కథ - ముగింపు

గమనిక: ఇది మెటా ఫిక్షన్ కాబట్టి కొద్దిగా నా గురించి కూడా వ్రాసుకున్నాను.  

రెండు వారాల తరువాత:

కుమార్ వాళ్ళింట్లో మసాలా టీ తాగుతూ శంకరం అన్నాడు "మీరు ఈమెయిల్లొ పంపించిన కథ రెండు బాగాలూ అందాయండీ. చదివాను. అంత గొప్పగా అనిపించకపోయినా అప్పటి మన మందు పార్టీలో మేము అడిగిన మేరకు ఆ మందు పార్టీ మీదనే బేస్ చేసుకొని మీరు థ్రిల్లర్ కథ అల్లడం నాకు థ్రిల్లింగుగా వుంది. రచయిత సమర్ధుడయితే ఏ సన్నివేశం నుండి అయినా కథ సృష్టించగలడని అర్ధమయ్యింది. మూడో భాగం కూడా వ్రాసారా మరి?"
 
తాను కూడా మసాలా తేనీరు రుచిని ఆస్వాదిస్తూ సన్నగా నవ్వి కుమార్ ఇలా అన్నాడు "మూడో భాగం అంటూ ఏమీ లేదు. కావాలంటే మన యొక్క ఈ కబుర్లనే మూడో భాగంగా అనుకోవచ్చు"

ఆశ్చర్యార్ధకంగా శంకరం "సార్" అన్నాడు.

కుమార్ చిరునవ్వుతో అవునని తల ఊపాడు.

"అంటే మీరు జరుగుతున్న నిజాన్నే కథగా తిప్పేస్తున్నారన్నమాట. అద్భుతం. ఈ రచనా విధానాన్ని ఏమంటారు?"

"నాకూ స్పష్టంగా తెలియదు కానీ మెటా ఫిక్షన్ అంటారేమో. ఆ విధానంలో రచయిత కూడా ఒక పాత్రగా వుండవచ్చు. ఇప్పటికిప్పుడు జరుగుతున్న కథ కాబట్టి సర్రియల్/ అధివాస్తవిక కథ అని కూడా అనొచ్చేమో నాకు తెలియదు. కనుక్కోవాలి"
 
"వావ్. తెలుసుకొని నాకూ చెప్పండి. ఆ కథకి ఇక ముగింపు లేదంటూనే మన ముచ్చట్లే ముగింపు కావచ్చన్నారు. నాకు కొంత అయోమయంగా వుంది"

కుమార్ తాగేసిన కప్పుని బల్ల మీద పెడుతూ "అదే ఈ కథ లోని వైవిధ్యం మరి" అన్నాడు.

"కథలో రెండవ భాగంలో చివరికి కెవ్వు మని వినిపించింది కదా. తరువాత ఏమయ్యిందంటారు మరి?"

"మీరు ఏమనుకుంటున్నారు?"

"చాలా ఆలోచనలు వస్తున్నాయి. అందులో మీ పాత్ర సందేహించినట్లుగా గిరి మిమిక్రీ చేసివుండవచ్చు లేదా ఆ ఇంట్లోని బేస్మెంటులో ఏదయినా రహస్యం వుండి వుండవచ్చు లేదా..."

"ఊ. లేదా?"

"లేదా పక్కింటిలో ఏదయినా నేరం జరుగుతుండవచ్చు. రెడ్డి గారు అన్నట్లు ఇది సినిమా సవుండ్ అయ్యుండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో దయ్యాలు తిరుగుతూవుండొచ్చు. పారా నార్మల్ ఏక్టివిటీ అయ్యొండొచ్చు. అలా చాలా చాలా అనుమానాలొస్తున్నాయి సార్"
 
"మీ అనుమానాలే ఆ కథకి ముగింపు"

"హ?"

"అవును. ఇలాంటి కథలని అసంపూర్తి కథలు అంటారు. రచయిత తన కథని లేదా నవలని ఒక పాయింట్ దగ్గర ఆపేస్తాడు. పాఠకులు తమకు తోచినట్లుగా తమకు నచ్చినట్లుగా ఎంచక్కా ముగింపులు ఊహించుకోవచ్చును. మీరు యండమూరి తులసీదళం చదివే వుంటారు. అది చదివాక ఆ అమ్మాయి తులసి చివరికి ఎలా బాగుపడింది అన్నది ఎవరి విశ్వాసాల ప్రకారం వారు కాంక్లూజనుకి వస్తారు. అలాగే శరత్ కాలం రచన ఉరి నవలలో మూల కథలో కూడా అందులోని ముఖ్యపాత్ర ఉరి నుండి ఎలా బయటపడిందీ పాఠకులు పలు విధాలుగా ఆలోచించుకోవడానికి అవకాశం వుంటుంది. పాఠకులని సంతృప్తి పడనివ్వకుండా వారి మెదడులకు ఆ కథ లేదా నవల పూర్తి అయ్యాక కూడా పని కల్పించడమే రచయిత లేదా అసంపూర్తి నవలా విధానం యొక్క ఉద్దేశ్యంగా వుంటుంది. ఈ టెక్నిక్ తో రచనలు చెయ్యడం నాకు బాగా ఇష్టం" అని వివరించాడు కుమార్.
 
"బావుంది సార్ మీ వివరణ. అసంపూర్తి రచనల గురించి తెలుసుకోగలిగాను. తులసీ దళం మళ్ళీ చదువుతాను. ఉరి నవల ఎక్కడ దొరుకుతుంది?"

"ఇక్కడ దొరుకుతుంది. ఆ రచయితే తుదిశ్వాస అన్న ఇంకో నవల కూడా ఇలాగే అర్ధాంతరంగా ఆపేసారు. అయితే నా నవల సాఫ్ట్ కాపీ అందుబాటులో లేదు. ఆ నవలలో బ్రెత్ కంట్రోల్ ప్లే (BCP) ఆడుతుంటారు. శృంగారంలో ఎన్నో రెట్లు ఆనందం అలా వస్తుంది కానీ అందులో ప్రాణాంతక మయిన రిస్కులు వున్నాయి. ఆ నవల ముగింపు చదివాక మైండ్ బ్లాంకయిపోయి కొన్ని క్షణాలు మీకు ఊపిరి ఆడనట్లుగా అనిపించవచ్చు. చక్కగా వచ్చింది ఆ నవల మరియు ఆ ముగింపు కానీ సాఫ్ట్ కాపీ అందుబాటులో లేదు"

"సరే సార్. ఇక వెళతాను" అని లేచాడు శంకరం

"మంచిది. చివరి భాగం వ్రాసి మీకు త్వరలో ఈమెయిల్ ఇస్తాను"
 
"మీరు మరో భాగం లేదన్నారు కదా!"

"మన ముచ్చట్లే ముగింపు అని కూడా అన్నా కదా. అవే వ్రాసి మన వాళ్లందరికీ పంపుతాను" నవ్వుతూ అన్నాడు కుమార్

"అయితే మనది నడుస్తున్న కథ లేదా లైవ్ స్టొరీ అంటారు" సెలవు తీసుకుంటూ అన్నాడు శంకరం.
"అంతే కదా మరి"

"నేను ఇప్పుడు అంటున్న ఈ వాక్యం కూడా కథలో వుంటుందా?!" శంకరం బయల్దేరబోతూ ఉత్సుకతతో అడిగాడు.

"వుంటుంది. ఇప్పుడు నేను అంటున్న ఈ వాక్యాలు కూడా అందులో వుంటయ్. మీరు ఇంకా మాట్లాడితే అవి కూడా చేరుస్తాను"" అన్నాడు ఆ రచయిత గలగలా నవ్వుతూ.

బయటకి బిగ్గరగా నవ్వితే ఆ నవ్వు కూడా ఎక్కడ కథలో ఎక్కడ పడుతుందో అని వస్తున్న నవ్వును ఆపుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు శంకర్.   

(అయిపోయింది)

7 comments:

  1. good style :)
    సర్రియల్ అంటే నిజజీవిత కథనం కాదు, అంతశ్చేతన, కలలో జరిగినట్లుగా ఉండడం ఇలాంటి వాటికి సంబంధించినది. నిజజీవితంలో కనబడని దృశ్యాలు సర్రియల్ కథనాల్లో జరుగుతాయి.

    ReplyDelete
  2. ఇలా కూడా ఎందుకు నవల కి పేరు పెట్టి తెల్ల కాగితాలతో కుట్టి ఇస్తే అందరూ పుస్తకం ముందు పెట్టుకుని గడ్డంకింద చెయ్యిపెట్టుకుని హాపీగా వాళ్ళకి కావలసిన కధ వాళ్ళు ఊహించుకుంటారు చక్కగా

    ReplyDelete
  3. గురువు గారు,
    మీ తెలబాన్ పదానికి మొగుడు లాంటి పదం దొరికింది... ఆజాకర్... ఆంధ్రా రజాకర్లు ... హహ...

    ReplyDelete
  4. @ గిలక
    తెరాస వాళ్ళు రజాకార్లని అభిమానిస్తారు కనుక తెలంగాణా వాదులు ఆంధ్రా వారిని అజాకార్లు అంటే మెచ్చుకున్నట్టవుతుందే కానీ తిట్టినట్లు అవదు కదా!

    ReplyDelete
  5. @ కొత్తపాళీ
    సర్రియల్ విషయంలో నాకెప్పుడూ కంఫ్యూజనే. అధివాస్తవికత అంటే అతి వాస్తవికత అని నా మనస్సులో ఎందుకో నాటుకుపోయివుంది. ఇంతకూ సర్రియల్ అంటే అధివాస్తవికతనే కదా. ఏదో ఒకటి వ్రాసుకుపోవడమే తప్పించి రచనా శైలుల మీద అంతగా అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన సమస్య నాది.

    @ తుంటరి
    మీలాంటి వారికి అది అయితేనే బెటరేమో - కానివ్వండి. అహనా పెళ్ళంటలో కోట కోడికూర తిన్నట్లుగా కథల్ని ఊహించుకోండేం :)

    ReplyDelete
  6. గురువు గారు,
    రజాకార్లని తెలంగాణా వాళ్ళు/తెరాసా వాళ్ళు అభిమానిస్తారని అబద్దం ఆడుతున్నారు.. నిజాం లని అభిమానిస్తారు తెరాస వాళ్ళు అనండి ఓకే అంటాను.. మీరు కూడా ఇలా మాట్లాడటం బాలేదు... మీరు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా ?...

    ReplyDelete
  7. @ శరత్ - శైలుల విభజనలు - నో ప్రాబ్లం. అందుకేగా వికీపీడియా ఉన్నది! :-)
    అవును, సర్రియలిజం కి మన వాళ్ళు పెట్టిన పేరు అధివాస్తవికత.

    ReplyDelete