నేను పోగొట్టుకున్నదాంతో పోలిస్తే నీ పోగొట్టుకోవడం ఎంతా?

మా ఆవిడ కారు షాకు ఇస్తుందేమో అనుకుంటే ఖజానా షాకు ఇచ్చింది. మొన్న ఆదివారం అరోరాలోని షికాగో ప్రీమియల్ అవుట్లెట్స్ ప్లాజాకి వెళ్ళాం. కోచ్ వానిటీ బ్యాగు డీలులో చాలా చవకగా వస్తున్నదనీ $300 బ్యాగు $100 కే వస్తోందనీ హైవేమీది నుండి వెళ్ళాలి కాబట్టి హైవే మీద కారు ప్రాక్టీసు చేసినట్లు వుంటుందనీ తోడుగా నన్ను పట్టుకెళ్ళింది. మాతో పిల్లలు రాలేదు.   అంత బ్రాండెడ్ వానిటీ బ్యాగులు మనకు అవసరమా అని అడిగాను కానీ వద్దనలేదు. తన డబ్బులతో కొనుక్కుంటోంది కాబట్టి వద్దనే అధికారం నాకు అంతగా లేదు కదా.   మనం సంపాదించిన డబ్బులమీద వాళ్ళకు సర్వహక్కులు వుంటాయి కానీ వారి డబ్బుల మీద మనకు ఏమాత్రం హక్కు, అధికారం వుండవు కదా. అందుకే ఆమె డబ్బులతో ఆమె ఏం చేస్తుందనేది పెద్దగా పట్టించుకోను కానీ ఉపయోగకరమయిన వాటిని కొనుక్కోమని చెబుతుంటాను. నగలు, నట్రాలేవో కొనుక్కుంటూవుంటుంది.

అక్కడ తన (పాత) వానిటీ బ్యాగులోనుండి ఎవరో డబ్బులు, బంగారం కొట్టేసారు. ఎలా కొట్టేసారో, ఎక్కడ కొట్టేసారో తెలియదు గానీ అవి మాత్రం మాయం అయిపోయాయి. ఒకే ఒక్క అనుమానాస్పద విషయం ఆమె రెస్టురూములో వున్నప్పుడు జరిగిందంట.  ఆ గదిలో టాయిలెట్ సీటు మీద పేపర్ పరిచేందుకై  ఒకసారి వేరేవైపుకు తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి కొక్కేనికి తగిలించిన బ్యాగు కిందపడివుందంట. అంతకుమించి ఏమీ ఆమెకు అర్ధం కావడం లేదు. బ్యాగు కోసిలేదు, తెరచిలేదు! ఆ దొంగ ఎవరో కానీ చాలా పద్ధతిగా తన కళని ప్రదర్శించినట్లుంది. ఏమాత్రం అనుమానం రాకుండా దోచుకుపోయారు. వాతావరణం కాస్త బాగుండటంతో ఆ రోజు అసలే  ఆ ప్లాజాకి జనాలు బాగా వచ్చారు. పావుగంట వరకు మాకు పార్కింగే దొరకలేదు. 

ఎన్ని డబ్బులు, ఎంత బంగారం పోయుంటుందో ఊహించండి చూద్దాం. ఏదో 50, 60  డాలర్లు, కొద్దిగా బంగారం పోయుంటుందనుకుంటున్నారా! నేనూ అలాగే అనుకున్నా. వెధవాయిని. డబ్బులు సుమారుగా $300 మరియు పలు ఆభరణాలు కలిపి చుట్టుపక్కల $2500 పోయాయి. ఆమె పోయిన ఆభరణాల లిస్టు చదువుతుంటే ఇవన్నీ ఇంట్లోనో, సేఫు డిపాజిట్ బాక్సులోనో పెట్టుకోక బ్యాగులో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావూ అని బోల్డంత ఆశ్చర్యపోయా. పదేళ్ళనుండి ఇలాగే పెట్టుకొని తిరుగుతున్నా, ఎవడన్నా దోచాడా అని నన్నే నిలదీసింది. అంటే పదేళ్ళనుండీ చేసిన పొరపాటునే చేస్తూవస్తున్నావన్నమన్నమాట అని బేర్ మన్నాను.  ఆమె బేబీ సిట్టింగు చేసి సంపాదించిన డబ్బులు, బంగారం కొన్ని ఇలా పొగొట్టుకుంది. అందులో నా సంపాదన మీద కొనుక్కున్నవి కూడా వుండొచ్చు కానీ నాకు ఆ బంగారం లెక్కలు తెలియదు లెండి.   

ఆ ప్లాజా సెక్యూరిటీ వాడికి ఫిర్యాదు చేసాం. సిసి కెమెరాల్లో ఏమన్నా కనిపిస్తుందేమో చూడరా బాబూ అంటే కేఫిటేరియాలో నెలకొల్పిన వాళ్ళ టివిలు ఎత్తుకుపోకుండా గమనించడానికి మాత్రమే ఆ కెమెరాలు పెట్టామనీ, మిగతా ప్రదేశాలు అవి కవర్ చేయవనీ సెలవిచ్చాడు. ఇలా ఖజానాలు బ్యాగుల్లో పెట్టుకురావద్దని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు కానీ మా ఆవిడకి తెలియదురోయ్ అని బావురుమన్నాను. ఇలాంటి దొంగతనాలు మీ ప్లాజాలొ జరుగుతంటాయట్రా అని అడిగాను. ఆహా భేషుగ్గా అప్పుడప్పుడు జరుగుతుంటాయని చెప్పాడు. అతని సలహా మీద పోలీసు స్టేషనుకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాము.  అమ్మా, ఇదండీ అంగతి. మీరు షాపింగుకి వెళ్ళినప్పుడు నగానట్రా బ్యాగుల్లో వేసుకొని వూరేగకుండా ఇంట్లోనో, బ్యాంకులోనో దాచుకోండి తల్లీ. మా ఆవిడ వానిటీ బ్యాగు ఒక మహాసముద్రం కాబట్టి ఆమె బ్యాగు జోలికి ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్ల అందులో నగానట్రాలు కూడా వుంటాయని నాకు మొన్నటిదాకా తెలీలా.  తెలిసివుంటే తను విన్నా వినకపోయినా నా బాధ్యతగా నేను హెచ్చరించి వుండేవాడిని. 

మరి మనకు బ్యాంకు సేఫ్ డిపాజిట్ బాక్సు ఎందుకూ, ఎంచక్కా అందులోవి అన్నీ కూడా బ్యాగులో పెట్టుకురాకపోయావా అని మా ఆవిడని విసుక్కున్నాను. మా ఆవిడని ఊరడించాలో, తిట్టాలో అర్ధం కాక మధ్యస్థంగా హితబోధలు చేస్తూ గులిగాను. మా ఆవిడ నిన్న మధ్యాహ్నం అంతా ఏడ్చుకుంటూ, ఆహారం తీసుకోకుండానే వుందని ఇంటికి వెళ్ళాక తెలిసింది. బాధ పడ్డంత వరకు చాల్లే, అంతా ఒకసారే బాధపడితే మరి ముందు ముందు సందర్భాల్లో ఎలా అని ఊరడించాను. నేను పోగొట్టుకున్న వాటితో పోలిస్తే నువ్వు పోగొట్టుకున్నది ఎంత అని జోకులేసాను. శనివారం రాత్రి బావగారూ, బాగున్నారా సినిమా చూసాము లెండి. అందులో కోట డైలాగు అది. అందులో తన కొడుకు శ్రీహరితో ఆ డైలాగు పదేపదే అంటుంటాడు. బాధలో, లాసులో వున్నా కాబట్టి వచ్చేవారం న్యూయార్క్ ట్రిప్పుకి రానంది. సంపాదన ఎలాగయితే జీవితంలో భాగమో అలాగే అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లూ, పోగొట్టుకోవడాలూ జీవితంలో భాగమేనని చెప్పేసి నచ్చచెప్పాను.

నేను ఓ జీవితమే పోగొట్టుకున్నాను. దానితో పోలిస్తే మా ఆవిడ పోగొట్టుకున్నది ఎంత లెండి. లైట్ :)

19 comments:

 1. is it real or just for blog?????

  ReplyDelete
 2. మీ "నేను పోగొట్టుకున్నదాంతో పోలిస్తే నీ పోగొట్టుకోవడం ..." పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  [Edited] పోగొట్టుకున్నదాంతో పోలిస్తే ప్రవీన్ పోగొట్టుకున్నది ఎంతా?"

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  నిజమేనండీ బాబూ. కథ అయితే కథ అని చెబుతాగా.

  ReplyDelete
 4. Clear that she made a fool out of you. She probably gave them to her folk in India and since you are not interested in anything other than Sex and LGBT, she made you beleive this story too. If you know what she had and recognize those items you will find those items on her sister's body next time you go to India.

  ReplyDelete
 5. @ అజ్ఞాత
  మా ఆవిడ అలాంటిది కాదు గానీ ఒహవేళ అలా అనుకున్నా పంపించడం కోసం నాకు అలా అబద్దాలు చెప్పనఖ్ఖరలేదు :) దర్జాగా పంపించొచ్చు. ఎందుకంటే నేను ఎలాగూ బంగారం లాంటి విషయాలు నేను బొత్తిగా పట్టించుకోను కాబట్టి ఏమున్నాయో, ఏంపోతున్నాయో నాకు తెలియదు. ఆ విషయం మా ఆవిడకి బాగా తెలుసు లెండి.

  ReplyDelete
 6. They (thieves) target Indians in USA.

  Generally Indian families possess Gold (22 Carat) and other valuables.

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  కొన్ని నగరాల్లో ఇండియన్స్ ఇళ్ళు దొంగలు టార్గెట్ చేస్తారని తెలుసు కానీ ఇండియన్ వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తారన్నమాట.

  ReplyDelete
 8. ఈ మధ్య మా అపార్ట్మెంట్లో ఒకటి,రెండు ఫ్లాట్లలో దొంగలు పడ్డారట. అంచేత, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా తన నగల దుకాణం మొత్తం తీసుకువెళుతోంది. మొన్న గుడికి వెళ్ళేటప్పుడు మొత్తం మోసుకొచ్చింది. అసలే ఆ గుడి ఏరియా లో రాత్రిపూట నల్లోళ్ళు ఎక్కువుగా తిరుగుతారు తాగి తూగుతూ...వద్దు మొర్రో అంటే వినదు. ఇంట్లో ఉంటే, "బ్రేక్ ఇన్" ఒక్కటే పాజిబిలిటీ. అదే బయటకు తీసుకువెళితే, మన "అజాగ్రత్త" కుడా జత కలుస్తుంది అని చెపితే, వాళ్ళు వింటారా? వినేస్తే ఇంకేం భాగ్యం?

  ఫొటో మాత్రం అదిరిందండీ

  ReplyDelete
 9. @ అజ్ఞాత
  అవును :)

  మాకు రెంటల్ ఇన్సూరెన్స్ వుంది. ఇంట్లో దొంగలు పడి ఎత్తుకెళితే కొంత మొత్తం చెల్లిస్తారు. మా పాలసీలో బంగారు ఆభరణాలకు గాను $1000 చెల్లిస్తారు. మాకు బ్యాంకులో సేఫ్ డిపాజిట్ బాక్స్ (లాకర్) కూడా వుంది.

  ReplyDelete
 10. ఐతే అక్క బాగ్ లో విలువైనవి ఉంటాయన్నమాట..!!! ;)

  ReplyDelete
 11. భర్త మాట వినాని వాలె భార్యలు...
  మీ పిచ్చి గాని మన మాట వింటె వాలు పెల్లాలు ఎలా అవుతారు..

  ReplyDelete
 12. mee blogs maalika.org lo kanabadatam ledu?

  ReplyDelete
 13. Very much co-incident, I lost close to 500 bucks of gift cards last week end in a shopping mall in Philly. By mistake I gave the purse to my husband to hold, where I kept all the gift cards, for few minutes. And he simply forgot it on a bench top where he was chating with his friend on phone. Informed to security and gave all the info.Though we know no one gonna return it .

  My mistake was to bring all the cards, though all of them were not necessary at that time.

  Learned a lesson out of it....

  ReplyDelete
 14. @ కాయ
  ఇకముందు బ్యాగులో విలువైనవి వుండకపొవచ్చు కానీ ఇప్పుడు ఆ బ్యాగే విలువయినది అయ్యింది ($300+). ఇప్పుడిక ఆ బ్యాగును కాపాడుతూ వుండాలి మేము.

  @ అజ్ఞాత
  కొన్ని కారణాల వల్ల నేనే మాలిక నుండి విరమించుకున్నాను.

  @ కవిత
  పొరపాటున గిఫ్ట్ కార్డులు అన్నీ తెచ్చినదొకరు - పోగొట్టినదొకరు. మీలో మీకు బ్యాలన్స్ అయ్యిందిలెండి :)

  ReplyDelete
 15. ప్చ్..అయ్యో శరత్..

  పోన్లేండి. ఇలాంటి విషయాలు మనకు ఉత్తరోత్తరా బాగా పనికొస్తాయి. మనమెలాగూ చిన్నా చితకా వస్తువులు పోగొడుతుంటాము. అప్పుడు వాళ్ళెలాగూ సుప్రభాతం అందుకుంటారు కదా. అలాంటప్పుడు మనకు పనికొచ్చే ఆయుధం ఇదొక్కటే మరి.

  ఇక్కడా..సేమ్.. ఇల్లు కంటే వాళ్ళ పర్సు సేఫ్ అంట. ఏంచేస్తాం :(

  ReplyDelete
 16. @ భా రా రే
  బంగారం పోయిందని కాదులెండి నా ఏడుపు. అంటే 'చిత్రం, భళారే విచిత్రం' సినిమాలో అనుకుంటా బ్రహ్మానందం గుడిలో చెప్పులు పోగొట్టుకొని కాసేపు లబలబలాడి "ఏడ్చినకాడికి చాల్లే, ఇవి నా చెప్పులైతే కదా, నా రూమ్మేట్ శివవి కదా" అని ఊరడించుకుంటాడే అలా కాదు లెండి కానీ మా ఆవిడకి కామన్సెన్స్ పోయినందుకు నా ఏడుపు. బంగారం అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ కామన్సెన్స్ ఎక్కడ కొని తేవాలీ అంట? మీరు చెప్పింది, అజ్ఞాత చెప్పిందీ చూస్తుంటే చాలామంది ఆడవాళ్ళ లాజిక్ అదేనేంటీ అనిపిస్తోంది.

  ఇంకో సంగతి చెప్పా మా ఆవిడకి. మన ఇంట్లో దొంగలు ఎప్పుడయినా పడకపొతారా - అప్పుడు వాటితో పాటు రెంటల్ ఇన్సూరెన్స్ వాడికి ఈ లిస్టుకూడా ఇచ్చేద్దామని చెప్పా. అందుకే ఆభరణాలు పోయినా వాటికి సంబంధించిన రసీదులూ, ఫోటోలు గట్రా వుంటే జాగ్రత్త చెయ్యమని చెప్పా. చూసారా నా తెలివీ!

  ReplyDelete
 17. "మా ఆవిడకి కామన్సెన్స్ పోయినందుకు...."

  How sad!. Below average husband(s) think that they are smarter than their wife, and their lady boss.

  paapam aaDavaaLLu!.

  ReplyDelete
 18. మన ఇంట్లో దొంగలు ఎప్పుడయినా పడకపొతారా - అప్పుడు వాటితో పాటు రెంటల్ ఇన్సూరెన్స్ వాడికి ఈ లిస్టుకూడా ఇచ్చేద్దామని చెప్పా.

  HOW DO U GET SUCH BRILLIANT IDEAS. LADIES FEEL THEIR BAGS ARE SAFER THAN BANK LOCKERS AND HUSBANDS.

  AND BY CHANCE NEVER TRY OPENING THOSE BAGS, YOU MAY FAINT DOWN AND SOME TIMES GO INTO COMA - BY EXPERIENCE

  ReplyDelete
 19. అయినా అ౦త జాగ్రత్త గా ఉన్నా పోతాయని ఎవరన్నా అనుకొ౦టారా.

  భా.రా.రె గారి వ్యాఖ్య :)

  ReplyDelete