ ఇవన్నీ మాకు చెప్పడం అంటారా? మరి ఎవడికి చెప్పుకోను నా ఎమోషన్స్ అన్నీ? 

ఇహపోతే మా పెద్దమ్మాయి ఎంచక్కా, బుద్ధిగా చెప్పినట్లు వింటూ కారు నేర్చుకుంటోంది. ఈ వారాంతం హైవేమీద కారు డ్రైవింగ్ నేర్పబోతున్నాను.

11 comments:

  1. సర్లెండి. పైదంతా కల కాదు గానీ అందరూ ఎలాగయితే తమ కుటుంబ కబుర్లు వ్రాస్తారో అలా వ్రాసి చూసానన్నమాట. బావుందా? ఇక శరత్ బ్లాగింగులోకి వెళదాం. ....:-)

    ReplyDelete
  2. మీకు తెలువదు అనుకుంట ఈ ప్రపంచం లొ ఎవరు వాల పెళ్ళాలకు డ్రైవింగ్ నెర్పియలెరు. అంటె నా ఉదెశం పక్క వాల పెళ్ళాలకు నెర్పియగలరు అని కాదు. ఫ్రెండ్స్ కి, తమ్ములకి నెర్పియవొచ్చు.

    ReplyDelete
  3. @ అజ్ఞాత
    :)

    @ అజ్ఞాత
    హా?! నిజమా? ఇదంతా మీరు ముందుగానే నాకు ఎందుకు చెప్పలేదు? ఆల్రెడీ నేర్పించానే - ఇప్పుడెలా మరి?

    ReplyDelete
  4. Sharat you did it. but i can understand how many time you shouted on her and she shouted on you....

    ReplyDelete
  5. Saratgaru,
    I think all indian husbands feel the same about their wives car driving.Believe me, after
    couple of months her driving doesnt
    look that bad for you.

    ReplyDelete
  6. గురువు గారు ఆ 294 మీద నేర్పించకండి.. అసలు ఎగ్జిట్ లు చాలా దూరం గా ఉన్నయ్.. నేను మొన్న కాట కలిసిన..

    ReplyDelete
  7. it took six months for me and an instructor ( charged 600 $ )to teach driving to my wife and she got her license on fourth attempt.
    She made four accidents and crashed and totaled a Toyota camry and a volvo s60 (hit a tree and totaled) a BMW is ready next..
    My daughter took classes at school and passed with flying colors on first attempt.
    Sarat garu...same story...in every house
    "kadupu chinchukunte kalla meeda padudhi"
    gattiga ante Kadupu maduddi.

    ReplyDelete
  8. avunaa??inni kastalu untayani maa ayanaki munde telinatlu undi..nenu mottukuntunna noooooooooo antunnaru!!paigaa naku driving raadu kanuka tanu office lo prasantam gaa pani avutundantaa...so nenu driving alochana viraminchukunna!!

    ReplyDelete
  9. I guess lot of men feel the same way about wife's driving, no matter how well the wife drives. I drove to office 50 miles each way for 5 years, with no accidents and only couple of tickets. My husband still comments when he sits next to me while I drive (look out for stop sign, maintain distance, slow down......).

    Moral of the story: Ladies- use ear plugs while you are driving and the husband sits next to you. :-)

    ReplyDelete
  10. @ చివరి అజ్ఞాత
    (మిగతావారికి తరువాత స్పందిస్తాను)
    మీలాగే మా ఆవిడ కూడా వర్చువల్ ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నట్టుగా నేను ఏవయినా డ్రైవింగు సూచనలు ఇస్తుంటే స్పందించడం మానివేసింది. ఇహ లాభం లేదని నేనూ నిర్లిప్తత అలవాటు చేసుకున్నాను. జరిగేదేదయినా వుంటే జరుగక మానదు. ఈలోగా నాకెందుకు కంగారు. కదా :)

    ReplyDelete
  11. శరత్,

    మీ టపా మొదట పొగడ్తలు చది వి ఇ౦త కలలా అని చిదివుకు౦టూ ఇ౦కా మీరె ఒప్పుకొన్నాక నవ్వు వచ్చి౦ది.

    నమ్మకపోవడానికి కారణ౦ మీరు వ్రాసిన సబ్జెక్ట్ మాత్రమే కారణ౦.ఇప్పటి వరకు భర్త అనబడే పాత్ర ఈ భూమ్మీద భార్యకు సవ్య౦గా డ్రయివిన్గ్ నేర్పిన దాఖలాలు బహు తక్కువ :)(టూ వీలర్ అయినా)

    అసలు మొగుడు ను౦డి డ్రైవి౦గ్ నేర్చుకోవల్సి రావడ౦ అ౦టే ఎన్నెన్నో జన్మల పాప ఫల౦ మాత్రమే అని అర్ధ౦ :) (అన్ని చోట్ల ఎక్సెప్షన్స్ ఉన్నట్లు ఇక్కడ కూడా అనుకో౦డి )


    ఇక మీ శ్రీమతి అలా మెచ్చుకొనే అవకాశ౦, నేతిబీరకాయ చ౦దమే :)

    ReplyDelete