ఆడ అంగరక్షకులు మరియు కబుర్లు

గమనిక: ఈ రోజు కబుర్లన్నీ ఎప్పటికప్పుడు వ్యాఖ్యలుగా వ్రాస్తుంటాను.

లిబియా అధ్యక్షుడు గడాఫీలో బాగా నచ్చేదొకటే - అతని పక్కన వుండే అందమయిన ఆడ అంగరక్షకులు.

ఈమధ్య గ్రూపన్ మరియు లివింగ్ సొషల్ లాంటి ఆన్లయన్ డీల్స్ సైట్లకి అలవాటు పడ్డాను. ఇదివరలో వారాంతం వచ్చిందంటే ఇంట్లో వారిని ఎక్కడికి తీసుకువెళ్ళాలి అన్నది సమస్యగా వుండేది. ఆ సైట్ల పుణ్యమా అని కొత్త కొత్త ప్రదేశాలు తెలుస్తున్నాయీ - తక్కువధరలో కూడా కూడా వస్తున్నాయి. మా మిత్రుడొకడు ఇండియాలో డీల్స్ కొరకై ఒక సైట్ నిర్మిస్తున్నా అంటేనూ గ్రూపన్ లాంటి సైటు ఇండియా కొరకు నిర్మించడం బావుంటుందని ఉచిత సలహా ఇచ్చాను. ఒకటి రెండు సైట్లు ఇప్పటికే వున్నాయి ఇండియా కొరకు కానీ అవి ఇంకా ప్రసిద్ధి పొందలేలేదు అని చెప్పాడు కానీ వాటి పేర్లు కనుక్కోలేదు. మీక్కూడా ఈ సైట్లు ఉపయోగకరంగా వుండవచ్చు - చూడండి:
http://www.groupon.com/
http://livingsocial.com/
బ్లాగుల్లో అసభ్యంగా అజ్ఞాతంగా వ్రాసి దొరికిపోయినవాళ్ళు కూడా అందరికీ నీతి ప్రవచనాలు చెబుతుంటేనూ, నా బ్లాగుల్లోని వ్రాతల వాలిడిటీ గురించి ప్రశ్నిస్తుంటేనూ నవ్వొస్తోంది.

9 comments:

  1. తెలంగాణా వాదుల సహాయ నిరాకరణ వల్ల వారియొక్క జీతాలూ ఆలస్యం అయిపోతున్నాయని ఓ వార్త చదివాను. నిజమయిన వాదులయితే కనుక జీతాలు కూడా తీసుకోమని సహాయ నిరాకరణ చేస్తే బావుంటుందంటాను.

    ReplyDelete
  2. :)

    నిజమయిన వాదులా కాదా అని తెలిసికోడానికి ఇది ఒక్కటె వ్యూహ౦ కదా..

    వీరు నిజ౦ అని తెలిస్తె తెల౦గాణ వచ్చెస్తది ..

    ReplyDelete
  3. @ మౌళి
    నిజ్జంగా అలా వీర తెలంగాణా వాదులందరూ చెయ్యగలిగితే వేర్పాటు బయటేమో కానీ ఇళ్ళళ్ళో మాత్రం తప్పకుండా వస్తుంది!

    ReplyDelete
  4. హ హ ...ఇక్కడ ఇ౦కో విష్య౦ ఉ౦ది ..

    తెల౦గాణా కా౦గ్రెస్ పెద్దలు నిజమయిన తెల౦గాణా వాదులు అయితె,

    సహాయ నిరాకరణ చెసినా జీత౦ వచ్చెయ్యాలి ...:)

    ఏమ౦టారు!!!

    ReplyDelete
  5. రాత్రి వచ్చిన ఆస్కార్ వేడుక చూసారా? ఎఫ్-బాంబ్ విన్నారా ;) ప్రజెంటర్లలో అనా హాథవే ఎప్పటిలాగే బావుంది. జేంస్ ఫ్రాంకో ప్చ్. ద కింగ్స్ స్పీచ్ సినిమాకే ఎక్కువ అవార్డులు రావడం బావుంది. ఆ సినిమా ఇంకా చూడలేదు - చూడాలి.

    @ మౌళి
    పనికి చెయ్యకపోతే జీతాలు ఇవ్వము అనేంత ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు లెండి.

    ReplyDelete
  6. శరత్..
    http://groupoff.com or http://groupoff.in ఇండియాలో ట్రై చెయ్.
    నా వరకూ నేనైతే.. ఆ వెబ్‍సైటులో శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 50రూపాయలకు పొందాను.

    ఇక snapdeal.com, dealivore.com, dealsandyou.com ఇలాంటి సైట్లు ఇండియాలో ఏడెనిమిది ఉన్నాయి. మన వాళ్లు ఇప్పుడిప్పుడే అవసరం ఉన్నా లేకపోయినా డిస్కౌంట్లలో కొనుక్కోవటం అలవాటు చేసుకుంటున్నారు.

    ReplyDelete
  7. Sarath garu > Sample career aspirations/development plan websites chepparu. Development plan submit cheyyali, 3 days ga alochinchina manchi matter ledu..

    Anulekha

    ReplyDelete
  8. Snapdeal dealivore unnayi kadaa already

    ReplyDelete
  9. @ఈ వ్యాఖ్య చూసారా

    ----------------------------------

    కుమ్మేసి అలొచించొచ్చు అనుకొండి... అప్పట్లొ శరత్ అనే బ్లాగరు ఉండేవారు కదా... ఆయన పాపం వదిలేయండి అని రెక్వెస్ట్ చేసినప్పటినుండి ఈ వాదిని సరిగ్గా పట్టించుకొవడం లేదు.
    ---------------------------------

    అప్పట్లో అ౦టే ఇప్పుడు పోయారా శరత్ అనే బ్లాగర్ :) మ౦చు మిమ్మల్ని కీర్తి శేషుల్ని చేసేస్తున్నట్లు౦ది

    ReplyDelete